Wednesday, January 8, 2025

SRI VENKATESHWARA PRAPATTI – శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి

శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి

ఈశానాం జగతోఽస్య వేంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్స్థల నిత్య వాసరసికాం తత్‍క్షాంతి సంవర్ధినీం |
పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం || 1 ||

శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక-
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ |
స్వామిన్ సుశీలసులభాశ్రితపారిజాత
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 2 ||

ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్ప-
సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ |
సౌమ్యౌ సదాఽనుభవనేఽపి నవానుభావ్యౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 3 ||

సద్యోవికాసిసముదిత్వరసాంద్రరాగ
సౌరభ్యనిర్భరసరోరుహసామ్యవార్తాం |
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 4 ||

రేఖామయధ్వజసుధాకలశాతపత్ర
వజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రైః |
భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నైః
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 5 ||

తామ్రోదరద్యుతిపరాజితపద్మరాగౌ
బాహ్యైర్మహోభిరభిభూతమహేంద్రనీలౌ |
ఉద్యన్నఖాంశుభిరుదస్తశశాంకభాసౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 6 ||

సప్రేమభీతి కమలాకరపల్లవాభ్యాం
సంవాహనేఽపి సపది క్లమమాదధానౌ |
కాంతావవాంగ్మనసగోచరసౌకుమార్యౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 7 ||

లక్ష్మీమహీతదనురూపనిజానుభావ
నీలాదిదివ్యమహిషీకరపల్లవానాం |
ఆరుణ్యసంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 8 ||

నిత్యాన్నమద్విధిశివాదికిరీటకోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహఃప్రరోహైః |
నీరాజనా విధిముదారముపాదధానౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 9 ||

విష్ణోః పదే పరమ ఇత్యుతిదప్రశంసౌ
యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాఽప్యపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితలప్రదిష్టౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 10 ||

పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి |
భూయోఽపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 11 ||

మన్మూర్ధ్ని కాలియఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రిశిఖరే శిరసి శ్రుతీనాం |
చిత్తేఽప్యనన్యమనసాం సమమాహితౌతే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 12 ||

అమ్లానహృష్యదవనీతలకీర్ణపుష్పౌ
శ్రీవేంకటాద్రి శిఖరాభరణాయమానౌ |
ఆనందితాఖిల మనో నయనౌ తవైతౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 13 ||

ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుస్స్తనావివ శిశోరమృతాయమానౌ |
ప్రాప్తౌపరస్పరతులామతులాంతరౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 14 ||

సత్వోత్తరైస్సతత సేవ్యపదాంబుజేన
సంసారతారకదయార్ద్ర దృగంచలేన |
సౌమ్యోపయంతృమునినా మమ దర్శితౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 15 ||

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయముపేయతయాస్ఫురంత్యా |
నిత్యాశ్రితాయ నిరవద్యగుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ || 16 ||

SRI VENKATESHWARA MANGALASHASANAM – శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం

శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం

శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేఽర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 1 ||

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమచక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ || 2 ||

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || ౩ ||

సర్వావయవసౌందర్య సంపదా సర్వచేతసాం
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ || 4 ||

నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్ వేంకటేశాయ మంగళమ్ || 5 ||

స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ || 6 ||

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ || 7 ||

ఆకాల తత్త్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం
అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్ || 8 ||

ప్రాయస్స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా
కృపయాఽఽదిశతే శ్రీమద్ వేంకటేశాయ మంగళమ్ || 9 ||

దయామృతతరంగిణ్యాస్తరంగైరివశీతలైః
అపాంగైః సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ || 10 ||

స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహ మూర్తయే
సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ || 11 ||

శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ || 12 ||

శ్రీమద్సుందరజామాతృ మునిమానసవాసినే
సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 13 ||

మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 14 ||

SRI VISHNU STAVARAJA – శ్రీ విష్ణుస్తవరాజః

శ్రీ విష్ణుస్తవరాజః

పద్మోవాచ |
యోగేన సిద్ధవిబుధైః పరిభావ్యమానం
లక్ష్మ్యాలయం తులసికాచితభక్తభృంగమ్ |
ప్రోత్తుంగరక్తనఖరాంగుళిపత్రచిత్రం
గంగారసం హరిపదాంబుజమాశ్రయేఽహమ్ || 1 ||

గుంభన్మణిప్రచయఘట్టితరాజహంస
-సింజత్సునూపురయుతం పదపద్మవృందమ్ |
పీతాంబరాంచలవిలోలచలత్పతాకం
స్వర్ణత్రివక్రవలయం చ హరేః స్మరామి || 2 ||

జంఘే సుపర్ణ గళ నీలమణిప్రవృద్ధే
శోభాస్పదారుణమణిద్యుతిచుంచుమధ్యే |
ఆరక్తపాదతలలంబనశోభమానే
లోకేక్షణోత్సవకరే చ హరేః స్మరామి || ౩ ||

తే జానునీ మఖపతేర్భుజమూలసంగ-
రంగోత్సవావృత తటిద్వసనే విచిత్రే |
చంచత్పతత్రిముఖనిర్గతసామగీత
విస్తారితాత్మయశసీ చ హరేః స్మరామి || 4 ||

విష్ణోః కటిం విధికృతాంతమనోజభూమిం
జీవాండకోశగణసంగదుకూలమధ్యామ్ |
నానాగుణప్రకృతిపీతవిచిత్రవస్త్రాం
ధ్యాయే నిబద్ధవసనాం ఖగపృష్ఠసంస్థామ్ || 5 ||

శాతోదరం భగవతస్త్రివళిప్రకాశ-
మావర్తనాభివికసద్విధిజన్మపద్మమ్ |
నాడీనదీగణరసోత్థసితాంత్రసింధుం
ధ్యాయేఽండకోశనిలయం తనులోమరేఖమ్ || 6 ||

వక్షః పయోధితనయాకుచకుంకుమేన
హారేణ కౌస్తుభమణిప్రభయా విభాతమ్ |
శ్రీవత్సలక్ష్మ హరిచందనజప్రసూన-
మాలోచితం భగవతః సుభగం స్మరామి || 7 ||

బాహూ సువేషసదనౌ వలయాంగదాది-
శోభాస్పదౌ దురితదైత్యవినాశదక్షౌ |
తౌ దక్షిణౌ భగవతశ్చ గదాసునాభ
తేజోర్జితౌ సులలితౌ మనసా స్మరామి || 8 ||

వామౌ భుజౌ మురరిపోర్ధృతపద్మశంఖౌ
శ్యామౌ కరీంద్రకరవన్మణిభూషణాఢ్యౌ |
రక్తాంగుళిప్రచయచుంబితజానుమధ్యౌ
పద్మాలయాప్రియకరౌ రుచిరౌ స్మరామి || 9 ||

కంఠం మృణాళమమలం ముఖపంకజస్య
రేఖాత్రయేణ వనమాలికయా నివీతమ్ |
కింవా విముక్తివశమంత్రకసత్ఫలస్య
వృత్తం చిరం భగవతః సుభగం స్మరామి || 10 ||

వక్త్రాంబుజం దశనహాసవికాసరమ్యం
రక్తాధరోష్ఠవరకోమలవాక్సుధాఢ్యమ్ |
సన్మానసోద్భవచలేక్షణపత్రచిత్రం
లోకాభిరామమమలం చ హరేః స్మరామి || 11 ||

సూర్యాత్మజావసథగంధమిదం సునాసం
భ్రూపల్లవం స్థితిలయోదయకర్మదక్షమ్ |
కామోత్సవం చ కమలాహృదయప్రకాశం
సంచింతయామి హరివక్త్రవిలాసదక్షమ్ || 12 ||

కర్ణోల్లసన్మకరకుండలగండలోలం
నానాదిశాం చ నభసశ్చ వికాసగేహమ్ |
లోలాలకప్రచయచుంబనకుంచితాగ్ర
లగ్నం హరేర్మణికిరీటతటే స్మరామి || 13 ||

ఫాలం విచిత్రతిలకం ప్రియచారుగంధం
గోరోచనారచనయా లలనాక్షిసఖ్యమ్ |
బ్రహ్మైకధామమణికాంతకిరీటజుష్టం
ధ్యాయే మనోనయనహారకమీశ్వరస్య || 14 ||

శ్రీవాసుదేవచికురం కుటిలం నిబద్ధం
నానాసుగంధికుసుమైః స్వజనాదరేణ |
దీర్ఘం రమాహృదయగాశమనం ధునంతం
ధ్యాయేఽంబువాహరుచిరం హృదయాబ్జమధ్యే || 15 ||

మేఘాకారం సోమసూర్యప్రకాశం
సుభ్రూన్నాసం శక్రచాపోపమానమ్ |
లోకాతీతం పుండరీకాయతాక్షం
విద్యుచ్చేలం చాశ్రయేఽహం త్వపూర్వమ్ || 16 ||

దీనం హీనం సేవయా దైవగత్యా
పాపైస్తాపైః పూరితం మే శరీరమ్ |
లోభాక్రాంతం శోకమోహాదివిద్ధం
కృపాదృష్ట్యా పాహి మాం వాసుదేవ || 17 ||

యే భక్త్యాఽద్యాం ధ్యాయమానాం మనోజ్ఞాం
వ్యక్తిం విష్ణోః షోడశశ్లోకపుష్పైః |
స్తుత్వా నత్వా పూజయిత్వా విధిజ్ఞాః
శుద్ధం ముక్తా బ్రహ్మసౌఖ్యం ప్రయాంతి || 18 ||

పద్మేరితమిదం పుణ్యం 
శివేన పరిభాషితమ్ |
ధన్యం యశస్యమాయుష్యం 
స్వర్గ్యం స్వస్త్యయనం పరమ్ || 19 ||

పఠంతి యే మహాభాగాస్తే 
ముచ్యంతేఽహసోఽఖిలాత్ |
ధర్మార్థకామమోక్షాణాం 
పరత్రేహ ఫలప్రదమ్ || 20 ||

SRI MUKAMBIKA STOTRAM - శ్రీ మూకాంబికా స్తోత్రం

శ్రీ మూకాంబికా స్తోత్రం

మూలాంభోరుహమధ్యకోణవిలసద్బంధూకరాగోజ్జ్వలాం
జ్వాలాజాలజితేందుకాంతిలహరీమానందసందాయినీం |
ఏలాలలితనీలకుంతలధరాం నీలోత్పలాభాంశుకాం
కోలూరాద్రినివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || 1 ||

బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం
నీలాకారసుకేశినీం సులలితాం నిత్యాన్నదానప్రియాం |
శంఖం చక్ర వరాభయాం చ దధతీం సారస్వతార్థప్రదాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || 2 ||

మధ్యాహ్నార్కసహస్రకోటిసదృశాం మాయాంధకారచ్ఛిదాం
మధ్యాంతాదివివర్జితాం మదకరీం మారేణ సంసేవితాం |
శూలంపాశకపాలపుస్తకధరాం శుద్ధార్థవిజ్ఞానదాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || ౩ ||

సంధ్యారాగసమాఽననాం త్రినయనాం సన్మానసైః పూజితాం
చక్రాక్షాభయ కంపి శోభితకరాం ప్రాలంబవేణీయుతాం |
ఈషత్ఫుల్లసుకేతకీదళలసత్సభ్యార్చితాంఘ్రిద్వయాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || 4 ||

చంద్రాదిత్యసమానకుండలధరాం చంద్రార్కకోటిప్రభాం
చంద్రార్కాగ్నివిలోచనాం శశిముఖీమింద్రాదిసంసేవితాం |
మంత్రాద్యంతసుతంత్రయాగభజితాం చింతాకులధ్వంసినీం
మందారాదివనేస్థితాం మణిమయీం ధ్యాయామి మూకాంబికాం || 5 ||

కల్యాణీం కమలేక్షణాం వరనిధిం వందారుచింతామణిం
కల్యాణాచలసంస్థితాం ఘనకృపాం మాయాం మహావైష్ణవీం |
కల్యాం కంబుసుదర్శనాం భయహరాం శంభుప్రియాం కామదాం
కల్యాణీం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || 6 ||

కాలాంభోధరకుంతలాంచితముఖాం కర్పూరవీటీయుతాం
కర్ణాలంబితహేమకుండలధరాం మాణిక్యకాంచీధరాం |
కైవల్యైకపరాయణాం కలిమలప్రధ్వంసినీం కామదాం
కల్యాణీం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || 7 ||

నానాకాంతివిచిత్రవస్త్రసహితాం నానావిధైర్భూషితాం
నానాపుష్పసుగంధమాల్యసహితాం నానాజనైస్సేవితాం |
నానావేదపురాణశాస్త్రవినుతాం నానాకవిత్వప్రదాం
నానారూపధరాం మహేశమహిషీం ధ్యాయామి మూకాంబికాం || 8 ||

రాకాతారకనాయకోజ్జ్వలముఖీం శ్రీకామకామ్యప్రదాం
శోకారణ్యధనంజయప్రతినిభాం కోపాటవీచంద్రికాం |
శ్రీకాంతాదిసురార్చితాం స్త్రియమిమాం లోకావళీనాశినీం
లోకానందకరీం నమామి శిరసా ధ్యాయామి మూకాంబికాం || 9 ||

కాంచీకింకిణికంకణాంగదధరాం మంజీరహారోజ్జ్వలాం
చంచత్కాంచనసత్కిరీటఘటితాం గ్రైవేయభూషోజ్జ్వలాం |
కించింత్కాంచనకంచుకే మణిమయే పద్మాసనే సంస్థితాం
పంచాస్యాంచితచంచరీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || 10 ||

సౌవర్ణాంబుజమధ్యకాంతినయనాం సౌదామినీసన్నిభాం
శంఖం చక్రవరాభయాని దధతీమిందోః కలాం బిభ్రతీం |
గ్రైవేయాంగదహారకుండలధరామాఖండలాదిస్తుతాం
మాయావింధ్యనివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || 11 ||

శ్రీమన్నీపవనే సురైర్మునిగణైరప్సరోభిశ్చ సేవ్యాం
మందారాది సమస్తదేవతరుభిస్సంశోభమానాం శివాం |
సౌవర్ణాంబుజధారిణీం త్రినయనాం ఏకాదికామేశ్వరీం
మూకాంబాం సకలేష్టసిద్ధిఫలదాం వందే పరాం దేవతామ్ || 12 ||

స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్న ఆంజనేయుడు

స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్న ఆంజనేయుడు!

అంజనాదేవి పూర్వాశ్రమంలో ఒక అప్సరస. మహా సౌందర్యవతి. అటువంటి సౌందర్యాన్నంతా పుణికిపుచ్చుకుని, జ్ఞాన స్వరూపమైన ఆ శివుని తేజస్సుని నిలుపుకున్న హనుమంతుడు అపరిమితమైన బల, బుద్ధి, గుణ, తేజో సంపన్నుడు మాత్రమే కాదు. చక్కని మూర్తీభవించిన సుందరాకారుడు కూడా! ఆ సౌందర్యమూర్తి శక్తి స్వరూపము, ప్రక్రుతి రూపం అయినా మూర్తిగా దర్శనమిచ్చే ఆలయం ఉందంటే, ఆశ్చర్యకరంగా ఉంటుంది .

శ్రీ రాముడికి ప్రియ భక్తుడు, ఆ జన్మ బ్రహ్మ చారి అయిన ఆంజనేయుడు హిందువులు అందరికీ ఇష్ట దైవము. కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడు ని చూడగానే చిన్న, పెద్ద అందరిలో ఒక విధమైన ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. భక్తికి, సేవానిరతి కి మారు పేరుగా హనుమను వర్ణిస్తారు. అలాంటి ఆంజనేయుడికి ప్రతి ఊరు లోను దేవాలయాలు ఉన్నాయి. ఆజన్మాంతం శ్రీ రాముని సేవకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి అక్కడ మాత్రం దేవతగా స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఆ దేవాలయం ఎక్కడ ఉందో చూద్దాం.

ప్రపంచంలోనే ఆంజనేయుడిని స్త్రీ రూపంలో పూజించే దేవాలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జ్ బంద్ లో ఉంది. ఇక్కడ దేవత రూపంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులు ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్మకం. ఇంకా ఇక్కడ రాముడు, సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్న ఆంజనేయుని విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఆంజనేయుని భక్తుడైన రతన్ పూర్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది.

ఒకసారి ఆ రాజు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు.దానితో హనుమంతుడిని ప్రార్థించగా ఆయన తన ఆలయం నిర్మించమని కలలో ఆదేశించాడు.

హనుమ ఆదేశం మేరకు గుడి నిర్మాణం చేపట్టిన రాజుకి మళ్ళి కలలో కనిపించిన ఆంజనేయుడు మహామాయ కుండ్ వద్ద ఉన్న విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ట జరపమని ఆదేశించాడు. తరువాత రాజు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ గుడి పూర్తయ్యే సరికి ఆ రాజు ఆరోగ్యం కుదుట పడింది. ఇక్కడి స్వామిని దర్శించుకోవాలంటే శీతాకాలం లో అక్టోబర్ నుండి మార్చ్ మద్య కాలంలో సరైన సమయం.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

విభూతి ధారణ మంత్రం - విధానం

విభూతి ధారణ మంత్రం - విధానం

భస్మ జ్యోతి స్వరూపాయ శివాయ పరమాత్మనే | 
షత్త్రింశత్తత్వ రూపాయ నమశ్శాంతాయ తేజసే || 
పునాతీదం జగత్సర్వం త్రిపుండ్రాత్మ సదాశివమ్ | 
ఐశ్వర్య ప్రాప్తి రూపాయ తస్మైశ్రీ భస్మనే నమః || 

భూతిర్భూతి కరీ పవిత్ర జననీ పాపౌఘవిధ్వంసినీ |
సర్వోపద్రవనాశనీ ప్రియకరీ సర్వార్థ సంపత్కరీ ||

భూతప్రేతపిశాచరాక్షస - గణారిష్టోపసంహారిణీ | 
తేజోరాజ్య విభూతి మోక్షణకరీ భూతిస్సదా ధార్యతామ్ || 
 
త్య్రంబక మహాదేవ త్రాహిమాం శరణాగతమ్  | 
జన్మ మృత్యుజరారోగై: పీడితం కర్మబంధనై:|| 
 
తావతస్త్వద్గతః ప్రాణ: త్వచ్చిత్తోహం సదా మృడా | 
ఇతి విజ్ఞాప్య దేవేశం జపేన్మన్త్రం  త్య్రంబకం || 

విభూతి ధారణా సమయ మందు

శ్రీకరంచ పవిత్రంచ శోక మోహ వినాశనం
ధరామి భసితం దివ్యం తేజః కాంతిం ప్రయచ్ఛతు

భావం: విభూతి ధారణ చేయటం వలన సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరును, మనలోని అజ్ఞాన తిమిరాలు అడుగంటి సుజ్ఞాన జ్యోతి వెలుగొందును.

అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ
సర్వగ్‍ంహవాఇదం భస్మ వాఙ్మన ఇత్యేతాని చక్షూగ్‍ంషి కరణాని భస్మాని
- జాబాలోపనిషత్

దీనితో పాటే శ్రీరుద్రంలోని 

ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుక మివబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్

కూడా చదివడం మంచిది.

అలాగే తైత్తరీయ సంహితలోని

"త్రియాయుషం జమదగ్నేః 
కశ్యపస్య త్రియాయుషమ్ 
అగస్త్య త్రియాయుషమ్
యద్దేవానాం త్రియాయుషమ్ 
తన్మే అస్తు త్రియాయుషమ్
కూడా పఠించవచ్చు.

అనేక లాభాలను చేకూర్చే విభూతి

అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా ప్రీతికరమైంది.

హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు. హోమగుండం, ధుని - రెండూ పరమ పవిత్రమైనవి.

హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు, పిడకలు, రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు, నవధాన్యాలు, గంధపుచెక్కలు, నేరేడు, సాంబ్రాణి, ఆవునెయ్యి, సాంబ్రాణి, అగరొత్తులు వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి.

శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం

పరమ పవిత్రమైనది, అనారోగ్యాలను పోగొట్టేది, సంపదలను చేకూర్చేది, బాధలను నివారించేది, అందరినీ వశంలో ఉంచుకునేది అయిన విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అనేది ఈ శ్లోక భావం.

విభూతిని లలాటము పైనే ఎందుకు ధరించాలి :

భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉంది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మనలోని  జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది.

కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం.

"భస్మనా సజలే నైనధారయేచ్చత్రిపుండ్రకం"

అంటూ గృహస్తు భస్మాన్ని నీళ్ళతో తడిపి, నుదుటిమీద, ఉదరంపైన, చేతులమీద పెట్టుకోవాలి. మంత్రాలు ఉచ్చరించడం చేతకానివారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే, కనీసం "నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి, భస్మధారణ చేయాలి.

స్త్రీలు, స్వాములు నీళ్ళతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. "ప్రయోగ పారిజాతం"లో కూడా ఇదే సంగతి రాశారు.

ఇతర ఏ వస్తువు లేదా పదార్ధాన్ని అయినా కాలిస్తే బూడిదగా మారుతుంది. కానీ బూడిదను కాలిస్తే రూపాంతరం చెందదు. తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడు అయిన మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు ఆరోగ్యదాయిని కూడా.

విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది. విభూతి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి విభూతి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం.

విభూతి మహిమ

సకల దోషాలు తొలగి, సర్వపాపాలూ పటాపంచలు కావాలన్నా, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభించాలన్నా ప్రతిరోజూ విభూతిని ధరించడమే ఏకైక మార్గమని శాస్తవ్రచనం. రోజూ పూజలు చేయలేనివారు, ఆలయ సందర్శన చేయలేనివారు ప్రతినిత్యం నుదుటన విభూది ధరిస్తే చాలు- సహస్రనామాలతో స్వామిని పూజించి, నిత్యం ఆలయదర్శనం చేసుకుంటున్నంత ఫలాన్ని పొందుతారు. అంతటి శక్తిమంతమైన విభూతిని ధరించిన వారి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుందని, అసలు విభూతినే ధరించని వారికి భవిష్యత్తు లేదని పురాణ కథనం

మృత్యుంజయ మంత్రం:
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుక మివబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్

విభూతి అంటే ధనము, బలము, మహిమ, లీల, మహాత్మ్యం అనే అర్థాలున్నాయి. విభూతి ధరిస్తే సకల శారీరక, మానసిక రోగాలు తొలగిపోయి, పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

పవిత్రమైన విభూతిని ఎలా ధరించాలో, ఏ అంగాలలో ధరిస్తే ఏయే ఫలితాలు సిద్ధిస్తాయో చూద్దాం.

ఫాలభాగం- పీకలవరకు చేసిన పాపాలు తొలగుతాయి.
వక్షస్థలం-మనస్సుతో తెలిసి చేసిన పాపం నశిస్తుంది.
నాభి- కడుపు దాకా చేసిన పాప నిర్మూలన జరుగుతుంది.
భుజాలు- చేతితో చేసిన పాపం నశిస్తుంది.
మోకాళ్లు-కాళ్లతో చేసిన పాపం పరిహరింపబడుతుంది.

ఊర్ధ్వ పుండ్ర ధారణ విధానం

సాధారణంగా వైష్ణవులు నిలువు బొట్టు పెట్టుకొంటారు. ఐతే, స్మార్తులు సైతం నిలువుబొట్టు పెట్టుకోవచ్చు, పెట్టుకొంటారు. ‘‘శ్రుతి స్మృత్యుక్త మార్గేణ మృదోధారణ ముచ్యతే/ శృణు వత్స! విధానేన మృత్స్నాధారణముత్తమమ్‌’’ అని ‘‘స్మృతి రత్నమహోదధి’’ తెలియజేస్తున్నది. ఇలా శ్రుతి స్మృతులు తెలియజేస్తున్నాయంటూ స్మార్తులు ధరించే ఊర్ధ్వపుండ్రధారణ విధానాన్ని ఈ గ్రంథం వివరించింది. స్మార్తులు మృత్తిక చేత ఊర్ధ్వ పుండ్రాన్నీ, భస్మం చేత త్రిపుండ్రాన్నీ ధరించవలసి ఉంటుంది. ఊర్ధ్వ పుండ్రాన్ని ఎర్రమన్నుతో గాని, తెల్ల మన్నుతో గాని, నల్లమన్నుతో గాని, గోపీచందనం (పచ్చ మన్ను)తో గాని దిద్దుకోవచ్చు. వైష్ణవులు పెట్టుకొనే నిలువుబొట్టు ఏయే పదార్థాలతో తయారు చేయాలో ఎలా పెట్టుకోవాలో నిర్దేశించే సూత్రాలు ఉన్నాయి. వాసుదేవోప నిషత్తు అలాంటి కొన్ని నియమాలను తెలియజేస్తుంది. (ఉదా: పరమహంస లలాటే ప్రణవేనైక మూర్థ్వపుండ్రం ధారయేత్‌). సాధారణంగా నుదుటి విూద నిలువుబొట్టు ధరించడమే ఆచారంగా కనిపిస్తుంది. కాని, శాస్త్ర ప్రకారం లలాటం, హృదయ స్థానం, ఉదరం, కంఠం, బాహువులు మొదలైన పన్నెండు స్థానాలలో పుండ్రం ధరించడం పద్ధతి. వైష్ణవ సంప్రదాయంలో కేశవ నామాలతో గానీ, విష్ణు గాయత్రీ మంత్రంతో గానీ పుండ్రధారణ జరుగుతుంది. నల్లమన్ను శాంతికరమనీ, ఎర్రమన్ను వశ్యకరమనీ, పచ్చమన్ను లక్ష్మీకరమనీ, తెల్లమన్ను మోక్షకరమనీ ‘‘స్మృతిరత్న మహోదధి’’ తెలియజేస్తున్నది. వైష్ణవులు ధరించే నామాల పదార్థాలలో శ్రీచందనమూ, కుంకుమపువ్వు కూడా ఉంటాయి. నామాలకు వాడే రంగుమన్ను కొండల విూద నుంచి, నదుల నుంచీ సేకరిస్తారు. ఇళ్ళల్లో ఉండే తులసి కోట మట్టి కూడా తిలకానికి ఉపయోగ పడుతుంది. స్మార్తులు ధరించే విభూతి అడ్డబొట్టు మూడు పట్టెలలోనూ పైన పట్టెను, కింది పట్టెను (రేఖలను) కుడిచేతి అనామిక, మధ్య వేళ్ళతో ఎడమ వైపు నుంచి కుడి వైపునకు దిద్దాలి. మధ్య పట్టె (రేఖను) అంగుష్ఠముతో (బొటన వ్రేలు) మధ్య పట్టెను (రేఖ) కుడివైపు నుంచి ఎడమ వైపునకు దిద్దాలి. ఇలా త్రిపుండ్ర ధారణ చేసేటప్పుడు స్మార్తులు ‘‘శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణమ్‌/ లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావకమ్‌’’ అనే శ్లోకాన్ని చదవడం మంచిది. కొందరు ‘ఓమ్‌నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం చదువుతారు

విభూతి పేర్లు - వర్ణములు

1. భస్మం - శ్వేత వర్ణము
2. విభూతి - కపిలవర్ణము,
3. భసితము -కౄష్ణ వర్ణము
4. క్షారము - ఆకాశవర్ణము
5. రక్షయని - రక్తవర్ణము

హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.
హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.
హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి.
భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

వివిధ హోమభస్మాలు చేసే మేలు:

శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.
శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.
శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.
శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.
శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి
శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.
శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.
శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.
హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.

గమనిక: హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.

విభూతి స్నానం అంటే ఏమిటి?

స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు
శివపురాణం - 21 వ భాగం లో విభూతి వైభవం గురించి ఈ క్రింది విధంగా చెప్పబడింది.

విభూతి ధారణ అనేది శివపురాణాంతర్గతమైన విషయం. ఆరాధన చేసేటప్పుడు శౌచముతో పూజామందిర ప్రవేశం జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు

వినా భస్మత్రిపుండేన వినా రుద్రాక్షమాలయా
బిల్వపత్రం వినానైవ పూజయేచ్ఛం కరం బుధః

సాధ్యమయినంతమటుకు ఈమూడూ లేకుండా పూజ జరుగకుండా చూసుకోవాలి. భస్మము అనగా తేలికగా చెప్పాలంటే బూడిద. దానిని మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటనవేలితో బొట్టుపెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలయినా, పురుషులయినా లలాటమునందు విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజులపాటు నిల్వచేసి పూజ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులయిన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు.

శాస్త్రమునందు శివనామము గంగ. విభూతి యమునా. రుద్రాక్ష సరస్వతి. గొప్ప శివభక్తుడు లలాటమునందు త్రిపుండ్రములను ధరించిన వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివపూజ పూర్తిచేసి బయటకు వచ్చిన వ్యక్తిని పూజామందిరంలోంచి బయటకు రాగానే చూస్తే చూసిన వారికి త్రివేణీసంగమ స్నానాన్ని చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేస్తారు. ఈమూడింటిని శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది.

నుదుటిమీద భస్మమును ఎలా బడితే అలా పెట్టుకోకూడదు. శాస్త్ర నియమం ప్రకారం మీరు నిద్రలేచిన తరువాత స్నానం అయేవరకు యథార్థమునకు పచ్చిగంగ త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాల పద్ధతులు వచ్చాయి. అయితే కొన్ని కారణముల చేత కొంతమంది స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి రావచ్చు. అలా తీసుకుంటే ఆ పాపం గాయత్రి చేత సాధ్యమయినంత తొందరగా పోతుంది. గాయత్రికి అధికారం లేనివాడు తమ ఇష్టదేవతానామం చెప్పి పూజ చేసుకోవాలి. విభూతి ధారణా చేసేవారు స్నానం చేయకుండా ఎక్కడికో అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో వారు పొడి విభూతిని తీసుకుని లలాటమునందు దరించవచ్చు. పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది. స్నానం చెయ్యనంత వరకు శరీరమునకు అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్న శరీరం తొందరగా వ్యగ్రత కలిగిన ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణహేతువు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి. చాలామందికి విభూతి పెట్టుకున్నవాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంటుంది. అది సరికాదు. విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరయినా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది. స్నానం చెయ్యకుండా వెళుతున్నా పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళవచ్చు. తడి విభూతిని పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమచేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడిచేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తిచేత మీరు దానిని అనుసంధానం చేయాలి.

భూతిం భూతకరీ, పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసినీ
సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతి స్సదా ధార్యతామ్!!

అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది మీ శరీరమునకు అలది ఉండగా భూతప్రేతపిశాచరాక్షస గణములు మీ ఇంట ప్రవేశించలేవు. తేజస్సును ప్రసాదిస్తుంది. విశేషమయిన ఐశ్వర్యమును ఈయగలదు. మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. బ్రహ్మచారి అయితే సాధ్యం అయినంత వరకు

ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్” అన్న మంత్రం చెప్పి సజలవిభూతిని ధరించాలి. ఇవేమీ చేతకాకపోతే తేలికైన మార్గం ఒకటి ఉంది. కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి

శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం
లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం

అని చెప్పాలి. దీని ధారణ చేత ఐశ్వర్యం కలుగుతోంది. ఇది నన్ను పవిత్రుడిని చేస్తోంది. ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకము వశం అయ్యేటట్లుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమును ఇస్తోంది. ఇదేదో వశీకరణ విద్య లాంటిది అని అనుకోకూడదు. లోకము యథార్థ స్థితి మీకు భాసిస్తుంది. పరమ పావనమైన ఈ భస్మమును నేను ధరించుచున్నాను.

ఒకవేళ ఈ మంత్రం రాకపోతే కనీసంలో కనీసం ‘శివా శివా శివా’ అని మూడు మాట్లు అనాలి. ఆటే మంగళము, శోభనము, భద్రము క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్లు అవుతుంది. ఈ మాటలు చెప్పి విభూతిని మూడు వేళ్ళతో పెట్టుకుంటారు. అలా విభూతి ధారణ చేయరాదు. అది దోష భూయిష్టం. నీటియందు భస్మము తడిపి మృగముద్ర పట్టమని శాస్రం చెప్పింది. మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏ లేడి/జింక కొమ్ములతో నిలబడ్డట్లుగా కనపడుతుంది. మూడువేళ్ళు కలుస్తాయి, రెండు వేళ్ళు నిలబడతాయి. ఇప్పుడు తడి భస్మంలో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు. తరువాత బొటన వేలును ముంచుటారు. తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకి బొటనవేలు పట్టగలినంత దూరం విడిచిపెట్టి నుదుటిమీద ప్రయాణం చెయ్యాలి. అపుడు బొటన వెలికి సజల విభూతి ఉన్నది కదా – ఆ రెండు వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలోంచి విభూతితో కూడిన బొటనవేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు.

భస్మధారణము అనేది మనుష్యుని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషము. మనకి వాసనలు కొని జన్మల నుండి తరుముకు వస్తాయి. విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. పాపక్షయం అంటే ఇదే. శాస్త్ర ప్రకారం ‘భ’ భస్మ ధారణము పాపములను తీయగలదు. శివపురాణం - 21 వ భాగం

విభూతి ధారణ అనేది శివపురాణాంతర్గతమైన విషయం. ఆరాధన చేసేటప్పుడు శౌచముతో పూజామందిర ప్రవేశం జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు

మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుడిని చేరకుండా భోగముల వైపుకి తిప్పెస్తున్నాయి. అధర్మబద్ధమయిన భోగముల కోసం వెంపర్లాడుతుంటారు. అలా వెంపర్లాడకుండా చెయ్యగల్గినది ‘సమ’ భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు ‘భస్మ’. భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం దరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను పట్టి జాగ్రత్తగా కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం. భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉన్నది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మీయందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది.

శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసేముందు పంచ బ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఏ చెట్టునుండి ఎన్ని పువ్వులను కోయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధారా శివలింగం మీదనుండి క్రిందపడగానే ఈయన పాదములన్నీ హరిస్తాయి. శివలింగం మీదినుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమయిన తేజస్సు ఉద్భవించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాపవిమోచనం అయిపొయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి భస్మం అంత గొప్పది. మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుడిని చేరకుండా భోగముల వైపుకి తిప్పెస్తున్నాయి. అధర్మబద్ధమయిన భోగముల కోసం వెంపర్లాడుతుంటారు. అలా వెంపర్లాడకుండా చెయ్యగల్గినది ‘సమ’ భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు ‘భస్మ’. భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం దరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను పట్టి జాగ్రత్తగా కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం. భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉన్నది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మీయందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది.

Tuesday, January 7, 2025

తిరుప్పావై - ఇరవై నాలుగోవ పాశురము

తిరుప్పావై - ఇరవై నాలుగోవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 24 వ. పాశురం గురించి తెలుసుకుందాం.

నిన్న ఇరవై మూడవ పాశురం లో మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా! స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూసారు. అవి కంది పోయినట్లు అనిపించింది. పాదాలు స్వతహాగా గులాబి రంగులో ఉంటాయి. కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. మేం నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ బాధపడ్డారు. వీళ్ళేమీ శ్రీకృష్ణుణ్ణి బాధ పెట్టడానికి రాలేదు కదా!. కేవలం ఆ స్వామిని చూసి అనందిద్దామని వచ్చారు.వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు.

ఈ 24 వ పాశురాన్ని మాంగళాశాసన పాశురం లేక హారతి పాశురం అని కూడా అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎలాంటివాడో, తను ఎలాంటివాడో తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తను ఏ జ్ఞానం లేనివాడూ, భగవంతుడు రక్షిస్తే తప్ప తనకు రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతునికున్న శక్తిని మరచి.. ఆయనకున్న సౌకుమార్యం, సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞాని అని మరచిపోయి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడు అని ఒకప్పుడు భావించినవాడు, ఈనాడు భక్తితో తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైన ఒక విలువైన వస్తువు మన ఇంట్లో ఉంటే మనం ఎలాగైతే ఆ వస్తువుని రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం.. ఆలయాల్లో తలుపులనీ, తాళమనీ ఇలా అన్నీ రక్షించుకోవడం కోసం చేస్తుంటాం. లోకాలను రక్షణ చేసే వాడికి మనం రక్షణ కల్పించడం ఏంటి? కనుక అది ఎంతో ప్రేమతో చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎలాగైతే హరించుకు పోతుందో. అదేవిధంగా దోషాలన్నీ హరించుగాక! అని మంగళం పాడుదాం. 

ఈరోజు పాశురం…..

అన్రివ్వులగ మళందాయ్ ! అడిపోత్తి
చ్చెన్రంగుతైన్నిలంగై శెత్తాయ్ ! తిరల్ పోత్తి
పోన్రచ్చగడ ముదైత్తాయ్! పుగళ్ పోత్తి
కన్రు కుణిలా వెరిన్దాయ్! కళల్ పోత్తి
కున్రుకుడైయావెడుత్తాయ్ ! గుణం పోత్తి
వెన్రు పగైకెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్రెన్రున్ శేవగమే యేత్తిపఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరంగేలో రెంబావాయ్ || 24 ||

ఇప్పుడు ఈ పాశురము యొక్క భావాన్ని చూద్దాం.

శ్రీకృష్ణుడు శయనమందిరం బయటికి వచ్చి ఆస్థానంలో సింహాసనముపై ఆసీనుడివి కావాలని ఆమె మరియు ఆమె సఖులు ప్రార్థిస్తున్నారు. దేవేరి నప్పిన్నాయ్ తో సహా, కృష్ణుడు సింహాసనముపై ఆశీనుడయ్యాడు. ఆయన నడిచివచ్చిన తీరు సింహం నడకని మరిపించిందట. ఆయన నడకను చూసిన గోపికలు అద్భుతమైన ఆశ్చర్యానికి లోనయ్యారు. భగవంతుడు, పిరాట్టి ప్రసాదించిన దర్శన సౌభాగ్యాన్ని కన్నులపండుగగా తిలకించారు. వారి శ్రీచరణాలకు దృష్టిదోషం అంటకుండా మంగళాశాసనం పలికారు. ఆ తర్వాత వారు అక్కడికి వచ్చిన కార్యాన్ని విన్నవించుకున్నారు. శ్రీ వ్రతం ఆచరించడానికి కావలసిన ఉపకరణాలు అందజేయాలని వేడుకున్నారు. నిరంతర కైంకర్య భాగ్యం ప్రసాదించమని గోపికలు ప్రార్థించారు. గోపికలు ప్రార్థించగా కృష్ణుడు శయ్య మీద నుంచి లేచాడు. ఆయన తన వంక ఒక పెద్దపులి, ఒక సింహం వచ్చినట్లు నడిచి రావడాన్ని చూసి గోపికలు ఆయనకు అడుగడుగునా మంగళాశాసనం సమర్పించారు.

వామనావతార కాలంలో బలిచక్రవర్తి వలన బాధలు పడుతున్న దేవతలను రక్షించడానికి, బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడానికి, ముల్లోకములను రెండడుగులతో కొలిచిన స్వామీ! అటువంటి మీ పాదారవిందములకు మంగళమగు గాక! శుభమగు గాక! రామావతార కాలమున సీతను అపహరించిన, దక్షిణ దిశగా వున్న లంకాధీశుడూ, దుష్టుడూ అయిన రావణుడున్న చోటికి వచ్చి సుందరమైన లంకను నశింపజేసిన స్వామీ! నీ పరాక్రమమునకు మంగళమగు గాక! జయ మంగళం. నిన్ను అంతం చేయడానికి బండి రూపంలో వచ్చిన శకటాసురుని తన్ని, ఏ ముక్క కి ఆ ముక్క వూడదీసిన నీ కీర్తికి మంగళమగు గాక ! దూడ రూపంలో వచ్చిన వత్సాసురిని కర్రపుల్ల వలె విరిచి, నిన్ను సంహరించడానికి వచ్చిన కపిత్థాసురుని గాలిలోకి ఎగరవేసిన స్వామీ!.....

మీ శ్రీ పాదములకు మంగళమగు గాక! దేవేంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోవులను, గోపాలురను కాపాడడానికి గోవర్ధన పర్వతమును 7 రోజులు గొడుగుగా ఎత్తిన స్వామీ! నీ కృపాగుణమునకు మంగళమగుగాక! శుభమగు గాక! శత్రువులను జయించి, ద్వేషమును నశింపజేయు నీ చేతియందున్న బల్లెమునకు (వేలాయుధమునకు) మంగళమగు గాక! అని ఈ ప్రకారము మంగళాశాసనం చేసి నీ వీర చరిత్రనే పాడడానికి వచ్చాము. మేము నీకు దాసులము. నీ దగ్గరనుండి వాద్య విశేషమును (పఱను) పొందుటకు వచ్చినాము. దయ చూపించు అని వేడుకుంటున్నారు.
ఈ పాశురం తిరుప్పావై ప్రబంధంలో పొదిగిన ఒక ఆభరణం వంటిది. తండ్రి విష్ణుచిత్తుడు లాగే ఆండాళ్ కూడా భగవంతునికి 'పల్లాండు' అంటే మంగళాశాసనం గానం చేసింది.

ఆండాల్ తిరువడిగళే శరణం

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...