Tuesday, December 31, 2024

ENDARO MAHANUBHAVULU ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

 ఎందరో మహానుభావులు అందరికీ వందనములు


తాళం: ఆది
రాగం: శ్రీ (మేళకర్త 22, కరహరప్రియ  జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స రి2 మ1 ప ని2 స 
అవరోహణ: స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స 

పల్లవి

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

అనుపల్లవి
చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

చరణంలు 
సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

EVARANI NIRNAYINCHIRI-ఎవరని నిర్ణయించిరిరా

ఎవరని నిర్ణయించిరిరా

తాళం: దేశాది -ఆది
రాగం: దేవామృతవర్షిణి(కరహరప్రియ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ

పల్లవి

ఎవరని నిర్ణయించిరిరా ని
న్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥

అను పలవి
శివుడనో మాధవుడనో కమల
భవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥

చరణము(లు)
శివమంత్రమునకు మా జీవము మా
ధవమంత్రమునకు రాజీవము ఈ
వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥ న్నెట్లారిధించిరిరా ॥

ABHIMANAMENNADU KALGURA అభిమానమెన్నడు కల్గురా

 అభిమానమెన్నడు కల్గురా


తాళం : ఆది
రాగం: వివర్ధని మేళకర్త 28, హరి కాంభోజి  జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ


ఆరోహణం: స రి2 మ1 ప స
అవరోహణం స ని2 ద2 ప మ1 గ3 రి2 స 

పల్లవి


అభిమానమెన్నడు కల్గురా
అనాథుడైన నాదుపై నీకు


అనుపల్లవి

అపరాధములన్ని మన్నింపుమయ్య
అభిరామ పట్టాభిరామ నాయందు (అభిమానము)

చరణము
కన్న తల్లియు కన్న తండ్రియు
అన్నియు నీవేయని నమ్మ లేదా
నిను వినా గతి నాకెవరు లేరే
నన్ను బ్రోవు త్యాగరాజ వినుత

ADIGI SUKHAMU LEVARANUBHAVINCHIRI - అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా?

అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా?

తాళం: రూపక   

రాగం: మాధ్యమావతి మేళకర్త 22, కరహరప్రియ  జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స రి2 మ1 ప ని2 స 

అవరోహణ: స ని2 ప మ1 రి2 స  

పల్లవి
అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా?
ఆదిమూలమా! రామ! ॥అడిగి॥

అను పల్లవి:
సడలని పాప తిమిరకోటిసూర్య!
సార్వభౌమ! సారసాక్ష! సద్గుణ! ని ॥న్నడిగి॥

చరణము(లు):
ఆశ్రయించి వరమడిగిన సీత
యడవికిఁ బోనాయె;
ఆశరహరణ! రక్కసి యిష్టమడగ
నపుడె ముక్కువోయె; ఓ రామ! ని ॥న్నడిగి॥

వాసిగ నారదమౌని వరమడుగ
వనిత రూపుఁడాయె,
ఆశించి దూర్వాసులు అన్నమడుగ
అపుడె మందమాయె; ఓరామ! ని ॥న్నడిగి॥

సుతుని వేడుక జూడ దేవకియడుగ య
శోద జూడ నాయె;
సతులెల్ల రతి భిక్షమడుగ వారివారి
పతుల వీడనాయె; ఓరామ! ని ॥న్నడిగి॥

నీకేఁ దయబుట్టి బ్రోతువో! బ్రోవవో!
నీ గుట్టు బయలాయె;
సాకేతధామ! శ్రీత్యాగరాజనుత!
స్వామి! యేటి మాయ? ఓరామ! ని ॥న్నడిగి॥

RAMADASU KEERTHANALU - రామదాసు కీర్తనలు


అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ

అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి

అయ్యయ్యో నీవంటి అన్యాయదైవము

అమ్మ ననుబ్రోవవే రఘురాముని కొమ్మ

అబ్బబ్బా రామనామం అత్యద్భుతము

అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా

అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా

అడుగుదాటి కదలనియ్యను

అంతా రామమయం

అదిగో భద్రాద్రి

ఇక్ష్వాకు కులతిలకా

ఏ తీరుగ నను దయ చూచెదవో

తక్కువేమి మనకూ

పలుకే బంగారమాయెనా

పాహి రామప్రభో

పాహిరామప్రభో పాహిరామప్రభో

రామచంద్రాయ జనక (మంగళం)

రామ తారక మంత్రము

రామ లాలీ మేఘశ్యామ లాలీ

RAMA LALI MEGHA SYAMA LALI - రామ లాలీ మేఘశ్యామ లాలీ

రామ లాలీ మేఘశ్యామ లాలీ


తాళం
రాగం
రూపకర్త: రామదాసు


పల్లవి

రామ లాలీ మేఘశ్యామ లాలీ
తామరసా నయన దశరథ తనయ లాలీ ॥

చరణము

అచ్చావదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥

జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ॥

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు ॥

RAMA TARAKA MANTRAMU - రామ తారక మంత్రము

 రామతారక మంత్రము


తాళం: ఆది
రాగం: ధన్యాసి
రూపకర్త: రామదాసు


పల్లవి

తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా

అనుపల్లవి

మీరిన కాలుని దూతలపాలిటి
మృత్యువుయని మదినమ్ముక యున్న

చరణము
మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా
హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా
ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా
వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు ॥ 1 ॥

ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న
అన్ని రూపులై యున్న నాపరాత్పరు నామహాత్ముని కథ విన్నా
ఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా ॥ 2 ॥

నిర్మల మంతర్లక్ష్యభావమున నిత్యానందముతోనున్న
కర్మంబులువిడి మోక్షపద్ధతిని కన్నుల నే జూచుచునున్న
ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న
మర్మము దెలిసిన రామదాసుని హృన్మందిరముననే యున్న ॥ 3 ॥

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...