Thursday, December 4, 2025

Sri Baglamukhi Kavacham 2 - శ్రీ బగళాముఖీ కవచం 2

శ్రీ బగళాముఖీ కవచం 2

కైలాసాచలమధ్యగం పురహరం శాంతం త్రిణేత్రం శివం
వామస్థాకవచం ప్రణమ్య గిరిజా భూతిప్రదం పృచ్చతి
దేవీశ్రీ బగళాముఖీ రిపుకులారణ్యాగ్ని రూపా చ యా
తస్యా శ్చాపవిముక్తమంత్ర సహితం ప్రీత్యాధునాబ్రూహిమాం
 ॥ 01 ॥

శ్రీ శంకర ఉవాచ:
దేవి శ్రీ భవవల్లభే శృణు మహామంత్రం విభూతిప్రదం
దేవ్యావర్మయుతం సమస్తసుఖదం సామ్రాజ్యదం ముక్తిదం
తారం రుద్రవధూం విరించిమహిళా విష్ణుప్రియాకామయుక్‌
కాంతేశ్రీ బగళాననే మమరిపొర్నా శాయతుభ్యం నమః
 ॥ 02 ॥

ఐశ్వర్యాణి పదంచదేహి యుగళం శీఘ్రం మనోవాంఛితం
కార్యంసాధయ యుగ్మయుక్‌ శివధూవహ్ని ప్రియాంతోమనుః
కంసారేస్తనయం చ బీజమపరా శక్తిశ్చ వాణీ తథా
కీలం శ్రీమతి భైరవర్షి సహితం ఛందోవిరాట్సంయుతమ్‌
 ॥ 03 ॥

స్వేష్టార్థస్య పరస్యవేత్తి నితరాం కార్యస్య సంప్రాప్తయే
నానాసాధ్య మహాగదస్యనియతం నాశాయ వీర్యాప్తయే
ధ్వాత్వా శ్రీ బగళాననాం మనువరం జప్త్వా సహస్రాఖ్యకం
దీర్ఘెష్షట్కయుతైశ్చ రుద్రమహిళా బీజైశ్శివస్యాంకగే
 ॥ 04 ॥

ధ్యానమ్‌
సౌవర్ణాసన సంస్థితాంత్రినయనాం పీతాంశుకోల్లాసినీం
హేమాభాంగరుచిం శశాంకముకుటాం ప్రక్చంపక స్రగ్యుతాం
హస్తైర్ముద్గరపాశబద్ధరశనాం సంబిభ్రతీం భూషణ
వ్యాప్తాంగీం బగళాముఖీం త్రి జగతాం సం స్తంభినీం చితయే

ఓం అస్య శ్రీ బగళాముఖీ బ్రహ్మస్త్ర మంత్రకవచస్య భైరవ ఋషిః
విరాట్‌ ఛందః శ్రీ బగళాముఖీ దేవతా క్లీం బీజం - ఓం శక్తిః శ్రీం
కీలకం మను పరస్య మనోభిలపితేష్ట కార్యసిద్ధయే జపే వినియోగః.

శిరసి భైరవృషయే నమః
ముఖే విరాటే ఛందసే నమః 
హృది బగళాముఖీ దేవతాయై నమః 
గుహ్యే క్లీం బీజాయ నమః 
పాదయోః ఐం శక్తయే నమః 
సర్వాంగే శ్రీం కీలకాయ నమః

ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః 
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః 
ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః 
ఓం హ్రైం అనామికాభ్యాం నమః 
ఓం హ్రౌం కనిష్ఠికాభ్యం నమః
ఓం హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః

ఓం హ్రాం హృదయాయ నమః 
ఓం హ్రీం శిరసేస్వాహా 
ఓం హ్రూం శిఖాయై వషట్‌ 
ఓం హ్రైం కవచాయ హుం 
ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్‌ 
ఓం హ్రః అస్త్రాయ ఫట్‌ 
ఇతి అంగన్యాస కరన్యాసౌ.

మంత్రోద్ధారః
ఓం హ్రాం ఐం శ్రీం క్లీం శ్రీబగళాననే ముమరిపుంనాశయ నాశయ
మమైశ్వర్యాణి దేహి దేహి శీఘ్రం మనోవాంఛిత కార్యం సాధయ హ్రీం స్వాహా.

శిరోమే పాతు ఓం హ్రీం ఐం శ్రీం క్లీం పాతు లలాటకం
సంబోధనపదం పాతు నేత్రే శ్రీబగళాననే ॥ 01 ॥

శ్రుతీ మమరిపుం పాతు నాసికాం నాసియ ద్వయం
పాతు గండౌ సదామామైశ్వర్యాణ్యం తంతుమస్తకమ్‌ ॥ 02 ॥

దేవిద్వంద్వం సదా జిహ్వాం పాతు శీఘ్రం వచో మమ
కంఠదేశం స నః పాతు వాంఛితం బహుమూలకమ్‌ ॥ 03 ॥

కార్యం సాధయ ద్వంద్వంతు కరౌపాతు సదామమ
మాయాయుక్తా తథా స్వాహా హృదయంపాతు సర్వదా ॥ 04 ॥

అష్టాధిక చత్వారింశ దండాఢ్యా బగళాముఖీ
రక్షాం కరోతు సర్వత్ర గృహేరణ్యే సదామమ ॥ 05 ॥

బ్రహ్మాస్త్రాఖ్యో మనుః పాతు సర్వాంగం సర్వసంధిషు
మంత్రరాజ స్సదారక్షాం కరోతు మమ సర్వదా ॥ 06 ॥

ఓం హ్రీం పాతు నాభిదేశం కటిమ్మే బగళావతు
ముఖం వర్ణద్వయం పాతు లింగం మే ముష్కయుగ్మకమ్‌ ॥ 07 ॥

జానునీ సర్వదుష్టానాం పాతు మే వర్ణపంచకం
వాచం ముఖం తథా పాదం షడ్వర్థా పరమేశ్వరీ ॥ 08 ॥

జంఘాయుగ్మే సదా పాతు బగళా రిపుమోహినీ
స్తంభయేతి పదం పృష్ఠం పాతు వర్ణత్రయం మమ ॥ 09 ॥

జిహ్వాం వర్ణద్వయం పాతు గుల్భౌమే కీలయేతిచ
పాదోర్ధ్వం సర్వదా పాతు బుద్ధిం పాదతలే మమ ॥ 10 ॥

వినాశయం పదం పాతు పాదాంగుళ్యోర్నఖానిమే
హ్రీం బీజం సర్వదాపాతు బుద్ధీంద్రియవచాంసినమే ॥ 11 ॥

సర్వాంగం ప్రణవఃపాతు స్వాహా రోమాణి మేవతు
బ్రాహ్మీ పూర్వదళేపాతు చాగ్నేయ్యాం విష్ణువల్లభా ॥ 12 ॥

మాహేశీ దక్షిణేపాతు చాముండారాక్షసేవతు
కౌమారీ పశ్చిమేపాతు వాయవ్యే చా పరాజితా ॥ 13 ॥

వారాహీ చోత్తరే పాతు నారసింహా శివేవతు
ఊర్ధ్వం పాతు మహాలక్ష్మీః పాతాళథే శారదావతు ॥ 14 ॥

ఇత్యష్టౌ శక్తయః పాతు సాయుధాశ్చ సవాహనాః
రాజద్వారే మహాదుర్గే పాతు మాం గణనాయకీ ॥ 15 ॥

శ్మశానే జలమధ్యేచ భైరవీచ సదావతు
ద్విభుజా రక్తవసనా స్సర్వాభరణ భూషితాః ॥ 16 ॥

యోగిన్య స్సర్వదాపాంతు మహారణ్యే సదామమ
ఇతి తే కధితం దేవి కవచం పరమాద్భుతమ్‌ ॥ 17 ॥

శ్రీ విశ్వవిజయంనామకీర్తి శ్రీ విజయప్రదమ్‌
అపుత్రో లభతే పుత్రం ధైర్యం శౌర్యం శతాయుషమ్‌ ॥ 18 ॥

నిర్ధనో ధనమాప్నోతి కవచస్యాస్య పాఠతః
జపిత్వా మంత్రరాజం తు థ్యాత్వా శ్రీ బగళాముఖీమ్‌ ॥ 19 ॥

పఠేదిదం హి కవచం నిశాయాం నియమాత్తు యః
యద్యత్కామయతే కామం సాధ్యాసాధ్యే మహీతలే ॥ 20 ॥

తత్తత్కామమవాప్నోతి సప్తరాత్రేణ శంకరీ
గురుంధ్యాత్వా సురాంపీత్వా రాత్రౌశక్తి సమన్వితః ॥ 21 ॥

కవచం యః పఠేద్దేవి తస్యాసాధ్యం న కించన
యంధ్యాత్వాప్రజపేన్మంత్రం సహస్రం కవచం పఠేత్‌ ॥ 22 ॥

త్రిరాత్రేణ వశంయాతి మృత్యుస్తస్యన సంశయః
లిఖిత్వా ప్రతిమాంశత్రో స్సతాలేనహరిద్రయా ॥ 23 ॥

లిఖీత్వా హృదితన్నామ తాం ధాత్వా ప్రజపేన్మనుం
ఏకవింశ ద్దినం యావత్ప్రత్యహం చ సహస్రకమ్‌ ॥ 24 ॥

జప్త్వా పఠేత్తు కవచం చతుర్వింశతివారకమ్‌
సంస్తం భో జాయతే శత్రోర్నాత్ర కార్యా విచారణా ॥ 25 ॥

వివాదే విజయం తస్య సంగ్రామే జయమాప్నుయాత్‌
శ్మశానేచ భయంనాస్తి కవచస్య ప్రభావతః ॥ 26 ॥

నవనీతం చాభిమంత్య్ర స్త్రీణాం దద్యాన్మహేశ్వరీ
వంధ్యాయాం జాయతేపుత్రో విద్యాబలసమన్వితః ॥ 27 ॥

శ్మశానాంగార మాదాయ భౌమేరాత్రౌ శనావథ
పాదోదకేన స్పృష్ట్వా చ లిఖేల్లోహశలాకయా ॥ 28 ॥

భూమౌశత్రో స్ప్వరూపంచ హృదినామ సమాలిఖేత్‌
హస్తం తద్దృదయే దత్వా కవచం తిథివారకమ్‌ ॥ 29 ॥

ధ్యాత్వా జపేన్మంత్రరాజం నవరాత్రం ప్రయత్నతతః
మ్రియతే జ్వరదా హేనదశమేహ్ని నసంశయః ॥ 30 ॥

భూర్జపత్రేష్విదంస్తోత్ర మష్టగంధేన సంలిఖేత్‌
ధారయే ద్దక్షిణేబాహౌ నారీవామభుజే తథా ॥ 31 ॥

సంగ్రామే జయమాప్నోతి నారీ పుత్రవతీ భవేత్‌
బ్రహ్మాస్త్రాదీని శస్త్రాణి నైవ కృంతంతి తఞ్జనమ్‌ ॥ 32 ॥

సంపూజ్య కవచం నిత్యం పూజాయాస్తు ఫలం లభేత్‌
బృహస్పతి సమోవాపి విభవే ధనదోపమః ॥ 33 ॥

కామతుల్యశ్చనారీణాం శత్రూణాంచ యమోపమః
కవితాలహరీ తస్య భవేద్గంగా ప్రవాహవత్‌ ॥ 34 ॥

గద్యపద్యమయీ వాణీ భవేద్దేవీ ప్రసాదతః
ఏకాదశశతం యావత్‌ పురశ్చరణ ముచ్యతే ॥ 35 ॥

పురశ్చర్యావిహీనం తు నచేదం ఫలదాయకమ్‌
నదేయం పరశిప్యేభ్యో దుష్టేభ్యశ్చ విశేషతః ॥ 36 ॥

దేయం శిష్యాయ భక్తాయ పంచత్వంచ తదాప్నుయాత్‌
ఇదం కవచమజ్ఞాత్వా భజేద్యో బగళాముఖీమ్‌ ॥ 37 ॥

శతకోటి జపిత్వా తు తస్యసిద్ధిర్నజాయతే
థారాఢ్యో మనుజోష్ట లక్షజపతః ప్రాప్నోతి సిద్ధింపరాం ॥ 38 ॥

విద్యాం శ్రీ విజయంతథా సునియతం థారం చ వీరం వరం
బ్రహ్మాస్త్రాఖ్యమనుం విలిఖ్య నితరాం భూర్జేష్టగంధేనవై
ధృత్వా రాజపురం వ్రజంతి ఖలుయే దాసస్తుతేషాంనృపః ॥ 39 ॥

ఇతి శ్రీ విశ్వసారోద్ధారతంత్రే శ్రీ పార్వతీశ్వరసంవాదే శ్రీ బగళాముఖీ కవచం 

Wednesday, December 3, 2025

దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల)

దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల)

దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల) అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రమిది.

ఎత్తిపోతల దత్తక్షేత్ర ప్రత్యేకత
యతి – తపః – తలం(ఎత్తిపోతల) త్రివేణి సంగమ దత్తక్షేత్ర ప్రదేశం. ఇక్కడ (ఎత్తిపోతల) కృష్ణానది ఉప-ఉప నదులైన మూడు ఉప-ఉప (వంకలు) నదులు చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక నదులు ఒకదానికొకటి సంగమిస్తాయి. ఈ మూడు నదులు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి ఆ మొత్తం ‘మధువంక’ గామారి అది కృష్ణానదిలో కలవడం జరుగుతుంది.

అందువల్లనే ఎత్తిపోతల జలపాతం వద్ద సంగమేశ్వర దేవాలయాన్ని (ప్రస్తుతం జీర్ణ స్థితిలో కలదు) మనం చూడవచ్చు, ఈ మూడు వంకలు కలిసి పైనుండి క్రిందకు పడేచోట గల ప్రదేశం చూచుటకు గోవు యొక్క కర్ణం (ఆవుచెవి) మాదిరిగా ఉండడమూ, మూడు వంకలు కలిసి (చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక) ‘మధువంక’గా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రముల ఎదురుగా జరుగుతుండడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి మధు గోకర్ణ గా ఒకప్పుడు పిలిచేవారు. ఇక్కడగల పరిసర ప్రదేశాల్లో మధుమతీ సమేత దత్తాత్రేయుని ఆవాసంవల్ల ఇక్కడ యతులు తపస్సు చేసుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫలితంగా త్రివేణి మధు గోకర్ణ కాస్తా యతి – తపః – తలం గా తదుపరి ఎత్తిపోతల గా మారింది.

ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు. కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునః ప్రతిష్టించాడు హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు. హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు ఈ క్షేత్రానికి దగ్గర లోగల మహీష్పతి నగరాన్ని (నేటి మాచర్ల) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల ఇక్కడే కార్త్యవీర్యార్జునుడు ముఖ్య పర్వదినములలో తప్పని సరిగా అనఘాస్టమీ వ్రతాలను ఆచరించేవాడు.

దత్త శిల
దత్త శిల ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుండి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఈ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు. ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కుర్చుని కనిపిస్తాడట. నడి రాత్రిలో ఈ దత్త శిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుడిని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోనే నిద్రిస్తే వారికి తప్పని సరిగా దత్తదర్శనం కలుగుతుంది.


మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Sri Baglamukhi Kavacham - శ్రీ బగళాముఖీ కవచం

శ్రీ బగళాముఖీ కవచం - 1

అస్యశ్రీ పీతాంబరీ శ్రీ బగళాముఖీ కవచస్య మహాదేవ బుషిః
అనుష్టుప్ఛందః శ్రీ బగళాముఖీ దేవతా హ్రీం బీజం స్వాహాశక్తిః ఓం
కీలకం మమ బగళాముఖీ ప్రసాద సిద్ధ్యర్థే జపేవినియోగః

సర్వసిద్ధిప్రదా ప్రాచ్యాం పాతు మాం బగళాముఖీ
పీ
తాంబరీ మమాగ్నేయ్యాం యామ్యాం మహిషమర్దనీ ॥ 01 ॥

నైరృత్యాం చండికా పాతు రిపువిగ్రహకారిణీ
పాతు బ్రాహ్మీ గదాహస్తా ప్రతీచ్యాం సుకరాననా
 ॥ 02 ॥

వాయవ్యాం పాతు మాం కాళి కౌబేర్యాం త్రిపురావతు
ఈశాన్యాం భైరవీపాతు పాతు నిత్యం సురప్రియా
 ॥ 03 ॥

ఊర్ధ్వం వాగీశ్వరీ పాతు మధ్యేమాం లలితావతు
అధస్తాదపి మాం పాయా ద్వారాహీ చక్రధారిణీ
 ॥ 04 ॥

మస్తకం పాతు మే నిత్యం శ్రీదేవి బగళాముఖీ
ఫాలం పీతాంబరా పాతు నేత్రే త్రిపురభైరవి
 ॥ 05 ॥

శ్రవణే విజయా పాతు నాసికాయుగళం జయా
శారదా వదనం పాతు జిహ్వాం పాతు సురేశ్వరీ
 ॥ 06 ॥

కంఠం రక్షతు రుద్రాణీస్కంధౌమే వింధ్యవాసినీ
సున్దరీ పాతు మే బాహూ పాతు దుర్గా కరౌసదా
 ॥ 07 ॥

భవానీ హృదయం పాతు మధ్యం మే భువనేశ్వరీ
నాభింపాతు మహామాయా కటిం కమలలోచనా
 ॥ 08 ॥

ఊరూ మే పాతు చరణౌభైరవీ శంకరీ తథా
సర్వతః పాతు మాం తారా యోగినీ పాతు చాగ్రతః
 ॥ 09 ॥

పృష్ఠతః పాతు కౌమారి దక్షపార్శ్వం సదాంబికా
రుద్రాణీ వామపా
ర్శ్వం తు పాతు మాం సర్వదా శివా ॥ 10 ॥

స్తుతా సర్వేషు దేవేషు రక్తబీజవినాశినీ
ఇత్యేతత్కవచం దేవ్యా ధర్మకామార్థసాధనమ్‌
 ॥ 11 ॥

గోపనీయం ప్రయత్నేన నకస్తై చిత్ప్రకాశయేత్‌
యస్సకృ
చ్చృణుయా ద్దేవీ కవచం యన్మయోదితమ్‌ ॥ 12 ॥

స సర్వాన్‌ లభతే కామాన్‌ నాత్ర కార్యా విచారణా
అపుత్రో లభతే పుత్రాన్‌ మూర్ఖో బుద్ధి మావాప్నుయాత్‌
 ॥ 13 ॥

సకృద్యస్తు పఠేద్దేవి కవచం భైరవోదితం
తస్యా
శుభద్రదా యాంతి యమస్య భవచోదితాః ॥ 14 ॥

॥ ఇతి శ్రీ జయద్రధ యామళతంత్రే శ్రీబగళాముఖీ కవచం 

Sri Bagalamukhi Peethambaree Dhyanam - శ్రీ బగళాముఖీ(పీతామ్బరీ) ధ్యానం

శ్రీ బగళాముఖీ(పీతామ్బరీ) ధ్యానం

మధ్యే సుధాబ్ధిమణిమణ్డపరత్నవేదీ 
సింహాసనోపరి గతాం పరివీతవర్ణామ్‌
 ।
పీతామ్బరాభరణమాల్యవిభూషిత్గాం
దేవీం నమామి ధృతముద్గరవైరిజిహ్వామ్‌
॥ 01॥

జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్పరిపీడయన్తీమ్‌ ।
గదాభిఘాతేన చ దక్షిణేన పీతా
మ్బరాఢ్యాం ద్విభుజాం నమామి ॥ 02 ॥

సౌవర్ణాసనసంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం
హేమాభ్గారుచిం శశ్కాముకుటాం సచ్చమ్పకస్రగ్యుతామ్‌ ।
హస్తైర్ముద్గరపాశవజ్రరశనాః సమ్బిభ్రతీం భూషణైః
వ్యాప్తాగాం బగళాముఖీం త్రిజగతాం సంస్తమ్బినీం చిన్తయే
 ॥ 03 ॥

॥ ఇతి బగళాముఖీ అథవా పీతామ్బరీ ధ్యానమ్‌ 

Sri Bagalamukhi Dhyanam - శ్రీ బగళాముఖీ ధ్యానం

శ్రీ బగళాముఖీ ధ్యానం

సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీమ్ 
హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపక స్రగ్యుతామ్‌
హస్తైః ముద్గర పాశవజ్ర రసనాః సంబిభ్రతీం భూషణైః
వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే॥ 01॥

హీయూషోదధి మధ్య చారువిలసద్రత్నోజ్జ్వలే మండపే
తత్సింహాసన మూలపాతిత రిపుం ప్రేతాసనాధ్యాసినీమ్‌
స్వర్ణాభాం కరపీడితారి రసనాం భ్రామ్యద్గదాం విభ్రమామ్‌
యస్త్వాం ధ్యాయతి యాంతి తస్య విలయం సద్యోహి సర్వాపదః ॥ 02 ॥

దేవీ త్వచ్చరణాంబుజార్చన కృతే యః పీతపుష్పాంజలిమ్‌
ముద్రాం వామకరే నిధాయ చ పునర్మంత్రీ మనోజ్ఞాక్షరీం
పీతధ్యాన పరో
థకుంభకవశాద్‌ బీజం స్మరేత్‌ పార్థివమ్‌
తస్యామిత్ర ముఖస్య వాచిహృదయే జాడ్యం భవేత్‌ తక్షణాత్‌ ॥ 03
 ॥

మాతర్భంజయ మద్విపక్షవరనం, జిహ్వాం చ సంకీలయ
బ్రాహ్మీ యంత్రయ ముద్రయా సుధిషణా ముగ్రాంగతిం స్తంభయ
శత్రూంశ్చూర్ణయ చూర్ణయాశుగదయా గౌరాంగి పీతాంబరే
విఘ్నౌఘం బగళే హరప్రణమతాం కారుణ్య పూర్ణేక్షణే 
 ॥ 04 ॥

మాతర్భైరవి భద్రకాళి విజయే వారాహి విశ్వాశయే
శ్రీవిద్యే సమయే మహేశి బగళే కామేశ వామే రమే
మాతంగి త్రిపురే పరాత్పరతరే స్వర్గాపవర్గ ప్రదే
దాసో
హం శరణాగతోస్మి కృపయా విశ్వేశ్వరి త్రాహిమాం ॥ 05 ॥

పీతాంబరాం చ ద్విభుజాం త్రినేత్రాం గాత్రకోజ్జ్వలాం
శిలా ముద్గర హస్తాం చ స్మరే త్తాం బగళాముఖీం ॥ 06
 ॥

Sri Bagalamukhi Valga Sthotram - శ్రీ బగళా(వల్గా)ముఖీ స్తోత్రం

శ్రీ బగళా(వల్గా)ముఖీ స్తోత్రం
(రుద్రయామళ తంత్రే)

శ్రీగణేశాయ నమః ।
చలత్కనకకుణ్డలోల్లసితచారుగ
ణ్డస్థలీం
లస
త్కనకచమ్పకద్యుతిమదిన్దుబిమ్భాననామ్‌ ।
గదాహతవిపక్షకాం కలితలోలజిహ్వాంచలాం
స్మరామి బగలాముఖీం విముఖవ్మానస్త్పమ్భినీమ్‌
 ॥ 01 ॥

పీయూషోదధిమధ్యచారువిలద్రక్తోత్పలే మ
ణ్డపే
సత్సింహాసనమౌలిపాతితరిపుం ప్రేతాసనాధ్యాసినీమ్‌
 ।
స్వర్ణాభాం కరపీడితారిరసనాం భ్రామ్యద్గదాం విభ్రతీమిత్థం
ధ్యాయతి యాన్తి తస్య సహసా సద్యోథ సర్వాపదః
 ॥ 02 ॥

దేవి త్వచ్చరణామ్బుజార్చనకృతే యః పీతపుష్జ్పలీన్భక్త్యా
వామకరే నిధాయ చ మనుం మన్త్రీ మనోజ్ఞాక్షరమ్‌
 ।
పీఠధ్యానపరో
థ కుమ్భకవశాద్బీజం స్మరేత్పార్థివం
తస్యామిత్రముఖస్య వాచి హృదయే జాడ్యం భవేత్తత్ష్కణాత్‌
 ॥ 03 ॥

వాదీ మూకతి ర్కతి క్షితిపతిర్వైశ్వానరః శీతతి క్రోధీ
శామ్యతి దుర్జనః సుజనతి క్షిప్రానుగః ఖ్జతి
 ।
గర్వీ ఖర్వతి సర్వవిచ్చ జడతి త్వన్మన్త్రిణా య
న్త్రితః
శ్రీర్నిత్యే బగలాముఖి ప్రతిదినం కల్యాణి తుభ్యం నమః
 ॥ 04 ॥

న్త్రస్తావదలం విపక్షదలనే స్తోత్రం పవిత్రం చ తే
యన్త్రం వాదినియ
న్త్రణం త్రిజగతాం జైత్రం చ చిత్రం చ తే ।
మాతః శ్రీబగలేతి నామ లలితం యస్యాస్తి జన్తోర్ముఖే
త్వన్నామగ్రహణేన సంసది ముఖే స్తమ్భో భవేద్వాదినామ్‌
 ॥ 05 ॥

దుష్టస్తమ్భనముగ్రవిఘ్నశమనం దారిద్య్రవిద్రావణం
భూభృత్సన్దమనం చలన్మృగదృశాం చేతఃసమాకర్షణమ్‌
 ।
సౌభాగ్యైకనికేతనం సమదృశః కారుణ్యపూర్ణేక్షణమ్‌
మృత్యోర్మారణమావిరస్తు పురతో మాతస్త్వదీయం వపుః
 ॥ 06 ॥

మాతర్జ్భ య మద్విపక్షవదనం జిహ్వాం చ స్కలయ
బ్రాహ్మీం ముద్రయ దైత్యదేవధిషణాముగ్రాం గతిం స్తంభయ ।
శత్రూంశ్చూర్ణయ దేవి తీక్ష్ణగదయా గౌర్గా పీతామ్బరే
విఘ్నౌఘం బగలే హర ప్రణమతాం కారుణ్యపూర్ణేక్షణే
 ॥ 07 ॥

మాతర్భైరవి భద్రకాలి విజయే వారాహి విశ్వాశ్రయే
శ్రీవిద్యే సమయే మహేశి బగలే కామేశి వామే రమే ।
మాత్గ త్రిపురే పరాత్పరతరే స్వర్గాపవర్గప్రదే
దాసో
హం శరణాగతః కరుణయా విశ్వేశ్వరి త్రాహి మామ్‌ ॥ 08 ॥

సంరమ్భే చౌరస్ఘ ప్రహరణసమయే బన్ధనే వ్యాధిమధ్యే
విద్యావాదే వివాదే ప్రకుపితనృపతౌ దివ్యకాలే నిశాయామ్‌ ।
వశ్యే వా స్తమ్భనే వా రిపువధసమయే నిర్జనే వా వనే వా
గచ్చంస్తిష్ఠంస్త్రికాలం యది పఠతి శివం ప్రాప్నుయాదాశు ధీరః
 ॥ 09 ॥

త్వం విద్యా పరమా త్రిలోకజననీ విఘ్నౌఘసంఛేదినీ
యోషిత్కర్షణకారిణీ జనమనఃసమ్మోహసన్దాయినీ ।
స్తమ్భోత్సారణకారిణీ పశుమనఃసమ్మోహసన్దాయినీ
జిహ్వాకీలనభైరవీ విజయతే బ్రహ్మాదిమన్త్రో యథా
 ॥ 10  ॥

విద్యా లక్ష్మీర్నిత్యసౌభాగ్యమాయుః పుత్రైః పౌ
త్రైః సర్వసామ్రాజ్యసిద్ధిః ।
మానో భోగో వశ్యమారోగ్యసౌఖ్యం ప్రాప్తం తత్తద్భూతలే
స్మిన్నరేణ ॥ 11  ॥

త్వత్కృతే జపసన్నాహం గదితం పరమేశ్వరి
 ।
దుష్టానాం నిగ్రహార్ధాయ తద్గృహాణ నమో
స్తు తే॥ 12 ॥

పీతామ్బరాం చ ద్విభుజాం త్రినేత్రాం గాత్రకోమలామ్‌ ।
శిలాముద్గరహస్తాం చ స్మరే తాం బగలాముఖీమ్‌
 ॥ 13 ॥

బ్రహ్మాస్త్రమితి విఖ్యాతం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ ।
గురుభక్తాయ దాతవ్యం న దేయం యస్య కస్యచిత్‌
 ॥ 14 ॥

నిత్యం స్తోత్రమిదం పవిత్రమిహ యో దేవ్యాః పఠత్యాదరాద్ధృత్వా
యన్రమిదం తథైవ సమరే బాహౌ కరే వా గలే।

రాజానో
ప్యరయో మదాన్థకరిణః సర్పా మృగేన్ద్రాదికాస్తే
వై యాన్తి విమోహితా రిపుగణా లక్ష్మీః స్థిరా సిద్ధయః
 ॥ 15 ॥

॥ ఇతి శ్రీరుద్రయామలే తన్త్రే శ్రీబగలాముఖీస్తోత్రం సమాప్తం 

Tuesday, December 2, 2025

Sri Bagalamukhi Sthotram 2 - శ్రీ బగళాముఖీ స్తోత్రమ్‌ 2

శ్రీ బగళాముఖీ స్తోత్రం 2

అస్య శ్రీ బగళాముఖీమహామంత్రస్య
నారదో భగవాన్ ఋషిః
అతిజగతీఛందః
శ్రీ బగళాముఖీ దేవతా
లాం బీజం ఇం శక్తిః
లం కీలకం
మమ దూరస్థానాం సమీపస్థానాం గతి మతి వాక్త్పంభనార్థే
జపే వినియోగః

ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః
బగళాముఖీ తర్జనీభ్యాం నమః
సర్వదుష్టానాం మధ్యమాభ్యాం నమః
వాచం ముఖం పదం స్తంభయ అనామికాభ్యాం నమః
జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ కనిష్టికాభ్యాం నమః
హ్రీం ఓం స్వాహా కరతలకరపృష్టాభ్యాం నమః

ఓం హ్రీం హృదయాయ నమః
బగళాముఖీ శిరసే స్వాహా
సర్వదుష్టానాం శిఖాయై వషత్‌
వాచం ముఖం పదం స్తంభయ కవచా హుం
జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ నేత్రత్రయాయ వౌషట్‌
హ్రీం ఓం స్వాహా అస్త్రాయ ఫట్‌
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

ధ్యానమ్‌ ।
పీతాంబరాం త్రిణేత్రాం చ ద్విభుజాం దహనోజ్వలాం
 ।
శిలాపర్వతహస్తాం చ రిపుకంపాం మహోత్కటామ్‌ ॥ 01
 ॥

గంభీరాం చ మదోన్మత్తాం స్వర్ణకాంతిసమప్రభాం ।
వైరినిర్దళనార్థాయ స్మరేత్తాం బగళాముఖీమ్‌ ॥ 02
 ॥

చతుర్భుజాం త్రిణయనాం కమలాసనసంస్థితాం
 ।
దక్షిణే ముద్గరం పాశం వామే జిహ్వాం చ వజ్రకమ్‌ ॥ 03
 ॥

పీ
తాంబరధరాం సాంద్రాం దృఢపీనయోధరాం ।
వైరివా
క్త్పంభినీం దేవీం స్మరామి బగళాముఖీమ్‌ ॥ 04 ॥

హేమకుండలభూషాంగీం శీతచంద్రార్థశేఖరీం
 ।
పీతభూషణభూషా
ఢ్యాం స్వర్ణసింహాసనేస్థితామ్‌ ॥ 05 ॥

త్రిశూలధారిణీమంబాం సర్వసౌభాగ్యదాయినీం
 ।
సర్వశృంగారవేషా
ఢ్యాం భజేత్తాం బగళాముఖీమ్‌ ॥ 06 ॥

మధ్యే సుధాబ్ధిమణిమంటప రత్న వేద్యాం
సింహాసనోపరిగతాం పరిపీతవర్ణామ్‌ ।
పీతాంబరాభరణమాల్యవిభూషితాంగీం
దేవీం నమామి ధృత ముద్గరవైరి జిహ్వామ్‌ ॥ 07
 ॥

చలత్కనకకుండలోల్లసితచారుగండస్థలాం
లసత్కనకచంపక ద్యుతిమదర్ధేందు బింబాంచితామ్‌ ।
సదాహితవిపక్షకాం దళితవైరి జిహ్వాంచలాం
నమామి బగళాముఖీం ధీమతాం వ్మానస్త్పంభినీమ్‌
 ॥ 08 ॥

పీయూషో దధిమధ్యచారు విలసద్రత్నోజ్వలే మంటపే
యాసింహాసన మౌళిపాతితరిపు ప్రేతాసనాధ్యాసినీమ్‌ ।
స్వర్ణాభాం కరపీడితారిరశనాం భ్రామ్యద్గదాం బిభ్రతీం
యస్త్వాం పశ్యతి తస్య యాంతి విలయం సద్యోహి సర్వాపదః ॥ 09 ॥

దేవి త్వచ్చరణాంబుజార్చనకృతే యః పీతపుష్పాంజలిం
ముద్రాం వామకరే నిధాయ చ పునర్మంత్రీ మనోజ్ఞాక్షరీం
 ।
పీఠధ్యానపరోపి కుంభకవశాద్బీజం స్మరేత్ప్రార్థితం
తస్యా మిత్రచయస్య సంసది ముఖ స్తంభో భవేత్తత్ష్కణాత్‌
 ॥ 10  ॥

(ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ
జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా)

మంత్రస్తావదయం విపక్షదళనే స్తోత్రం పవిత్రం చ తే
యంత్రంవాదిని యంత్రిణం త్రిజగతాం జైత్రం స చిత్రం చ తత్‌ ।
శ్రీమాతర్బగళేతి నామ లలితం యస్యాస్తి జంతోర్ముఖే
తన్నామస్మరణేన వాగ్భవముఖ స్తంభోభవేత్త
త్ష్కణాత్‌ ॥ 11  ॥

దుష్టస్తంభనముగ్రవిఘ్నశమనం దారిద్య్రవిద్రావణం
భూభృత్త్పంభనకారణం మృగదృశాం చేతస్సమాకర్షణం
 ।
సౌభాగ్యైకనికేతనం మమ దృశాం కారుణ్యపూర్ణేక్షణే
మృత్యోర్మారణమావిరస్తు పురతో మాతస్త్వదీయం వపుః॥ 12 ॥

సంఖ్యాగ్రే చోరదండ ప్రహరణసమయే బంధనే వైరిమధ్యే
విద్యావాదే వివాదే ప్రకటితనృపతౌ యుద్ధకాలే నిశాయాం ।
వశ్యేచ స్తంభనే వా రిపువధసమయే ప్రాణబాధే రణే వా
గచ్చంతీష్టం త్రికాలం తవ పఠనమిదం కారయేదాశు ధీరః ॥ 13 ॥

మాతర్భంజయ మద్విపక్షవదనం జిహ్వాం చ సంకీలయ
బ్రాహ్మీం ముద్రయ ముద్రయాశుధిషణామం ఘ్య్రోర్గతిం స్తంభయ । 
శత్రూన్‌ చూర్ణయ చూర్ణయాశు గదయా గౌరాంగి పీతాంబరే
విఘ్నౌఘం బగళే హర ప్రతిదినం కౌమారి వామేక్షణే ॥ 14
 ॥

మాతర్భైరవి భద్రకాళి విజయే వారాహి విశ్వాశ్రయే
శ్రీనిత్యే బగళే మహేశి సమయే రామే సురామే రమే ।
మాతంగి త్రిపురే పరాత్పరతరే స్వర్గాపవర్గప్రదే
వందేహం శరణాగతోస్మికృపయా విశ్వేశ్వరీ త్రాహి మామ్‌ ॥ 15 ॥

త్వం విద్యా పరమా త్రిలోకజననీ వ్యోషాననం ఛేదినీ
యోషాకర్షణకారిణీ చ సుమహాబంధైకసంభేదినీ ।
దుష్టోచ్చాటనకారిణీ రిపుమనస్సందోహసందాయినీ
జిహ్వాకీలనభైరవీ విజయతే బ్రహ్మాస్త్రసారాయణీ ॥  16 ॥

యః కృతం జపసంఖ్యానాం చింతితం పరమేశ్వరీ
 ।
శత్రూణాం బుద్ధినాశాయ గృహాణ మదనుగ్రహాత్‌ ॥ 17
 ॥

వైడూర్యహారపరిశోభితహేమమాలాం
మధ్యేతిపీన కుచయోర్థృతపీతవస్త్రాం ।
వ్యాఘ్రాధిరూఢ పరిపూరిత రత్నశోభాం
నిత్యం స్మరామి బగళాం రిపువక్త్ర కీలామ్‌ ॥ 18 ॥

ఏకాగ్ర మానసో భూత్వా స్తోప్యత్యంబాం సుశోభనాం ।
రజన్యా రచితాం మాలాం కరే ధృత్వా జపేచ్చుచిః
 ॥ 19 ॥

వామే పాణౌ తు పాశం చ తస్యాధస్తాద్ధృఢం శుభం ।
దక్షే కరే
క్షసూత్రం చ అధఃపద్మం చ ధారిణీం ॥ 20 ॥

చాముండే చండికోష్ట్రే హుతవహదయితే శ్యామలే శ్రీభుజంగీ
దుర్గే ప్రత్యంగిరాద్యే మురరిపుభగినీ భార్గవీవామనేత్రే
 ।
నానారూపప్రభేదే స్థితిలయజననం పాలయద్భర్గహృద్యే
విశ్వాద్యే విశ్వజైత్రీ త్రిపురః బగళే విశ్వవంద్యే త్వమేకా ॥ 21
 ॥

చక్రం ఖడ్గం ముసలమభయం దక్షిణాభిశ్చ దోర్భిః
శంఖం ఖేటం హలమపి చ గదాం బిభ్రతీం వామదో
ర్భిః ।

సింహారూఢామయుగనయనాం శ్యామలాం కంజవక్త్రాం
వందే దేవీం సకలవరదాం పంచమీం మాతృమధ్యామ్‌
 ॥ 22 ॥

ద్వాత్రింశదాయుతయుతైశ్చతురష్టహసై 
రష్టోత్తరైశ్శతకరైశ్చ సహస్రహసైః ।
సర్వాయుధైెరయుత బాహుభిరన్వితాం తాం
దేవీం భజామి బగళాం రసనాగ్రహస్తామ్‌ ॥ 23 ॥

సర్వతశ్శుభకరాం ద్విభుజాం తాం
కంబుహేమ నవకుండల కర్ణాం ।
శత్రునిర్దళనకారణకోపాం
చింతయామి బగళాం హృదయాబ్జే
॥ 24 ॥

జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్‌ పరిపీడయంతీం ।
గదాభిఘాతేన చ దక్షిణేన పీతాంబరా
ఢ్యాం ద్విభుజాం నమామి ॥ 25 ॥

వందే వారిజలోచనాం వసుకరాం పీతాంబరాడంబరాం
పీతాంభోరుహసంస్థితాం త్రినయనాం పీతాంగరాగోజ్ఞ్వలాం
 ।
శబ్దబ్రహ్మమయీం మహాకవిజయీం త్రైలోక్యసమ్మోహనీం
విద్యుత్కోటి నిభాం ప్రసన్న బగళాం ప్రత్యర్థివాక్త్పంభినీం
 ॥ 26 ॥

దుఃఖేన వా యది సుఖేన చ వా త్వదీయం
స్తుత్వా
థ నామబగళే సముపైతి వశ్యం ।
నిశ్చిత్య శత్రుమబలం విజయం త్వదంఘ్రి
పద్మార్చకస్య భవతీతి కిమత్ర చిత్రమ్‌ ॥ 27
 ॥

విమోహితజగత్త్రయాం వశగతావనవల్లభాం
భజామి బగళాముఖీం భవసుఖైకసంధాయినీం ।
గేహం నాతతి గర్వితః ప్రణమతి స్త్రీసంగమో మోక్షతి
ద్వేషీ మిత్రతి పాపకృత్సుకృతతి క్ష్మావల్లభోధావతి
 ॥ 28 ॥

మృత్యుర్వైధృతిదూషణం సుగుణతి త్వత్పాదసంసేవనాత్‌
త్వాం వందే భవభీతిభంజనకరీం గౌరీం గిరీశప్రియాం ।
నిత్యం యస్తు మనోహరం స్తవమిదం దివ్యం పఠేత్సాదరం
ధృత్వా యన్త్రమిదం తథైవ సమరే బాహ్వోః కరే వా గళే ॥ 29 ॥

రాజానో వరయోషితోథకరిణస్సర్వామృగేంద్రా వశాః
స్తోత్రైర్యాంతి విమోహితా రిపుగణా లక్ష్మీః స్థిరా సిద్ధయః ।
నిర్నిద్రే బగళే సముద్రనిలయే రౌద్య్రాది వ్మాద్రికే
భద్రే రుద్రమనోహరే త్రిభువనత్రాణే దరిద్రాపహే ॥ 30
 ॥

సద్రత్నాకర భూమిగోజ్వల కరీ నిస్తంద్రి చాంద్రాననే
నీహారాద్రిసుతే నిసర్గసరళే విద్యే సురాద్యే నమః ।
దేవీ తస్య నిరామయాత్మజముఖాన్యాయూంషి దద్యాదిదం
యే నిత్యం ప్రజపన్తి భక్తి భరితాస్తేభ్యస్త్సవం నిశ్చితమ్‌ ॥31
 ॥

నూనం శ్రేయో వశ్యమారోగ్యతాం చ ప్రాప్తస్సర్వం భూతలే సాధకస్తు ।
భక్త్యా నిత్యం స్తోత్రమేతత్పఠన్వై విద్యాం కీర్తిం వంశవృద్ధిం చ విన్దేత్‌
 ॥ 32 ॥

॥ ఇతి శ్రీరుద్రయామళే శ్రీబగళాముఖీస్తోత్రమ్‌ 

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...