Sunday, November 24, 2024

Sree subrahmanya kavacha stotram -శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రమ్

శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రమ్


అస్య శ్రీసుబ్రహ్మణ్య కవచ స్తోత్రమహామంత్రస్య, 
బ్రహ్మా ఋషిః, అనుష్టుప్ఛందః, 
శ్రీసుబ్రహ్మణ్యో దేవతా, ఓం నమ ఇతి బీజం, 
భగవత ఇతి శక్తిః, సుబ్రహ్మణ్యాయేతి కీలకం, 
శ్రీసుబ్రహ్మణ్య ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ॥

కరన్యాసః 
ఓం సాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం సీం తర్జనీభ్యాం నమః ।
ఓం సూం మధ్యమాభ్యాం నమః ।
ఓం సైం అనామికాభ్యాం నమః ।
ఓం సౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥

అంగన్యాసః 
ఓం సాం హృదయాయ నమః ।
ఓం సీం శిరసే స్వాహా ।
ఓం సూం శిఖాయై వషట్ ।
ఓం సైం కవచాయ హుమ్ ।
ఓం సౌం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం సః అస్త్రాయ ఫట్ ।
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥

ధ్యానమ్
సిందూరారుణమిందుకాంతివదనం కేయూరహారాదిభిః
దివ్యైరాభరణైర్విభూషితతనుం స్వర్గాదిసౌఖ్యప్రదమ్ ।
అంభోజాభయశక్తికుక్కుటధరం రక్తాంగరాగోజ్జ్వలం
సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం భీతిప్రణాశోద్యతం॥

లమిత్యాది పంచపూజా
ఓం లం పృథివ్యాత్మనే సుబ్రహ్మణ్యాయ గంధం సమర్పయామి ।
ఓం హం ఆకాశాత్మనే సుబ్రహ్మణ్యాయ పుష్పాణి సమర్పయామి ।
ఓం యం వాయ్వాత్మనే సుబ్రహ్మణ్యాయ ధూపమాఘ్రాపయామి ।
ఓం రం అగ్న్యాత్మనే సుబ్రహ్మణ్యాయ దీపం దర్శయామి ।
ఓం వం అమృతాత్మనే సుబ్రహ్మణ్యాయ స్వాదన్నం నివేదయామి ।
ఓం సం సర్వాత్మనే సుబ్రహ్మణ్యాయ సర్వోపచారాన్ సమర్పయామి ।

కవచమ్
సుబ్రహ్మణ్యోఽగ్రతః పాతు సేనానీః పాతు పృష్ఠతః ।
గుహో మాం దక్షిణే పాతు వహ్నిజః పాతు వామతః ॥ 1 ॥

శిరః పాతు మహాసేనః స్కందో రక్షేల్లలాటకమ్ ।
నేత్రే మే ద్వాదశాక్షశ్చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్ ॥ 2 ॥

ముఖం మే షణ్ముఖః పాతు నాసికాం శంకరాత్మజః ।
ఓష్ఠౌ వల్లీపతిః పాతు జిహ్వాం పాతు షడాననః ॥ 3 ॥

దేవసేనాపతిర్దంతాన్ చిబుకం బహులోద్భవః ।
కంఠం తారకజిత్పాతు బాహూ ద్వాదశబాహుకః ॥ 4 ॥

హస్తౌ శక్తిధరః పాతు వక్షః పాతు శరోద్భవః ।
హృదయం వహ్నిభూః పాతు కుక్షిం పాత్వంబికాసుతః ॥ 5 ॥

నాభిం శంభుసుతః పాతు కటిం పాతు హరాత్మజః ।
ఊరూ పాతు గజారూఢో జానూ మే జాహ్నవీసుతః ॥ 6 ॥

జంఘే విశాఖో మే పాతు పాదౌ మే శిఖివాహనః ।
సర్వాణ్యంగాని భూతేశః సర్వధాతూంశ్చ పావకిః ॥ 7 ॥

సంధ్యాకాలే నిశీథిన్యాం దివా ప్రాతర్జలేఽగ్నిషు ।
దుర్గమే చ మహారణ్యే రాజద్వారే మహాభయే ॥ 8 ॥

తుములే రణ్యమధ్యే చ సర్వదుష్టమృగాదిషు ।
చోరాదిసాధ్వసేఽభేద్యే జ్వరాదివ్యాధిపీడనే ॥ 9 ॥

దుష్టగ్రహాదిభీతౌ చ దుర్నిమిత్తాదిభీషణే ।
అస్త్రశస్త్రనిపాతే చ పాతు మాం క్రౌంచరంధ్రకృత్ ॥ 10 ॥

యః సుబ్రహ్మణ్యకవచం ఇష్టసిద్ధిప్రదం పఠేత్ ।
తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహమ్ ॥ 11 ॥

ధర్మార్థీ లభతే ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ ।
కామార్థీ లభతే కామం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ ॥ 12 ॥

యత్ర యత్ర జపేద్భక్త్యా తత్ర సన్నిహితో గుహః ।
పూజాప్రతిష్ఠాకాలే చ జపకాలే పఠేదిదమ్ ॥ 13 ॥

తేషామేవ ఫలావాప్తిః మహాపాతకనాశనమ్ ।
యః పఠేచ్ఛృణుయాద్భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ ।
సర్వాన్కామానిహ ప్రాప్య సోఽంతే స్కందపురం వ్రజేత్ ॥ 14 ॥

ఉత్తరన్యాసః

కరన్యాసః
ఓం సాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం సీం తర్జనీభ్యాం నమః ।
ఓం సూం మధ్యమాభ్యాం నమః ।
ఓం సైం అనామికాభ్యాం నమః ।
ఓం సౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥

అంగన్యాసః 
ఓం సాం హృదయాయ నమః ।
ఓం సీం శిరసే స్వాహా ।
ఓం సూం శిఖాయై వషట్ ।
ఓం సైం కవచాయ హుమ్ ।
ఓం సౌం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం సః అస్త్రాయ ఫట్ ।
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ॥


|| ఇతి శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రమ్ ||

Saturday, November 23, 2024

Angarakudu - అంగారకుడు

అంగారకుడు

స్వభావము -ఉగ్ర
అధిపతి -కుమారస్వామి.
లింగము -పురుష
రుచి -చేదు
జాతి -క్షత్రియ
అధి దేవత -పృధ్వి
దిక్కు -దక్షిణం
తత్వం - అగ్ని
ప్రకృతి -పిత్తము
ఋతువు -గ్రీష్మం
లోహము -ఇనుము, ఉక్కు
రత్నము -పగడము,
గ్రహ సంఖ్య -ఆరు
గుణం -తమో గుణం
ప్రదేశం -కృష్ణా నది మొదలు లంక వరకు
జప సంఖ్య - 7000

భావరీత్యా దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు.
అంగారకుడు మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలకు అధిపతి.
శరీరావయావలో ఎముకలో మజ్జ, కండరాలు,
బాహ్యంలో జ్ఞానేంద్రియాలు.
అంగారకునికి సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులు,
శత్రువు బుధుడు,
సములు శుక్రుడు, శని.

అంగారకుడి ప్రభావము
అంగారక ప్రభావితులు పొడుగుగా దృఢంగా ఉంటారు. బంధువులంటే అపార ప్రేమ కలిగి ఉంటారు. అదుపు చేయ లేని ఆవేశ పరులు. విపరీత బంధు ప్రీతి కలిగి ఉంటారు. అధికారం, పదవి, సేవకులను కలిగి ఉంటారు. యంత్రములు, ఆయుధములు మొదలైన వాటిలో శిక్షణ పొందుటలో ఆసక్తుడు. అధిక దానధర్మములు కలిగి ఉంటారు.అంగారకుడి రూపు రేఖలు

అంగారకుడు ఎర్రని మేని ఛాయ కలవాడు. సన్నని నడుము, కండలు తిరిగిన శరీరం, వంకీల జుట్టు కల వాడు. వయసు పద హారు. ఎర్రని వస్త్రధారణ, శంఖం వంటి మెడ, వాహనం పొట్టేలు, ఆయుధం శూలం, మంగళప్రథమైన రూపము.

కుజ దోష నివారణకు పరిహారం
కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ స్తుతి దర్శనం చేయాలి. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి. సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి. కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి. ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి. స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి చేసి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి.దుర్గాదేవిని స్తుతించాలి. మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి. బలరామ ప్రతిష్ఠిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి. మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి. మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 7000 కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి. నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి, ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి. మంగళ వారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.

భావాలూ పరిహారాలు
కుజుడు కర్కాటకం లో నీచ స్థితి పొందుతాడు. కర్కాటక లగ్నం నుండి పన్నెండు భావాలలో ఉన్నప్పుడు ఆయాభావాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కనుక వాటికి తగిన పరిహారాలు కింద ఇవ్వబడ్డాయి.

1. మొదటి భావం లేక లగ్నం కుజుడికి నీచ స్థానమైన కర్కాటకం అయి అందులో కుజుడు ఉంటే అబద్ధములు చెప్పకూడదు, దంతంతో చేసిన వస్తువులు వాడరాదు. దానం తీసుకోరాదు.

2. కుజుడు రెండవ స్థానంలో ఉండి అది కుజుడికి నీచ స్థఆనమైన కర్కాటకం అయిన ఎడల కంఠ సమస్యలు ఉంటాయి కనుక కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యస్వామిని సేవించి గంట, దీపం దానం చేయాలి. రెండవ స్థానం కర్కాటకం అయి అందు కుజుడు ఉన్న అది కుజుడికి నీచ స్థితి కనుక ధన సమస్యలు ఉంటాయి. పరిహారంగా ఎర్రటి చేతి గుడ్డను ఎప్పుడూ వాడుతుండాలి. ఏడు మంగళ వారాలు చిన్న పిల్లలకు బెల్లం గోధుమలతో చేసిన ఆహారం తినిపించాలి.

3. కుజుడు అన్నదమ్ములకు చిహ్నం. మూడవ ఇంట కుజుడు ఉన్న సోదరులతో చిక్కులు ఉంటాయి కనుక పరిహారం కొరకు ఏనుగు దంతంతో చేసిన వస్తువును ఇంటికి దక్షిణంలో ఉంచి కుజుడిని ఆరాధించాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఇరుగు పొరుగుతో వివాదాలకు దూరంగా ఉండాలి. వెండి ఉంగరంలో పొదిగిన పగడపు ఉంగరం ఎడమ చేతికి ధరించవచ్చు.

4. నాగవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కోతులకు, తల్లికి భోజనం పెట్టాలి. పంచదార వంటి తీపి పదార్ధాల సంబధిత వ్యాపారం చేయాలి.

5. పంచమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు రాగి పాత్రలో రాత్రి అంతా ఉంచిన నీటిని తెల్లవారిన తరువాత పచ్చని చెట్టుకు పోయాలి. ఇంటికి దక్షిణంలో వేప చెట్టు నాటాలి.

6. ఆరవ స్థానం రోగ, శత్రు స్థానం కనుక కుజ స్తోత్రం చదువుకోవాలి. తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఇంట్లో ఉంచరాదు.

7. ఏడు స్థానంలో కుజుడు ఉన్న భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటాయి కనుక పరిహారంగా శిరః స్నానమాచరించి ఇంటికి దక్షిణ భాగంలో మూడు వత్తులతో దీపం వెలిగించి కుజుడి స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయాలి. కంది పప్పుతో చేసిన ఆహారం తీసుకుంటే ధన సమస్యలు తీరి భార్యాభర్తల మధ్య అనుకూలత కుదురుతుంది.

8. ఎనిమిదవ స్థానం ఆయుషు స్థానం స్త్రీలకు మాంగల్య స్థానం కనుక సుబ్రహ్మణ్య, దుర్గ, ఆంజనేయ, గణపతి, శివులకు విశేష పూజలు చేయాలి.

9. తొమ్మిదవ స్థానం అందు కుజుడు నీచమైన; పెద్ద వారిని గౌరవించడం, వెండితో పొదిగిన పగడపు ఉంగరం ధరించడం చెయ్యాలి.

10. పదవ స్థానం అందు కుజుడు నీచమైన; కార్యాలల్లో సుబ్రహ్మణ్య స్వామిని ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కార్యాలు మొదలు పెట్టాలి.

11. పదకొండవ స్థానం లాభస్థానం, అన్నతో పేచీలు ఉంటాయి. మట్టి పాత్రలో సింధూరం లేక తేనె ఉంచిన దోష పరిహారం ఔతుంది.

12. వ్యయ స్థానం కుజుడు నీచమైన తేనె త్రాగుట, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి.

ద్వాదశ రాశులలో కుజుడు
లగ్నములో కుజుడు ఉన్న జాతకుడు క్షతగాత్రుడు, క్రూరుడు, అల్పాయుష్మంతుడు, సాహసిగా ఉంటాడు.

ద్వితీయస్థానములో కుజుడు ఉన్న జాతకుడు కురూపి, ధనహీనుడు, దుష్టుల మీద అధారపడి జీవించే వాడు ఔతాడు.

తృతీయస్థానమున ఉన్న జాతకుడు ధనవంతుడు, ధైర్యశాలి, సుఖవంతుడు, సోదరులు లేని వాడు, జయించశఖ్యం కాని వాడు ఔతాడు.

చతుర్ధస్థానమున కుజుడు ఉన్న జాతకుడు మిత్రులు లేని వాడు, మాతృహీనుడు, గృహము లేని వాడు, సుఖము లేని వాడు, వాహన లేని వాడు ఔతాడు.

పంచమ స్థానములో కుజుడు ఉన్న జాతకుడు సుఖము లేని వాడు, సంతానం లేని వాడు, అల్పమేధావి, సంపద పోగొట్టుకున్న వాడు ఔతాడు.

షష్టమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు ధనవంతుడు, కీర్తికలవాడు, విజయుడు ఔతాడు.

సప్తమ భావములో కుజుడు ఉన్న జాతకుడు దుశ్చరిత్రుడు, వ్యాధిపీడితుడు, వృధాగా తిరుగు వాడు, కళత్రహీనుడు ఔతాడు.

అష్టమ భావములో కుజుడు ఉన్న జాతకుడు అంగవైకల్యం కలవాడు, నిర్దనుడు, అల్పజీవి, ప్రజల చేత నిదించబడువాడు ఔతాడు.

నవమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు రాజమిత్రుడు, పితృహీనుడు, ప్రజల చేత ద్వేషించబడువాడు, జనఘాతకుడు ఔతాడు.

దశమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు క్రూరుడైన రాజు ఔతాడు.

ఏకాదశమున కుజుడు ఉన్న జాతకుడు విశాలహృదయుడు, ప్రజలచేత మన్ననలు అందుకొను వాడు ఔతాడు.

ద్వాదశమున కుజుడు ఉన్న జాతకుడు ధనవంతుడు, ధైర్యశాలి, సచ్చరిత్రుడు, శోకహీనుడు ఔతాడు.

అంగారక



Wednesday, April 3, 2024

Telugu years names -తెలుగు సంవత్సరాల పేర్లు

తెలుగు సంవత్సరాలు ఎన్ని?

తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తుంది. 60 పూర్తయిన తర్వాత మళ్లీ మొదటి నుంచి సంవత్సరం ప్రారంభం అవుతుంది. 60 సంవత్సరాలకు ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. మొదటి రుతువు వసంతం. 
మొదటి నెల చైత్ర మాసం. 
మొదటి తిథి పాడ్యమి. 
తెలుగు వారికి జనవరి 1 నుంచి కాకుండా ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు.

మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అస్సాం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపుకుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. మరికొద్ది రోజుల్లో శోభకృత్ నామ సంవత్సరం ముగిసిపోయి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని అర్థం కోపం కలిగించేదని.

తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ

తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా మనం పిలుస్తున్నాము.

తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారం కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు ఇవే.

తెలుగు సంవత్సరాల పేర్లు

ప్రభవ- యజ్ఞాలు అధికంగా జరుగుతాయి
విభవ- సుఖంగా జీవిస్తారు
శుక్ల- సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు
ప్రమోద్యుత- అందరికీ ఆనందాన్ని ఇస్తుంది
ప్రజోత్పత్తి- అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది
అంగీరస- భోగాలు కలుగుతాయి
శ్రీముఖ- వనరులు సమృద్ధిగా ఉంటాయి
భావ- ఉన్నత భావాలు కలిగి ఉంటారు
యువ- వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి
ధాత- అనారోగ్య బాధలు తగ్గుతాయి
ఈశ్వర- క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది
బహుధాన్య- దేశం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది
ప్రమాది- వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి
విక్రమ- పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు
వృష- వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి
చిత్రభాను- అద్భుతమైన ఫలితాలు పొందుతారు
స్వభాను- క్షేమము, ఆరోగ్యం
తారణ- మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి
పార్థివ- ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి
వ్యయ- అతివృష్టి, అనవసర ఖర్చులు
సర్వజిత్తు- సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి
సర్వదారి- సుభిక్షంగా ఉంటారు
విరోధి- వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం
వికృతి- ఈ సమయం భయంకరంగా ఉంటుంది
ఖర- పరిస్థితులు సాధారణంగా ఉంటాయి
నందన- ప్రజలకు ఆనందం కలుగుతుంది
విజయ- శత్రువులను జయిస్తారు
జయ- లాభాలు, విజయం సాధిస్తారు
మన్మధ -జ్వరాది బాధలు తొలగిపోతాయి
దుర్ముఖి- ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు
హేవళంబి- ప్రజలు సంతోషంగా ఉంటారు
విళంబి- సుభిక్షంగా ఉంటారు
వికారి- ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది
శార్వరి- పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది
ఫ్లవ- నీరు సమృద్ధిగా ఉంటుంది
శుభకృత- శుభాలు కలిగిస్తుంది
శోభకృత్- లాభాలు ఇస్తుంది
క్రోధి- కోపం కలిగిస్తుంది
విశ్వావసు- ధనం సమృద్ధిగా ఉంటుంది
పరాభవ- ప్రజల పరాభవాలకు గురవుతారు
ఫ్లవంగ- నీరు సమృద్ధిగా ఉంటుంది
కీలక- పంటలు బాగా పండుతాయి
సౌమ్య- శుభ ఫలితాలు అధికం
సాధారణ- సాధారణ పరిస్థితులు ఉంటాయి
విరోధికృత్- ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది
పరీధావి- ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది
ప్రమాదీచ- ప్రమాదాలు ఎక్కువ
ఆనంద- ఆనందంగా ఉంటారు
రాక్షస-కఠిన హృదయం కలిగి ఉంటారు
నల- పంటలు బాగా పండుతాయి
పింగళ- సామాన్య ఫలితాలు కలుగుతాయి
కాళయుక్తి - కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి
సిద్ధార్థి-కార్య సిద్ధి
రౌద్రి- ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి
దుర్మతి- వర్షాలు సామాన్యంగా ఉంటాయి
దుందుభి- క్షేమం, ధ్యానం
రుధిరోద్గారి- ప్రమాదాలు ఎక్కువ
రక్తాక్షి- అశుభాలు కలుగుతాయి
క్రోధన- విజయాలు సిద్ధిస్తాయి
అక్షయ- తరగని సంపద

Saturday, September 30, 2023

మహాలయ పక్షాలు - MAHALYA PAKSHALU

మహాలయ పక్షాలు


భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు
మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

పితృదేవతలకు.. ఆకలా..?

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి .. అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే..

పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

తద్దినాలు పెడుతున్నాం కదా.. మహాలయ పక్షాలు పెట్టాలా?

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు.

ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .. పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ.. వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.. ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

పితృకార్యాలు చేయకపోతే, ఏమవుతుంది?

స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్|
జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్|| - గరుడ పురాణం

ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.

"ప్రేత రూపం విడిపించని కులాన్ని (కులం = వంశం) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు."

ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.

వీలైతే ఈ మహాలయ పక్షాలలో ప్రతి రోజు పితృదేవతా స్తుతి పఠించాలి

పితృ దోష నివారణ

పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.

ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.

మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.

పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు బోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు బోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.

పితృ దేవతా స్తుతి

శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది గరుడ మహాపురాణం లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్|
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః||

నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః|
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః||

నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్|
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః||

నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి|
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్||

నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా|
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః||

నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః|
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః||

నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః|
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః||

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్|
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్||

నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా|
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః||

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః|
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః||

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః|
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా||

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః|
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః||

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా|
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః||

పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా|
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్||

పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః|
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్||

పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ|
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు||

తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్|
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి||

సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి|
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః||

యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః|
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః||

యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ|
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు||

కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం|
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు||

దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు|
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్||

పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ||

తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన|
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః||

యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని|
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః||

రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్|
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః||


అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా|
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా||

అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం|
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా||

ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః|
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః||

సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః|
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః||

భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ

కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః|
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః||

వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా|
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః||

మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః|
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః||

సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః|
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్||

ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్|
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్||


మార్కండేయ ఉవాచ

ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః|
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః||

తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్|
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ||


రుచిరువాచ

అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్|
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్||

ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా|
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్||

మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా|
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి||

నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా|
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః||

ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ|
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః||

నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు|
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే||

సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా|
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్||

అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్|
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః||

యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః|
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః||

తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః|
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః||

మార్కండేయ వువాచ

ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః|
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ||

నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం|
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్||

ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః|
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః||

స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః|
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్||

ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా|
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః||

శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్|
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః||

స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే|
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్||

యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా|
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి||

తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః|
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్||


(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు).


పితృదేవతా నమోస్తుతే!


ఓం నమో నారాయణాయ

Thursday, September 28, 2023

శుక మహర్షి Sukha Maharshi

శుక మహర్షి

పరమ పవిత్రమైన భారత బ్రహ్మర్షుల్లో శ్రీశుక మహర్షి చాలా గొప్పవాడు. వేదవ్యాస మహర్షి తపస్సు చేసి పొందిన కొడుకు. శ్రీశుక మహర్షిని పోలిన మహర్షి త్రిభువనాల్లోనూ ఎక్కడ వెదికినా లేడు.

పూర్వం వేదవ్యాస మహర్షి 'కర్ణికారం' అనే వనంలో పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి పంచభూతాలు సమానమైన కొడుకు కావాలని కోరుకుని వరం పొందాడు.

ఆయన కోరుకున్నట్లుగానే ఘ్నతాచి అనే చిలుక రూపంలో వున్న అప్సరస కారణంగా శ్రీశుకుడు పుట్టాడు.

శుక మహర్షి పుట్టినప్పుడు ఆకాశగంగ వచ్చి స్నానం చేయించింది. ఆకాశం నుంచి కృష్ణాజినం, దండం వచ్చాయి. దివ్యదుందుభులు మ్రోగాయి, దేవతలు గానం చేస్తూ, పుష్ప వర్షం కురిపించారు. పార్వతీ సహితంగా పరమేశ్వరుడు వచ్చి ఉపనయం చేశాడు. ఇంద్రుడు కమండలం, దేవతలు ఎప్పుడూ మాయని దివ్య వస్త్రాలు ఇచ్చారు.

శ్రీశుకుడికి పుట్టకతోనే వేదాలు వచ్చేశాయి. అయినా బృహస్పతి దగ్గర మిగిలిన విద్యలన్నీ నేర్చుకున్నాడు.

కొంతకాలం తర్వాత వ్యాసుడు తన కొడుకు శుకుణి మోక్ష మార్గం గురించి తెలుసుకోమని జనక మహారాజు దగ్గరకి పంపించాడు.

కాని నడిచి మాత్రమే వెళ్ళమని చెప్పాడు వ్యాస మహర్షి.

తండ్రి చెప్పిన ప్రకారం శ్రీశుకుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. ద్వారపాలకులు మొదట లోపలికి పంపించలేదు, తర్వాత పంపారు.

జనక మహారాజు మంత్రితో సహా ఎదురొచ్చి అర్హ్య పాద్యాలిచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టి పూజచేశాడు.

జనక మహారాజుని మోక్షమార్గం గురించి చెప్పమన్నాడు శుక మహర్షి జనకమహారాజు మోక్షమార్గం గురించి విపులంగా శుక మహర్షికి చెప్పి పంపాడు.

శ్రీశుకుడు తండ్రి వలన కాలావయవ నిరూపణ, చతుర్యుగ ధర్మాలు, బ్రహ్మం దాని విజ్ఞానం, సర్వ వర్ణ ధర్మాలు, దానగుణ ప్రాశస్త్యం, మైత్రి గుణలాభం, ఇంద్రియ నిగ్రహం ఇలాంటివెన్నో నేర్చుకున్నాడు.

తండ్రితో అన్ని విషయాల గురించి చెప్పించుకుని ఆచరించి బ్రహ్మర్షియై వెలిగాడు శుకుడు. ఆత్మజ్ఞానంతో బాహ్య ప్రపంచం మర్చిపోయి శరీరం మీద దుస్తులు కూడా లేకుండా వుండేవాడు.

తక్షకుడి విషంతో ఏడు రోజుల్లో మరణించేలా శాపాన్ని పొందిన పరీక్షిత్తు దగ్గరకి శ్రీశుకుడు వెళ్ళి అతనికి ముక్తి కలిగేలా తన తండ్రి రాసిన భాగవత కథ వినిపించాడు .మిగిలివున్న ఏడు రోజులు వేరేది ఆలోచించక భగవంతుడి యందే మనస్సుంచి ధ్యానం చెయ్యమని చెప్పి పరీక్షిత్తుకు బ్రహ్మలోకం కలిగేలా చేశాడు.

ఒక రోజు నారద మహర్షి ఆశ్రమానికి వచ్చి శుకుణ్ణి నీకేంకావాలో అడగమన్నాడు

ఈలోకంలో పుట్టిన నాకు ఏది మంచో చెప్పమన్నాడు శుక మహర్షి.

యోగసిద్ధి మంచిదని నారదుడు చెప్పగానే శుక మహర్షి నారాదునికి ప్రదక్షిణం చేసి తండ్రికి చెప్పి కైలాస పర్వతం మీద తపస్సు చేసి యోగ సిద్ధి పొందాడు.

నారదుడు శ్రీశుకుణ్ణి చూడ్డానికి వెడితే అతనికి ఆత్మయోగం చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయాడు శుకుడు. మిగిలిన సిద్దులు ఆశ్చర్యపోయారు. అలా వెళ్ళిపోతూ మృగాలికి పక్షులకి, పర్వతాలకి తన తండ్రి వచ్చి శుకా! అని పిలిస్తే ఓయని పలకమని చెప్పాడు శుక మహర్షి.

శుకుడు ఆకాశ గంగ మీద ఆకాశంలో వెడుతూ వుంటే దాంట్లో స్నానం చేస్తున్న స్త్రీలు అతన్ని చూసి సిగ్గుపడలేదు, కాని అదే వ్యాసుడు వెడుతుంటే సిగ్గుపడ్డారు. అది చూసిన వ్యాసుడికి తనని చూసుకుని తనకే సిగ్గనిపించింది. ఎందుకంటే శ్రీశుకుడు పసిబిడ్డ మనసులాంటి మనసున్నవాడు, ఆడ, మగ ఎవరో తెలియనివాడు.

వ్యాసుడు శుకుడు కనిపించక శుకా! అని పిలుస్తే 'ఓ'యని వినిపింపిందిట. ఇంతలో ఈశ్వరుడు వచ్చి బాధపడుతున్న వ్యాసుణ్ణి ఓదార్చి నీకు కావలిసనట్లే నీ కొడుకు చాలా గొప్పవాడయ్యాడు, ఇంకెందుకు బాధపడతావని చెప్పి పంపించాడు.

శుకుడిని మించిన యోగీశ్వరుడు, తత్వజ్ఞుడు,తపస్వి మూడులోకాలలో మరి లేరు..
అంతటి మహానీయ మహర్షికి మనసులోనే పాదాభివందనం చేద్దాం..

అనంతపద్మనాభ వ్రతం - Anantha Padmanabha Vratham

అనంతపద్మనాభ వ్రతం

అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం.

శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి. పద్మానికి నడుమ దర్భలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి. దర్భలతో చేసిన ఆ బొమ్మలోకి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి. ఎర్రని రంగులో ఉండే 14 ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలని పురోహితులు చెబుతున్నారు.

ఇలా పద్మనాభ వ్రతాన్ని ఆచరించే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అనంతపద్మనాభ వ్రతకల్ప కథ

శౌనకాది మహామునులతో సూత పౌరాణికుడు: లోకములలో దారిద్య నివారణమునకు ఒక మహొత్తర వ్రతము కలదు. దానిని చెప్పెద వినుడు అని ఈ విధంగా చెప్పసాగిరి. కాలకర్మవశమున పాండవులు అరణ్యవాస సమయంలో కృష్ణభగవానునితో మహాత్మా! మేము అనేక కష్టాలతో జీవనము సాగిస్తున్నాము. ఈ జీవన మార్గాన్ని తప్పించే తరుణోపాయ మేదైనా ఉంటే చెప్పమని వేడుకున్నారు.

ఓ ధర్మరాజా! పురుషులకు, స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల సౌభాగ్యములనిచ్చు ఓ వ్రతము కలదు. అదియే అనంతపద్మనాభవ్రతము. భాద్రపద శుక్ల పక్ష చతుర్థీ రోజున చేయవలెను. ఆ వ్రతము వల్ల పుత్ర, పౌత్రాభి వృద్ధియు యశస్సు, సుఖశాంతులు కలుగును అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు "అనంతుడెవ్వరు? అతని స్వరూప మేమిట"ని అడుగగా, ఓ పాండుపుత్రా! అనంతుడు మరెవ్వరో కాదు నేనే. సృష్టి, స్థితి లయ కారకుడను నేనే! కాలగమనమునకు ఆద్యుడను నేనే! నా హృదయాంతరాలలో పదునాలుగు రుద్రులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు సప్తర్షులు, భూర్భువ స్వర్గోకాదులు గల నా స్వరూపమును వీక్షించుము అన్నాడు. ఆ మాటలు విని, "ఓ లోకరక్షకా! జనార్దనా! అనంతవ్రతం చేస్తాము ఆ వ్రతము ఎలా చేయాలి ఏ దైవాన్ని పూజించాలి" అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని అడుగగా ఈ విధంగా చెప్పసాగిరి.

కృతయుగంలో సుమంతుడను వేదశాస్త్ర సంపన్నుడయిన బ్రాహ్మణుడు కలడు. వశిష్టగోత్రోద్భవుడయిన సుమంతునకు భృగుమహాఋషి పుత్రిక అయిన దీక్షాదేవితో వివాహమయినది. ఆ దంపతులకు సుగుణరాశియగు పుత్రిక జన్మించినది. ఆ బాలికకు శీల యను పేరు పెట్టారు. శీల తన తండ్రికి అనుగుణంగా భక్తిశ్రద్ధలతో ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన పుత్రికకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. తపోనిష్టుడగు కౌండిన్యమహాముని సుమంతుని ఇంటికి వచ్చాడు. ఆయనను సుమంతుడు అర్ఘ్య పాద్యాదులతో సత్కరించి, తన కుమార్తె శీలనిచ్చి వివాహం చేశాడు. కౌండిన్యుడు సదాచార సంపన్నురాలు అయిన తన భార్యతో తన యాశ్రమముకు బయలుదేరాడు. మధ్యాహ్న సమయమున మార్గమధ్యమములో బండి ఆపి సంధ్యావందనాది క్రియలు చేయాలనుకొని చెరువు దగ్గరకు వెళ్ళారు. ఆరోజు భాద్రపద శుక్ల చతుర్దశి, స్త్రీలు అంతా ఎర్రని వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో అనంతపద్మనాభ స్వామిని పూజిస్తున్నారు. పరమభక్తురాలైన శీల కూడా ఆ వ్రతమునందు ఆసక్తురాలై వారిని ఆ వ్రతం విషయం అడిగినది. ఈ వ్రతం అనంతపద్మనాభ వ్రతం. ఈ వ్రతం వలన అనంతఫలములు లభించును అని తెలుపగా శీల ఆ స్తీల సహాయంతో వ్రతాన్ని ఆచరించినది.

వ్రత ప్రభావం వల్ల ఆశ్రమము స్వర్ణమయముతో ఐశ్వర్య సంపదగల భవంతిగా అయింది. దంపతులిద్దరు ఏ లోటు లేకుండా అతిధి సత్కారములతో సుఖముగా ఉన్నారు. కౌండిన్యుడు ఓ రోజున శీల సందిట నుండు తోరము చూసి ఓ శీల నీవు తోరము కట్టుకొన్నావు గద! అదెందులకు! నన్ను వశము చేసుకొనుటకా లేక మరియొకరి కోసం కట్టుకొన్నావా! అని అడిగాడు.

స్వామీ అది అనంతపద్మనాభస్వామి తోరణము ధరించియున్నాను. ఆ దేవదేవుని అనుగ్రహం వల్ల ఇట్టి సిరి భాగ్యములు కలిగాయి. అన్న శీల మాటలకు కౌండిన్యుడు కోపధారుడై దేవుడిని ధూషిస్తూ తోరమును త్రెంచి భగభగ మండెడు మంటలలో వేసాడు. కొన్ని రోజులకు వారి సంపద అంతయు పోయెను. ఆఖరికి బియ్యంగింజ లేక క్షుద్బాధ పీడితులయ్యారు కౌండిన్యుడికి గతమంతా గుర్తుకు వచ్చి, దైవదూషణంవల్ల జరిగింది అని తలచి, మనస్సులో అనంత నామము జపిస్తూ ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి, "ఓ వృక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచినావా" అని అడిగాడు. "అనంతుడెవ్వరో నాకు తెలియదు" అని చెప్పినది.

కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక ఏనుగు, గాడిద నిలుచుని ఉన్నాయి వారిని అనంత పద్మనాభ స్వామి గురించి అడిగాడు అవి అనంతుడెవ్వరో తెలియదన్నాయి.

కౌండిన్యుడికి విసుగు, బాధ కలిగి ఓపికలేక మూర్చ పోయి క్రిందపడ్డాడు. కౌండిన్యుని కోసం భగవంతుడు తేజోవంతుడైన వృద్ధరూపమున వచ్చి కౌండిన్యుని తన గృహమునకు తీసుకొనిపోయెను. ఆ గృహము మణులతోను దేవాంగనలతోగూడి యాశ్చర్యము చెందేలా ఉంది. సదాగరుడసేవితుడు, శంఖ చక్రగదాధరుడగు స్వస్వరూపాల్ని పద్మనాభస్వామి చూపించగా, కౌండిన్యుడు సంతుష్టుడై - నమో నమస్తే! గోవిందా నారాయణ జనార్ధనా అని అనేక విధముల స్తోత్రం చేశాడు. అంతట అనంతపద్మనాభస్వామి సంతుష్టుడై ఎన్నడు దారిద్యం రాకుండా, అంత్య కాలమున విష్ణులోక ప్రాప్తికలుగునని వరము ఇచ్చాడు.

దేవాది దేవా! నేను త్రోవలో చూసిన మామిడిచెట్టు, ఆవు, వృషభము, గాడిద, ఏనుగుల వింత ప్రవర్తనకు కారణ మేమిటని అడిగాడు.

ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా! పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంతో విద్యను ఎవ్వరికి చెప్పక పోవడం వలన ఎవ్వరూ ఉపయోగించలేని మామిడి చెట్టుగా జన్మించాడు. తొల్లియొకడు మహాభాగ్యవంతుడై ఎన్నడూ ఎవ్వరికి ఆఖరికి బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేయనందున పశువుగా పుట్టి, పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. మానవులను ఎల్లప్పుడు దూషణములు చేసినవాడు గాన గాడిద అయినాడు. పెద్దలు చేసి ధర్మము అమ్మినందువలన ఏనుగు అయ్యాడు. ఇవి వారి వారి పూర్వస్థితిగతులు. నీవు పదునాలుగు సంవత్సరాలు అనంత వ్రతము నియమానుసారంగా ఆచరించినచో నీకు నక్షత్ర స్థానము లభిస్తుంది అని అనంతుడు అదృశ్యమయ్యాడు.

కౌండిన్యుడు జరిగినది అంతయు భార్య శీలకు చెప్పి పదునాలుగు సంవత్సరాలు అనంతవ్రతం చేసి ఇహలోకములో పుత్రలతో, పాత్రులతో సంపదలు పొంది నక్షత్రస్థానం పొందాడు.

ధర్మరాజా! కౌండిన్యుడు నక్షత్రమండలంలో ఆ నామమున విరాజిల్లుతూ ఉన్నాడు. అగస్త్య మహాముని ఆచరించి ప్రసిద్ధి పొందాడు.

సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర మొదలగు రాజులు వ్రతం చేసి, యశస్సుపొందారు. స్వర్గ ప్రాప్తి కలిగింది. ఈ వ్రతకథను విన్నవారు ఇహలోకమున అష్టైశ్వర్యములతో సుఖముగా ఉందురు. అంతిమకాలంతో పరమపదము పొందగలరు అని పురాణ వచనం.


𝕝𝕝 ॐ 𝕝𝕝  జై శ్రీమన్నారాయణ 𝕝𝕝 卐 𝕝𝕝

Wednesday, September 20, 2023

ఋషి పంచమి Rushi Panchami

సప్తఋషిభ్యో నమః

భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.

సప్తఋషుల గురించి తెలుసుకుందాం

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః|
వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.

ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు
2.అత్రి
3.భరద్వాజుడు
4.విశ్వామిత్రుడు
5.గౌతముడు
6.జమదగ్ని
7.వసిష్ఠుడు

వీరు ఏడుగురు పూజ్యనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు.

1.కశ్యప మహర్షి

సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2.అత్రి మహర్షి

సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3.భరద్వాజ మహర్షి

భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4.విశ్వామిత్ర మహర్షి

విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5.గౌతమ మహర్షి

తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6.వశిష్ఠ మహర్షి

ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.

7.జమదగ్ని మహర్షి

జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు.

అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తపఃఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి.

ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

సప్తఋషి ధ్యాన శ్లోకములు

కశ్యప ఋషి :
కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః|
ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః

అత్రి ఋషి :
అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్|
సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||
ఓం అనసూయా సహిత అత్రయేనమః

భరద్వాజ ఋషి :
జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్|
కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||
ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః

విశ్వామిత్ర ఋషి :
కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్|
దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||
ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః

గౌతమ ఋషి :
యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా|
అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||
ఓం అహల్యా సహిత గౌతమాయనమః

జమదగ్ని ఋషి :
అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్|
దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||
ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

వసిష్ఠ ఋషి :
శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్|
బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||
ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః

సప్తఋషిభ్యో నమః

ఋషి పంచమి వ్రత కథ:

భవిష్యోత్తర పురాణం ఈ ఋషి పంచమి వ్రత ప్రాశస్త్యమును వివరిస్తోంది. పేరుకు ఋషి పంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబందించిన వ్రతంగా చెప్పబడినది. ఒకానొకప్పుడు సివాశ్వడు అనే రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించే వ్రతం గురించి అడుగగా బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించినట్లుగా " వ్రతకల్పం" పేర్కొన్నది.

పూర్వం విదర్భలో ఉత్తంగుడనే బ్రాహ్మణునకు బాలవితంతువు అయిన ఒక కుమార్తె, వేదాధ్యయనం చేసే ఒక కుమారుడు ఉన్నారు. విద్యార్ధులకు వేదం నేర్పుతూ ఈ బ్రాహ్మణుడు జీవనం చేస్తూ ఉండగా, ఒక రోజు ఆయన కుమార్తె దేహం నుండి పురుగులు రాలిపడ్డాయి. ఈ సంఘటనతో ఆ బాలిక స్పృహతప్పి పడిపోగా, ఉత్తంగుడు తన ఉపాసనా బలం వలన ఆమె పూర్వ జన్మలో రజస్వల అయి ఉండి , ఇంటిలోని అన్నపు గిన్నెలను ముట్టుకోవడం వలన ప్రస్తుతం తన కుమార్తె దేహం క్రిమిభూయిష్టమైనదని తెలుసుకున్నాడు. అప్పుడా బాపడు తన కూతురు చేత ఋషిపంచమీ వ్రతాన్ని చేయించి, గత జన్మలో ఆమె రజస్వలగా ఉన్న సమయంలో చేసిన పాపాలను హరించివేశాడు. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తుందో, ఆమె రజస్వలగా ఉండి చేసిన దోషాలన్నీ హరించబడతాయి.

పూర్వకాలంలో ఇంద్రుడు వృతాసుర వధ చేసి బ్రహ్మహత్యా పాతకం పొందాడు. అప్పుడు ఇంద్రుడు తన పాపంలో ఒక పావు వంతు భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడు. ఆనాటి నుండి స్త్రీలు రజో ధర్మాన్ని పొంది, రజస్వలలు కావడం ప్రారంభమైనది. రజస్వలా కాలంలో వారు తెలిసీ తెలియక చేసే పాపాలను పోగొట్టడానికి బ్రహ్మ ఈ ఋషిపంచమి వ్రతాన్ని కల్పించాడని పురాణ కథనం.

విదర్భలో శ్వేతజితుడనే క్షత్రీయుడు, సుమిత్ర అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. శ్వేతజితుడు కృషి కర్మలో ఉండటం వలన, తెలియక రజస్వల, అయిన స్త్రీలను తాకడం, వారితో సంబాషించడం వంటి పనులు చేశాడు. సుమిత్ర కూడా రజస్వలగా ఉన్నా అందర్నీ ముట్టుకుంటూ ఉండేది. అవసానకాలంలో వారు ఇద్దరూ మృతి చెంది, సుమిత్ర కుక్క గానూ, శ్వేతజితుడు ఎద్దుగానూ సుమిత్ర కొడుకైన గంగాధరుని ఇంటినే జన్మించారు.

కాలం గడుస్తున్నది.సుమిత్ర శ్రాద్ధదినం వచ్చింది. గంగాధరుడు శ్రద్ధగా. శ్రాద్ధ క్రియ ఆచరించి, బియ్యపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించేలోగా, పాయసాన్ని ఒక పాము ముట్టడం చూసిన కుక్క, అతిథులకు ఆ పాయసం పెడితే మరణిస్తారని తలంచి, అందరూ చూస్తూండగానే తాను ఆ పాయసాన్ని ఎంగిలి చేసింది. కుక్కముట్టిన పాయసం పనికి రాదు కనుక వంట మనిషి మళ్ళీ పాయసం వండి అతిథులను తృప్తి పరచింది. కానీ కుక్క పాయసాన్ని ముట్టినందున కోపంతో, ఆ రోజు దానికి ఆహారం ఇవ్వలేదా వంటమనిషి.

కుక్కరూపంలో ఉన్నది తానని తెలియక కొడుకు సైతం తన పట్ల నిర్లక్ష్యం వహించడం చూసిన సుమిత్ర ఈనాడు నా కొడుకు చేసిన శ్రాద్ధం వ్యర్ధం అయింది కదా! అని ఎద్దురూపంలో ఉన్న క్షత్రియునకు చెప్పుకుంది. ఈ రెండు మూగ జీవాల భాషను తెల్సిన గంగాధరుడు మర్నాడు తన గురువు వద్దకు వెళ్ళి, వాళ్ళ శాపవృత్తాంతము తెలుసుకుని, తాను ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించి, వారికి పశుజన్మల నుండి విముక్తి కలిగించి, ఉత్తమ గతులు పొందునట్లు చేసి మాతృఋణ విముక్తుడయ్యాడు.

ఈ వ్రతం ఎల ఆచరించాలి?

ఋషిపంచమి వ్రతం ప్రాయశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం విధానాలు మనలో చాలామందికి తెల్సినా ఆచరించే వాళ్ళు తక్కువ! ఒకవేళ ఆచరించినా చాలా అశాస్త్రీయంగా చేయడం విచారకరం.

పంచమినాటి తెల్లవారుఝామున స్త్రీలు స్నానం చేసి పుష్పసంచయనం చేయాలి. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి. అనంతరం గణపతి పూజ పూర్తిచేసి, ఉత్తరేణి మొక్కకు పూజసల్పి, దాన్ని సమూలంగా పెరికివేసి,దాని కొమ్మతో దంతధావనం (పళ్ళుతోమడం) చేయాలి. పుణ్యస్త్రీలు విభుది, గోపిచందనం, పంచగవ్యములతో స్నానించాలి. ఈ తంతు ముగియగానే ఆకాశంలోని సప్తఋషులను, అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి.

పూజలో నాల్గువత్తుల దీపం ఉండాలి. పూజానంతరం, భోజనంలో బఱ్ఱె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూరను భుజించాలి.

వివాహితలు ఈ వ్రతంవల్ల భర్త ప్రేమనూ, వితంతువులు రాబోయే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని " వ్రతోత్సవ చరిత్ర " స్పష్టం చేస్తున్నది. ఋషిపంచమి మధ్యాహ్నకాల వ్యాపిని అయి ఉండాలి. పంచమి తిధి ఉభయదినవ్యాపినిగా ఉంటే మొదటిరోజునే ఈ వ్రతం ఆచరించాలి.

నీలమతపురాణం ఋషిపంచమిని వరుణ పంచమి గానూ, " జ్యోతిషీ" రక్షాపంచమిగానూ, స్మృతి కౌస్తుభమౌ - చతుర్వర్గ చింతామణి - పురుషార్ధ చింతామణి వంటి పలు ప్రాచీన గ్రంథాలుఋషి పంచమి "ఋషిపంచమి" గానూ పేర్కొనడం జరుగింది. నామాలు వేరు అయినప్పటికి స్త్రీలు ఈ రోజున ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మలందు రజస్వలయై చేసిన దోషములు హరించబడతాయి. ఇది స్త్రీల వ్రతం. ప్రతి స్త్రీ ఆచరించవలసిన వ్రతం.

శుభం భూయాత్

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...