Sunday, December 29, 2024

ANTARYAMI ALASITI అంతర్యామి అలసితి సొలసితి

 రాగం: శివ రంజని


పల్లవి 
అంతర్యామి అలసితి సొలసితి |
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||

చరణములు 
కోరిన కోర్కులు కోయని కట్లు |
తీరవు నీవవి తెంచక |
భారపు బగ్గాలు పాప పుణ్యములు |
నేరుపుల బోనీవు నీవు వద్దనక ||

జనుల సంగముల జక్క రోగములు |
విను విడువవు నీవు విడిపించక |
వినయపు దైన్యము విడువని కర్మము |
చనదది నీవిటు శాంతపరచక ||

మదిలో చింతలు మైలలు మణుగులు |
వదలవు నీవవి వద్దనక |
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె |
అదన గాచితివి అట్టిట్టనక ||

ATI DUSHTUDA NE NALUSUDANU అతిదుష్టుడ నే నలసుడను

 పల్లవి 

అతిదుష్టుడ నే నలసుడను |
యితరవివేకం బికనేల ||

చరణములు 
ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ
నిక్కపుదప్పులు నేరములు |
గక్కన నిన్నిట కలిగిననీవే
దిక్కుగాక మరి దిక్కేది ||

ఘోరపుబాపము కోట్లసంఖ్యలు
చేరువ నివె నాచేసినివి |
నీరసునకు నిటు నీకృప నాకిక
కూరిమి నా యెడ గుణమేది ||

యెఱిగి చేసినది యెఱుగక చేసిన-
కొఱతలు నాయెడ గోటులివే |
వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు
మఱవక నాగతి మఱి యేది ||

BHAAVAMU LONA భావములోనా బాహ్యమునందును

 రాగం: దేసాక్షి


పల్లవి 
భావములోనా బాహ్యమునందును |
గోవింద గోవిందయని కొలువవో మనసా ||

చరణములు 
హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు |
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా ||

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు |
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ||

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు |
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా ||

CHAALADAA BRAHMAMID చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు

 పల్లవి 

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడగించు సంకీర్తనం ||

చరణములు 
సంతోష కరమైన సంకీర్తనం
సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతము దలచుడీ సంకీర్తనం ||

సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం ||

జముబారి విడిపించు సంకీర్తనం
సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదుల జేయు సంకీర్తనం ||

జలజాసనుని నోరి సంకీర్తనం
చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలచుడీ సంకీర్తనం ||

సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం
సరుగనను దలచుడీ సంకీర్తనం ||

CHAALADAA HARI NAAMA చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు

రాగము : హంసధ్వని

పల్లవి 
చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు
చాలదా హితవైన చవులెల్లను నొసగ ||

చరణములు 
ఇది యొకటి హరి నామ మింతైన జాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ |
మదినొకటె హరినామ మంత్రమది చాలదా
పదివేల నరక కూపముల వెడలించ ||

కలదొకటి హరినామ కనకాద్రి చాలదా
తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ |
తెలివొకటి హరినామదీప మది చాలదా
కలుషంపు కఠిన చీకటి పారద్రోల ||

తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా
జగములో కల్పభూజంబు వలె నుండ |
సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా
నగవు జూపులను నున్నతమెపుడు జూప ||

CHADUVULONE HARINA చదువులోనే హరిని జట్టిగొనవలెగాక

 పల్లవి 

చదువులోనే హరిని జట్టిగొనవలెగాక
మదముగప్పినమీద మగుడ నది గలదా ||

చరణములు 
జడమతికి సహజమే సంసారయాతన యిది
కడు నిందులో బరము గడియించవలెగాక |
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను
విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ||

భవబంధునకు విధిపాపపుణ్యపులంకె
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక |
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే
నివిరి నిన్నటివునికి నేటికి గలదా ||

దేహధారికి గలదే తెగనియింద్రియబాధ
సాహసంబున భక్తి సాధించవలెగాక |
యిహలను శ్రీవేంకటేశుదాసులవలన
వూహించి గతిగానక వొదిగితే గలదా ||

CHAKKANI TALLIKI చక్కని తల్లికి చాంగుభళా తన

 రాగం: పాడి


పల్లవి 
చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా ||

చరణములు 
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా |
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా ||

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా |
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా ||

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా |
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా ||

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....