Sunday, December 29, 2024

ENTA MATRAMUNA ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన

 పల్లవి 

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ||

చరణములు 
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు |
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు |

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు |
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ||

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు |
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు ||

BRAHMA KADIGINA PADAMU బ్రహ్మ కడిగిన పాదము

 పల్లవి 

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ||

చరణములు 
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||

కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ||

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము |
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ||

BHAVAYAMI GOPALABALAM భావయామి గోపాలబాలం

 తాళం: ఆది

రాగం: యమునా కళ్యాణి
కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు

పల్లవి 
భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేహం సదా ||

చరణములు 
కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-
పటల నినదేన విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ||

నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం |
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం ||

ALARA CHANCHALAMAINA అలర చంచలమైన ఆత్మలందుండ

తాళం : ___
రాగం : నీలాంబరి  (మేళకర్త __, _____ జన్యరాగ )
రూపకర్త : అన్నమాచార్య

ఆరోహణ : స రి2 గ3 మ1 ప ద2 
ప ని3 స 

అవరోహణ: స ని3  మ1 గ3 రి2 గ3 


పల్లవి 

అలర చంచలమైన ఆత్మలందుండ
నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ
నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

చరణములు 
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన
వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన
అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు
చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల
వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల
మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి
నిజమైన తొడవాయె వుయ్యాల ||

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ
భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో
యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||

కమలకును భూపతికి కదలు కదలకు
మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస
మందంద చూపె నీ వుయ్యాల ||

కమలాసనాదులకు కన్నుల పండుగై
గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి
నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||

ALARULU KURIYAGA అలరులు గురియగ నాడెనదే

తాళం : ఆది
రాగం: శంకరాభరణం (మేళకర్త 29, ____ జన్యరాగ )
రూపకర్త : అన్నమాచార్య

ఆరోహణ : స రి2 గ3 మ1 ప ద2 ని3 
అవరోహణ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స


పల్లవి 
అలరులు గురియగ నాడెనదే |
అలకల గులుకుల నలమేలుమంగ ||

చరణములు 
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే |
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ ||

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే |
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ ||

చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే |
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ ||

AMMAMMA EMAMMA అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ

తాళం : ఆది
రాగం : భైరవి (మేళకర్త 20, నట భైరవి జన్యరాగ )
రూపకర్త : అన్నమాచార్య

ఆరోహణ : స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అవరోహణ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స

పల్లవి 

అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||

చరణములు 
నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||

నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||

చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||

ANDARIKI AADHAARAMAINA అందరికాధారమైన ఆది పురుషుడీతడు

 పల్లవి 

అందరికాధారమైన ఆది పురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతుడు ||

చరణములు 
సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవంబై నతడీతడు |
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ||

సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు
ధరనావుల మందలలో తగ జరించె నీతడు |
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ||

పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు
సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు |
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ||

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...