Sunday, December 29, 2024

EMANI POGADUDUME ఏమని పొగదుడుమే యికనిను

 రాగం:ఆభేరి

తాళం :ఆదితాళం

పల్లవి 
ఏమని పొగదుడుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగ ||

చరణములు 
తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు |
పులకల మొలకల పొదులివి గదవే
పలుమరు పువ్వుల పానుపులు ||

తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి |
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ||

కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు |
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన మీ కల్యాణములు ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...