Friday, June 12, 2026

Visit to the Navagraha Temples - నవగ్రహ దేవాలయ దర్శనం

నవగ్రహ దేవాలయ దర్శనం

నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను మరియు నవగ్రహ దోషాలను అధిగమించడానికి, గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, మంచి ఆరోగ్యాన్ని, సంపదను, శ్రేయస్సును పొందడానికి, అలాగే మానసిక ప్రశాంతతను పొందడానికి నమ్ముతారు.

నవగ్రహ దేవాలయాలకు వెళ్ళడానికి గల కొన్ని ముఖ్య కారణాలు:

గ్రహాల అనుగ్రహం:
నవగ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు) మానవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఈ గ్రహాల అనుగ్రహం పొందడానికి, వారి చెడు ప్రభావాలను తగ్గించడానికి నవగ్రహ ఆలయాలను సందర్శిస్తారు.

సమస్యల నివారణ:
నవగ్రహాల పూజలు చేయడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు.

ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
నవగ్రహ ఆలయాలను సందర్శించడం వలన ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

మంచి ఫలితాలు:
నవగ్రహాల పూజలు చేయడం వలన మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు.

నవగ్రహాలకు సంబంధించిన కొన్ని సాధారణ నమ్మకాలు:
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు.

ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది మరియు అది వ్యక్తి యొక్క జీవితంలో వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది.

నవగ్రహాలను పూజించడం ద్వారా, వారి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు వారి ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.

నవగ్రహాలు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండేవి మాత్రమే కాదు, మన ప్రవర్తనలోనే ఉంటాయి! మనం చేసే మంచి పనులే మనకు గ్రహ అనుకూలతను ఇస్తాయి. ఈ చిన్న విషయాలను గుర్తుపెట్టుకుని తప్పులు సరిదిద్దుకుంటే.. ఆ నవగ్రహాల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

సూర్యుడు: పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత.సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.

చంద్రుడు: అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం.అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

కుజుడు: ఎవరికైనా అప్పు ఇచ్చి ఎగ్గొడితే కుజుడికి విపరీతమైన కోపం వస్తుంది. అలాగే వ్యవసాయ పరంగా భూమిని లేదా రైతును మోసం చేస్తే ఆయన అస్సలు ఊరుకోడు.

బుధుడు: బుధుడికి చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటే కోపం. అందునా బుధవారం రోజున ఈ పని అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, నాకు జ్ఞానం ఉందని విర్రవీగినా బుధుడు ఆగ్రహిస్తాడు.

గురువు: సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది.

శుక్రుడు: శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే.శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

శని: శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లితండ్రిని చులకన చేసిన సహించడు.సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

రాహువు: రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును.ఈయన భ్రమ మాయకి కారణము..!!

కేతువు: జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకాడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు.

నవ గ్రహ స్తోత్రం

నవగ్రహ బీజ మంత్రములు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

One should not eat a meal while wearing footwear - చెప్పులు వేసుకొని అన్నం తినకూడదు

చెప్పులు వేసుకొని అన్నం తినకూడదు

మన పూర్వీకులు నిర్ణయించిన మరియు పాటించిన సంప్రదాయాలకు ఎన్నో కారణాలు మరియు శాస్త్రీయత వుంది.

ఈ భరతభూమిలో పుట్టిన సర్వమానవులూ బ్రాహ్మణుణ్ణి చూచి, ఆచారాలు నేర్చుకోండి — అని వ్యాసమహర్షి/మనువు చెప్పారు.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ 

అని భగవద్గీతలో చెప్పారు.

మన అందరి ఉదరంలోనూ వైశ్వానరాగ్ని (జఠరాగ్ని) ఉన్నది .

భోజనం గూడా ఒక యజ్ఞమే. ప్రాణాహుతులను ఆ వైశ్వానరాగ్నిలో వేల్చడం భోజనం చేయడంలో తొలి ప్రక్రియ.

మంత్రోచ్చారణతో తినబోయే ఆహారాన్ని సంప్రోక్షణ చేసి, ప్రాణాహుతులు ఉదరంలో ఉన్న అగ్నికి సమర్పిస్తున్నాం . భోజనానంతరం గూడా ఆ యజ్ఞవిధిపూరణమంత్రాలు ఉచ్చరించడం పాటిస్తూ ఉన్న విధిలో భాగమే.

భోజనాన్ని గూడా యజ్ఞంగా భావనచేయడమే ఈ చర్యల వెనక ఉన్న ఆంతర్యం.

యజమాని శుచియై (పాదప్రక్షాళన అనంతరం) కింద కూర్చుండి యజ్ఞం ఆరంభిస్తాడు. అపుడు చెప్పులు ధరించడం చేయరు.

అది మంత్రోచ్చారణ చేసే సమయం కాబట్టి చెప్పులు విప్పేయడం చేస్తున్నాం.

అందుచేతనే కనీసం భోజనానికి ముందు పాదప్రక్షాళనైనా చేసుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు

ఆ పూర్వసంప్రదాయాన్నే యథాశక్తి అందరూ భోజనవిధిలో పాటిస్తున్నారు.

ప్రాణాహుతులు అగ్నిలో వేల్చేవి గాబట్టి నేతితో తడిపి సమర్పించవలె. అందుకోసమే వడ్డించిన అన్నం మీద నెయ్యి వేసి , ఆ తర్వాత దాన్ని మంత్ర పూర్వకంగా(రుచి చూడకుండా), నోట్లో వేసుకొంటున్నాం.

ఇంత విధానం తెలియక పోయినా, నెయ్యి వేసిన తర్వాతే భోజనం ఆరంభించడం మాత్రం అన్ని వర్ణాల వారూ హోటళ్ళలో గూడా నేటికీ పాటిస్తున్నారు.

బ్రాహ్మణాచారాలపై గౌరవంతోనే వాటిని అనుసరించడం జరుతున్నది.


Sri Krishna Temple, Vrindavan, Mathura District, Uttar Pradesh - శ్రీకృష్ణ ఆలయం బృందావనము, మధుర జిల్లా, ఉత్తరప్రదేశ్

శ్రీకృష్ణ ఆలయం బృందావనము, మధుర జిల్లా, ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ లోని మథుర జిల్లాలో ఉన్న బృందావనం శ్రీకృష్ణుని బాల్య లీలలకు ప్రసిద్ధి చెందిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ దాదాపు 5,500 వరకు శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైన, ప్రసిద్ధి చెందిన ప్రధాన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి

ద్వారకా నాథ్ మందిరము, మదన మోహన మందిరము, బంకె బిహారి మందిరము, రాధారమణ మందిరము, గోపీనాథ్ మందిరము, షాహాజీ మందిరము, రంగనాథ మందిరము ( దక్షిణ దేశమునగల శ్రీ రంగనాథుని వలె నుండును ), గోవర్ధన గిరి దిగువన శ్రీరామానుజులు దయచేసిన రీతులలో అర్చనాదులు జరుప బడుచున్న లక్ష్మీ నారాయణ మందిరము, ఇంకను ఎన్నియో మందిరములు గలవు . దర్శించి నంతనే జన్మ ధన్యమగును .

బాంకే బిహారీ ఆలయం (Banke Bihari Temple): బృందావనంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. ఇక్కడ శ్రీకృష్ణుడిని చిన్నపిల్లవాడిగా (నల్లటి విగ్రహ రూపంలో) పూజిస్తారు. ఇక్కడ విగ్రహానికి తెరలు అడ్డం పెట్టడం, తొలగించడం ద్వారా భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.

ఇస్కాన్ ఆలయం (కృష్ణ బలరామ మందిరం - ISKCON Temple): స్వామి ప్రభుపాదచే 1975లో నిర్మితమైన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు రాధాకృష్ణుల విగ్రహాలను చూడవచ్చు. ఇక్కడి భజనలు, సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.

AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద , (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ వ్యవస్థాపకుడు- ఆచార్య), కృష్ణ బలరామ మందిరాన్ని ప్రారంభించి, కృష్ణుడు - బలరాముడు , రాధా - శ్యామసుందర్ , గోపికలు లలితా దేవి మరియు విశాఖ దేవి మరియు గౌర మూర్తులు స్థాపించారు.

రాధాష్టమి నాడు ఆలయంలో రాధా శ్యామసుందర్
ఆలయ ప్రధాన దేవతలు మధ్య బలిపీఠం వద్ద కృష్ణుడు మరియు బలరాముడు . కుడి బలిపీఠం వద్ద శ్రీ శ్రీ రాధా శ్యామసుందర్ రూపంలో రాధా కృష్ణుడు, లలిత మరియు విశాఖ అనే గోపికలతో ఉన్నారు. ఎడమ బలిపీఠం వద్ద చైతన్య మహాప్రభు నిత్యానందతో , మరియు ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద మరియు అతని గురువు భక్తిసిద్ధాంత సరస్వతి ఉన్నారు.

ఆలయానికి సమీపంలో, సముదాయ ప్రవేశ ద్వారం వద్ద, తెల్ల పాలరాయితో నిర్మించిన ప్రభుపాద సమాధి మందిరం ఉంది.

ప్రేమ్ మందిర్ (Prem Mandir): భారీ పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం దాని అద్భుతమైన శిల్పకళకు మరియు రాత్రి పూట రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతులకు ప్రసిద్ధి చెందింది. రాధాకృష్ణుల దివ్య లీలలను తెలిపే దృశ్యాలు ఆలయం చుట్టూ ఆకర్షణీయంగా ఉంటాయి.

శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం (శ్రీ కృష్ణ జన్మస్థాన్): ఇది బృందావనానికి సుమారు 12 కి.మీ దూరంలో మధురలో ఉంది. శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించిన ప్రదేశంగా దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు.

పండుగలు

కృష్ణ జన్మాష్టమి - కృష్ణుని జన్మదినోత్సవం

రాధాష్టమి - రాధా జన్మదినం

బలరామ పూర్ణిమ - బలరాముని జన్మదినోత్సవం

గౌర పూర్ణిమ - చైతన్య మహాప్రభు జన్మదినోత్సవం

నిత్యానంద త్రయోదశి - నిత్యానంద జన్మదిన వార్షికోత్సవం

గోపాష్టమి - గోవులతో కృష్ణుని లీలలకు అంకితం చేయబడిన పండుగ

హోలీ - ప్రేమ మరియు రంగుల పండుగ, రాధాకృష్ణుల లీలలతో ముడిపడి ఉన్న ప్రధాన పండుగ

శరత్ పూర్ణిమ - రాధా కృష్ణులు మరియు గోపికల మహారాసులతో ముడిపడి ఉన్న పండుగ .

కార్తీక పౌర్ణమి - రాధాకృష్ణులు మరియు గోపికల కలయికతో ముడిపడి ఉన్న పండుగ.

చతుర్మాస్

కార్తీక దామోదర మాసం - రాధా కృష్ణుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే కార్తీక మాస వేడుక.

దీపావళి - సీతారాములకు (రాధా కృష్ణుని మరొక రూపం) అంకితం చేయబడిన ప్రధాన హిందూ పండుగ .

వైష్ణవ ఆచార్యులు మరియు సాధువుల ఆవిర్భావ మరియు తిరోగమన దినాలు (పుట్టిన మరియు మరణించిన రోజులు).

ముఖ్యమైన వివరాలు:

ఎలా చేరుకోవాలి: 

విమానాశ్రయం: ఆగ్రా లేదా ఢిల్లీ

రైల్వే స్టేషన్: ఆగ్రా లేదా ఢిల్లీ

రోడ్డు మార్గం: ఢిల్లీ నుండి రోడ్డు మార్గం ద్వారా బృందావనం సుమారు 2-3 గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి మరియు హోలీ పండుగలను ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

వేసవి నెలల్లో, సందర్శకులు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం వరకు, మరియు సాయంత్రం 4:00 నుండి 9:00 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. శీతాకాలంలో భక్తులు ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం వరకు, మరియు సాయంత్రం 3:00 నుండి 8:00 గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Wednesday, June 10, 2026

The Celestial Wedding of Lord Satyadeva at Annavaram - అన్నవరం సత్యదేవుని కళ్యాణం అన్నవరం

అన్నవరం సత్యదేవుని కళ్యాణం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్తాగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు.

శ్రీ సత్యనారాయణ స్వామివారిని

"మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.

క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామానారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరిమీద వెలుస్తున్నాను.. శాస్త్ర ప్రకారం ప్రతిష్టించి పూజించమని చెప్పాడు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి వెతికి, ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీనుండి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి ప్రతిష్టించారు. హరి హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యన్నారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడుకూడా పూజలందుకుంటరు.

ఆలయ నిర్మాణం 1934 లో జరిగింది. ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతా మూర్తులు. ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింపబడింది. ఈ స్వామిని మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం మహ విష్ణువుగా, త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు..

స్థలపురాణం : ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.

పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది.

మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులు గా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తు లో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది.

Vasavi Kanyakaparameswari, Penugonda, West Godavari District, Andhra Pradesh - వాసవి కన్యకాపరమేశ్వరి, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

వాసవి కన్యకాపరమేశ్వరి, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్


పెనుగొండ ప్రాముఖ్యత:
పవిత్ర భూమి: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గౌతమీ నదీ తీరాన ఉన్న పెనుగొండ, గొప్ప మునులు తపస్సు చేసిన పుణ్యక్షేత్రం.

దేవతల నిలయం: ఇది కుమారస్వామి తపస్సు చేసిన చోటు మరియు లక్ష్మీనారాయణ స్వామి వెలసిన ప్రాంతం.

అమ్మవారి జననం:

కుసుమ శ్రేష్టి దంపతులు: పెనుగొండను పాలించే కుసుమ శ్రేష్టి, కుసుమాంబ దంపతులకు సంతానం లేకపోవడంతో 'పుత్రకామేష్టి యజ్ఞం' చేశారు. అప్పుడు వారికి యజ్ఞ ప్రసాద ప్రభావంతో వారికి కవలలు జన్మించారు.

విరూపాక్షుడు: నందికేశ్వరుని అంశ (కుమారుడు).

వాసవి: ఆదిపరాశక్తి అంశ (కుమార్తె). ఆమె వైశాఖ శుద్ధ దశమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించారు.

వాసవీ దేవి చిన్నతనం నుంచే శివ భక్తురాలు. తాను కన్యగానే ఉండి ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని నిర్ణయించుకుంది.

అయితే, ఆ ప్రాంతాన్ని సందర్శించిన విష్ణువర్ధన చక్రవర్తి అమ్మవారి అందానికి ముగ్ధుడై, ఆమెను వివాహం చేసుకోవాలని ఆశించాడు.

కుల కట్టుబాట్లకు, వాసవి నిర్ణయానికి వ్యతిరేకంగా చక్రవర్తి పెనుగొండపై యుద్ధానికి సిద్ధపడ్డాడు.
యుద్ధం జరిగితే రక్తపాతం జరుగుతుందని, ఎంతో మంది అమాయకులు చనిపోతారని వాసవి భావించింది.

స్త్రీ గౌరవాన్ని కాపాడడానికి మరియు అహింసను ప్రపంచానికి చాటడానికి ఆమె ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అదే "అగ్ని ప్రవేశం".

వాసవి నిర్ణయానికి మద్దతుగా 102 గోత్రాలకు చెందిన దంపతులు కూడా ఆమెతో పాటు అగ్నిలో దూకడానికి సిద్ధమయ్యారు.

మాఘ శుద్ధ ద్వితీయ నాడు, వాసవి తన నిజ రూపమైన 18 చేతుల ఆదిపరాశక్తి (కన్యకా పరమేశ్వరి) గా దర్శనమిచ్చి, 102 గోత్రజలతో కలిసి అగ్నిలో ఐక్యమయ్యారు.

ఈ వార్త విన్న విష్ణువర్ధన చక్రవర్తి తీవ్ర దిగ్భ్రాంతితో అక్కడికక్కడే మరణించాడు.

విశేషాలు

అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేసిన 102 గోత్రాల వారసుల కోసం కాశీ నుంచి 102 శివలింగాలను తెచ్చి పెనుగొండలో ప్రతిష్టించారు. అందుకే ఆ వీధిని ఇప్పటికీ 'లింగాల వీధి' అని పిలుస్తారు.

ప్రతి సంవత్సరం ఈ రోజును 'ఆత్మర్పణ దినోత్సవం'గా వైశ్యులు మరియు భక్తులు ఎంతో భక్తితో జరుపుకుంటారు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Offering hair to God - దేవునికి తలనీలాలు

దేవునికి తలనీలాలు

హిందూ సంప్రదాయంలో దేవునికి తలనీలాలు (తల వెంట్రుకలు) సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. ముఖ్యంగా తిరుమల వేంకటేశ్వర స్వామికి ఈ మొక్కును ఎక్కువగా చెల్లిస్తుంటారు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాలు మరియు ఫలితాలు తెలుసుకుందాం:

అహంకారాన్ని వదులుకోవడం:
మనిషికి తన అందంపై, ముఖ్యంగా జుట్టుపై ఒక రకమైన మమకారం ఉంటుంది. జుట్టు మనిషి రూపానికి అందాన్ని ఇస్తుంది. అటువంటి అందాన్ని ఇచ్చే జుట్టును దేవుని ముందు త్యాగం చేయడం అంటే—నేను నా అహంకారాన్ని, అందాన్ని, గర్వాన్ని నీ పాదాల చెంత వదిలేస్తున్నాను అని అర్థం. అంటే, దేవుని ముందు అందరూ సమానమే అని చాటిచెప్పడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

పౌరాణిక నేపథ్యం (నీలాద్రి కథ):
పురాణాల ప్రకారం, వేంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలి తలపై కొంత జుట్టు పోయినప్పుడు, నీలాదేవి అనే గంధర్వ కన్య తన జుట్టును కోసి స్వామికి అమర్చిందట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి, "నా దగ్గరకు వచ్చే భక్తులు తమ తలనీలాలు సమర్పిస్తే, అవి నీకే చెందుతాయి" అని వరమిచ్చారు. అందుకే ఆమె పేరు మీదుగా ఆ కొండకు 'నీలాద్రి' అని పేరు వచ్చింది. భక్తులు సమర్పించే జుట్టు నీలాదేవికి చేరుతుందని నమ్మకం.

మొక్కుబడి తీర్చుకోవడం:
కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు, అది నెరవేరితే "నీకు తలనీలాలు ఇస్తాను స్వామి" అని మొక్కుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా తమ జుట్టును సమర్పిస్తారు.

తలనీలాలు ఇవ్వడం వల్ల కలిగే ఫలితం:
పాప విముక్తి: జుట్టుతో పాటు మనలోని దుర్గుణాలను, గతంలోని పాపాలను దేవునికి వదిలేస్తున్నామనే భావన మనసును పవిత్రం చేస్తుంది.

ప్రశాంతత: అహంకారాన్ని వదులుకోవడం వల్ల మనసులో వినయం పెరుగుతుంది, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

క్రమశిక్షణ: సామాన్యుడిగా దేవుని ముందు నిలబడటం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది.

సమర్పణ భావం: "సర్వం నీదే" అనే భావనతో చేసే ఈ పని వల్ల దైవ అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Statue of Kubera - కుబేర విగ్రహం

కుబేర విగ్రహం

ప్రతి ఒక్కరూ బాగా డబ్బు సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఆర్థికంగా బలోపేతంగా ఉన్నప్పుడే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారని బలంగా నమ్ముతారు. అందుకే డబ్బు సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడతారు. అయినప్పటికీ కొంతమందికి ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఎంతో కష్టపడి వారు సంపాదించిన డబ్బు, వారే ఊహించని విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఒకసారి ఇలా చేసి చూడండి.

ఇంట్లో కుబేర విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తులు పెరిగి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కుబేరుడు ధనానికి, సిరిసంపదలకు అధిపతి.

కుబేర విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే కలిగే ప్రయోజనాలు:
ధన లాభం: కుబేరుడిని సంపదకు దేవుడిగా భావిస్తారు, కాబట్టి ఆయన విగ్రహం ఇంట్లో ఉంటే ఆర్థిక స్థిరత్వం, డబ్బుకు లోటు ఉండదు.

వాస్తు దోష నివారణ: సరైన దిశలో కుబేర విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.

సానుకూల శక్తి: ఇంట్లో సానుకూల వాతావరణం, సంతోషం, శాంతి పెంపొందుతాయి.

విగ్రహాన్ని ఉంచే సరైన పద్ధతులు:
దిశ: కుబేర విగ్రహాన్ని ఇంటి ఉత్తర దిశలో లేదా ఈశాన్య (North-East) మూలలో ఉంచడం అత్యంత శుభప్రదం.

స్థలం: విగ్రహాన్ని ఇంట్లో ప్రధాన ద్వారం (Main Entrance) దగ్గర లేదా ఎంట్రీ హాల్లో ఉంచడం ఉత్తమం, దీనివల్ల ఇంటికి అదృష్టం వస్తుంది.

నిర్వహణ: విగ్రహం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి, ఎటువంటి చెత్త, పనికిరాని వస్తువులు ఉండకూడదు.

పూజ: ప్రతిరోజూ కుబేరుడికి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, విగ్రహాన్ని ఉత్తరం వైపు ముఖం ఉండేలా పెట్టాలి.

స్నానపానాదులుగావించి మీ పూజగదిలో తూర్పువైపున కూర్చోండి.

చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి.

కలశాన్ని ఉంచండి. నెయ్యితో దీపాలు వెలిగించండి.

భూమి మరియు కలశాన్ని పూజించండి.

విఘ్నాలను తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయండి.

కుబేరుడికి ధాన్యం మరియు బెల్లం అర్పించండి.

ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను 108 సార్లు జపించండి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే కుబేరుడి అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...