Sunday, December 29, 2024

ARASINANNU GACHINATHANIKI SARANU అరసినన్ను గాచినాతనికి శరణు

 అరసినన్ను గాచినాతనికి శరణు


తాళం: ఆది
రాగం: మళహరి  (మేళకర్త 15, మాయ మాళవ గౌళ  జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి1 మ1 ప ద1 స
అవరోహణ: స ద1 ప మ1 గ3 రి1 స

పల్లవి
అరసినన్ను గాచినాతనికి శరణు
పరము నిహము నేలే పతికిని శరణు||

చరణము
వేదములు దెచ్చినట్టివిభునికి శరణు
ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
యేదెసా తానైయున్న యీతనికి శరణు
శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు||

అందరికి ప్రాణమైన అతనికి శరణు
ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు
దిందుపడి దేవతల దేవునికి శరణు
అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు||

తానే చైతన్యమైన దైవానకు శరణు
నానాబ్రహ్మాండాలనాథునికి శరణు
అనుక శ్రీ వేంకటాద్రి యందునుండి వరములు
దీనుల కిందరి కిచ్చే దేవునికి శరణు||

No comments:

Post a Comment

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...