Sunday, December 29, 2024

EMOKO CHIGURUTADHARAMUNA ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను

 పల్లవి 

ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ||

చరణములు 
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు |
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా ||

పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు |
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా ||

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు |
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...