Saturday, January 11, 2025

తిరుప్పావై - ఇరవై ఏడవ పాశురము

తిరుప్పావై - ఇరవై ఏడవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈ పాశురాల్లో 20వ పాశురం నుంచి 29వ పాశురం వరకూ గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడిని వర్ణిస్తుంది. నేడు 27 వ పాశురంలో శ్రీకృష్ణుడు తో కలిసి పాలు, అన్నం మునిగేలా నెయ్యి పోసి.. ఆ మధుర పాల పదార్ధం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కుర్చుని చల్లగా హాయిగా భుజించ వలెను అని గోదాదేవి.. 27 వ పాశురంలో కోరుతుంది.

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ || 27 ||

దీని అర్ధం తెలుసుకుందాం..

శత్రువులను జయించే కళ్యాణ గుణ సంపన్న గోవిందా నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానం లోకులందరూ పొగడెడి తీరుతో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చేడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందియలు, గజ్జెలు మొదలగు అనేక ఆభరణాలు మేము ధరించవలెను. తర్వాత మంచి వస్త్రాలు ధరించవలెను. పాలు, అన్నం మునిగేలా నెయ్యి పోసి.. ఆ మధుర పాల పదార్ధం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కుర్చుని చల్లగా హాయిగా భుజించ వలెను అని గోదాదేవి.. రంగనాధుడిని తన చెలులు గోపికలతో కలిసి కోరింది.

ఆండాల్ తిరువడిగళే శరణం

Thursday, January 9, 2025

తిరుప్పావై - ఇరవై ఆరవ పాశురము

తిరుప్పావై - ఇరవై ఆరవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 26 వ. పాశురం గురించి తెలుసుకుందాం.

ఈరోజు పాశురములో….
రేపల్లె లో వర్షాలు కురవడం కోసమని.. ఆ వూరి పెద్దల అనుమతి తీసుకుని.. గోపికలు ఈ మార్గశీర్ష వ్రతాన్ని చేస్తున్నారు. ఊరికి వర్షాలు ముఖ్యం. గోపికలకు శ్రీకృష్ణుని సాన్నిధ్యం ముఖ్యం. అందుకోసమే వారు వ్రతానికి పనికివచ్చే పరికరాలను.. శ్రీకృష్ణుని నుంచి పొందడానికి వచ్చి శ్రీకృష్ణుడిని స్తోత్రం చేస్తున్నారు. అదే ఈ పాశురములో విశేషం.

మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్వనగళ్; వేణ్డువన కేట్టియాల్;
జ్ఞాలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచశన్నియమే
పోల్వన శంగంగళ్, ప్పాయ్ ప్పాడుడై యనవే,
శాలప్పెరుమ్ పఱైయే, పల్లాండిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, వితానమే
అలినిలై యాయ్! అరుళేలో రెంబావాయ్|| 26 ||

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చదువుదాం.
ఇంద్ర నీలమణిలా మెరుస్తున్న కాంతి కలిగినవాడా! ఆశ్రితులపై వ్యామోహము కలవాడా! ఓ వటపత్ర సాయీ! ఈ నోములో పెద్దలు ఆచరించిన వ్రత విధానం చెప్తున్నాం వినవలసింది. లోకమంతటికీ వినిపించేలా, అతి పెద్ద ధ్వని చేసేది, తెల్లని కాంతి కలిగినది, నీ చేతిలో ఉన్న పాంచజన్యం అనే శంఖమువలే.. ధ్వని చేయు... పెద్దవి కొన్ని శంఖములను, పెద్ద శబ్దం చేయు వాయిద్యంను (భేరీ), తిరుప్పల్లాండును అద్భుతంగా గానము చేసే గాయకులను, వెలుగులను ప్రసరింపజేసే దీప స్తంభాలను, మంగళ దీపమను ధ్వజమును, చాందినీని, వీటన్నింటిని మాకు కొరత లేకుండా ఇవ్వవలసింది. ఇదే మా ప్రార్థన. మమ్ములను అనుగ్రహించు. నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. లోకాలు అన్నింటినీ నీ కడుపులో ఉంచుకున్నావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.ఓ వటపత్ర సాయీ! ఇదే మా విన్నపం అని ప్రార్థిస్తున్నారు.

గోపికలకు ఒక అనుమానం వచ్చింది. 
శ్రీకృష్ణుడికి తామంటే ఇష్టమా? లేదా? అని.
అనుమానంగా శ్రీకృష్ణుడి వైపు చూశారు.
శ్రీకృష్ణుడు వారినే చూస్తున్నాడు. గోపికలు శ్రీకృష్ణుడిని ఎంతగా కావాలనుకుంటున్నారో; అంతకంటే ఎక్కువగా కూడా శ్రీకృష్ణుడే గోపికలను కావాలి అనుకుంటున్నాడు.

భక్తుడు మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటే, వద్దన్నా సరే భక్తుడి యొక్క యోగక్షేమాలు చూస్తాడు. పరమాత్మ అంతటి కరుణామయుడు.

గోపికలు పెద్దవారు సూచించిన విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. స్నాన వ్రతం పూర్తి కాబోతుంది. ఈనాటి నుండి నీరాట్టం అంటారు. ఇక్కడ స్నానం అంటే అర్థం నదికి వెళ్లి మునగడం కాదు. భగవంతుడి యొక్క గుణములలో మునగడమే స్నానం. భగవంతుని పొందామన్న ఆనందంలో ఉండడమే స్నానం. ఆ స్నానంతో అహంకార మమకారాలను తొలగిపోతాయి.

గోపికలు తెలివిగా శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్యం అనే శంఖాన్ని అడిగారు. శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని వదిలి ఉండలేడని గోపికలకు తెలుసు. ఆ శంఖాన్ని కోరుకుంటే శంఖంతోపాటు శ్రీకృష్ణుడే తమ వద్దకు వస్తాడని వారి ఆశ. పెద్ద పెద్ద తప్పెట వాయిద్యాలు కావాలంట. మంగళం పాడినవారు కావాలట.పెద్ద శబ్దం చేసుకుంటూ ఊరేగింపుగా వెళుతుంటే దారి చూడడానికి మంగళ దీపాలు కావాలంట. దీపం అంటే వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించడం. శ్రీరంగ హర్మ్యతల మంగళదీపరేఖాంఅని అమ్మవారిని పరాశర భట్టారు వారు వర్ణించారు.దూరంగా ఉండే వారికి కూడా వారు కనిపించేలా ఒక జండా కావాలట. ఈ విధంగా గోపికలు శ్రీకృష్ణుడికి బాగా దగ్గరవ్వాలని చూస్తున్నారు.

ఆండాల్ తిరువడిగళే శరణం

Wednesday, January 8, 2025

తిరుప్పావై - ఇరవై ఐదవ పాశురము

 తిరుప్పావై - ఇరవై ఐదవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 25 వ. పాశురం గురించి తెలుసుకుందాం.

ఒరుత్తి మగనాయ్ పిఱందు, ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర
తరిక్కిలానాగి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిళ్లైప్పిత్తు కంగన్ వయిత్తిల్
నెరుప్పెన్న నిన్ర నెడు మాలే !యున్నై
అరుత్తిత్తు వన్దోమ్; పరై రుతియాకిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీరుందు మగిళెందేలో రెంబావాయ్ || 25 ||

ఇప్పుడు ఈ పాశురం యొక్క భావాన్ని చదువుదాం..

ఓ శ్రీకృష్ణా ! పరమ భాగ్యశాలి అయిన దేవకీదేవికి ముద్దుల బిడ్డగా అవతరించి, అదే రాత్రి గోకులంలో నందగోపుని భవనానికి చేరి.. యశోదాదేవికి కూడా అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా పెరుగుతుండగా.. చారుల వలన ఈ విషయం తెలుసుకున్న కంసుడు నిన్ను మట్టుబెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.ఆ ప్రయత్నాలన్నింటినీ వ్యర్థం చేసి.. వాని గర్భంలో చిచ్చు పెట్టావు. 

ఓ! స్వామీ! పురుషార్థములను (పఱను) కోరుటకు మేము నిన్ను ఆశ్రయించేము. మా కోరికలను తీర్చి పురుషార్ధములను మాకు ఇస్తే, నీలాదేవి వద్దకు వెళ్లి.. ఆశపడదగిన నీ సంపదను, నీ వీరచరిత్రను, నీ శౌర్యాన్ని చాలాసార్లు కీర్తిస్తాం. మా దుఃఖమంతా తీరి మేము సంతోషిస్తాం. నీ అనుగ్రహం వల్ల మా యొక్క దివ్యమైన వ్రతం సంసంపూర్ణమవుతుంది.

ఉత్తర భారతదేశంలో గల మధురలో దేవకీ గర్భాన జన్మించి, తండ్రి వసుదేవుని తలపై గోకులం చేరి, యశోద ఇంట్లో ఆమె కుమారుడిగా పెరిగావు కదా! సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడినే పుత్రుడిగా పొందాలని.. దేవకీదేవి ఎన్నో తపస్సులు చేసి నిన్ను కన్నది. నీ బాల్యము, ఆటపాటలు, అద్భుత లీలలు చూసే అదృష్టం ఆమెకు దక్కలేదని దేవకీదేవి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నాకు పుత్ర సౌభాగ్యం లేదు. ఆ శుభలక్షణం, అదృష్టం అంతా యశోదాదేవిదే. "ఎన్ని పూజలు చేసిందో. తన జీవితం ధన్యమైంది." అని అంటుంది ఆండాళ్ తల్లి.

ఆది, అనాది లేనివాడు, జన్మ పరంపరల నుంచి ముముక్షువులకు ముక్తిని ఇచ్చేవాడు- స్వయంగా భూమ్మీద జన్మించడం అతడి లీలావిలాసం కాక మరేమిటి! వేదాలు శ్రీకృష్ణుడు తల్లిగా దేవకీదేవిని స్తుతిస్తాయి. జన్మనిచ్చింది ఒకరైతే, పెంచింది మరొకరు. కృష్ణావతారంలో యశోదాదేవి పాత్ర ఆరాధనీయం. దారితప్పుతున్న జీవులను ఉద్ధరించటానికి మానవరూపంలో సాక్షాత్కరించిన పరమాత్ముడే శ్రీకృష్ణుడు.

పంచేంద్రియాల వలలో చిక్కి, సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవిని ఆచార్యుడూ మరియు మంత్రమూ మాత్రమే ఒడ్డుకు చేరుస్తాయి. 

గోపికలు భగవానుడి విషయంలో శరణాగతులై, బ్రహ్మానందానుభవాన్ని ప్రసాదించమని కోరుతున్నారు. "స్వామీ! నీ వద్దకు పరిశుద్ధులమై, నిర్మలమైన అంతఃకరణతో వచ్చాం. చతుర్విధపురుషార్థాలలో అత్యున్నతమైన దానిని అర్ధిస్తున్నాం. నిన్నూ, నీ దేవేరినీ స్తోత్రం చేసి మీకు సేవకులమై మా జన్మాంతర దుఃఖాలన్నీ రూపుమాపుకొని బ్రహ్మానందాన్ని కైవసం చేసుకుంటాం. నీ చరణ కమల సేవే పరమభాగ్యం అని చెప్తున్నారు. 'పర' లాంటి వ్రతానికి పనికొచ్చే సాధనాల కోసం ఇక్కడకు రాలేదయ్యా! నిన్నే పొందాలని వచ్చాం. మాకు కావాల్సిన 'పర' ఏమిటో తెలుసా? భగవత్ - భాగవత - ఆచార్య కైంకర్యమే. అదే మేము కోరుకునే 'పర'. మమ్మల్ని అనుగ్రహించు దేవా! అని ప్రార్థిస్తున్నారు గోపికలు.

ఆండాల్ తిరువడిగళే శరణం

వేదవేద్యులు వెదకేటి మందు

వేదవేద్యులు వెదకేటి మందు

తాళం: ___
రాగం: దేసాక్షి (మేళకర్త __, __  జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ
అవరోహణ

పల్లవి
వేదవేద్యులు వెదకేటి మందు
ఆది నంత్యములేని‌ ఆ మందు ॥వేద॥

చరణము
అడవిమందులుఁ గషాయములు 
నెల్లవారు కడగానక కొనఁగాను
తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-
నడియాలమైనట్టి ఆ మందు ॥వేద॥

లలితరసములుఁ దైలములు 
నెల్లవారు కలకాలము గొనఁగాను
చెలువైన దొకమందు చేరె మాకు భువి-
నలవి మీఱినయట్టి యా మందు ॥వేద॥

కదిసిన జన్మరోగముల నెల్లవారు
కదలలేక వుండఁగాను
అదన శ్రీతిరువేంకటాద్రిమీఁది మందు
అదివో మా గురుఁడిచ్చె నా మందు ॥వేద॥

వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు

వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు

తాళం: 
రాగం: సామంతం (మేళకర్త 28, హరి ఖంభోజి   జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి2 మ1 ప ద2 స
అవరోహణ: స ద2 ప మ1 గ3 రి2 స

పల్లవి
వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు
కలికి మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురా ॥వలచి॥

చరణము
అంగడి కెత్తినట్టి దివ్వె లంగన ముఖాంబుజములు
ముంగిటి పసిఁడి కుంభములును ముద్దుల కుచయుగంబులు
యెంగిలి సేసినట్టి తేనె లితవులైన మెఱుఁగుమోవులు
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు ॥వలచి॥

కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలో నీడలు యెడనెడ కూటములు
తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడని లేఁతనవ్వులు
మంచితనములోని నొప్పులు మాటలలోని మాటలు ॥వలచి॥

నిప్పులమీఁద జల్లిన నూనెలు నిగిడి తనివిలేని యాసలు
దప్పికి నేయి దాగినట్లు తమకములోని తాలిమి
చెప్పఁగరాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పని కరుణ గలిగి మనుట అబ్బురమైన సుఖములు ॥వలచి॥

NAVAGRAHA MANGALA SLOKA - నవగ్రహమంగళశ్లోకాః

నవగ్రహమంగళశ్లోకాః (నవగ్రహ మంగళాష్టకం)

భాస్వాన్ కాశ్యపగోత్రజోఽరుణరుచిర్యస్సింహపోఽర్కస్సమి-
త్షట్త్రిస్థోఽదశశోభనో గురుశశీ భౌమాస్సుమిత్రాస్సదా,
శుక్రో మన్దరిపుః కళిఙ్గజనపశ్చాగ్నీశ్వరౌ దేవతే
మధ్యేవర్తులపూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళమ్. ||1||

చంద్రః కర్కటకప్రభుస్సితనిభశ్చాత్రేయగోత్రోద్భవ-
శ్చాత్రేయశ్చతురశ్రవారుణముఖశ్చాపే ఉమాధీశ్వరః,
షట్సప్తాగ్ని దశైకశోభనఫలో నోరిర్బుధార్కౌప్రియౌ
స్వామీ యామునజశ్చ పర్ణసమిధః కుర్యాత్సదా మంగళమ్. ||2||

భౌమో దక్షిణదిక్త్రికోణయమదిగ్వింధ్యేశ్వరః ఖాదిరః
స్వామీ వృశ్చికమేషయోస్సు గురుశ్చార్కశ్శశీ సౌహృదః,
జ్ఞోఽరిష్షట్త్రిఫలప్రదశ్చ వసుధాస్కందౌ క్రమాద్దేవతే
భారద్వాజకులోద్వహోఽరుణరుచిః కుర్యాత్సదామంగళమ్. ||3||

సౌమ్యః పీత ఉదఙ్ముఖస్సమిదపామార్గో త్రిగోత్రోద్భవో
బాణేశానదిశస్సుహృద్రవిసుతశ్శేషాస్సమాశ్శీతగోః,
కన్యాయుగ్మపతిర్దశాష్టచతురష్షణ్ణేత్రగశ్శోభనో
విష్ణుర్దేవ్యధిదేవతే మగధపః కుర్యాత్సదా మంగలమ్. ||4||

జీవశ్చాంగిరగోత్రజోత్తరముఖో దీర్ఘోత్తరాశాస్థితః
పీతోఽశ్వత్థసమిచ్చసింధుజనితశ్చాపోఽథ మీనాధిపః,
సూర్యేందుక్షితిజాః ప్రియా బుధసితౌ శత్రూ సమాశ్చాపరే
సప్త ద్వే నవ పంచమే శుభకరః కుర్యాత్సదామంగళమ్. ||5||

శుక్రోభార్గవగోత్రజస్సితరుచిః పూర్వాముఖః పూర్వదిక్
పాంచాలస్థ వృషస్తులాధిపమహారాష్ట్రాధిపౌదుంబరః,
ఇంద్రాణీమఘవాబుధశ్చ రవిజో మిత్రోర్క చన్ద్రావరీ
షష్ఠత్రిర్దశవర్జితేభృగుసుతః కుర్యాత్సదామంగళమ్. ||6||

మందః కృష్ణనిభః సపశ్చిమముఖః సౌరాష్ట్రపః కాశ్యప-
స్స్వామీ నక్రసుకుంభయోర్బుధసితౌ మిత్రౌ కుజేన్దూద్విషౌ,
స్థానంపశ్చిమదిక్ప్రజాపతియమౌ దేవౌ ధనుష్యాసనౌ-
ష్షట్త్రిస్థశ్శుభకృచ్ఛమీరవిసుతః కుర్యాత్సదా మంగళమ్. ||7||

రాహుస్సింహళదేశపో నిఋఋతిః కృష్ణాంగశూర్పాసనః
యఃపైఠీనసగోత్రసంభవసమిద్దూర్వాముఖో దక్షిణః,
యస్సర్పః పశుదైవతోఽఖిలగతస్స్వామ్యాద్విశేషప్రద
షట్త్రిస్థశ్శుభకృచ్చ సింహకసుతః కుర్యాత్సదామంగళమ్. ||8||

కేతుర్జైమినిగోత్రజః కుశసమిద్వాయవ్యకోణేస్థితః
చిత్రాంకధ్వజలాంఛనోహిభగవాన్యో దక్షిణాశాముఖః,
బ్రహ్మాచైవతు చిత్రగుప్తపతిమాన్ప్రీత్యాధిదేవస్సదా-
షట్త్రిస్థశుభ కృచ్చ బర్బరపతిః కుర్యాత్సదా మంగళమ్. ||9||

|| ఇతి నవగ్రహమంగళశ్లోకాః (నవగ్రహ మంగళాష్టకం) ||

SRI VENKATESHWARA STOTRAM – శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలా కుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో |
కమలాయతలోచన లోకపతే విజయీ భవ వేంకటశైలపతే || 1 ||

సచతుర్ముఖషణ్ముఖపంచముఖ ప్రముఖాఖిలదైవతమౌళిమణే |
శరణాగతవత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే || 2 ||

అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః |
భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే || 3 ||

అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ |
పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితాన్న పరం కలయే || 4 ||

కలవేణురవావశగోపవధూ శతకోటివృతాత్స్మరకోటిసమాత్ |
ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే || 5 ||

అభిరామగుణాకర దాశరథే జగదేకధనుర్ధర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయాజలధే || 6 ||

అవనీతనయాకమనీయకరం రజనీకరచారుముఖాంబురుహమ్ |
రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామ మయే || 7 ||

సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయమమోఘశరమ్ |
అపహాయ రఘూద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే || 8 ||

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || 9 ||

అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాఽఽగత్య సేవాం కరోమి |
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || 10 ||

అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే || 11 ||

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...