Wednesday, December 4, 2024

సప్తమ భావమందున్న గ్రహ ఫలితాలు

సప్తమ భావమందున్న గ్రహ ఫలితాలు

01. జన్మ లగ్నము నుండి ఏడవ స్థానము సప్తమ భావము! ఇదే కళత్ర భావము! దీనిని "అస్తమయ కేంద్రము",  "వివాహ స్థానము" ననియు నందురు. 

02. సప్తమ భావమునకు ప్రధాన కారక గ్రహం శుక్రుడు.!

03. సప్తమ భావము ద్వారా జాతకుని యొక్క వివాహము, భార్య, భర్త, దాంపత్య సౌఖ్యము, భార్యాభర్తల అన్యోన్యము, మోహము, రేతస్సు(ఇంద్రియపుష్టి), ఇంద్రియములు, కామము, సంసారము, విహారము, పాతివ్రత్యమును, భార్య లేక భర్త యొక్క మృతి, స్త్రీ-పురుషులతో కలహములు, మృష్ఠాన్న భోజనాదులు, తాంబూల-సుగంధ ద్రవ్య-అలంకార శయ్యా సౌఖ్యములు,  కీర్తి-అపకీర్తి, ఆట-పాటలు, వర్తక-వాణిజ్యాదులు, భాగస్వామ్యములు, క్రయ-విక్రయములు, కోర్టు వ్యవహారములు, తగాదాలు, నష్టదనము, దత్తపుత్రులు, గాన-సంగీత-నృత్య-నాటకాది చతుషష్టి కళలు, రహస్య విషయములు, దొంగతనము, అప్పులిచ్చుట, వడ్డీ వ్యాపారము, దానము, ప్రయాణ విఘ్నములు, త్రోవ తప్పుట, ఉద్యోగము, పశుసంపద, శత్రువిజయము, వ్యసనాలంపట, వ్యభిచారము, దంతములు, నాభి, స్త్రీల మర్మావయవములు, స్థనములు, లింగము, నిగూఢవర్తనము అను ఫలితములను గురించి తెలియదగుయున్నది. 

04.  సప్తమ భావమునకు- శుభ గ్రహములు అధిపతులగుట వలన వారు ఆధిపత్య పాపులగుదురు. పాపగ్రహముల కాధిపత్యము కలిగినవారు- ఆధిపత్య శుభులు కాగలరు. నైసర్గిక శుభగ్రహములు (శుక్రుడు తప్ప) భావము నందుండుట మంచిది. 

05. సప్తమ భావము నందు రవియున్న- చంచలత్వము, స్వల్ప సౌఖ్యము, చెవుడు, విఫలత్వము, స్త్రీ వియోగము, అనారోగ్యములు, భార్యకు దౌర్భాగ్యము, పాపకార్యాసక్తి కలుగ గలవు.

06. సప్తమ భావమందు చంద్రుడున్న- శరీరకాంతి, చక్కని దేహము, పరస్త్రీ సంఘమము లుండగలవు. క్షీణచంద్రుడున్న- రోగ శరీరము, పనికిమాలిన భార్య, కళత్ర అనారోగ్యము లుండగలవు. 

07. కుజుడు సప్తమమందున్న- విరహము, బావనష్టము లుండగలవు. చంద్రుని కలయిక వలన- ఆర్తి, విద్యావిహీనత, భయంకర స్వభావము లుండగలవు. 

08. బుధుడు సప్తమ స్థానమందున్న- యుక్తాయుక్త పరిజ్ఞానము, కాముకత్వము, అల్పమైన రతి సౌఖ్యము, ధనము, తెలివిగల భార్య, కొలహీనత యగుదానితో సంబంధము, పుత్రులు, సువర్ణ-ధన-భాగ్యములు కలుగ గలవు. 

09. సప్తమ స్థానంలో గురువున్న- నమ్రత, శాస్త్రాసక్తి,, మంచి యోచన, విద్యా-వినయ-రూప-శీలములు, మంచి భార్య, మాట పొందిక, వకృత్వ శక్తి, దాతృత్వము, సమర్ధత, ఖ్యాతి కలుగగలవు. 

10. శుక్రుడు సప్తమ స్థానమందున్న- సౌందర్య స్త్రీలయందు మోజు, జారత్రము, అనేక వివాహములు, పుత్రసంతతి, గొప్ప వంశము, పేరు-ప్రతిష్టలు, విశేష ధన-భాగ్యములు ప్రాప్తించగలవు. 

11. సప్తమ స్థానంలో శనియున్న- అందము, బలము లేకపోవుట, స్త్రీ గృహ-ధాన్యా లోపము, జీర్ణావస్త్రధారణ, దుర్జన సహావాసము, నీచత్వము, జారత్వము, వ్యసన లంపటము, అధిక వయస్సు గల భార్య, వృద్ధ స్త్రీ సంపర్కము, కళత్ర నష్టములు కలుగగలవు. 

12. రాహువు సప్తమమందున్న- అమాయకురాలైన భార్య, చెడుబుద్ధులు, రోగకళత్రము, సంతానహీనత, నీచ స్త్రీ సంపర్కము, వ్యభిచారము, రెండవ వివాహము, కళత్ర నష్టములు కలుగును. 

13. సప్తమంలో కేతువున్న- శోకము, జలగండము, దైవభక్తి, తెలివి తేటలు గల భార్య, పాపకార్యాసక్తి, కాముకత్వము కాలత్రానురాగము, భార్య వినియోగ దుఃఖము, ధనహాని ప్రాప్తించగలవు. 

వివాహ యోగములు

01. వివాహమునకు శుక్రుని బలాబలములు ముఖ్యము! మరియు లగ్నా చతుర్థి దశమ భావాధిపతులు- వారి బలాబలములు కూడా చూడవలెను. 

02. లగ్నాధిపతి, సప్తమాధిపతి, నవమాధిపతి, గురువు, శుక్రుడు అను వారిలో అధిక బలము గల గ్రహ దశయందు- వివాహము కాగలదు.

03.  సప్తమాధిపతి శుభారాశి యందుండి వివాహ కారక గ్రహము స్వక్షేత్ర-ఉచ్చ క్షేత్రములందున్న- 9 వ సంవత్సరంలో బాల్యవివాహము కాగలదు. 

04. శుక్రుడు సప్తమాధిపతి కలిసియుండి, సప్తమంలో రవియుండిన బాల్య వివాహము జరుగును. 

05. సప్తమాధిపతి బలమగు స్థానము నందుండి, ద్వితీయంలో శుక్రుడున- 10-16 సంవత్సరముల మధ్య వివాహము కాగలదు. 

06. 1-4-7-10 స్థానములలో శుక్రుడుండి, ఆ శుక్రునికి సప్తమ రాశిలో చంద్రుడున్న- 12 నుండి 19 సంవత్సరముల లోపు వివాహమగును. 

07. సప్తమ స్థానంలో గురువుకుఉచ్చ-స్వక్షేత్ర, మిత్రక్షేత్ర స్థితి కలిగిన బాల్య వివాహము జరుగును. 

08. ద్వితీయాధిపతి 11 వ స్థానమందు 7 వ స్థానాధిపతి 2 వ స్థానమందు ఉన్న 15 వ సంవత్సరములో వివాహమగును. 

09. లగ్న-అష్టమాధిపతులతో శుక్రుడు కలిసియున్న- 15వ సంవత్సరంలో వివాహము జరుగును. 

10. చంద్ర లగ్నమునకు 7 వ రాశియందు శుక్రుడుండి, ఆ ఏడవ రాశ్యాధిపతియున్న రాశినుండి 7 వ రాశియందు శనియున్న- 18 వ సంవత్సరంలో వివాహయోగము. 

11. శుక్రునికి కేంద్ర స్థితి కలిగియుండి, ఆ కేంద్రాధిపతి 11వ స్థానమందున్న- 20-25 సంవత్సరములందు వివాహం జరుగును. 

12. ద్వితీయాధిపతి, కుజుడూ కలిసియుండి; ద్వితీయమందు శుక్రుడున్న- 22 లేక 27వ సంవత్సరంలో వివాహమగును. 

13. సప్తమాధిపతి సప్తమమందుండి, శుక్రుడు 7-9 స్థానములందున్న- 27 లేక 30 వ సంవత్సరమునందు వివాహము జరుగును. 

14. లగ్నాధిపతి, శుక్రుడు కలిసియుండి; అష్టమాధిపతి 8వ స్థానమందున్న- 23, 25వ సంవత్సరమునందు వివాహ యోగము కలుగును. 

15. ద్వితీయంలో రాహువు, తృతీయంలో శుక్రుడుండిన- 31 లేక 34 సంవత్సరములందు వివాహమగును. 

16. సప్తమాధిపతి, లగ్నాధిపతీ, శుక్రుడు స్థిరరాశుల యందుండి; చంద్రుడు క్షీణభలము కలిగి, చరరాశియందున్న- వివాహము 30 సంవత్సరములు వరకు జరగదు. 

17. పై విధముగా గ్రహ స్థితియందు శుక్ర-సప్తమాధిపతులకు శని యొక్క దృష్టి కలిగిన- లేక లగ్నాధిపతి, శుక్రులతో-శని కలిసిన 50 సంవత్సరముల వరకు వివాహ యోగము కలుగదు. 

18. లగ్నమందు అష్టమాధిపతియున్న- మూడు వివాహములు కాగలవు. 

19. సప్తమ భావమునందు చంద్రుడున్నను, భావమును జూచినను- వివాహయోగములు కొన్ని తప్పిపోయి; తదుపరి ఫలించగలవు. 

20. సప్తమస్థాన, స్థానాధిపతులకు రవి-శని సంబంధములు కలిగినను, లేక మకర-కుంభములందు శుక్రుడునను- వివాహము ఆలస్యమగును. 

21. కారకాంశ లగ్నమునుండి 2-4 స్థానములందు బుధుడుండిన యెడల వివాహము కాదు (రాశి  చక్రంలో అధిక భాగం గతించిన గ్రహము నవాంశలో ఏ రాశియందున్న ఆ రాశి కారకాంశ లగ్నము). 

22. సప్తమాధిపతి శుభగ్రహ సంబంధ రహితుడై, స్థానము బలరహితమై యుండి; సప్తమంలో ధూమగ్రహమున్న యెడల- వివాహము జరగదు. 

23. ద్వితీయ-సప్తమాధిపతులు ఒకే రాశి యందు పాపగ్రహాములతో కలిసి ఉన్న- వివాహము జరుగుట దుర్లభము. 

24. సప్తమాధిపతిగానీ, శుక్రుడుగానీ 8-12 స్థానములందుండగా; సప్తమంలో శనియున్న- వివాహము కానేరదు. 

25. చంద్రుడు, వ్యాయాధిపతీ శత్రుగ్రహాములతో గలసి; నీచాంశల యందున్న- వివాహము కాదు. 

26.  2-7-9-10 స్థానము లన్నిటియందు పాప గ్రహములున్న- వివాహముండదు.

27. ద్వీతీయభావమునకు, సప్తమభావమునకు పాపగ్రహార్గళము కలిగిన (ఇరువైపులా పాపగ్రహములుండుట)- వివాహయోగముండదు. 

వివాహకాల దశాంతర్దశలు

1. పాపరాశులయందున్న (6-8-12) శుభగ్రహ దశల మధ్య కాలము వివాహము కలిగించగలదు. 

02.సప్తమాధిపతియున్న రాశ్యంశాధిపతి గ్రహములు- శుక్ర-చంద్రులలో శుభాదిక గ్రహ దశాంతర్ధశలయందు- వివాహము జరుగగలదు. 

03.శుక్రుడు, కళత్ర స్థానాధిపతి అను గ్రహములతో బలముగల గ్రహముతో కలిసియున్న- గ్రహ దశాంతర్ధశలయందు- వివాహమగును. 

04.చంద్ర దశలో బుధ-అంతర్దశ, గురుదశలో-గురు అంతర్దశ, గురుదశలో-చంద్ర అంతర్దశ, బుద్ద దశలో-చంద్ర-బుధ-గురువు అంతర్దశలు; శుక్ర దశలో శుక్ర అంతర్దశల యందు- సామాన్యంగా వివాహయోగము ప్రాప్తిస్తుంది. 

05.నవాంశ చక్రంలో లగ్నాధిపతియున్న రాశ్యాధిపతి యొక్క స్వక్షేత్రములందు, గోచార గురు సంచార కాలమునందు- వివాహము కాగలదు. 

06.నవాంశ చక్రంలో సప్తమాధిపతి యున్న రాశికి 5-9 రాశులలో, గోచార గురువు సంచరించే కాలం- వివాహ సమయంగా ఉంటుంది. 

07.జన్మ లగ్న, చంద్ర లగ్నములకు 1-4-7-10 రాశులలో గోచార గురిని సంచారకాలమునందు- వివాహమునుహించవలెను. 

08.రాశి చక్రమందు- గురువున్న రాశికి 1-4-5-7-9-10 రాశులలో గోచార గురిని సంచార కాలమునందు- వివాహ యోగం ఉండగలదు. 

09.లగ్నాధిపతి, సప్తమాధిపతియున్న రాశులలో గోచార గురుని సంచారకాలము- వివాహము జరుగుటకు దోహదపడగలదు. 

10.జన్మలగ్నము నుండి 2-7 రాశులలో గోచార గురుని సంచార కాలము కూడ- వివాహము జరుగును. 

11.లగ్నాధిపతితోగాని, సప్తమాధిపతితోగాని కలిసియున్న గ్రహముల యొక్క దశాంతర్ధశలయందు- భార్య ప్రాప్తించగలదు. 

కళత్ర - రూప, శీలాది యోగములు

01.గురు,చంద్ర, శుక్రులు కలిసియున్నను, లేక చంద్ర, శుక్రులు కలసియుండి; వారికి గురుదృష్టి యున్నను- అందమైన భార్య లభించగలదు.

02.కర్కాటక రాశి సప్తమ స్థానమై, అందు కుజ-శనులు కలసియున్న- అందము, పాతివృత్యము గల భార్య ప్రాప్తించగలదు. 

03.అంశ చక్రమునందు- సప్తమ స్థానంలో, చంద్ర-గురువులుండిన- రూపవతియకు భార్య లభించగలదు. 

04.సప్తమ స్థానమందు బుధుడున్న- భార్య రూపసి కాగలదు, కళత్ర రాశికి బుధ సంబంధముండిన- భార్య చురుకుదనము, తెలివితేటలు కలిగి యదార్ధవాది కాగలదు.

05.సప్తమమున గురుడున్న- జాతకుని భార్య ధర్మ గుణశీల కాగలదు. 

06.సప్తమాధిపతి కేంద్ర స్థానము లందుండి, శుభగ్రహ వీక్షితుడైన- వాని భార్య శీలవతియగును. 

07.సప్తమాధిపతి శుభ నవాంశలయందున్న- భార్య శీలవతియుగను. 

08.లగ్నాధిపతి బలవంతుడై యుండి, సప్తమంలో గురువుండి, శుక్రుడు చరరాశి యందున్న- అధిక సౌందర్యము గల భార్య ప్రాప్తించగలదు. 

09.శుక్రునికి, సప్తమాధిపతికి గురుని సంబంధమున్న- భార్య ప్రతివ్రత కాగలదు. 

10.సప్తమాధిపతి గురువై, వానికి బుధ-శుక్రుల సంబంధం ప్రాప్తించిన- పతివ్రతయకు భార్య లభించగలదు. 

11.7 వ స్థానాధిపతి శుభగ్రములతో కలసి, శుభగ్రహ వీక్షితుడైయున్న- కళంక రహిత, సౌభాగ్యవతియకు భార్య ప్రాప్తించి; వివాహానంతరము ధన-భాగ్య-సంపదల నందగలడు. 

12.గురువు 1-9-11 స్థానములందున్న- సత్కళత్రము కలుగును. 

13.బలవంతుడగు సప్తమాధిపతి- శుక్రునితో గలసి 4-10 స్థానంముల యందున్న- సత్కళత్రము కలుగును.

14.జన్మ లగ్నమందు సప్తమాధిపతియుండి, ద్వితీయమున గురుడున్న- ఇరువురు భార్యలుండి అందు మొదటి భార్య పొడవు, స్థూల శరీరము గలదియు; రెండవ భార్య పొట్టిగానుండి, సౌందర్యవతియు కాగలదు. 

15.లగ్నాధిపతికన్నను అధిక బలముగల సప్తమాధిపతి శుభగ్రహ రాశ్యాంశల యందుండినను, శుభ దృగ్యోగాది సంబంధము కలిగినను పరమోచ్చ, వైశేషికాంశలయందున్నను- భార్య ఉత్తమ కుల సంజాతురాలు కాగలదు. 

16.సప్తమాధిపతి బలము కంటే తక్కువ బలముగల లగ్నాధిపతి బలహీనుడై, శత్రువు నవాంశల యందున్నను; నీచాంశము, మూడము, నీచ గ్రహ దృగ్యోగ సంబంధాదులు కలిగియున్నను- భార్య హీనకుల సంజాతురాలు కాగలదు. 

17.సప్తమ స్థానమందు కుజుడున్న- కుచ్చితురాలగు భార్య కలుగును. 

18.రవికి సప్తమాధిపత్యం కలిగి, పాపగ్రహరాశి-నవాంశల యందున్నను; పాపగ్రహ, దృక్యోగాది సంబంధములు కలిగినను- భార్య పాపాత్మురాలగును. 

19.సప్తమ భావమునకు శని సంబంధము కలిగిన- జాతకుని భార్య కోప స్వభావం కలిగి, ముకుళితముఖియై యున్నాను; ఓర్పు-కష్టించి పనిచేయు స్వభావము కలదిగా నుండును. 

20.సప్తమ స్థానమునకు శుభ సంబంధము లేక కేవలం కుజుని సంబంధమే కలిగియున్న- జాతకుని భార్య భర్తను బాధించునది, కోపి రతి, తిరస్కార భావము గలదిగా నుండగలదు. 

21.అంశ చక్రమందు 7 వ స్థానంలో కుజుడున్న- అంగవైకల్యము గల భార్య కలుగును. 

22.చంద్రునికి సప్తమాధిపత్యం కలిగి, పాపగ్రహ రాశి-నవాంశల యందున్నను, పాప ద్రుగ్యోగాది సంబంధములున్నను- దోషయుక్తయై, చెడు పనుల నాచరించెడు కఠినాత్మురాలు భార్య కాగలదు. 

23.సింహరాశి సప్తమ స్థానమై, రవి కేంద్ర స్థానములందున్న- భార్య స్థనములు గొప్పవియు, కఠినముగా నుండునవియు నగును. 

24.కుజుడు సప్తమాధిపతిగానున్న- కుష్క స్థనములు గల భార్య కలుగును. 

25.రవికి సప్తమాధిపత్యము కలిగి, కేంద్రములందు లేకయున్నను, సప్తమ స్థానంలో శని-రాహు-కేతువులన్నను- వ్రేలాడు స్థనములుగల భార్య ప్రాప్తించగలదు. 

26.సప్తమంలో బుధ-చంద్ర-గురువులున్న- భార్య కుచములు కురుచలై యుండును. 

27.సప్తమ భావాధిపతి కుజునితో గలసియున్న- కుడి స్థనము కన్న ఎడమ స్థనము పెద్దదిగానున్న భార్యయు; బుధునితో గలసిన- రెండు ప్రక్కల సమానస్థనములు గలదియు భార్యగా ప్రాప్తించగలదు. 

28.కళత్ర భావాధిపతి గురు-చంద్రులతో గలసియున్న- ఎడమ ప్రక్క కంటెను, కుడిపక్క స్థనము పెద్దదిగా గల భార్య ప్రాప్తించగలదు. 

29.7వ అధిపతితో రవి కలిసియున్న-శుష్కస్థనములు గల భార్యా కలుగును. 

30.సప్తమ భావాధిపతి కేతువుతో గలసిన- చిన్నవగు స్థనములు గల భార్య ప్రాప్తించును. 

31.కళత్రాధిపతి రాహువుతో గలసిన- వెడల్పగు స్థనములున్న భార్య కలుగును. 

32.సప్తమాధిపతి పాప గ్రహముగా నుండినన్ను లేక జలతత్వ గ్రహమైనను లేక జలరాశులయందున్నను; అట్టి స్థితియందు గురుదృష్టి కలిగిన- బలిసిన స్థనములు గల భార్య ప్రాప్తించగలదు. 

33.గురువుగాని, శుక్రుడుగాని సప్తమాధిపతులైనను- భార్య యొక్క భగము సమము గలదిగాను; చంద్ర-శని-బుధులైన హస్వభగముగాను నుండగలదు. 

34.రాశిచక్రమందు సప్తమ స్థానంలో గల రాహువు లేక కేతువు అంశయందు కవార గ్రహంశల యందున్న- అట్టి జాతకుని భార్య భర్తకు విషము పెట్టగలదు. కేవలము పాప సంబంధాదులు కలిగిన రాహు-కేతువులు రాశి చక్రమందు సప్తమమందున్న- కఠినాత్మురాలు, పాపకర్మలు చేయునధై లోకాపవాదము నందుగలదు. 

35.సప్తమ స్థానమునకు, సప్తమాధిపతికి- శుభగ్రహాల కలయిక, దృష్టి యుండుట; సప్తమాధిపతియున్న నవాంశాధిపతి శుభుడై యుండుట వలన- భార్య సద్గుణములు గలదిగా నుండును. 

36.పై విధముగానే సప్తమ స్థాన-భావాధిపతులకు-పాప గ్రహ కలయిక దృష్టి వలనను; సప్తమాధిపతియున్న నవాంశాధిపతి పాపగ్రహ మగుట వలనను- దుర్గుణములు గల భార్యను పొందగలరు. 

37.సప్తమ భావంలో 6-8-12 అధిపతులండి, పాపగ్రహ వీక్షితులైన- భార్య స్వేచ్చా విహారిణియై వ్యభిచరించగలదు. 

38.సప్తమాధిపత్యం గల శుక్రుడు కుజాంశల యందునను; లేక కళత్ర స్థానాధిపత్యం గల కుజుడు నవాంశ చక్రమందు శుక్రునితో గలసి పాపగ్రహ విక్షితుడైయున్నను; కుజ-శుక్రులు ఒకరి అంశయందు మరొకరు పరివర్తన పొందియున్నను- భార్య వ్యభిచారిణి కాగలదు. 

39.సప్తమాధిపతి శుక్రుడై, లగ్నాధిపతితో గలసి మకర రాశి యందుండి; లగ్న-చతుర్ద-సప్తమము లందు శుభగ్రహ దృష్టి లేని పాప గ్రహము లుండి; చంద్రుడు నీచ-నీచాంశల యందున్న యెడల- అట్టివాని భార్య విచ్చలవిడిగాను, బహిరంగముగాను వ్యభిచరించగలదు. 

40.చంద్రుడు, శనితోగాని, కుజునితోగాని కలసి యుండగా; శని-కుజులు ఒకరినొకరు చూచుకొనుచున్న (పరస్పర దృష్టి) జాతకుడు వ్యభిచారి యగుటయే గాక; అతని భార్య కూడా వ్యభిచారిణి కాగలదు. 

41.లగ్నమందు కుజుడు, సప్తమమునందు శనియుండి; సప్తమాధిపతి శుక్రుడు కుజ నవాంశల యందున్న యెడల- ఆ జాతకుని భార్య వ్యభిచారిణి కాగలదు. 

వ్యభిచార యోగములు 

01.సప్తమ స్థానములో శుక్రుడు సంపూర్ణ బలం కల్గియుండిన- బహుస్త్రీలతో సంబంధము లుండగలవు. 

02.శుక్రుడు నైసర్గిక పాపగ్రహములతోనూ, 2-6-7 స్థానాధిపతులతోనూ, కలసి జన్మలగ్నము నందున్న- వ్యభిచారి కాగలడు.

03.నైసర్గిక పాప గ్రహము 2-6-1 స్థానాధిపతులతో కలిసి, సప్తమ స్థానమందున్న యెడల వ్యభిచారి కాగలడు. 

04.శుక్రునకు కుజ-శనుల ఇరువురి దృష్టి కలిగి యున్న- వ్యభిచరించగలడు. 

05.సప్తమ స్థానమునకు శుభగ్రహ ద్రోగ్యోగాది సంబంధములు కలుగక ఆ స్థానంలో శుక్రుడుండి, సప్తమాధిపతి రాహువుతో కలసిన- వేబిచార యోగము కలుగును. 

06.కుజుడు-శుక్రుడు కలిసి 7 లేక 10 స్థానములందున్న- వ్యభిచారి. 

07.జన్మలగ్నమునుండి 10వ స్థానంలో శని, చంద్ర లగ్నము నుండి 10వ స్థానంలో శుక్రుడు ఉన్న యెడల వ్యభిచారి కాగలడు. 

08.వృషభ-తులలు 7 లేక 10వ స్థానంలో నుండి, అందు శని-బుధ-శుక్రలు కలసియున్న- వ్యభిచారి కాగలడు. 

09.అంశ చక్రంలో 12వ స్థానమందు కుజ-శుక్రులున్న- వ్యభిచారికాగలడు. 

10.అంశ చక్రము నందు 9వ స్థానంలో కేతువున్న (రాశి చక్రంలో 9వ స్థానం ఏ రాశి యగునో అంశచక్రంలో ఆ రాశి యందు కేతువుండుట యని కొందరి అభిప్రాయము)- జీవితాంతము పరస్త్రీ రతుడు కాగలడు. 

11.చంద్ర-కుజ-శనులు కలసి సప్తమమందున్న- వ్యభిచారికాగలడు. 

12.సప్తమ స్థానంలో కుజ-రాహువులు కలసియున్న- అన్యకుల స్త్రీలతో వ్యభిచరించగలడు. 

13. పాప గ్రహములతో గలచిన క్షీణచంద్రుడు సప్తమందున్న- పరస్త్రీ రతుడు కాగలడు. 

14.రవి-కుజ-చతుర్ధాధిపతి కలసి, 6-7 స్థానములలో నెందైనను నుండి; శని వీక్షితుడైన- రజస్వలయైన వితంతువును సంఘమించగలడు. 

15.సప్తమ స్థానాధిపతి బలహీనుడై లేక కుజ నవాంశల యందుండగా, సప్తమ స్థానంలో క్షీణ చంద్రుడున్న- దాసీ స్త్రీ సంగమము, బలహీనుడైన బుధుడు ఉన్న వేశ్య స్త్రీ సంగమము, రాహువు ఉన్న గర్భిణీ స్త్రీ సంగమము, శని రాహువులున్న- హీన జాతి స్త్రీ సంగమము, శుక్ర-రాహువులున్న- రజక స్త్రీ సంగమము, బుద-రాహువులున్న- పడుపు వృత్తి గల స్త్రీ సంగమము, గురు-శుక్ర-రాహువులు ఉన్న- ఉత్తమ కుల వితంతు సంగమము; కుజ-శనులున్న- నికృష్ట జాతి స్త్రీ సంగమము కలుగును. 

16. లగ్నాధిపతి, అష్టమాధిపతి కలిసి మేష-వృషభ-తుల-వృశ్చిక రాశులయందున్న- తన బంధు వర్గమునందు రహస్యముగా వ్యభిచరించువాడు కాగలడు. 

బహు బార్య యోగములు

01. సప్తమ స్థానము పాపగ్రహ రాశియై  యుండి, సప్తమాధిపతి నీచ నంది, 7వ స్థానంలో పాప గ్రహములున్న- ద్వికళత్రయోగము(ఇద్దరు భార్యలు) వుండును. 

02. సప్తమాధిపతి కేంద్రకోణముల యందుండి, ఆ స్థానము అతనికి ఉచ్చ-మిత్ర క్షేత్రమై దశమాధిపతి వీక్షణ కలిగియున్న- అనేక భార్యలు కలుగును. 

03. సప్తమాధిపతి-పంచమాధిపతి బలవంతులై శుభగ్రహములతో గలసి యుండి, వారిలో నొకరికి షష్ఠాధిపతి వీక్షణ కలిగిన- బహు భార్య యోగము కలుగును. 

04. ద్వితీయాధిపతి 6వ స్థానంలో, సప్తమాధిపతి 8వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో (ఈ ముగ్గురు కలిసి 6-8-12 లలో ఏదో ఒక స్థానంలో యుండి) నుండి; ఎన్ని పాపగ్రహ వీక్షణలు కలిగియుందురో- అన్ని కళత్రములు నష్టపడగలవు. 

05. శని 2వ స్థానంలో, రాహువు 7వ స్థానంలో నున్న- ద్వికళత్ర యోగముండును. 

06. శుక్రునకు పాప గ్రహ సంబంధము వలన- ద్వికళత్ర ప్రాప్తి. 

07.  ద్వితీయ-అష్టమ స్థానములకు అనేక గ్రహ సంబంధము కలిగిన కళత్ర భంగము కాగలదు.  గురు సంబంధము వలన- ద్వితీయ వివాహముండును. 

08. అష్టమ స్థానంలో గల పాప గ్రహములను గురుడు చూసుకున్న- ద్వికళత్ర యోగముండును. 

09. సప్తమ స్థానంలో 1-8-12 అధిపతులు కలసియున్న- ద్వికళత్ర యోగముండును. 

10. మిధున-కన్యలు 8వ స్థానమై, శని వీక్షణ నందియున్న- ద్వికళత్రము కలుగును. 

11. సప్తమాధిపతి 8 వ స్థానంలో శుభ బలాధికుడైయున్న- మేనమామల తాలూకు కన్యక భార్య యగును.  వ్యాధితో నుండగలరు. 

12.  లగ్నాధిపతి 12, రవి 7, కుజుడు 8 స్థానములందున్న- రెండవ వివాహము జరుగును. 

13.  ద్వి స్వభావ రాశులలో శుక్రుడుండి, కుజ-రాహువులు ధృగ్యోగములు కలిగిన- మొదటి భార్య నశించి, రెండవ వివాహము కాగలదు. 

14. సప్తమ స్థానంలో రవి-బుధ-కుజులు పాపగ్రహములతో గలసి యున్న- మొదటి భార్య సంతానము కలిగి, నశించగలదు. తదుపరి రెండవ వివాహము జరుగగలదు. 

15. శుక్రునికి గురు దృష్టి కలిగిన-ద్వికళత్ర యోగముండును. 

16. సప్తమ స్థానంలో శని-రాహువులున్న ద్వికళత్ర యోగముండును.

17. జాతకము నందు కుజ దోషముండి, ద్వితీయంలో గురువు వున్నను లేక శనియున్నను- ద్వి కళత్ర యోగము కలుగును. 

బార్యా వియోగ-అనారోగ్యములు 

01. సప్తమ స్థానంలో 5 లేక 8 స్థానాధిపతిలున్న- భార్యావియోగం కలుగును. 

02. సప్తమాధిపతి 5వ స్థానమందున్న- భార్యావియోగ ముండగలదు. 

03.  పంచమస్తానములో బలహీనుడైన చంద్రుడుండి 1-7-12 స్థానాలలో పాప గ్రహములున్న- భార్యా-సంతాన వియోగము లుండగలవు. 

04. శుక్రునకు పాపార్గళము కలిగి పాప గ్రహ సంబంధం లుండిన- భార్యా వియోగము కలుగును. 

05. పాప గ్రహముల యొక్క సంబంధములు గల శుక్రుడు 4-8-12 స్థానముల యందున్న యెడల- భార్యా వియోగము కలుగును. 

06. సప్తమ స్థానము వృశ్చిక రాశియై, అందు శుక్రుడున- భార్య వియోగం కలుగును. 

07. వృషభ రాశి సప్తమ స్థానమై, అందు బుదుడున్న- భార్యాభయోగము. 

08. మకరం సప్తమ స్థానమై అందు గురువున్న- భార్యావియోగము. 

09 మీనరాశి సప్తమ స్థానమై; అందు శని గానీ, కుజుడు గానీ యుండిన- భార్యాభియోగము కలుగును. 

10. శుక్రుడు పాపగ్రహములతో గలసి 7-5-9 స్థలముల యందున్న- అంగవైకల్యం గల భార్య ప్రాప్తించి, వియోగ మేర్పడగలదు. 

11. శుక్రునికి సప్తమంలో కుజుడు, చంద్రుడికి సప్తమంలో శనియున్న- భార్యా వియోగము లేక సంతాన హీనత కలుగును. 

12. సప్తమ-ద్వితీయాధిపతులు బలహీనులై, పాపగ్రహ సంబంధములు కలిగియున్న- భార్యను వదిలి వేయగలరు. 

13. సప్తమ స్థాన-సప్తమాధిపతులకు శనీ-రాహు సంబంధమున్న భార్యను విడిచివెయును. 

14. సప్తమ శని, లగ్న రవి వలన- కళత్రము నష్టమగును. 

15. కన్య జన్మ లగ్నమై, అందు రవి యుండి; మీనంలో శనియున్న- భార్య నశించును. 

16.శుక్ర, షష్ఠాధిపతులు కలిసియున్న- భార్యకు ఆపదలు ప్రాప్తించగలవు. 

17. కుజుడు సప్తమ భావమందున్న- 22 లేక 42వ సంవత్సరంలో భార్య నశించును.

18. చంద్ర-శుక్రులు నీచ స్థితి యందున్న- భార్యకు జలగండము. 

19. సప్తమాధిపతి పాశ భుజంగ ద్రేక్కాణముల యందున్న- భార్య ఊరి వలన మృతి నందగలదు. 

20. శుక్రుడు పాప బలాధిక్యత నంది, సప్తమాధిపతి పాపులతో గలసియుండి, సప్తమ భావమందు 4వ స్థానాధిపతియున్న- గర్భవతియై, భార్య మరణించగలదు. 

21. కుజుడు 2-4-7-8-12 స్థానములందున్న- భార్యకు హాని కలుగును. 

22. పై విధముగా కుజుడుండి, 2వ స్థానంలో గురువున్న లేక ద్వితీయాధిపత్యము గురువునికి కలిగినను- కళత్రము నష్టమగును. 

23. సప్తమాధిపతి 3-8 స్థానములందున్న- భార్యకు అనారోగ్యము. 

24. శుక్రుడున రాశి నుండి 4-8 రాశులలో రవి, కుజ, శనులున్న- భార్య అగ్ని వలన మృతి నందగలదు. 

25. శుక్రుని కిరువైపులా పాప గ్రహములున్న- భార్య ఎత్తు నుండి జారి పడగలదు. 

26. సప్తమాధిపతికి సప్తమంలో రాహువున్న-  కళత్ర నష్టం కలుగును. 

27. పంచమ స్థానమునకు శుభగ్రహ వీక్షణాది సంబంధములు కలుగక, 11వ స్థానంలో రాహువు యొక్కడే యున్న- రాహు దశలో భార్య మరణించగలదు. 

28. సప్తమాధిపతి-రాహువు గలసి, 10వ స్థానమందున్న- విషము వలన భార్య నాశనం కాగలదు. 

29. శుక్రుడు మకర-కుంభంము లందుండి- సప్తమాధిపతి నీచస్థితి నందిన, పాప గ్రహముల యొక్క దశాంతర్ధశలు భార్యను నశింపచేయును. 

30. సప్తమ స్థానంలో కుజుడు, 2వ స్థానములో రాహువు, 6-8-12 స్థానాలలో ఒకచోట శుక్రుడు యుండిన- వివాహమైన సంవత్సరం లోపల కళత్ర నష్టము కలుగును. 

31. సప్తమాధిపతి అష్టమ స్థానమందుండి, 12వ స్థానాధిపతి సప్తమందున్న- 19 లేక 39 వ సంవత్సరంలో భార్యను భార్యకు మృతి కలుగును. 

32. లగ్నాధిపతికి నీచస్థితి కలిగి, సప్తమాధిపతి 8వ స్థానమందున్న- 40 వ సంవత్సరమునందు భార్య మరణించగలదు. 

33. ఇతర గ్రహములతో కలయక శుక్రుడోక్కడే కర్కాట రాశి యందున్న-  కళత్రమును నష్టపరుచును. 

34. జన్మ లగ్న-చంద్ర లగ్నముల నుండి 2వ స్థానంలో నున్న కుజుడు- సంతాన నష్టములను; 7వ స్థానంలో గల కుజుడు- భార్య హానినీ, 8వ స్థాన కుజుడు- స్త్రీల సౌభాగ్య (భర్తను) నష్టమును; 12వ స్థాన కుజుడు- సంపద నష్టము, దరిద్రములను కలిగించగలడు. 

35. కుజుడు జన్మ-చంద్ర లగ్నములు రెండింటి ద్వారా దోషప్రధుడైయుండిన- వివాహాటంకము లుండగలవు. 

36.  కుజుని కి ద్వితీయ-సప్తమ భావస్థితి- పురుషుల కధిక దోష ప్రధము. 

37.  4-12 కుజ స్థానస్థితి స్త్రీల కధిక దోషము కలిగించును. 

38. అష్టమ స్థాన, లగ్న స్థాన కుజదోషము- స్త్రీ పురుషులను పీడించగలదు. 

39.  శుక్రుడున్న రాశి నుండి కూడా 1-2-4-7-8-12 రాశులలో కుజుదుండుట- వైవాహిక జీవితమునకు మంచిది కాదు. 

సప్తమ భావ యోగములు 

01. నైసర్గిక శుభగ్రహమును దృష్టి 5-7 స్థానములకు కలిగిన- భార్యా సంతానముల ద్వారా అభివృద్ధి నందగలరు. 

02.  సప్తమ భావమునకు రవి గ్రహ సంబంధము కలిగిన- భార్య అదృష్టవతియై, బాగా కలిసి రాగలదు. 

03. సప్తమ స్థానమునకు శుక్ర సంబంధమున్న- భార్య వలన సుఖపడగలరు. 

04. 7 వ స్థానమునకు గురు సంబంధమున్న- వివాహానంతరం యోగ ప్రాప్తి కలుగును. 

05. జన్మ లగ్నమునందు బుధ, కేతువుల కలయిక వల్ల- భార్యకు రోగము కలుగును. 

06. సప్తమాధిపతికి గానీ, సప్తమ భావములకుగానీ- కుజ లేక శని సంబంధమున్న- భార్యతో కలహము లుండగలవు. 

07. సప్తమమందు పాప గ్రహములున్న- భార్యకు గర్భస్రావము కాగలదు. 

08. సప్తమాధిపతి యొక్క స్పుట రాశికి 5-9 స్థానములలో- గోచార గురువు ప్రవేశించు కాలము- భార్య మరణమును సూచించగలదు. 

09. సప్తమ, షష్ఠ స్థానాధిపతులు, 6 వ స్థానంలో కలసియున్న- శత్రువివాదములు, చోర బాధలు ప్రాప్తించగలవు. 

10.  సప్తమ భావము ద్వారా- జాతకుని మొదటి భార్య విషయములు తెలియను. 

11. అష్టమ భావం ద్వారా- రెండవ భార్య విషయంలు గ్రహించవలెను. 

12. తృతీయ భావము ద్వారా- మూడవ భార్య విషయములు తెలియవలెను. 

13. సప్తమ భావము తులాంశ యందున్న- వ్యాపార వృత్తి ప్రాప్తించగలదు. 

14.సప్తమ భావములో- కుజ, బుదులు కలసియున్న- వ్యాపారము చేయగలరు. 

15. లగ్న, సప్తమాధిపతులు లగ్నమందుండి; సప్తమాధిపతి దశ ప్రాప్తించిన- గొప్ప సుఖ-శాంతులు లేర్పడగలవు. 

16. శుభ గ్రహ సంబంధము గల సప్తమాధిపతి దశయందు- నౌకా సంబంధిత వృత్తు లేర్పడగలవు.

17. పాప గ్రహ సంబంధం గల సప్తమాధిపతి దశయందు- ఉన్నంతయు పోయి, దేశాటన మొనర్చును. 

18. సప్తమ స్థానంలో రాహు వుండి, పాప గ్రహ వీక్షితుడైన- దేశభ్రమణము కలుగును. 

19. సప్తమాధిపతి 9వ స్థానము నందుండి, 1-2 అధిపతులచే చూడబడుచున్న- కాంట్రాక్ట్ ల వలన విరివిగా ధన-భాగ్యములు ప్రాప్తించగలవు. 

20. సప్తమాధిపతి- శుక్రుడూ మిత్ర క్షేత్రములందుగానీ, ఉచ్చరాశుల యందు గాని యుండి; శుభగ్రహ సంబంధీకులైన- విశేష భాగ్య-సంపదలతో సుఖ ప్రాప్తి నందగలరు. 

జ్యోతిషశాస్త్రము


Monday, December 2, 2024

షష్ఠ భావమందున్న గ్రహ ఫలితాలు

షష్ఠ భావమందున్న గ్రహ ఫలితాలు

01.జన్మలగ్నం నుండి ఆరవరాశిని షష్ఠ భావముగా గ్రహించవలెను.  దీనికి రుణ రోగ స్థానము, కలహస్థానము, ప్రమాద స్థానమనియుపేర్లు కలవు. 

02. షష్టభావమునకు ప్రధాన కారక గ్రహము కుజుడు. 

03. షష్ఠ భావము ద్వారా జాతకుని యొక్క శత్రువులు, ఋణములు, రోగములు మోస క్రోధ వైరములు, పేరాశ, కుట్రలు, భయము, ఆశాభంగము, ఆత్మస్తుతి, జనద్వేషము, మతిభ్రష్టత, ప్రమాదములు, అవమానములు, జ్ఞాతులు, దుర్మరణం, దాస్యము, జూదము, భిక్షాటన, శిక్షలు, చెరసాలప్రాప్తి, యుద్ధము, అంగవైకల్యము, శత్రచికిత్స, వైద్యము, భూత ప్రయోగబాధలు, నిద్ర, ఆకలి, దరిద్రము, దొంగలు, ఔదార్యము, మేనమామల విషయములు, కఫాశ్లేష్మములు, శూల, అతిసారము, క్షయ, మేహా వ్రణాలు, మశూచి, మూత్రవ్యాధులు, సుఖవ్యాధులు, గర్వము, నిందా దూషణ, దుర్భాషలు, నాభి, గుదము, లింగ-రుషణములు, మద్యపానాది వ్యసనములు అను ఫలితములను గురించి తెలియదగియున్నది. 

04. షష్టభావము- పాపస్థానము! దీని ఆధిపత్యముగల గ్రహము మిక్కిలి పాపికాగలడు.  షష్ఠాధిపతి ఏ భావమునందునను ఏ భావాధిపతితో కలిసినను- ఆ భావ ఫలితములను పాడుచేయను.  నైసర్గిక పాప గ్రహములు షష్ఠ భావము నందుట మంచిది. . షష్ఠాధిపతి ఏ ఇతర గ్రహములతో కలియక 2-7-11 స్థానముల యందుండుట మంచిది. 

05. షష్ఠ భావము నందు రవియున్న- సౌఖ్యము, తేజస్సు, కులముఖ్యత్వము, శత్రు-రోగా- ఋణరాహిత్యము, బలము, వాహనము, బుద్ధియు కలుగ గలవు. 

06. చంద్రుడు షష్ఠమందున్న- క్రూరత్వము, దయాహీనత, క్రోధము, రోగ శరీరము, చాందసము, అజీర్తి వ్యాధి కలుగును.  పూర్ణచంద్రుడైన- కొంత శుభముండును. 

07. షష్ఠమందు కుజుడుండిన- అధిక కోపము, శత్రు నాశనము, స్నేహశీలత్వము, సజ్జన సహవాసము, కామాతురత, రోగ-రుణ-పీడా నాశనములు కలుగును. ఈ కుజునికి షష్ట స్థానము నీచ, శత్రు, క్షేత్రములైవున్న పోట్లాటలు ఉండగలవు. 

08. బుధుడు షష్ఠ భావమందున్న- రోగ శరీరము, కఠిన హృదయము, కలహ ప్రియత్వము, జాతివృద్ధి, శత్రుబాధలు, వ్యాకులత కలుగును. 

09. గురుడు షష్ఠమందున్న- రోగరాహిత్యము, కీర్తికాంక్ష లుండగలవు. గురునికి స్వమిత్ర క్షేత్రములగుట వలన- శత్రునాశనము; శత్రు క్షేత్రము, శత్రు గ్రహసంబంధములున్న- శత్రు బాధలు ప్రాప్తించగలవు. 

10. షష్టమందు శుక్రుడున్న- అధిక ధనవ్యయము, శత్రువృద్ధి, భయము, శత్రువులకు వశపడియుండుట, స్వల్ప సుఖము ప్రాప్తించును. 

11. శని షష్ఠ భావమందున్న- శత్రు-రోగ-ఋణములు లేకుండుట, దీర్ఘాయువు, నీచుల వలన భయము, పుత్ర-ధనసంపదలు, వాత రోగ బాధలు ఉండగలవు. 

12. రాహువు షష్ఠమందున్న- మూలవ్యాధి, శత్రువులు, ధన-భోగములు, యోగ్య కళత్రములు ప్రార్థించగలవు. 

13. కేతువు షష్ఠమందున్న-ధైర్యము, చొరబుద్ధి, కుట్టిలత్వము, శత్రు-రోగ-ఋణ బాధలు, చంచల స్వభావము, అవమానములు, ధైర్యము, పశుసంపదలు కలుగును. 

14. మేషము షష్టభావముగానుండిన- మెదడుకు సంబంధించిన అనారోగ్యములు, శిరో-నేత్రవ్యాధులు కలుగును. 

15. వృషభము షష్టమైన-కంఠవ్యాధులు; మలకోశ, మూత్ర కోశ వ్యాధులు కలుగును. 

16. మిధునము షష్ఠమైన- ఊపిరితిత్తులు, రక్తము, శ్వాసకోశ, నాడీ మండలములకు సంబంధించిన వ్యాధులు కలుగును. 

17. కర్కాటకము ఆరవ స్థానముగానున్న- జీర్ణకోశ, ఉదర సంబంధిత వ్యాధులు కలుగును. 

18. సింహము షష్ఠమైన- హృదయ, కంఠ, మలకోశ సంబంధమగు వ్యాధులు మరియు దురలవాట్లవల్ల కలుగు ఆయా జబ్బులు నుండగలవు. 

19. కన్య షష్టమైన- అజీర్తి, జిగట విరోచనములు, మలబద్ధకములు కలుగును. 

20. తుల షష్ఠమైన- మధుమేహము, మూత్రపిండ సంబంధిత వ్యాధులు కలుగును. 

21. వృశ్చికము ఆరవ స్థానమైన- వాపులు, ఉబ్బులు, రహస్యాంగ వ్యాధులు కలుగును. 

22. ధనస్సు ఆరవ స్థానమైన- రక్త దుర్బలత, లివర్, నడుముల బలహీనత, క్షయ వంటి వ్యాధులు సంభవించగలవు. 

23. మకరం షష్ఠ స్థానమైన- చర్మము, కీళ్లు, రక్తములకు సంబంధించిన వ్యాధులు; మరియు జలుబు సంబంధిత ఇతర శీతల వ్యాధులు కలుగును. 

24. కుంభం ఆరవ స్థానమైన- రక్తము, నరములు, నేత్రములకు సంబంధించిన వ్యాధులు; మానసిక సంబంధ వ్యాధుల వలన బాధలు కలుగును. 

25. మీనము షష్ఠ భాగముగానుండిన- వ్రణములు, కంతులు, రక్తములోని మలినముల వలన- నరముల వణుకు, క్షయ వంటి వ్యాధులు ఉండగలవు. 

వివిధ రోగ యోగములు

01. లగ్న, ద్వితీయాధిపతులు 6-8-12 స్థానములందుండి; లగ్నమందు కుజుడు పాప గ్రహ సంబంధం కలిగియున్న- నేత్ర రోగములు కలుగును. 

02. శుభగ్రహ దృష్టి లేని శని- శత్రువు-నీచ-అస్తంగా తాది దోష యుక్తుడై: ద్వితీయాధిపతి లగ్నాధిపతులతో గలసియుండి, శుక్రుడు బలహీనుడై యుండిన- పుట్టుకతో గుడ్డివాడగును. 

03. లగ్న, అష్టమాధిపతులిద్దరూ- 8వ స్థానము నందున్న- ఎడమ కన్నుకు హాని కలుగును. 

04. శుక్రుడు 6-8 స్థానములందున్న- కుడికంటికి హాని కలుగును. 

05. వ్యయస్థానంలో రవి-చంద్రులు కలిసివున్న- రెండునేత్రములకు హాని కలుగును. 

06. షష్టభావంలో- చంద్రుడు, 8వ స్థానంలో-రవి 12లో-శని 2-కుజుడుయున్న- గుడ్డివాడవును. 

07. షష్ఠాధిపతి-బుధుడు కలసి; జన్మలగ్నమందున్న- మూగతనము. 

08. ద్వితీయాధిపతి-గురువు కలసి; 6-8-12 స్థానములందునను- మూగతనము వచ్చును. 

09. షష్ఠాధిపతి-గురువు కలసి 6-8-12 స్థానములను స్థానముననున్న-మూగతనము. 

10. వృషభమందు-చంద్రుడుండి; మకర, కుంభ, మినముల యొక్క నవాంశలయందు పాప గ్రహములున్న మూగతనము ప్రార్థించగలదు. 

11. షష్ఠాధిపతికి-శత్రు క్షేత్ర స్థితి కలిగినను, లేక చంద్ర లగ్నమునకు 12వ స్థానంలో బుధుడున్నను  చెవిటి- వారగుదురు. 

12. తృతీయ, షష్ఠా, లాభాధిపతులు మువ్వురూ 1-5-9 స్థానములందున్న- చెవుడు కలుగును. 

13. నవాంశ లగ్నమందు-కేతువుండి, పాప విక్షణంనందిన- చెవి తెగిపోగలదు. 

14. ద్వితీయాధిపతి, రాహువు కలసి; షష్ఠమందున్న- దంత రోగములు కలుగును.

15. 6-8-12 స్థానములలో- ద్వితీయాధిపతి పాపగ్రహములతో గలసియున్న- నోటి యందు దుర్గంధము కలుగును. 

16. లగ్నాధిపతి, కుజుడు కలసి; మిధున, కన్యలందున్న- ముఖరోగం ఉండును. 

17. లగ్నాధిపతి, బుధుడు కలసి; మేష, వృశ్చికము నందున్న-ముఖరోగం ఉండును.

18. కుజుడు-లగ్నమందు, శుక్రుడు-షష్ఠమందునుండిన- ముక్కు తెగిపోగలదు. 

19. శనికి-లగ్నస్థితి, రాహువుకు-సప్తమస్థితి, శుక్రునకు-దశమస్థితి కలిగియుండి క్షీణ చంద్రుడు, రాహువుతో గలసిన- కాళ్లు-చేతులు తెగిపోగలవు. 

20. నైసర్గిక పాప గ్రహములన్నియు 4 కేంద్ర స్థానము నందున్న వికలాంగుడు కాగలడు.  (1-4-7-10 కేంద్ర స్థానములు)

21. దశమ స్థానంలో-బుధ, శని, రాహులు కలిసియున్న చేతులకు హాని కలుగును. 

22. వ్యయాధిపతి-బలరహితుడై, పాప గ్రహంశ, లేక నీచాంశం యందున్న- అంగవైకల్యం ముండగలదు. 

23. వ్యయాధిపతి-పాపులతో కలిసినను, 12వ స్థానంలో- పాప గ్రహములున్నను- అవయవ లోపం ఉండగలదు. 

24. రవి యున్న రాశికి 2వ  రాశిలో- శనియు,  10వ  రాశిలో చంద్రుడు, ఏడవ రాశిలో కుజుడు స్థితి నంది యున్న- అంగవైకల్య యోగము. 

25. లగ్నాధిగా ద్వితీయంలో-రవి, సప్తమంలో- కుజుడు, దశమంలో చంద్రుడు యున్న- అంగవైకల్య యోగము. 

26. షష్ఠ భావము నందు- రవి, కుజ శనులు కలిసి యున్న- కుంటివాడగును. 

27. నైసర్గిక పాప గ్రహములన్నియు షష్ఠ భావమందున్న- కుంటితనము కలుగును. 

28. షష్ఠాధిపతి- పాప గ్రాములతో గలసి 1-8 స్థానములందున్న- బాల్యమందే వ్రణ బాధలు ఉండగలవు.

29. షష్ఠాధిపతికి- పాప గ్రహా లేక అష్టమాధిపతులు కలయిక వలన- వ్రణ బాధలు కలుగును. 

30. షష్ఠాధిపతి- చంద్రుడు కలసి; 1-8 స్థానములందున్న- నోటి యందు వ్రణ బాధలుండును. 

31.షష్ఠాధిపతి- 8-1 స్థానములందుండి; కుజుని గలసిన- కంటము నందు, శుక్రుని కలసిన- నేత్రములందు, గురుని కలసిన-నాభియందు, బుధునికలసిన-ఉదరమునందు(పొట్ట), రాహువు-కేతువులను గలసిన- దేహమునందు, పెదవియందు- వ్రణబాధలు ప్రాప్తించగలవు. 

32. షష్ఠమందు- బుధుడు, 11వ స్థానము లో-చంద్రుడు, 12వ స్థానంలో-గురువుయున్న- గుదమందు వ్రణబాధలు లుండగలవు.

33. 9వ స్థానమునందు- షష్ఠాధిపతియున్న, ఆ స్థానమునకు షష్ఠాధిపతి దృష్టి కలిగిన- గృహ్యరోగ పీడితులు కాగలరు. 

34. 12-6 స్థానములలో-పరివర్తన చెందిన లేక 3 వ లేఖ 19వ సంవత్సరంలో గుల్మ  రోగ పీడ కలుగును. 

35. మేష, వృశ్చికములందు గలసియున్న- చంద్ర, కుజలకు- శని దృష్టి కలిగిన- అండ రోగా పీడ ఉండును. 

36. 8వ స్థానంలో- కుజ, శుక్రులు లేక కుజ, శని, రాహువులు కలిసియున్న అండ రోగము కలుగును. 

37. షష్ఠ, అష్టమాధిపతులు- శని, కుజులుగా నుండి; వారిరువురు పరస్పర దృష్టి నందిన- అండ రోగము కలుగును. 

38. షష్ఠాధిపతి, లగ్నాధిపతి కలసి; మేష, వృశ్చికముల యందున్న- మూల వ్యాధి కలుగును. 

39. లగ్నాధిపతి, కుజుడు, బుధుడు కలసి- మిధున, కన్య యందున్న- మూల వ్యాధి కలుగును. 

40. 6-8-12 స్థానాలలో- రాహువుతోగాని, కేతువుతోగాని కలసి లగ్నాధిపతి యుండిన- మూల వ్యాధి మరణాంతకము కాగలదు. 

41. శని, ఇతర పాప గ్రహ సంబంధములు గల- లగ్నాధిపతి 8వ స్థానము నందున్న- 59వ సంవత్సరంలో వాతరోగము కలుగును. 

42. శని యొక్క షడ్వర్గులు కలిగిన షష్ఠాధిపతి- లగ్నాధిపతితో గలసియున్న ఆ షష్ఠాధిపతి దశా కాలమునందు సన్నిపాత వ్యాధి కలుగును. 

43. లగ్న, షష్ఠాధిపతులకు శని యొక్క సంబంధముచే వాతవ్యాధి కలుగును. 

44. షష్ఠాధిపతి-కుజునిచే చూడబడుచూ; 8వ స్థానమునందున్న స్పోటకము కలుగును. 

45. లగ్న, షష్ఠాధిపతులు కుజునుతో కలిసియున్న స్పోటక ప్రాప్తి. 

46. లగ్న, షష్ఠాధిపతులకు మాంది-రాహు-కేతువుల సంబంధం కలిగిన చంద్ర భుక్తి యందు- సర్ప బాద, జ్వరము, మశూచి కలుగును. 

47. కుజుడు-12వ స్థానంలోనూ, శని-8వ స్థానంలోనూ నుండిన- 15వ లేక 30 వ సంవత్సరంలో స్పోటకము కలుగును. 

48. షష్ఠభావమందు- శనియున్నను- లేక భావమును చూచినను- గర్భ శూల కలుగును. 

49. షష్ఠభావంలో-గురువు; పంచమంలో-చంద్రుడు ఉన్న 19వ లేక 22వ సంవత్సరంలో కుక్షీ రోగము ప్రాప్తించగలదు. 

50. సప్తమ లేక అష్టమ స్థానములలో- శని, గురువులు కలిసి ఉన్న- రక్త కోశ రోగము, రవి కూడా కలిసి ఉన్న- క్షయ వ్యాధి ప్రాప్తించగలదు. 

51. క్రోరాంశ యందున్న బుధుడు-కుజుడుతో గలసి, షష్ఠ భావమందుండి; శుక్ర, చంద్రులచే చూడబడుచుండిన- క్షయ వ్యాధి పీడితులు కాగలరు. 

52. రవి,చంద్రులకు- ఒకరి రాశుల యందు మరోకరికి మరొకరికి పరివర్తన కలిగిన క్షయ వ్యాధి జనించగలదు. 

53. దశమ స్థానంలో- శని, కుజ, చంద్రులుండి; బుధుడు-మేషరాశి యందున్న కుష్టు వ్యాధి కలుగును. 

54. పాప గ్రహవీక్షణ గల-చంద్ర, శుక్రులు జలరాశుల యందున్న- కుష్టు వ్యాధి జనించును. 

55. కారకాంశ- లగ్నమునందుండి; 4వ స్థానంలో- కుజ వీక్షితుడైన చంద్రుడుండిన మహా కుష్టు వ్యాధి ప్రాప్తించగలదు. 

56. షష్ఠమందు చంద్రుడూ, లగ్నమందు రాహువు యున్న- అపస్మార వ్యాధి కలుగును. 

57. అష్టమ స్థానంలో- చంద్ర, రాహువులు కలసియున్న అపస్మార వ్యాధి కలుగును. 

58. చంద్ర, శుక్రులు కేంద్రములందుండి; అష్టమంలో పాప గ్రహములు ఉన్న అపస్మార వ్యాధి ఉండగలదు. 

59. చంద్ర,శనులు కలసి; కుజ దృష్టి పొందియున్న అపస్మార స్థితి కలుగును. 

60. చతుర్ధమందు- గురు, కుజ, శనులు కలిసి ఉన్న హృద్రోగ ప్రాప్తి. 

61. సప్తమంలో కుజ, రాహువుల కలయిక భార్యకు కుసుమ రోగము. 

62. షష్టమందు- చంద్ర, గురుల కలయిక- శూల రోగ ప్రాప్తి!

63. పాప గ్రహ దృష్టి నందిన గురుడు- వ్యయమందున్న-గుద రోగము కలుగును. 

64. కుజ, శనులు- షష్ఠ భావము నందుండి; రవి, రాహువులచే చూడబడుచున్నాను; లేక బలహీనుడైన లగ్నాధిపతికి- కుజ, శనులు సంబంధం కలిగియున్నను ఆ జాతకుడు దీర్ఘవ్యాధిగ్రస్తుడు కాగలడు. 

65. అష్టమాధిపతి- 6-8-12 స్థానములందున్న- నిత్య రోగ బాధలు ఉండును. 

66. లగ్నాధిపతి, షష్ఠాధిపతి గ్రహములకు రవి యొక్క కలయిక కలిగిన- జ్వర బాధలు, చంద్రుని కలయికచే- జలోచరము; కుజునిచే- ఆయుధ,వ్రణ, స్పోటక, బాధలు; బుధ కలయికచే- మనోవిచారము, శని కలయికచే- వాత వ్యాధులు, రాహువు, కేతువుల కలయిక వలన- సర్పపీడలు ప్రాప్తింపుచుండ గలవు. 

67. లగ్నమందున్న షష్ఠాధిపతికి చంద్ర, రాహువుల కలయిక వల్ల- పురుషాంగమునకు శస్త్ర చికిత్స జరుగగలదు. 

68. లగ్నములందు- బుధ, రాహువుల కలయిక వల్ల- విషభక్షణ మృత్తి కలుగును. 

69. చతుర్ధ, సప్తమాధిపతులు శత్రు గ్రహములతో; కలసి 6-8-12 స్థానములందున్న- మూత్ర, కృచ్చ  రోగములు కలుగును. 

70. షష్ఠాధిపతి 8వ స్థానంలోనూ, కుజుడు- 6వ స్థానంలోనూ నుండిన- 6వ లేక 12వ సంవత్సరంలో తీవ్ర జ్వరగండం ముండగలదు. 

71. చంద్రుడు- శుభగ్రహ సంబంధ రహితుడై షష్ఠమందున్న- బాల్యంలో రోగ పీడ ఉండగలవు. 

72. 10వ స్థానంలో కుజుడున్న- భూ సంబంధముగను, 6-8-12 లలో గురువున్న-వస్త్రాభరణ- వాహనముల కొరకు; 7-5-9 లలో గురువు ఉన్న- సంతానము వలన, 5-9 లలో రవి ఉన్న- తండ్రి వలన, బంధువుల వలన; 5-7 లలో శుక్రుడున్న-ప్రయాణ విషయములను గురించి మనోవ్యాధలు కలుగుచుండగలవు. 

షష్టభావము శుభాశుభ యోగములు

01. షష్ట భావాధిపతికి- నీచ, శత్రుక్షేత్ర స్థితి; ద్వాదశ భావ స్థితి కలిగిన యెడల- శత్రునాశమునము కాగలదు.

02. షష్ఠ స్థానంలో- శుభగ్రహము లుండుటవల్ల మంచి జరుగును.

03. 6-11 స్థానాధిపతులు- 11-6 స్థానములందు పరివర్తనులైయున్న- 41వ సంవత్సరంలో శత్రువుల వల్ల ధననాశము కాగలదు. 

04. గురువు-1-6-12 అధిపతులతో కలసి; షష్ఠ భావమందున్న- కుమారుడే పరమ శత్రువు కాగలడు.

05. షష్ఠ భావమునకు లేక షష్ఠాధిపతికి శని-కుజుల దృగ్యోగాది సంబంధములు కలిగిన- మద్యపానము చేయగలరు. 

06. షష్ఠాధిపతి 10 వ స్థానమునందున్నను, ఆ స్థానమున చూచినను- వ్యసనముల వల్ల బ్రష్టులు కాగలరు.

07. 1-6-8 స్థానాధిపతులకు రాహు-కేతువుల కలయికయున్న-సర్పదష్టులు  కాగలరు (1-6-8 అధిపతుల దశలలో). 

08.  లగ్నమందు షష్ఠ- అష్టమాధిపతులుండి వారికి రవి సంబంధం కలిగిన- జ్వరద్యుపద్రవముల  వలన మృతి కలుగును. 

09. పై విధముగా చంద్ర సంబంధము కలిగిన- జలగండముచే మృతి కలుగును. 

10.  పై విధముగా బుధ సంబంధము వలన పైత్య రోగాదుల వల్ల మరణము కలుగును. 

11. పై విధముగా శని సంబంధము వలన- క్రూర జంతువుల, చోరుల వల్ల మరణము ప్రాప్తించగలదు. 

12.  పై విధముగా కుజ సంబంధము వలన- శత్రువులు, అగ్నివల్ల మృతి కలుగును. 

13. పై విధముగా షష్ఠ-అష్టమాధిపతులుండి; ఆయా గ్రహముల సంబంధములతో పాటు- గురు-శుక్రల సంబంధము కూడా కలిగిన- మరణ గండము తప్పిపోగలదు. 

14. షష్ఠాధిపతికి రాశ్యంశలయందు కేతు సంబందమున్న- కారాగార ప్రవేశము చేయగలరు. 

15. చంద్రుడు పాపగ్రహ వీక్షితుడైయుండి, శని సప్తమ స్థితి యందుండి, శుభగ్రహములు చరరాశులయందుండిన- భూత, ప్రేత పిశాచాది దుష్టగ్రహ పీడలు సంభవించగలవు. 

16. వ్యయాధిపతి తృతీయస్థితి కలిగియున్నను, అంశ లగ్నమందు కేతువున్నను- చోరుడు కాగలడు. 

17. షష్ఠాధిపతి సప్తమంలో నుండిన- శత్రు వశీకరణ, శత్రు నిగ్రహము లుండగలవు.

18. నైసర్గిక పాపగ్రహములన్నియు షష్ఠ భావంలో కలిసియున్న- తక్కువ స్థితి నుండి  ఉన్నత స్థితి నందగలరు. 

19. రాహు-కేతువులతో గలసి, 1-6-8 అధిపతులు కేంద్ర కోణములందున్న- కారాగృహ ప్రాప్తి కలుగును. 

20.  కుజుడు 9-10 స్థానములందు పాపగ్రహ వీక్షితుడైన- మేనమామలు ఉండరు. 

21. షష్ట స్థానమును శుభగ్రహములు వీక్షింపుచుండిన- మేనమామలు ఉండరు. 

22. బుధుడున్న రాశి నుండి 6 వ రాశిలో పాపగ్రహములున్న మేనమామ ఉండరు. 

23. షష్ఠాధిపతి షష్ఠ భావమందున్న-నమ్మికగల మంచి సేవకులుండగలరు. 

జ్యోతిషశాస్త్రము


Thursday, November 28, 2024

పంచామృత స్నానాభిషేకం - PANCHAMRUTHA SNANAM

 (వామదేవాయ నమః – స్నానం)
ఇత్యాది నిర్మాల్యం-విసృజ్యేత్యంతం ప్రతివారం కుర్యాత్ ॥

॥ పంచామృతస్నానమ్ ॥
అథ (పంచామృత స్నానం) పంచామృతదేవతాభ్యో నమః ।
ధ్యానావాహనాది షోడశోపచారపూజాస్సమర్పయామి ।
భవానీశంకరముద్దిశ్య భవానీశంకర ప్రీత్యర్థం 
పంచామృతస్నానం కరిష్యామః ।

క్షీరం
ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ ।
భవావాజస్య సంగథే ॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః క్షీరేణ స్నపయామి ।
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన ।
మహేరణాయ చక్షసే ।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః ।
ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ।
ఆపో జనయథా చ నః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । 
క్షీరస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ।

దధి
దధిక్రావ్‍ణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః ।
సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ ॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । దధ్నా స్నపయామి ।
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన ।
మహేరణాయ చక్షసే ।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః ।
ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ।
ఆపో జనయథా చ నః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । 
దధిస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ।

ఆజ్యం
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా-
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । ఆజ్యేన స్నపయామి ।
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన ।
మహేరణాయ చక్షసే ।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః ।
ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ।
ఆపో జనయథా చ నః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । 
ఆజ్య స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ।

మధు

మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః ।
మాధ్వీర్నః సంత్వోషధీః ।
మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః ।
మధుద్యౌరస్తు నః పితా ।
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః ।
మాధ్వీర్గావో భవంతు నః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । మధునా స్నపయామి ।
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన ।
మహేరణాయ చక్షసే ।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః ।
ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ।
ఆపో జనయథా చ నః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । 
మధుస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ।


శర్కర

స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే ।
స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే।
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే ।
బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । శర్కరయా స్నపయామి ।
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన ।
మహేరణాయ చక్షసే ।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః ।
ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ।
ఆపో జనయథా చ నః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । 
శర్కర స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । 
పంచామృత స్నానం సమర్పయామి ।


శంఖోదకం
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన ।
మహేరణాయ చక్షసే ।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః ।
ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ।
ఆపో జనయథా చ నః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । 
శంఖోదకేన స్నపయామి ॥

ఫలోదకం
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః ।
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగ్‍ం హసః ॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । 
ఫలోదకేన స్నపయామి ।

గంధోదకం
గంధద్వారాం దురాధర్​షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ ।
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । గంధోదకేన స్నపయామి ।

పుష్పోదకం
యోఽపాం పుష్పం-వేద ।
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ।
చంద్రమా వా అపాం పుష్పమ్ ।
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । పుష్పోదకేన స్నపయామి ।

అక్షతోదకం
ఆయనే తే పరాయణే దూర్వా రోహంతు పుష్పిణీః ।
హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృ॒హా ఇమే ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । అక్షతోదకేన స్నపయామి ।

సువర్ణోదకం
తథ్సువర్ణగ్ం హిరణ్యమభవత్ ।
తథ్సువర్ణస్య హిరణ్యస్యజన్మ ।
య ఏవగ్ం సువర్ణస్య హిరణ్యస్య జన్మవేద ।
సువర్ణ ఆత్మనా భవతి ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । సువర్ణోదకేన స్నపయామి ।

రుద్రాక్షోదకం
 త్రయంబకం-యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ।
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్ ॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । రుద్రాక్షోదకేన స్నపయామి ।

భస్మోదకం
మా నో మహాంతముత మా నో అర్భకం
మా న ఉక్షంతముత మా న ఉక్షితమ్ ।
మా నోఽవధీః పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిషః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । భస్మోదకేన స్నపయామి ।

బిల్వోదకం
మా నస్తోకే తనయే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః ।
వీరాన్మా నో రుద్ర భామితోఽవధీర్​హవిష్మంతో
నమసా విధేమ తే ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । బిల్వోదకేన స్నపయామి ।

దూర్వోదకం
కాండాత్కాండాత్ప్రరోహంతి పరుషః పరుషః పరి।
ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ ॥
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । దూర్వోదకేన స్నపయామి ।
అథ మలాపకర్​షణ స్నానమ్ ।
హిరణ్యవర్ణాశ్శుచయః పావకా
యాసు జాతః కశ్యపో యాస్వింద్రః ।
అగ్నిం-యా గర్భం దధిరే విరూపాస్తా
న ఆపశ్శగ్గ్ స్యోనా భవంతు ॥
యాసాగ్ం రాజా వరుణో యాతి మధ్యే
సత్యానృతే అవపశ్యంజనానామ్ ।
మధుశ్చుతశ్శుచయో యాః పావకాస్తా
న ఆపశ్శగ్గ్ స్యోనా భవంతు ॥
యాసాం దేవా దివి కృణ్వంతి భక్షం
యా అంతరిక్షే బహుధా భవంతి ।
యాః పృథివీం పయసోందంతి శుక్రాస్తా
న ఆపశ్శగ్గ్ స్యోనా భవంతు ॥
శివేన మా చక్షుషా పశ్యతాపశ్శివయా
తనువోప స్పృశత త్వచం మే ।
సర్వాగ్ం అగ్నీగ్ం రఫ్సుషదో హువే వో మయి
వర్చో బలమోజో నిధత్త ॥
(అ.వే., కాండ-3, సూక్తం-13)
యదదః సంప్రయతీరహావనదతా హతే ।
తస్మాదా నద్యో నామ స్థ తా వో నామాని సింధవః ॥ 1
యత్ప్రేషితా వరుణేనతాశ్శీభగ్ం సమవల్గత ।
తదాప్నోదింద్రో వో యతీస్తస్మాదాపో అనుస్థన ॥ 2
ఆపకామగ్గ్ం స్యందమానా అవీవరత వో హి కమ్ ।
ఇంద్రో వశ్శక్తిభిర్దేవీస్తస్మాద్వార్ణామ వో హితమ్ ॥ 3
ఏకో వో దేవో అప్యతిష్ఠథ్స్యందమానా యథావశమ్ ।
ఉదానిషుర్మహీరితి తస్మాదుదకముచ్యతే ॥ 4
ఆపో భద్రా ఘృతమిదాప ఆనురగ్నీషోమౌ బిభ్రత్యాప ఇత్తాః ।
తీవ్రో రసో మధుపృచాం అరంగమ ఆ మా ప్రాణేన సహ వర్చసాగన్న్ ॥ 5
ఆదిత్పశ్యామ్యుత వా శృణోమ్యా మా ఘోషో గచ్ఛతి వాఙ్మ ఆసామ్ ।
మన్యే భేజానో అమృతస్య తర్‍హి హిరణ్యవర్ణా అతృపం-యదా వః ॥ 6
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన ।
మహేరణాయ చక్షసే ।
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః ।
ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ।
ఆపో జనయథా చ నః ।
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । శుద్ధోదకేన స్నపయామి ।
[ దివిశ్రయస్వాంతరిక్షేయతస్వ పృథివ్యాసంభవ బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయత్వా । 
అపాం గ్రహాన్గృహ్ణత్యేతద్వాప రాజసూయం-యదేతేగ్రహాస్సవోఽగ్నిర్వరుణసవో రాజసూయమగ్నిసవశ్చిత్యస్తాభ్యామేవ సూయతేఽథో ఉభావేవలోకావభిజయతి యశ్చ రాజసూయేనేజానస్య యశ్చాగ్నిచిత ఆపో భవంత్యాపో వా అగ్నేర్భ్రాతృవ్యా యదపోఽగ్నేరధస్తాదుపదధాతి భ్రాతృవ్యాభిభూత్యై భవత్యాత్మనాపరాఽస్యభ్రాతృవ్యో భవత్యమృతం-వా ఆపస్తస్మాదద్భిరవతాంతమభిషించంతి నార్తిమార్ఛతిసర్వమాయురేతి ॥]
పవమానస్సువర్జనః । పవిత్రేణ విచర్​షణిః ।
యః పోతా స పునాతు మా । పునంతు మా దేవజనాః ।
పునంతు మనవో ధియా । పునంతు విశ్వ ఆయవః ।
జాతవేదః పవిత్రవత్ । పవిత్రేణ పునాహి మా ।
శుక్రేణ దేవదీద్యత్ । అగ్నే క్రత్వా క్రతూగ్ం రను ।
యత్తే పవిత్రమర్చిషి । అగ్నే వితతమంతరా ।
బ్రహ్మ తేన పునీమహే । ఉభాభ్యాం దేవసవితః ।
పవిత్రేణ సవేన చ । ఇదం బ్రహ్మ పునీమహే ।
వైశ్వదేవీ పునతీ దేవ్యాగాత్ ।
యస్యై బహ్వీస్తనువో వీతపృష్ఠాః ।
తయా మదంతః సధమాద్యేషు ।
వయగ్గ్ స్యామ పతయో రయీణామ్ ।
వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు ।
వాతః ప్రాణేనేషిరో మయో భూః ।
ద్యావాపృథివీ పయసా పయోభిః ।
ఋతావరీ యజ్ఞియే మా పునీతామ్ ॥
బృహద్భిస్సవితస్తృభిః । వర్‍షిష్ఠైర్దేవమన్మభిః ।
అగ్నే దక్షైః పునాహి మా । యేన దేవా అపునత ।
యేనాపో దివ్యంకశః । తేన దివ్యేన బ్రహ్మణా ।
ఇదం బ్రహ్మ పునీమహే । యః పావమానీరద్ధ్యేతి ।
ఋషిభిస్సంభృతగ్ం రసం । సర్వగ్ం స పూతమశ్నాతి ।
స్వదితం మాతరిశ్వనా । పావమానీర్యో అధ్యేతి ।
ఋషిభిస్సంభృతగ్ం రసం । తస్మై సరస్వతీ దుహే ।
క్షీరగ్ం సర్పిర్మధూదకమ్ ॥
పావమానీస్స్వస్త్యయనీః । సుదుఘాహి పయస్వతీః ।
ఋషిభిస్సంభృతో రసః । బ్రాహ్మణేష్వమృతగ్ం హితమ్ ।
పావమానీర్దిశంతు నః । ఇమం-లోకమథో అముమ్ ।
కామాన్‍థ్సమర్ధయంతు నః । దేవీ‍ర్దేవైస్సమాభృతాః ।
పావమానీస్స్వస్త్యయనీః । సుదుఘాహి ఘృతశ్చుతః ।
ఋషిభిస్సంభృతో రసః । బ్రాహ్మణేష్వమృతగ్ం హితమ్ ।
యేన దేవాః పవిత్రేణ । ఆత్మానం పునతే సదా ।
తేన సహస్రధారేణ । పావమాన్యః పునంతు మా ।
ప్రాజాపత్యం పవిత్రం । శతోద్యామగ్ం హిరణ్మయం ।
తేన బ్రహ్మ విదో వయమ్ । పూతం బ్రహ్మ పునీమహే ।
ఇంద్రస్సునీతీ సహమా పునాతు । సోమస్స్వస్త్యా వరుణస్సమీచ్యా ।
యమో రాజా ప్రమృణాభిః పునాతు మా । జాతవేదా మోర్జయంత్యా పునాతు ।
ఆపో వా ఇదగ్ం సర్వం-విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః
పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః సమ్రాడాపో విరాడాపః
స్వరాడాపశ్ఛందాగ్ంస్యాపో జ్యోతీగ్ంష్యాపో
యజూగ్ంష్యాపస్సత్యమాపస్సర్వా దేవతా ఆపో
భూర్భువస్సువరాప ఓమ్ ॥
అపః ప్రణయతి । శ్రద్ధావా ఆపః ।
శ్రద్ధామేవారభ్య ప్రణీయ ప్రచరతి ।
అపః ప్రణయతి । యజ్ఞో వాఅ ఆపః ।
యజ్ఞమేవారభ్య ప్రణీయ ప్రచరతి
అపః ప్రణయతి । వజ్రో వా ఆపః ।
వజ్రమేవ భ్రాతృవ్యేభ్యః ప్రహృత్య ప్రణీయ ప్రచరతి ।
అపః ప్రణయతి । ఆపో వై రక్షోఘ్నీః ।
రక్షసామపహత్యై ।
అపః ప్రణయతి । ఆపో వై దేవానాం ప్రియంధామ ।
దేవానామేవ ప్రియంధామ ప్రణీయ ప్రచరతి ।
అపః ప్రణయతి । ఆపో వై సర్వా దేవతాః ।
దేవతా ఏవారభ్య ప్రణీయ ప్రచరతి ।
(ఆపోవైశాంతాః । శాంతాభిరేవాస్య శుచగ్ంశమయతి ॥)
శ్రీ భవానీశంకరాస్వామినే నమః । మలాపకర్​షణస్నానం సమర్పయామి ।

ద్వితీయ భావమందున్న గ్రహ ఫలితములు

ద్వితీయ భావమందున్న గ్రహ ఫలితములు

జనమలగ్నము నుండి ద్వితీయ(రెండవ) రాశి - ధన భావము, కుటుంబ భావము దెలుపబడినది. 
ఈ భావము ద్వారా జాతకుని వాక్కులు, ముఖము, భోజనము, భుద్ధి, విద్య, నేత్రములు, చెవులు, దౌడలు, దంతములు, నాలుక, ధనం, ధనరాబడి, క్రయ- విక్రయములు, ప్రయాణములు, కుటుంబ విషయములాదిగాగల ఫలితములు తెలియగలవు. 
1. రవి యున్న - ధన హీనత, అసత్య వాక్కులు, స్వల్ప సంతానము, భార్య సౌక్య హీనత, ముఖ, నేత్ర, దంత రోగములు కల్గును. 
2. చంద్రుడు యున్న - దాతృత్వము, సద్బుద్ధి, సౌక్యము, తేజసు, పేరు-ప్రతిష్టలు, సున్నితము, స్పుటమైన వాక్కులు , ధనా భరణములు, కుటుంబ వృద్ధి కల్గును. ఈ చంద్రుడు క్షీణ దశయందున్న వ్యతిరేక ఫలితములు, విద్యా విఘ్నములు ప్రాప్తించును. 
3. కుజుడున్న - నిలువయుండని ధనము, దుర్భుద్ధి, దయాహీనత, కుటుంబ సౌక్యము లేకుండుట, ధీర్ఘ కోపము, నేత్ర వ్యాధులు, పశువ్యపారము, ఋణపీడ, ప్రవాసము, భోగము, పిత్రార్జిత అస్తి, విద్యా విఘ్నములు, అపాత్రదానము కలుగగలవు. 
4. బుదుడున్న - అందము, పొడవైన తలవెంట్రుకలు, అతిభాషణ, ధన - భులాభము, సౌఖ్యము, కుటుంబ సుఖము, విద్య కల్గును. 
5. గురువున్న - రూప, విద్య, గుణ, సౌశీల్యములు, సత్స్వభావము, కీర్తి - ప్రతిష్టలు, అవిరోధము, ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము, వృద్ధాప్యమునందు, ఆర్ధిక ఇబ్భందులు కలుగగలవు. 
6. శుక్రుడుయున్న - విద్య, తద్వారా ధనార్జన, స్త్రీ ధనము, సుఖ భోజనము, విలువగల వస్త్రాభరణ, వాహన, సంపదలు, ధన నిల్వలు, పుణ్యకార్యాచరణ, ఆడంబర వాక్కులు, కుటుంబ వృద్ధి, అందమగు నేత్రములు, సంస్కృత కావ్య నాటకాలంకార విద్య పాండిత్యము కల్గును. 
7.  శనియున్న - పరగృహ, పర స్థలములందువశించుట, జూదాది వ్యసనములు, ఉత్తమ వాహన యోగము, స్వజన పరిత్యాగము, విచారములు, కల్గును. ద్వితీయ భావము కరకుంభములైన యెడల - విశేష వాహన సౌఖ్యము, రాజపూజ్యత, ధనము, నేత్రరోగము, ఋణపీడ, కళత్ర సౌఖ్యహాని, సంతాన విచారము కల్గును. 
8. కేతువుయున్న - శూరత్వము, కలహములందు నేర్పు, విదుషత్వము, కంగారు, వ్యాపారము ద్వారా ధన యోగము, కుటుంబ విరోధము, కఠిన వాక్కులు, ముఖ రోగములు కల్గును. 
9. రహువుయున్న - బలము, దుఖము, ధన హీనత, నీచ గృహనివాసము, మాంస విక్రయము, మత్య్స వ్యాపారములు కల్గును. 
10. ధనమునకు సంబంధించిన విషయములలో 2-5-9-10-11, భావములు కూడా ఫలితములు నివ్వగలవు. ద్వితీయ భావముతోబాటు మిగిలిన ఆ భావములయోక్క బలా బలములు కూడ, విచారింపవలసి యున్నది. 
11. ధనకారకుడగు గురుగ్రహము, ధనలాభాదిపతి, ధన భావమునందున్న గ్రహములు - ధనయోగాములందు ప్రాధాన్యతనంది యుండెదరు. 
12. జన్మలగ్నము లేక చంద్రలగ్నములో నున్న గురువు - ద్వితీయ భావాధిపతులగు గ్రహములను చుచుచున్ననూ లేక వారితో కలసియున్నాను - ధనము, కుటుంబము వృద్ధినందగలదు. 
13. ద్వితీయాధిపతికి - లభాదిపతియోక్క కలయిక లేక దృష్టి యుండిన యెడల - అత్యాధిక ధనవంతుడు కాగలడు. 
14. బుధ, గురు, శుక్రులు - ధన  భావమునందున్ననూ లేక ఆ భావమును జూచినా వేశేష ధనవంతులగుదురు. 
15. 2-9-10-11 భావధిపతులగు గ్రహములు - 1-4-5-7-9-10 స్థానములయందున్న యెడల గొప్ప ధన ప్రాప్తి కల్గును. 
16. 1-4-7-10 స్థానములందు శుభ గ్రహములున్నచో  - అధిక ధనము కల్గును. 
17. ఒక ఉచ్చస్థితిగల గ్రహముతో - గురుడుగానీ శుక్రుడు గానీ బుధుడుగానీ , పూర్ణ చంద్రుడు గానీ కలసి - 2-4-11 స్థానములయందున్న - గొప్ప శ్రీమంతుడు కాగలడు. 
18. లగ్న,  ద్వితీయ, ఏకాదశ భావధిపతులు 5-9-1-4-7-10 స్థానములందుండి - వారికి పాప గ్రహ సంబంధము లేకుండిన - ధనవంతులు కాగలరు. 
19. 2-5-9-11 భావాధిపతులందరు కొందరుగానీ పరస్పర దృష్టి కలయికలాదిగా గల సంబంధములుండి బలము కల్గియుండిన - లక్షాధిక ధన - సంపదలు ప్రాప్తించగలవు. 
20. ధన - లాభ భావములయొక్క అధిపతులగు గ్రహములు పరస్పరం మిత్రులై, లగ్నమందున్న - విశేషధనయోగము కల్గును. వీరుభయులు పాపగ్రహ సంబంధములులేని వరై 1-4-7-10 స్థానముల యందున్న - గొప్ప ఐశ్వర్యయోగము కల్గును.
21. 2 - 10 భావధిపతులు 5వ స్థానంలో గలసియున్న - ఐశ్వర్యము కల్గును.
22. ధన భావమునందు గ్రహములుండి, శుభ గ్రహముల దృష్టి కల్గియున్న - మొక్కల పెంపకము అమ్మకముల వలన ధనప్రాప్తి కల్గును.
23. ద్వితీయ భావాదిపతి మిత్ర గ్రహములతో గలసి యున్నను లేక మిత్ర గ్రహరాశులయందున్ననూ - జన్మించిననతోడనే ధన ప్రాప్తినందును, విదేశములందు ధనలాభము లుండగలవు.
24. ద్వితీయభావాదిపతి బుధునితో కలసియున్ననూ లేక 1-4-7-10 స్థానములయందుండి, కేతువుచే చూడబడిననూ - రత్నములు బంగారము సమృద్ధిగా ప్రాప్తించును.
25. ధనుర్మీనములు 9వ స్థానమై, అందు శుక్రుడు 5వ భావాదిపతితో కలసి యుండిన - గొప్ప ఐశ్వర్యము కల్గును.
26. వృషభ, తులలు పంచమ భావముగా నుండి; అందు శుక్రుడుండి, లాభ భావమున శనియుండిన - గొప్ప ధనయోగము కలుగును.
27. సింహలగ్నమునందు రావియుండి, కుజుడు లేక గురునిచే కూడియున్నను, వారి దృష్టినందిననూ, సత శీలుడై, గొప్ప ధనవంతుడు కగలడు.
28. ద్వితీయ, దశమ భావాధిపతులు - బలము గలవారై, దశమ భావమునందున్న - అనేక లక్షల ధనము ప్రాప్తించగలదు.
29. జన్మలగ్నదిపతి ద్వితీయమునందుండి, 1-4-7-10 స్తానములందొక శుభగ్రహముండి, చతుర్ధ భావాదిపతి 3-6-11 స్థానములందున్న  యెడల కోటీశ్వరులు కాగలరు.
30. ద్వితీయాధిపతి నీచను పొంది ; చంద్ర, శుక్రులహో గలసి యున్న- ప్రభుత్వపరముగా ధనము ప్రాప్తించును.
31. దశమ భావదిపతి - రవి, కుజ, బుదులతో, గలసియున్న- రాజుల వలన, గురునితో గలసియున్న -రాజ సత్కారముల వలన, శుక్రునితో గానీ, సప్తమాధిపతితోగాని కలసి యున్న- స్త్రీల వలన, శనితో గూడియున్న - శూద్రులవలన, రాహు - కేతువులతో గలసియున్న - నీచ జనుల వలన ధన లాభము కలుగును.
32. ద్వితీయ భావాధిపతి ద్వితీయమునందుగానీ, దశమస్థానమందుగానీయుండి గురు దృష్టినందిన యెడల - జన్మతః బీదవాడైనను, ధనవంతుడగును.
33. ధనాధిపతి సప్తమస్థానమందుండి, శుక్ర వీక్షితుడైన, యెడల - భార్య ద్వారా ధనవంతుడు కాగలడు.
34. 5-9-11 స్థానాధిపతులు 2-5-9 స్థానముల యందున్న - ధన యోగము కలుగును.
35. ద్వితీయధిపతి - లభాధిపతితో కలసి 1-4-5-7-9-10 స్థానములందుండి శుభగ్రహ దృష్టి, కాల బలము కల్గి యున్న - యౌవన కాలమునందు స్వశక్తితో ధనార్జన చేయగలడు.
36. లగ్నాధిపతి, బుధుడు, ద్వితీయాదిపతి కలసియున్న - వృద్ధాప్యము నందు ధనయోగము కల్గును.
37. ధనయోగామును కలిగించు గ్రహములకు కుజ, శని, రాహు సంబంధములున్న యెడల - ఆ యోగ గ్రహదశలయందు, అంతర్ధశలయందు - దొంగతనము, మోసము, సాహసము, కలహము, తప్పుడు సాక్ష్యముల ద్వారా ధన ప్రాప్తి కల్గుచుండును.
38. చంద్ర - శుక్రులు కలసియున్నను, పరస్పర ద్రుష్టికల్గియున్ననూ యావజ్జివిత ధన భాగ్యము కల్గును.
39. ద్వితీయాధిపతి  - లభస్థానమందు, లాభాధిపతి (11స్థానం) - లగ్నమునందు, లగ్నాధిపతి - ద్వితీయము నందు నుండిన - భూస్థాపిత ధనయోగము కల్గును.
40. శుభుడైయున్న లగ్నాధిపతి ద్వితీయమునందుండి, ద్వితీయాధిపతి అష్టమ స్థానమందుండినయెడల - నిధి ద్రవ్య ప్రాప్తి కల్గును.

నిర్ధన యోగములు 

1. ద్వితీయాధిపతి, గురువు కలసి గానీ, విడిగాగాని 6-8-12 స్థానములయందున్న - ధన హీనుడగును. 
2. ద్వితీయాధిపతి - 12వస్థానమందు, 12వస్థానాధిపతి - 2వస్థానమందుండి, 11వ స్థానాధిపతి 6-8-12 స్థానములందున్న - ధననాశనము కల్గును. 
3. 2-5-9-11 స్థానాధిపతులకు - 6-8-12 స్థానాధిపతుల సంబంధము కల్గిన - ధన నష్టము, ఋణ పీడ శత్రు భయములు ప్రాప్తించును. 
4. ద్వితీయాధిపతి 4వ స్థానాధిపతి సంబంధముచే - ఋణపీడ కల్గును. 3-6-12 స్థానాధిపతులు - 5-9-11 స్థానములందున్నను - ఋణ భాధలుండగలవు. ముఖ్యముగా 3-6-11 అధిపతులు 11వ స్థానమందుండిన - అధిక ఋణగ్రస్తుడు కాగలడు.
5. జన్మలగ్నదిపతి 6-8-12 స్థానముల యందున్న - దరిద్రయోగము.
6. లగ్నాధిపతి పాపగ్రహ సంబంధము కల్గి 6-8-12 స్థానముల యందుండి, మారకాధిపతి (8వ స్థానాధిపతి) చే కుడియున్నను, చూడబడినను - రాజవంశమునందు బుట్టినవాడైనను దరిద్రుడు కాగలడు.
7. 9-10 స్థానధిపత్యములుకలుగని పాపగ్రహములు లగ్నముందుండి - 8వ స్థానాధిపతితో కలసినను, చూడబడినను - దరిద్రులు కాగలరు.
8. దశమ భావమునం దే గ్రహము లేక యుండి, కర్కాటకము, సింహము అను రాశులయందు పురుషగ్రహము లేకయున్న - దరిద్రులు కాగలరు.
9. ధన, లాభ స్థానాధిపతులు పాప గ్రహాంశల యందుండి - పాపగ్రహములతో గలసి, కుజునిచే జూడబడుచుండిన - అగ్నివలన, చోరులవలన, ప్రభుత్వమువలన ధననాశనము కల్గును.
10. బలహీనత - లేక స్వల్పబలము గల వ్యాయాధిపతి క్రూరాంశల యందుండి సప్తమాధిపతి సంబంధము కల్గియున్న - భార్యా మూలకముగా ధననష్టములు కల్గును.
11. ఏ లగ్నముగల వారికైనను, మేషమునందు శని, కర్కాటకమునందు కుజుడు, మీనమునందు చంద్రుడు, వృషభమునందు రవి యుండిన - ధన హీనులు కాగలరు.
12. లగ్నాదిగ శుభస్థానములందు (1-4-5-7-9-10) పాపగ్రహములు, పాప స్థానములందు (2-3-6-8-12) శుభగ్రహములు యుండిన - దరిద్రులగుదురు.
13. ద్వితీయధిపతి శత్రుగ్రహముతో గలసియుండి, ద్వితీయమందు  రాహువున్న యెడల - ఆ ద్వితీయధిపతి దశయందు ధనము, ధాన్యము, పశు సంపదలు నష్టపడగలవు.
14. ధన - లభాధిపతులు పాపగ్రహములతో గలసి, శుభగ్రహ సంబంధము లేక అష్టమాధిపతిచే చూడబడుచుండిన - జన్మించినది మొదలు భిక్షాటన చేయుచు దరిద్ర జీవనులు కాగలరు.

ద్వితీయ భావరీత్యా ఇతర యోగములు 

1. లగ్నమందు గురువు, ద్వితీయమందు చంద్రుడు ఉన్న - మంచి నేత్రములు లుండును. 
2. ద్వితీయధిపతి పాపగ్రహములచే చూడబడక 1-4-7-10 స్థానములందుడుట, నేత్ర కారకుడగు శుక్రుడు పాపగ్రహ  వీక్షణము లేక 1-4-7-10-11 స్థానము లందున్నను - మంచి నేత్రములు కల్గి జీవితాంతం నేత్ర వ్యాధులులేక సుఖించగలరు.
3. 6-8-12 స్థానములలో చంద్ర - శుక్రులు గలసియున్న రేచీకటి ప్రప్తించ గలదు.
4. చతుర్ధ - నవమాధిపతులు రవి - శుక్రులతో గలసి లగ్నాధిగా 2-3-4-8-9-11 స్థానముల యందున్న - తల్లిదండ్రులు గ్రుడ్డివారు కాగలరు.
5. సప్తమ స్థానాధిపతి రవి - శుక్రులతో గలసి 3-1-11 స్థానముల యందున్న - భార్య జాత్యంధురాలగును.
6. 12 వ స్థానమందు శనియున్న - కుడికంటికి, కుజుడున్న ఎడమ కంటికి హాని కల్గును.
7. షష్టాధిపతి వక్రించియున్న- నేత్ర రోగములు కల్గును.
8. రవి - చంద్రులు  1-2-7 స్థానముల యందుండి కుజ శనులను చూడబడిన యెడల రెండు కన్నులు పొవును.
9. ద్వితీయమునందు శనియున్న ఆపి ఆపి గానీ నిదానముగా గాని మాట్లాడును.
10. ద్వితీయమున శని - చంద్రులున్న నత్తి మాటలుండును.
11. ద్వితీయాధిపతి నీచయందుండి, ద్వితీయమున క్షీణ చంద్ర- కేతులున్నను లున్నను లేక కేతువు మాత్రమే యుండి, పాప గ్రహ ద్రుష్టి నందిన నత్తి ఏర్పడును.
12. ద్వితీయాధిపతి - గురువుకలసి గానీ, విడిగా గానీ 6-8-12 స్థానము యందుండిన - మూగ వాడగును.
13. లగ్నమందు కేతువున్న - క్రింది దంతములు వెడల్పుగా నండ వచ్చు. రహువున్న పళ్ళు పొడవుగా నుండి బైటికి కన్పించగలవు.
14. లగ్నాధిపతి నీచనందియుండి, అష్టమాధిపతి గురువు కలసి 8వ స్థానమందున్న - దంత రోగము లుండగలవు.
15. సప్తమ స్థానంలో పాప గ్రహలున్న - జాతకుని పళ్ళు చూచుటకు వింతగా నుండగలవు. రవికి ద్వితీయ స్థితి వలన - పళ్లకు హాని .
16. శని ధనుస్సు నందున్న - పెద్ద పళ్ళు, శని కర్కాటకము నందున్న - పటుత్వము లేని పళ్ళు కల్గును.
17. శని ద్వితియాదిపతియై మేషమందున్నను, గురునితో కూడినను - ఎలవేళ్ళల శ్రాద్ధాన్నములు తినుచుండగలడు.
18. ద్వితీయయధిపతి అష్టమాధిపతితో గలసి, 11వ స్థానము నందున్న - కుటుంబవృద్ధి గల్గును.
19. ద్వితీయయధిపతికి శని సంబంధము వలన - లోభి కాగలడు.


లగ్న భావమందున్న గ్రహ ఫలితాలు

లగ్న భావమందున్న గ్రహ ఫలితాలు

1. జన్మలగ్నందు రవియున్న - తీవ్రస్వభావము, తెలివి తేటలు, సహనము లేకుండుట, దయారాహిత్యము, కార్యములయందు నేర్ఫు, ఎర్రని దేహచ్చాయ, ఫైత్యతత్వము, సామాన్య శరీరధారుడ్యము, శిరో - నేత్ర వ్యాధులు, ఆలోచనాధిక్యత, రాజసము, అన్యస్థల నివాసము కలిగించగలడు. 
2. జన్మలగ్నమందు చంద్రుడున్న (పూర్ణ చంద్రుడై యుండిన) మంచి రూపము, స్థూలకాయం , పెద్ద పొట్ట, దయ, విద్యా - వినయములను, (క్షీణ చంద్రుడైయుండిన) - మదము, అల్ఫవీర్యము, అవిటితనము, దుష్టకార్యాసక్తి కలిగించును.
3. కుజుడుండిన - కృశించిన శరీరము, పొడవు, కురుపులు, గాయములు, వ్రణముల వలన బాధలు, దంత రోగములు , రక్త దోషములు, ఉన్మాదము, చపలత్వములు, తీవ్రమైన, దుష్టవర్తనము, త్వరగా అలసిపోవుట, సాహసములుండ గలవు.
4. జన్మలగ్నమందు బుధుడుండిన, మంచి శరీరము, బుద్ధికుశలత, నేర్పరితనము, మధుర వాక్కులు, కళా ప్రావీణ్యత, సాహిత్య - గణిత - విద్యప్రావీణ్యత, ధీర్ఘాయువులు, కల్గును.
5. జన్మలగ్నమందు గురువుండిన - ఆరోగ్యమగుశరీరము, ధీర్ఘాయువు, జ్ఞానములు, కార్యాలోచనాపర్వతము, ఉన్నత, విద్యా యోగము, పాండిత్యము, ధైర్యము, పూజ్యత, గోరవ -మర్యాదలు, కలిగించగలడు.
6. జన్మలగ్నమందు శుక్రుడుండిన - మంచి ముఖ - నేత్రములుగల సౌమ్య దేహము, సౌఖ్యము, వస్త్రాభరణ ప్రాప్తి, స్త్రీ వశీకరణ శక్తి, సంగీతాది లలిత కళాభినివేశము, వివిధ భాషల పరిచయము, ఆయుర్ధాయములు కల్గును.
7. జన్మలగ్నమందు శనియున్న - నల్లని శరీరము, వికట రూపము, భాలరిస్టములు, వతతత్వము, నీచ సంభాషణలు, అనాచారము, నిర్ణయ, డాంబికత్వము, స్త్రీలోలత, కామాసక్తి, వ్యాధిపీడనలు కల్గును. శని తులాలగ్నము నందున్న యెడల - చక్కని రూపము, ప్రజాగోరవాధరములు, పాండిత్యము, ఏలుబడి, రాజ్యతుల్యత, ధన - సంపదలు కలుగగలవు.
8. జన్మలగ్నమందు రాహువున్న - కృష్ణవర్ణ దేహచ్చాయ, కురూపత్వము, పుప్పిగోళ్ళు, నేత్రవ్యాధులు, శారీరక రోగములు, మలినవస్త్రధారణ, గాంభీర్యము, సాహసము, పట్టుదల, మూర్ఖత్వము, ధర్మహీనత, విశేష ధనాసక్తి కలిగి యుండును.
9. జన్మలగ్నమందు కేతువున్న - శుష్కించిన లేక వక్రమైన శరీరములు, వ్యాధిగల హస్తములు, చర్మరోగ భాధలు, కుటిలత్వము, విచిత్ర ప్రవర్తన కుత్సితతత్వము, చపలత్వము, అసత్య భాషణలు కల్గును.
10. జన్మలగ్నము బలహినముగా నుండినప్పుడు ఇతర భావములు ఎంత బలముగా నున్నను, రాణింపు కలుగదు. జన్మలగ్న, చంద్రలగ్న అంశలగ్నములు మూడు బలహీనముగా నుండిన - జాతకుడు దరిద్రుడు కాగలడు
11. లగ్నాధిపతీ, చంద్రలగ్నధిపతీ కలసి 6 -8- 12 స్థానములయందున్న- జాతకుడు ధుర్భలశరీరుడు కాగలడు.
12. బలహీనుడైన లగ్నాధిపతి 5-9 స్థానముల యందున్న - క్రోధి కాగలడు.
13. లగ్నాధిపతి - చంద్రునితోగాని, బుధునితో గానీ కలసి కర్కాటక, మకర, కుంభ, మీన రాశులయందున్న - జలగండము, ప్రప్తించగలధు.
14. లగ్నమునకు 4-10 స్థానములందు శుభ, పాప గ్రహములున్న బంధనయోగము కల్గును. మరియు 2-12 స్థానములందు పాప గ్రహములున్నను బంధనయోగ ముండగలదు.
15. వృషభ, తులలు లగ్నముగా నుండి అందు చంద్ర, శుక్రులుండి వారి దశలు ప్రాప్తించినయెడల అత్యున్నతమైన, పదవి కల్గును.
16. లగ్నమునకు 2-12 స్థానములందు శుభగ్రహములు మాత్రమే యుండిన గొప్ప ధనవంతులు కాగలరు.
17. అరూడ లగ్నమునకు రాశి చక్రమందు 5వ స్థానంలో శుక్రుడున్న - కవి యగును.
18  అరూడ లగ్నమునకు రాశి చక్రమందు 5వ స్థానంలో గురువుండిన - వేద పండితుడు కాగలడు.
19. అరూడ లగ్నమునకు రాశి చక్రమందు 5వ స్థానంలో రవి యున్న సంగీతశాస్త్రము, బుదుడున్న - మీమాంస, జ్యోతిష శాస్త్రములు, చంద్రుడున్న - సాంఖ్య, యోగ శాస్త్రములు, కేతువున్న - గణిత శాస్త్రములు తెలిసిన పండితులు కాగలరు.
20. జన్మలగ్నము నుండి 6-8-12 స్థానములు అరూడ లగ్నముగా నుండిన - దరిద్రుడగును.
21. సప్తమ స్థానమందు గానీ అరూడ లగ్నమునందుగానీ చంద్ర, గురు, శుక్రలు కలిసియున్న యెడల ఐశ్వర్యవంతుడు కాగలడు.
22. 11వ రాశియందు - ఉచ్చనందిన గ్రహముండి గురు శుక్రులలో నోకరితో కలసియున్న - గొప్ప ధనవంతుడు కాగలడు.
23. చంద్ర లగ్నము నుండి 3-6-10-11 రాశులలో - రవి, 1-3-7-10-11లలో చంద్రుడు, 3-6-11 లలో కుజుడు, 2-4-5-11 లలో బుధుడు, 2-5-7-9-11 లలో గురుడు, 1-2-4-5-9-11 లలో శుక్రుడు, 3-6-11 లలో శని సంచారము చేయు కాలములు - గోచార రీత్య శుభప్రధమైనవి మిగిలిన రాశులలో ఈ గ్రహముల సంచారము మంచిది కాదు.


తృతీయ భావ మందున్న గ్రహ ఫలితాలు

తృతీయ భావ మందున్న గ్రహ ఫలితాలు

1. జన్మ లగ్నము నుండి మూడవ రాశియే తృతీయ భావము. దీనినే భాత్రు భావమని కూడా యనెదరు . 
2. తృతీయ భావము ద్వారా - జాతకుని యొక్క కనిష్ట సోదరి - సోదరులు వారియొక్క వృద్ధి - క్షయములు , బంధువులు , మిత్రులు , భార్య , తండ్రి , ఇరుగు పొరుగు పరిస్థితులు, పరాక్రమము, ధైర్య- సాహసములు, శాంతము, శ్రద్ధ, సమర్ధత, ఉపాయము, తీర్ధయాత్రలు, ప్రయాణము, మనశ్చాంచల్యము, గ్రంధ రచనా ప్రచురణలు, ఉత్తర- ప్రత్యుత్తరములు, ధీర పటుత్వము, కంఠస్వరము, భుజములు, అలంకార భూషణములు, పంపకములు, వాహనము, మార్గము, స్వప్నములు, ఎడమ చెవి, చెవులు, పాదములు, రొమ్ములు అనువానికి సంబంధించిన  ఫలితములు, తెలియవలెను. 
3.  రవి గ్రహము తృతీయ భావము నందున్న - ప్రియ వాక్కులు ధన వాహన సువర్ణములు, సేవకులు, బలము ధైర్యము, ఖ్యాతి, దుష్టమైన బుద్ధి స్వల్ప సోదరులు కలుగగలరు. ఇతరులచే పూజింపబడును. 
4. తృతీయమునందు చంద్రుడున్న - హింసా స్వభావము, గర్వము, నేర్పరితనము, అల్పబుద్ది, దయాహీనత, నిర్భయత్వము, పిరికితనము, సోధరివృద్ధి కల్గును. 
5. కుజుడు తృతీయమందున్న - సోదరనష్టము, కృషిచే ధనార్జన, ధన, సుఖ, పరివార రాహిత్యము, క్రిమి కీటక గృహ వాసములు కల్గును. 
6. బుధుడు తృతీయమందున్న- బుద్ధి సూక్ష్మత, నేర్పరితనము, శరీర కుశత్వము, పిరికితనము, కల్మష చిత్తము విశేష ధనము, బాలారిష్టములు కల్గును. 
7. తృతీయ భావమందు గురుడున్న - దుర్మార్గవర్తనము, సౌమ్యత లేకుండుట, ప్రేమరాహిత్యము, అజీర్ణ వ్యాదులు, బలహీనత, అందమైన వ్రాత, ధన సౌక్యము లోపించుట, స్వల్ప సోదరులు, ఆడపిల్లలయందు ప్రేమ లేకుండుట ప్రాప్తించగలవు. 
8. తృతీయమందు శుక్రుడున్న - చిక్కిన దేహము లజ్జత్వము, దుర్మార్గము, మనసాతురత, ఆభరణధారణ, మంచివారికి దూరమగుట, చెడు కార్యాసక్తి కల్గును. 
9. తృతీయమందు శని యున్న - రాజ గౌరవము, వాహన సౌఖ్యము, గ్రామానుకూలత, పరాక్రమము, గ్రామాదిపత్యము కల్గును.
10. తృతీయమందు రాహువు యున్న సోదర నాశనము కల్గును. తృతీయము రాహువుకు ఉచ్చస్థానమైన యెడల పుత్ర, కళత్ర, ధన ధాన్య - సౌక్యములు, వాహనములు, పరివార జనము కల్గును. 
11. కేతువు తృతీయమందున్న- శత్రునాశనము, ధన బోగైశ్వర్యములు, బంధు నాశనము, భాహువులకు పీడ, మనోద్వేగములు కల్గును.

ఇతర భావ విషయములు

1. తృతీయ భావము శుభగ్రహరాశియై అందు శుభ గ్రహ సంబంధము వున్న - సోదర వృద్దియు, పాపగ్రహ రాశియై పాపగ్రహ సంబంధము యున్న - సోదర నాశనము సంభవించును. 
2. తృతీయ భావమునందు గతించిన నవాంశలకు సరియగు సంఖ్య గల సోదరు లుండగలరు.
3. తృతీయాదిపతి 6-8-12 స్థానములందున్నను, తృతీయమునందు రవి, బుధులున్నను - సోదరులుండరు.
4. లగ్న - తృతీయాధిపతులు తృతీయ -లగ్నములందు పరివర్తన పొందిన కవల సోదరులుండగలరు.
5. తృతీయాధిపతి - కుజునితోగని, చంద్రునితోగానీ, కలసియున్న సవతి సోధరులుండగలరు .
6. తృతీయమున శని యున్న - తమ్ములను, కుజుడున్న - అన్నలను నశింపజేయును.
7. 9 వ స్థానమునందు రవి, కుజ, గురులున్న- సోదరులు; చంద్ర, శుక్ర, రహువులున్న - సోదరీలు కలుగగలరు.
8. ద్వితీయమునందు బుధ గురులుండి, కన్యారాశి యందు రాహువున్న - ముగ్గురు సోదరులు కలుగగలరు.
9. తృతీయ భావము, ఆ భావధిపతి కారకుడు శుభగ్రహ సంబంధముల నందిన - చక్కని కంఠస్వరము కలిగి ఇతరులను రంజింపజేయును.
10. తృతీయమున శని - బుధులున్న ధైర్యము లోపించును.
11. తృతీయమున రవి -కుజ-శుక్ర-రాహు-కేతువులున్న-శూరత్వము కల్గును.
12. తృతీయమున చంద్ర-బుధులున్నా - లోభి గుణము పిరికితనము; శని గురువులున్న కీర్తి - ఔదార్యము కల్గును.
13. తృతీయాధిపతి  1-9 స్థానముల యందున్న - విశేష ప్రయాణములు కల్గును.
14. తృతీయాధిపతి  8 వ స్థానమందున్న -ప్రయాణము చేయుచూ మరణించును.
15. తృతీయాధిపతికి నీచ, అస్తంగత, శత్రు క్షేత్ర, పాపగ్రహ ద్రుష్టి అనునవి కల్గిన - విషపధార్ధములచే ప్రమాదములు తటస్థించగలవు.
16. తృతీయాధిపతి గురునితో కలసి, లగ్నమందున్న - జంతుభయము కల్గును .
17. మకర, కుంభ, మీన, కర్కాటకములందు తృతీయాధిపతియన్న యెడల - జల గండము ప్రాప్తించును.
18. జన్మ లగ్నము నందు తృతీయాధిపతి-రాహువు కలసి యున్న - సర్పగండము వుండగలదు.
19. తృతీయాధిపతి - బుధునితో కలసియున్న, లేక తృతీయమందు పాప గ్రహాలున్నను కంఠ రోగములు కల్గును.
20. కుజుడు, తృతీయాధిపతీ కలసి తృతీయ మందున్న - గుదము, మర్మావయవములందు రోగ భాధ లుండగలవు.
21. తృతీయమున కుజుడున్న - చెవి పోటు వ్రణభాధలు కల్గును.
22. తృతీయాధిపతి -రవి, శనులతో గలసి, 6-8-12 స్థానముల యందున్న - నేరారోపణలు జరిగి శిక్షింపబడగలరు.
23. తృతీయ భావమునకు అధిక పాప గ్రహ సంబంధముల వలన - భావ కారకత్వములకు సంబంధించిన ఫలితములు ప్రతికూలముగా నుండగలవు.
24. తృతీయ భావమునకు - భావాధిపతికి సంభవించు అధిక శుభగ్రహ సంబంధముల వలన భావకారకత్వ ఫలితములు వృదినంది అనుకూలించగలవు .


చతుర్ధ భావ మందున్న గ్రహ ఫలితాలు

చతుర్ధ భావ మందున్న గ్రహ ఫలితాలు

1. జన్మ లగ్నము నుండి నాల్గవ రాశియే చతుర్ధ భావము. దీనినే మాతృ భావము, విద్యా స్థానము, క్షేత్ర-సుఖ-వాహన స్థానములనియు దెలియ వలెను. 
2. చతుర్ధ భావము ద్వారా - జాతకుని ప్రాపంచిక సుఖానుభవములు, విద్య, సుఖము, తల్లి, వాహనములు, భూములు, క్షేత్రములు, జయము, మాతృవర్గము, పితృధనము, గృహము, పశుసంపద, ఆయువు, నిధి నిక్షేపములు, కీర్త్, సముద్రయానము, శాస్త్ర పరిజ్ఞానము, బోధన, హృదయము, వక్షస్థలము, స్వభావం, స్నేహశీలత, జాతి, శయనము, జలొపద్రవములు, స్థాన చలనము, కృషి మొదలగు విషయములను గురించి తెలుసుకొనదగియున్నది. 
3. చతుర్ధ భావమున రవి యున్న - తండ్రికి వ్యతిరేకత, తల్లి సౌఖ్యము లోపించుట, పిత్రార్జిత ఆస్తి హాని, అస్థిరమైన నివాసము, భూవ్యయము, స్వల్ప సుఖ - భోగములు, హృదయ రోగము కల్గును. 
4. చంద్రుడు చతుర్ధమందున్న - బంధు మిత్రాధిక్యత, అధిక సంతానము, స్త్రీ-పుత్ర సుఖములు, బ్రాహ్మణ భక్తి, శిల్ప విద్యా ప్రవేశము, సేవకులు, వాహనము, విద్యా-గృహ సౌఖ్యములు కల్గును. క్షిణ చంద్రునిచే - దీనికి వ్యతిరేక ఫలితములు లుండగలవు. 
5. చతుర్ధములందు కుజుడున్న - దౌర్భల్యము, మూర్ఖత, సుఖలోపము, రోగము, దుఃఖము, పరగృహ భోజనము, బంధుద్వేషము, విద్యా విహీనత, దోషయుక్త గృహ నివాసము కల్గును. 
6. బుధుడు చతుర్ధ భావము నందున్న - పాండిత్యము, మాత్రుసుఖము, ధన-ధాన్య వృద్ధి, గీతా వాద్య ప్రయత్నములు కల్గును. 
7. గురువు చతుర్ధము నందున్న - బంధువులు, స్త్రీలు వస్త్రాభరణములు, పశులాభము, గోసంపద, రాజానుగ్రహము, భూమి, విద్య, సుఖ-సౌఖ్యములు, వాహనయోగములు ప్రాప్తించగలవు . 
8. చతుర్ధమునందు శుక్రుడుండిన - అధికారము, నిత్య ఐశ్వర్యము, అలంకార గృహము, సర్వజన ప్రియత్వము, అధిక కామాసక్తి, సంగీత-సాహిత్య ప్రకాశము, వాహన యోగములు కల్గును. 
9. శని చతుర్ధము నందున్న - స్త్రీ, బంధు, సేవకులు లేకుండుట;నిలకడ లోపించుట, వసతి కొరకు ఇబ్బందులు, మాతృ సౌక్య హాని; స్వగృహము లేకుండుట, భునష్టము, సుఖలోపములు కల్గును. 
10. రాహువు చతుర్ధము నందున్న - గ్రామవాసము నీచ స్నేహము, పురాతన - శిధిల గృహ వాసము, జీర్ణ వస్త్రధారణ, మతి భ్రమ, స్వల్ప భూవసతి, వాహన రాహిత్యము, బంధు ద్వేషము కల్గును. 
11. చతుర్ధము నందు కేతువున్న - మాతృ సౌఖ్య హీనత, మిత్రాభిమాన దురత్వము, పిత్రార్జిత నష్టము, తొందరపాటు, దేశద్రిమ్మరితనము కల్గును.

విద్యాయోగములు 

1. చతుర్ధ భావము, చతుర్ధాదిపతి, విద్యాకారక గ్రహముల బలాబలముల ద్వారా విద్యాయోగము ప్రాప్తించగలధు.
2. లగ్న, ద్వితీయ, చతుర్ధాధిపతులైన గ్రహములు 6-8-12 స్థానపతుల నైసర్గిక పాప గ్రహముల సంబంధములు కలుగక; 1-4-5-7-9-10 స్థానముల యందున్న - విద్య యందు అసమాన ప్రతిభ కల్గును.
3. చంద్ర-శుక్రులు కలసి గాని, శుక్రుడోక్కడేగానీ 1-4-7-10 స్థానముల యందున్న - విద్యా యోగము కల్గును
4. లాభాదిపత్యముగల శుక్రుడు చతుర్ధము నందున్న - విద్యావంతులులగుదురు.
5. చతుర్దాధిపతి 6-8-12 స్థానముల యందుండి, పాప గ్రహ సంబంధము కల్గియున్న - స్వల్ప విద్య కల్గును.
6. చతుర్దాధిపతి 1-4-7-10 స్థానముల యందుండి, బుధుడు ఉచ్చనంది, చంద్ర లగ్నమునకు 1-4-7-10 స్థానములలో శుక్రుడుండిన - గొప్ప విద్యా వంతుడు కాగలడు .
7.సంపూర్ణ బలముగల గురువు ద్వితీయము నందున్న, భాగ్యాధిపతి బలీయ నవాంశయందున్నను - వేద విద్యావేత్తయగును. శాస్త్రాభిలాషి కాగలడు.

మాతృ సౌఖ్య యోగములు 

1. క్షీణచంద్రుడు -6-8 స్థానముల యందుండుట; చంద్ర లగ్నము నుండి - 7 వ స్థానంలో కుజ - శనులుండుట; చతుర్ధ భావమునందు పాప గ్రహములుండి; శుభ సంబంధము లేకుండుట వలన - మాత్రుభావము నిర్వీర్యము కాగలదు. 
2. చతుర్దాధిపతి 6-8-12 స్థానము లందున్న తల్లి నిందితురాలు కాగలదు.
3. షష్టాధిపతి శని కలసి చతుర్ధ భావము నందున్న జాతకుని తల్లి శిలశంకితురాలు కాగలదు 
4. షష్టాధిపతి - నైసర్గిక పాపగ్రహమై, మరొక నైసర్గిక పాపగ్రహముతో గలసి చతుర్థము నందున్నను, రాహు దృష్టి నందినను తల్లి శీలము లోపించి యుండగలదు.
5. జన్మ లగ్నమును నుండిగానీ, పూర్ణచంద్ర లగ్నము నుండిగానీ 8 వ స్థానాధిపతీ, చతుర్ధ స్థానాధిపతీ ఇతర పాపగ్రహములతో గలసి యున్న జాతకుని తల్లి జారిణి యగును.
6. దశమాధిపతి బలయుక్తుడై, లగ్నము నందున్న - జాతకుని తల్లి పతివ్రత కాగలదు.
7. చతుర్ధాధిపతి - శుభగ్రహములతో గలసియుండి, రవి ద్రుష్టి నందిన - తల్లి పతివ్రత యగును.
8. చతుర్ధాధిపతి- చతుర్ధముందుండి, లగ్నాధిపతిచే చూడబడుచున్న లేక శుభగ్రహ యుక్తుడైయున్న - తల్లి ప్రేమకు పాత్రుడు కాగలడు.
9. చతుర్ధాధిపత్యము గల గురువు 1-9-10 స్థానములందు బలయుక్తుడై యుండి, చంద్రదృష్టి నందిన - మాతృసౌఖ్యము ప్రాప్తించగలదు.
10. చతుర్ధాధిపత్యము గల పూర్ణచంద్రుడు - చతుర్థము లేక మిత్ర క్షేత్రము లందున్న తల్లికి సుఖము కలిగించు వాడగును.
11. చతుర్ధాధిపతి- శుభగ్రహమై, గురునితో గలసి 1-4-5-7-9-10 స్థానములందున్న - తల్లికి విశేష సుఖము ప్రాప్తించగలదు.
12. లగ్న దశమాధిపతులు పరస్పర మిత్రులై యుండి, శుభగ్రహ సంబంధము కల్గిన - తల్లి జాతకునియందు బహు ప్రేమగలదయి యుండును.
13. చతుర్ధాధిపతితో కలిసియున్న లగ్నాధిపతికి - 6-11 స్థానాధిపతుల ద్రుష్టి కల్గిననూ లేక ఇతర పాపగ్రహముల దృష్టి కల్గిననూ - తల్లితో శత్రుత్వము కల్గును.
14. మాతృకారక గ్రహము (పగలు - శుక్రుడు, రాత్రి - చంద్రుడు) బలము కల్గి శుభగ్రహ దృష్టి నంది, శుభాంశయందున్ననూ లేక లగ్నాదిగా 7 వ స్థానము శుభగ్రహ రాశియై యున్ననూ - తల్లికి దీర్ఘాయువు కల్గును.
15. చతుర్ధ భావమునందు శనియుండి, శుభగ్రహములచే చూడబడుచుండిన - తల్లికి దీర్ఘాయువు కల్గును.
16. మాతృకారక గ్రహము - నైసర్గిక పాపగ్రహములతోగలసి    స్థానము నందున్న - తల్లికి అల్పాయువు కలుగును.
17. చతుర్ధమునందున్న శనికి పాపగ్రహముల దృష్టియున్న యెడల - త్వరితముగా మాతృవియోగము కల్గును.
18. లగ్నమునందు - కుజుడూ, వ్యయము (12వ స్థానం)న గురువు యుండి, మిగిలిన శుభగ్రహములన్నియు 6వ స్థానము నందున్న - తల్లి జీవింపదు.
19. రవి, కుజ, శనులు 6-8 స్థానము లందున్న - తల్లికి అరిష్టము కల్గును.
20. వృశ్చికాంశయందు జన్మించిన జాతకుని తల్లికి - స్తన్యములు శుష్క్రించును.
21. చంద్రుడు - తృతీయాధిపతితో గలసి 6-8-12 స్థానములయందున్న - జాతకుడు అన్యస్త్రీ స్తన్యపానము వలన పెరుగును.
22. చతుర్ధమందున్న పాపగ్రహమునకు శుభగ్రహ ద్రుష్టి లేకున్న - ఆ పాపగ్రహ దశాంతర్దశల యందు మాతృమారకము సంభవించగలదు.

భూ - గ్రహ యోగములు 

01. గ్రహమునకు - గురు-శుక్రులూ, భూములు, స్థలములు, వన క్షేత్రములకు - కుజుడూ కారక గ్రహములు కాగలరు. 
02. చతుర్ధాధిపతి - 10 వ స్థానమందు, దశమాధిపతి - 4 వ స్థానమందూ యుండి, కుజుడు బలీయుడై యున్న - పంటలు పండు అనేక భూములు వుండగలవు. 
03. చతుర్ధ - దశమాధిపతులకు - అధిమిత్రస్థితి కల్గిన గ్రహములు బలవంతులై యున్న - పెక్కు భూము లుండగలవు.
04. లగ్న - చతుర్ధాధిపతులు - పరస్పర భావములందు (ఏ ఒక్కరైనను)బలము కల్గియుండి, శుభగ్రహ ద్రుష్టి నందిన - స్వార్జిత భూము లేర్పడగలవు. 
05. శుభ స్థానములందు - చతుర్ధ - తృతీయాధిపతు లిరువురు కలసి యుండిన - అనేక క్షేత్రములు ప్రాప్తించును. 
06. చతుర్ధమునందు శుక్రుడుండి, చతుర్ధాధిపతి 7 వ స్థానమందుండి ఇరువురికి అదిమిత్ర స్థితి కల్గిన - భార్య ద్వారా క్షేత్ర లాభము లుండగలవు. 
07. చతుర్ధ - సప్తమాధిపతులు - సప్తమ - చతుర్ధములందు పరివర్తన పొందియున్న భార్యద్వారా భూములు ప్రాప్తించగలవు.
08. చతుర్ధాధిపతికి 6-8-12 స్థానములు గాక మిగిలిన ఏ భావాధిపతుల సంబంధము బలవత్తరముగా నుండునో ఆ భావ సంబంధమగు భూ లాభముండగలదు. 
09  చతుర్ధాధిపతి పాపగ్రహములతో గలసి ద్వితీయము నందున్నను లేకనీచ శత్రురాశుల యందున్నను, ఉచ్చయందుండి పాపగ్రహములతో గలసినను భూ వ్యయము కాగలదు.
10. దశమాధిపతి పాపగ్రహములతో గలసి చతుర్ధము నందున్న పూర్వార్జిత భూములన్నియు నష్టపడగలరు.
11. చతుర్దభావమునందు పాపగ్రహములున్నను పాపగ్రహ మాధ్యమందు భావస్థితియున్నను, భావమునకు అధిక పాపసంభంధము కల్గినను భావాధిపతికి కూడా యిటులనే పాప దృగ్యోగాది సంబంధములు కల్గినను కారకుడు పాపాధిక సంబంధముల నందినను సమస్త భూసంపదలు నష్టపడగలవు. 
12. లగ్నాధిపతికి- ఉచ్చ స్వక్షేత్ర, మూల, త్రికోణ, మిత్ర, క్షేత్ర స్థితి యందు చతుర్ధాధిపతి కలయిక; శుభ గ్రహ సంబంధములు వున్న యెడల తన ప్రయత్నము లేకనే గృహ మేర్పడగలదు. 
13. చతుర్ధాధిపతి - నవాంశ చక్రము నందే రాశిలో నుండునో రాశి చక్రమునందు లగ్నాదిగా 1-4-7-10 స్థానముల యందున్న గృహ మేర్పడగలదు. 
14. చతుర్ధాధిపతి ఉచ్ఛయందుండి, భాగ్యాధిపతి 1-4-7-10 స్థానముల యందున్నచిత్రమైన గృహము ప్రాప్తించగలదు. 
15. శనికి దశమాధిపత్యము కల్గి చతుర్ధాధిపతితో కలసి 1-4-7-10 స్థానముల యందున్న యెడల ప్రకారము గల మెడలు కలుగగలవు.
16. చతుర్ధాధిపతిగాని గృహకారక గ్రహముగాని ద్వితీయాధిపతి లేక లాభాధిపతితో కలసి శుభాగ్రహ  దృష్టినందియున్న సంపదలతో గూడిన గృహము ప్రాప్తించగలదు. 
17. చతుర్థ భావము చరరాశియై యుండి, చతుర్ధాధిపతియును చరరాశియందు శుభాగ్రహ దృష్టి కల్గియున్న- విదేశములందు గృహ యోగము కల్గును. 
18. చతుర్థము చరరాశియై చతుర్ధాధిపతి గృహకారక గ్రహము చర రాశులలో నుండిన అనేక స్థలములందు గృహములు  ఏర్పడగలవు. 
19. 2-4-12 రాశుల అధిపతులు కలసి 1-4-6-7-9-10 స్థానములందున్న చక్కని గృహ యోగము కల్గును. 
20. 1-7 రాశ్యాధిపతులు కలసి లగ్న- చతుర్థ స్థానములందున్నగృహ లాభముండును. 
21. చతుర్థ- దశమాధిపతులు కలసి, 1-4-7-10 స్థానములందుడి శని కేంద్ర స్దాన స్థిరుడై యుండిన గొప్ప గృహము నిర్మించ గలరు 
22. చతుర్ధాధిపతి 8వ స్థానమందుండి, పాప గ్రహ వీక్షితుడైన గృహ నాశనము సంభవించగలదు. 
23. అంశ చక్రమునందు రవి-రాహువులకు కుజ దృష్టి కల్గిన గృహము దగ్ధము కాగలదు.
24. రవి 1-4-5-7-9-10 స్థానములందున్న- గృహము శిధిలమగును.
25. జన్మ లగ్న, అంశ లగ్నములలో బలయుక్తమగు లగ్నమునకు చతుర్ధ స్థానమందు చంద్ర - శుక్రులున్న - ఉన్నత గృహ యోగం కలదు, శని - రాహువులున్న పాషాణ గృహ యోగంగలదు, కుజ - కేతువులున్న ఇటుకలచే నిర్మించు గృహముండును, గురువున్న - కఱ్ఱల ఇల్లు, రవి యున్న - రెల్లుగడ్డి లేక గడ్డి ఇల్లు కల్గును. 
26. లగ్న చతుర్ధాధిపతులుగలసి, చతుర్ధమందుండి వారిలో ఒకరికి ఆ రాశి ఉచ్చగాను, రెండవ వారికి మిత్ర క్షేత్రముగాను నుండిన అకస్మాత్ గృహ లాభయోగము కల్గును.
27. లగ్న, ద్వితీయ, చతుర్ధాధిపతిలలో ఎంతమంది 1-4-5-7-9-10 స్థానములయందుందురో అన్ని గృహ యోగము లుండగలవు. 

వాహన యోగములు 

01. వాహన కారక గ్రహము - శుక్రుడు. ఈ గ్రహము దుష్ట లక్షణములు లేకుండా బలము కలిగియుండిన వాహన యోగములు కల్గు అవకాశములున్నవి. 
02. చతుర్ధ స్థానాధిపతి బలము కల్గియుండి, చతుర్ధ స్థానమందు శుభ గ్రహములున్న యెడల వాహన సిద్ధి కలుగగలదు. 
03. చతుర్ధాధిపతి 9వ స్థానమందుండి; సప్తమాధిపతి, శుక్రుడు కలసి 1-4-5-7-9-10 స్థానముల యందున్న వాహన యోగము ప్రాప్తించగలదు. 
04. గురువు లగ్నమునుండి; చతుర్ధాధిపతి, శుక్రుడు కలసి, శుభ స్థానముల యందున్న వాహన యోగము కల్గును. 
05. ద్వితీయాధిపతికి లగ్నస్థితీ, రాజ్యాధిపతికి ద్వితీయస్థితీ కల్గి; చతుర్థము నందొక ఉచ్చనందిన గ్రహమున్న - అనేక వాహనములకు అధిపతి కాగలడు. 
06. లగ్నాధిపతికి - కేంద్రస్థానములందు చతుర్ధాధిపతియు, చతుర్ధాధిపతికి కేంద్రములందు
( 1-4-7-10 స్థానముల ) నవమాధిపతియు యుండి; లగ్నాధిపతి బలయుక్తుడైయున్న అనేక వాహనములకు అధిపతిగాగాని వాటి కధికారిగా గాని యుండగలరు. 
07. చతుర్ధ భావమందు పూర్ణచంద్రుడుండి, శుక్రవీక్షితుడైన నౌక వ్యాపారము సంభవించగలదు. 
08. చంద్ర శుక్రులు పరస్పర ద్రుష్టి గలవాడైనను, లేక చంద్రునికి తృతీయమందు శుక్రుడున్నను - నిరంతర వాహన సంచారి కాగలడు. 
09. చంద్ర - చతుర్ధాధిపతులుగాని, లగ్నాదిపతులుగానీ కలసి; లగ్నమందున్న - వాహనయోగ ముండగలదు. 
10. చతుర్ధాధిపతి - గురువుతోగాని, శుక్రుడితోగని కలసి లగ్నమందున్న - పల్లకీ యోగముండును. 
11. లగ్న - దశమాధిపతులు, లగ్న - దశమములందు పరివర్తన కల్గియున్న - అనేక వాహనములుండగలవు. 
12. చతుర్ధాధిపతి, గురు-చంద్ర-శుక్రులతో గలసి; కేంద్ర కోణంలందున్న - ఉన్నత వాహన యోగము కల్గును. 
13. రాజ్యాధిపతి (10 వ స్థానం)- చతుర్ధమునందుండగా శుక్రుడు పరమోచ్చ భాగాలయందుండిన ఉన్నత పదవులు కల్గి, ఎచ్చటికి వెళ్లినను మంగళ వాద్యములతో సన్మానించ బడుచుండగలడు. 
14. చతుర్ధాధిపతి, 6-8-12 స్థానములందుండి, పాపగ్రహ ద్రుష్టి కల్గిన - వాహనభంగము వాటిల్లును. 
15. చతుర్ద భావమునందు - 6-8-12 స్థానాధిపతులుండి, శుక్రుడు పాపగ్రహ ద్రుష్టినందిన వాహనభంగము కల్గును. 
16. శుక్రుడు 6 వ స్థానము, చతుర్ధాధిపతి 8 వ స్థానము, దశమాధిపతి 12 వ స్థానము లందుండి; చతుర్ధమందు పాపగ్రహములున్న - వాహన గండములు కల్గును. 
17. చతుర్ధాంశాధిపతి - శుక్రునితో గలసి, 8 వ స్థానమందుండి; కుజ వీక్షితులైన యెడల లేక అష్టమాధిపతిదృష్టి కల్గియుండిన - వాహనముల ద్వారా మృత్యువు సంభవించును.  

సుఖ యోగములు

01. చతుర్ధ భావమునకు చంద్ర & శుక్రుల సంభంధముచే సుఖము కల్గును. 
02. చతుర్ధాధిపతి -వృషభ, మిధున, కర్కాటక, కన్య, తులా, ధనుర్ రాశుల యందున్న లేక ఆ నవాంశలు కల్గియున్న - జాతకునికి సుఖ జీవనమగును. 
03. లగ్నాధిపతి - ఉచ్చ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రము లందుండి; శుభ సంబంధము పొందియున్న - జాతకుడు జీవితాంతము సుఖియగును. 
04. లగ్నాధిపతి - గురునితో కలసి 1-4-7-10 స్థానములందున్న - జాతకుని యౌవనకాలము సుఖమయము కాగలదు. 
05. లగ్నమునందు శుక్రుడున్న - జీవితములోని మొదటి భాగం సుఖవంతమగును. 
06. 9 వ స్థానమునుండి 12 వ స్థానము వరకు గల స్థానములలో - శుభ గ్రహములన్నియు నుండిన - జీవితాంతమునందు సుఖపడగలడు. 
07. 5 గ్రహములు స్వక్షేత్రము లందున్న - గొప్ప సుఖము ప్రాప్తించగలదు. 
08. లగ్నాధిపతి బలము కలిగియుండి, గురువు 1-4-7-10 వ స్థానము యందున్న - బాల్యదశలో సుఖము అనుభవించగలడు. 
09. శుభగ్రహములు (గురు-శుక్రులు)- 1-11-12 స్థానములందున్న ప్రౌఢదశ వరకు సుఖ భోగములు ప్రాప్తించగలవు. 
10. లగ్నమునందు - ఒక శుభగ్రహమూ, ద్వితీయమునందొక పాప ఉండి; 4-7-10 స్థానములలోను పాపగ్రహములుండి; లగ్నాధిపతి ఉత్తమాంశ మందున్న - ప్రారంభ జీవితమునందు కష్టములు, చివరి జీవితమునందు - సుఖములు ప్రాప్తించగలవు.
11. నవమాధిపతి 1-4-7-10 స్థానములందున్న - బాల్యములో సుఖముండును. 
12. భాగ్యాధిపతి (9 వ అధిపతి)- 5-9 స్థానములలోగాని లేక స్వక్షేత్ర ఉచ్ఛరాశులయందు గానీ యున్న - మధ్య వయసులో సుఖము కల్గును. 
13. లగ్నము నుండి 5 స్థానం వరకు బాల్య దశను,  6 నుండి 9 వరకు మధ్యమ వయసును, 
10 -11-12 చివరి జీవితమును సూచించినదైయున్నది. 
14. లగ్నాధిపతి ద్వితీయం మందున్నను లేక తన నవాంశంమందున్నను; అదే వవిధముగా  లాభాధిపతి- ద్వితీయమందున్నను లేక లగ్నాధిపతి నవాంశమందున్నను- 20 సంవత్సరముల పిమ్మట సుఖయోగము కలుగును. 
15. అంశ చక్రము నందు లగ్నాధిపతి యున్న రాజ్యాధిపతి- రాశి చక్రంలో ఉచ్చనందిననూ,  కేంద్ర కోణములందున్ననూ 20 సంవత్సరములు తర్వాత సుఖ యోగము ప్రాప్తించును. 
16. లగ్నాధిపతి శుభారాశి యదుండి, అధిక శుభ సంబంధములు కలిగియున్న 16 సంవత్సరముల తరువాత సుఖ యోగము కలుగును. 
17. వ్యాయాధిపతికి- శుభ సంబంధము కలిగి; ఉచ్చయందు గానీ శుభ వర్గులయందుగాని యుండిన- హంస తూలికా తల్పమునందుశయన సుఖము ప్రాప్తించగలదు. 
18. వ్యాయాధిపతికి- పాపవర్గులు, నీచ; లగ్నాధిపతికి షష్ఠాష్టమ వ్యయ స్థితి, పాప దృష్టి; చతుర్ధాధిపతికి- పాప సంబంధము, పాపక్షేత్ర స్థితి; శుక్రునికి దుష్టస్థానస్థితి వలన -సుఖ నాశనము కాగలదు. 

చతుర్ధ భావము వల్ల కలుగు ఇతర యోగములు

01. లగ్నాధిపతి, చతుర్దాతుపతులూ - పరస్పర మిత్రులైన అనేకమంది స్నేహితులు ఉండగలరు. 
02. చతుర్ధ భావమునకు- శుభగ్రహ సంబంధముండి, కారకుడు బల యుక్తుడైన బంధు పూజితుడు కాగలడు. 
03. ఏ గ్రహముకైనను చతుర్ధము ఉచ్చస్థానమై ఆ గ్రహమందుండి- గురువును వీక్షిస్తూ ఉన్న- బంధువులచే పూజింపబడగలరు. 
04. చతుర్దమున- గురుడుండి, చతుర్ధాధిపతి- గురు దృష్టి నందినను లేక శుభ గ్రహములతో కలిసియున్నను- బందు సమృద్ధి యుండగలదు. 
05. చతుర్ధాధిపతి- పాపదృష్టి నందక, కేంద్ర కోణముల యందున్న- బంధువుల  కుపకారియగును. 
06. చతుర్ధమునందు- పాప గ్రహములున్నను, చతుర్ధాధిపతి- నీచ అస్తంగతములను జెందిననూ  బంధుద్వేషి కాగలడు. 
07. లగ్నాధిపతికి, చతుర్ధాధిపతికి, నవమాధిపతికి- నీచ-అస్తంగత శత్రు క్షేత్ర దోషములు లేకయుండి; దశమస్థాన మందుండగా దశమాధిపతి లగ్నస్థితుడై యున్న ఎడల- సింహాసన యోగము కలుగును లేదా గొప్ప పదవి అలంకరించగలడు. 
08. చతుర్ధాధిపతికి- 5- 9 రాశ్యాధిపతుల కలయిక, వారి దృష్టి -రాజ్య ప్రాప్తి ఇవ్వగలదు. 
09. చతుర్ధము నందు -రవి గాని, క్షీణచంద్రుడు గాని యుండిన- క్షణిక కపటికాగలడు. 
10. నవాంశ చక్రమునందు  చతుర్ధాధిపతియున్న రాశ్యాధిపతి సప్తమాధిపతి యొక్క దృష్టి నందియున్న -జలగండములు ప్రాప్తించగలవు. 
11. చతుర్దమున నీచనందిన గ్రహముండి, చతుర్ధాధిపతి 6 స్థానంలోనూ, కుజుడు 12వ స్థానంలోనూ నుండిన -జాతకుడు మూగవాడగును. 
12. పంచమున రవి-బుధ-రాహువు ఉన్నను, ద్వితీయమునందు రవి-బుధులున్నను జ్యోతిష్య- వైద్య విద్యలు తెలిసినవాడగును. 
13. తుల యందు చంద్రుడునున్న- జ్యోతిష్యము, ద్వితీయమున శుక్రుడున్న -కవిత్వము వచ్చును. 
14. చతుర్దబావమందు అనేక పాప గ్రహములున్నను, బహు పాప గ్రహములు చతుర్ధమును చూచుచున్నాను, అట్టి గ్రహ స్థితియందు గురు-శుక్ర-చంద్రులు బలరహితులై యున్న- జాతకుడు తల్లిని పొందువాడవును మరియు పాపకార్యాసక్తుడు, దుర్మార్గుడు కాగలడు. 
15. లగ్నాధిపతి 6-8-12 స్థానములందు నీచయందున్న- శయన సుఖము లోపించగలదు. 
16. వ్యాయాధిపతి పాపసంబంధము కలిగి, శుభ సంబంధము లేక యున్న శయన  సుఖముండదు. 
17. వ్యాయాధిపతి పాపియై శుభవర్గులయందున్నను; లగ్నాధిపతి మందీగుళికులతో కలిసి యున్నను శయన సుఖముండదు. 
18. లగ్న వ్యయములందు పాప గ్రహములు 4 వ స్థానమున కుజుడు, 5 స్థానమున రవి-బుధ-రాహువులు, 8 స్థానమును శని యుండిన -గొప్ప దుఃఖములు ప్రార్థించగలవు. 
19. వ్యాయమందు పాప గ్రహములుండి గురువు, బలహీనుడైన -దుఃఖములు కలుగును.  
20. దశమాధిపతి పాపగ్రహములతో గలసినను,  నీచ నందినను- ధనమెంత యున్నను దుఃఖములు తప్పవు. 


Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...