రాజా! నీ విప్పుడడిగిన ప్రశ్న చాలా మేలైనది. ఎంతో సమంజసమైన, పరిపక్వమైన ప్రశ్న ఇది. ఆత్మతత్త్వం తెలిసినవాళ్ళు ఈ ప్రశ్నను అభినందిస్తారు. ఇది సకలశుభాలనూ చేకూరుస్తుంది. లోకంలో వినదగినవిషయాలు వేలకొలదిగా ఉన్నాయి. అందులో ఇది మిక్కిలి ముఖ్యమైనది. సంసారంలో మునిగి తేలే గృహస్థులకు ఆత్మతత్త్వం ఏ మాత్రం తెలియదు. వాళ్ళకు స్త్రీసంగమంతోనూ, నిద్రతోనూ రాత్రికాలం గడచిపోతుంది. పగలంతా కుటుంబవ్యవహారాలతో, ధనార్జనబుద్ధితో సరిపోతుంది. పశువులూ, భార్యలూ, బిడ్డలూ, చుట్టాలూ, శరీరమూ ఇత్యాదిగాగల పరివారమంతా శాశ్వతమని నమ్మి వాళ్ళు కాపురాలు సాగిస్తారు. చివరికొకనాడు శాశ్వతంగా కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాలానికి చెందిన ఈ దుఃస్థితి తెలిసికూడా తెలియనివారుగానే ఉండిపోతారు.
రాజా! మోక్షాపేక్షగలవానికి అన్నింటికి ఆత్మ అయినవాడు, మహావైభవం కలవాడూ, సర్వవ్వాపీ, జగదీశ్వరుడూ అయిన విష్ణువే వినడానికీ, సేవించడానికీ, వర్ణించడానికీ, భావించడానికీ అన్నివిధాలా తగినవాడు.
ఆత్మానాత్మవివేకమనే సాంఖ్యయోగంతోకానీ, ధర్మానుష్టానంతోకానీ చివరికాలంలో శ్రీహరిని చింతించాలి. అలా చేయడమే మానవజన్మ దాల్చినందుకు ఫలం.
రాజా! ఉత్తమమూ, నిర్మలమూ అయిన బుద్ధిగల మహాత్ములు శాస్త్రంలో చెప్పిన విధినిషేధాలు వర్జించి గుణరహితమైన పరబ్రహ్మాన్ని ఆశ్రయిస్తారు. మనస్సులో ఎల్లవేళలా శ్రీహరిగుణాలను చింతిస్తూ ఉంటారు.
నా తండ్రి వ్యాసభగవానుడు. ద్వాపరయుగంలో భాగవతం నాచేత చదివించాడు. నేను పరబ్రహ్మంలో లగ్నమైన చిత్తం కలిగి భగవంతుని అవతారలీలలు నన్నాకర్షించడంవల్ల దీన్ని పఠించాను. నీవు పంకజాక్షుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందుచేత నీకు భాగవతతత్త్వం వివరిస్తాను. వినవయ్యా మహారాజా! భాగవతశ్రవణంవల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విస్తరిస్తుంది. మోక్షం కోరేవాడికి ముక్తి లభిస్తుంది. జన్మ జరామరణాది సంసారభయాలన్నీ సమసి పోతాయి. యోగివర్యులకు వాసుదేవుని నామకీర్తనలు ఉత్తమమైన వ్రతాలు.
రాజా! విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారంలో అనేక సంవత్సరాలతరబడి పొర్లుతూ సతమతమవుతుండే అవివేకి ముక్తికెలా పోగలడు? వాడు సంసారంనుండి ఎన్నటికీ ముక్తుడు కాలేడు. ఇది నిక్కం. ఒక్క ముహూర్తకాలమైనా హరిని స్మరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుంది.
కౌరవనాథా! పూర్వం ఖట్వాంగుడనేరాజు సప్తద్వీపాలనూ పరిపాలిస్తుండేవాడు. ఇంద్రాదిదేవతలు యుద్ధభూమిలో భయంకరులైన దానవులచే ఓడిపోయారు. ఓడి ఆ రాజుచెంతకు వచ్చి తమకు సాయం చేయుమని అర్థించారు. ఆయన భువినుండి దివికేగి దానవేశ్వరులనందరినీ సంహరించాడు. అందుకు సంతసించిన దేవతలు ఖట్వాంగుణ్ణి ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. "నే నెంతకాలం జీవిస్తానో చెప్పండి! ఇదే నేను కోరే వరం, వేరేవరంనా కక్కరలేదు" అని అతడన్నాడు. "నీకు ఆయువింక ఒక్క ముహూర్తకాలం (రెండుగడియలు) మాత్రమే ఉన్నది" అని ఆ వేల్పులన్నారు. వెనువెంటనే ఆ భూపాలుడు విమానయానంతో భూలోకానికి వచ్చాడు.
అలా దివినుంది వచ్చిన ఖట్వాంగమహారాజు కొండలవంటి గజాలనూ, గుర్రాలనూ, ప్రాణప్రియలైన సుందరీమణులనూ, సన్నిహితులైన హితులనూ, పండిత శ్రేష్ఠులనూ ప్రగాఢమైన వైరాగ్యంతో పరిత్యజించాడు.
ఆ రీతిగా సర్వసంగ పరిత్యాగం చేసిన ఖట్వాంగమహారాజు గోవిందనామ సంకీర్తన చేస్తూ, మరణభయం వదలిపెట్టి రెండు గడియలకాలంలోనే ముక్తిపొందాడు.
రాజా! విను. నీకు ఏడుదినాల తరువాతనే కదా మరణం! అప్పటివరకూ పరలోకసాధనమైన పరమశుభాన్ని ఆర్జించడానికి ఎంతో అవకాశం ఉంది. అవసానసమయం సమీపించగానే భయపడకుండా దేహధారి అయినవాడు శరీరం, పుత్రులు, భార్య మొదలయిన వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఇల్లు వదలిపోయి పావనమైన తీర్ధజలాలలో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంతప్రదేశం చేరుకోవాలి. అక్కడ శాస్త్రం విధించినట్లు దర్భలూ, జింకచర్మం, వస్త్రం పరచుకొని కూర్చోవాలి. జగమంతా పవిత్రం చేయగలదీ, అకార-ఉకార-మకారాలనే మూడక్షరాలతో కూడినది, బ్రహ్మబీజం అయిన ఓంకారాన్ని మనస్సులో స్మరిస్తూ ఉచ్చ్వాస నిశ్వాసాలను వశపరచుకోవాలి. ఆపై విషయాలను వెన్నంటి పరుగిడే ఇంద్రియాలను బుద్ది అనే సారధితోనూ, మనస్సు అనే పగ్గంతోనూ బిగబట్టి నిగ్రహించాలి. గట్టి కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిమీద నిశ్చలంగా నిలపాలి. విషయచింతలులేని చిత్తంతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమంగా ధ్యానించాలి. రజోగుణ తమోగుణాలచేత ఆకర్షింపంబడి మోహానికి లోనయ్యే మనస్సును ఆ గుణాలవల్ల కల్గిన మాలిన్యాలనూ ధారణతో తొలగించి నిర్మలం చేయాలి. అలా చేసినవాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుకుంటాడు. ధారణానియమం సిద్ధిస్తే అతడు సుఖమయమైన విషయాన్ని దర్శిస్తాడు. అట్టి యోగి భక్తిలక్షణమైన యోగాన్ని ఆశ్రయించి మోక్షం చూరగొంటాడు. ఈ విధంగా పలికిన శుకయోగీంద్రునితో పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.
మునివర్యా! ధారణ ఎలా నిలుస్తుంది? ధారణ స్వరూపం ఎలాంటిది? ధారణ అంటే ఏమిటి? అది జీవుని చిత్తమాలిన్యాన్ని ఎలా పరిహరిస్తుంది? దయతో ఈ విషయం నాకు తెలపండి!
రాజు చెప్పిన మాటలు విని అవధూతల్లో మేటి అయిన శుకయోగి ఆ రాజునుద్దేశించి ఇలా పలికాడు.
అక్షరత్వా ద్వరేణ్యత్వా ద్ధూతసంసారబంధనాత్ ।
తత్త్వమస్యర్థ సిద్ధత్వా దవధూతోஉభిధీయతే ॥
క్షరం(వినాశం) లేని ఆత్మస్వరూపుడు, శ్రేష్ఠపురుషుడు, సంసారబంధం వదలించుకొన్నవాడు "తత్వమసి" అన్న మహావాక్యార్థాన్ని అనుభవంలోకి తెచ్చుకొన్నవాడు అవధూత అవుతాడు. పై లక్షణ శ్లోకంలో ప్రథమపాదం మొదట 'అ' అనీ, ఆ పాదం మధ్యలో 'వ' అనీ, రెండవపాదం మొదటి 'ధూ' అనీ, మూడవపాదం మొదట 'త' అని ఉన్న నాలుగక్షరాలను కలిపితే 'అవధూత' శబ్దం సిద్ధిస్తుంది. అవధూతలు ఆత్మ వినాశనం లేనిదని గ్రహించి, సంసారాన్ని వదలించుకొని 'తత్+త్వం+అసి' అను ఉపదేశరూపమైన మహావాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొంటారు. అందుచే వారు శ్రేష్ఠపురుషులు.
పండితుడైనవాడు శ్వాసవాయువుల నరికట్టి సంసారంతోడి సంగాన్ని త్యజించాలి. ఇంద్రియాలను జయించాలి. ఆపై బుద్ధిబలంతో మనస్సును విష్ణుదేవుని విశాలమైన రూపంమీదే స్థిరంగా నిలపాలి.

రాజా! విను. భగవానుడైన విష్ణుని విరాట్ విగ్రహంలో జరిగిన, జరుగనున్న జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, జలం, అగ్ని వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఏడు ఆవరణాలు మహాండకోశమైన విరాట్పురుషుని శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు ఆశ్రయమై వైరాజపురుషుడు భాసిస్తున్నాడు. ఆ మహాత్మునికి పాతాళం అరికాలు; రసాతలం కాలిమడమ, మునివ్రేళ్ళు; మహాతలం చీలమండలు; తలాతలం పిక్కలు; సుతలం మోకాళ్ళ జంట; వితలం అతలం తొడలు; భూతలం పిరుదు; ఆకసం బొడ్డు; గ్రహాలూ, తారకలూ, జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షఃస్థలం; మహర్లోకం మెడ; జనలోకం ముఖం; తపోలోకం నొసలు; సత్యలోకం శిరస్సు; ఇంద్రాదులు భుజదండాలు; దిక్కులు చెవులు; శబ్దం శ్రోత్రేంద్రియం; అశ్వినీదేవతలు ముక్కుపుటాలు; గంధం ఘ్రాణేంద్రియం; అగ్ని నోరు; అంతరిక్షం కళ్ళు, సూర్యుడు నేత్రేంద్రియం, రేపవళ్ళు కనురెప్పలు, బ్రహ్మపదం కనుబొమలు, జలాలు దవడలు, రసం జిహ్వేంద్రియం. సకలవేదాలు భాషణాలు, యముడు కోరలు, పుత్రాదులమీది స్నేహ కళలు దంతాలు, జనులకు పిచ్చి కల్గించే మాయావిలాసాలు నవ్వులు, తుదిలేని సృష్టులే కడగంటి చూపులు; సిగ్గు, లోభం పెదవులు, ధర్మమార్గాలు రొమ్ములు; అధర్మమార్గం వెన్ను, ప్రజాపతి పురుషాంగం, మిత్రావరుణులు వృషణాలు, సముద్రాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రోమాలు, గాడ్పు నిట్టూర్పులు, కడలేని కాలమే ప్రాయం. పలువిధాలైన ప్రాణులతో గూడిన సంసారాలు కర్మలు, మబ్బులు శిరోజాలు, సంధ్యలు కట్టుబట్టలు, ప్రధానం హృదయం, చంద్రుడు వికారాల కన్నింటికి స్థానమైన మనస్సు. మహత్తత్వం చిత్తం. రుద్రుడు అహంకారం, గుర్రాలు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు గోళ్ళు; పశువులు, మృగాదులు కటిప్రదేశం, పక్షులు చిత్రమైన మాటలనేర్పులు, మనువు బుద్ది, పురుషుడు నివాసం, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు షడ్జం మొదలయిన స్వరాలు; ప్రహ్లాదుడు స్మృతి, దైత్యులు, దానవులు వీర్యం. అంతేకాదు, ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం, క్షత్రియులు భుజాలు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు, వసువులు రుద్రులు, హవిర్భాగాలు ద్రవ్యాలు, యజ్ఞప్రయోగాలు కర్మలవుతున్నాయి. ఇట్టి విశ్వమయుడైన విరాట్పురుషుని విగ్రహాన్ని మోక్షం కోరేవాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి అని చెప్పి శ్రీశుకమహర్షి ఇంకా ఇలా చెప్పినాడు.
వంశపావనుడవైన ఓ పరీక్షిన్మహారాజా! ఈ విశ్వమంతా విష్ణమయమే. విష్ణుదేవుడు విశ్వమయుడు. ఇందులో ఏ మాత్రం సందేహించ వలసిన పనిలేదు. విష్ణమయం కాని వస్తువు ఈ జగత్తులో ఒక్క పరమాణువు గూడా లేదు.
రాజా! జీవుడు కలలో తనకంతవరకూ తీరని కోరికలమీది ఉబలాటంతో పలుశరీరాలు ధరిస్తాడు. పలుపేర్లతో వ్యవహరింపబడతాడు. తన ఇంద్రియాలతో విశేషా లన్నింటినీ గమనిస్తాడు. ఆ మీదట తన్ను తెలుసుకొంటాడు. ఇట్లే అంతటికీ అంతరాత్మయయిన పరమాత్మ అన్నిప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞతో బుద్ధి వృత్తులనన్నింటినీ పరిశీలిస్తాడు. తానే అన్నిటికీ ప్రభువు కావడంవల్ల దేనికీ బద్దుడు కాడు. ఆయన సత్యస్వరూపుడూ, ఆనందపరిపూర్ణుడూ అయిన విజ్ఞానమూర్తి. ఆయనను సేవించినప్పుడే ముక్తి సిద్ధిస్తుంది. తదితరుల సేవతో మోక్షం సిద్ధించదు. ఈ సంసారబంధం వీడదు.
రాజా! పూర్వం బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకొన్నాడు. పలు సంవత్సరాలు అందుకై ప్రయత్నించాడు. అయినా అందుకు తగిన నేర్పు బ్రహ్మకు సిద్ధించలేదు. ఆపై హరిని ఏకాగ్రమైన చిత్తంతో ప్రార్ధించాడు. ఆ హరి కృపవల్ల మళ్ళీ సృష్టి క్రమాన్ని స్మరించగలిగాడు. ఆ ధారణతో ప్రాణులను సృష్టించే విధానంలో నేర్పు గడించాడు. ఫలప్రదమైన, పూజనీయమైన బుద్ధివికాసంతో ఈ జగన్నిర్మాణంలో సమర్థుడై విహరించాడు.
అవివేకియైన మానవుడు శబ్దప్రధానమైన వేదంలోని కర్మకాండ బోధించినట్లు నిరర్ధకాలైన స్వర్గాదిసుఖాలు కోరుతాడు. నిద్రించేవాడు పూర్వసంస్కారంతో కలలు కన్నట్లు మాయామయమైన మార్గంలో పరిభ్రమిస్తాడు. అంతేకాని శాశ్వతమైన మోక్షసుఖం పొందలేడు. వివేకవంతుడు అలా చేయడు. అతడు నిస్సారమైన భోగాలలో శరీరధారణకు అవసరమైనంత మేరకే భోగస్వీకారం చేస్తాడు. కడు జాగరూకుడై ఉంటాడు. సంసారం సుఖమని భావించడు. దాని కతీతమైన త్రోవలో పోతేనే సిద్ధి కల్గుతుందని భావించి అలా ప్రవర్తిస్తాడు.
సంసారంపట్ల విరక్తుడైన వివేకవంతుడు ఇలా భావన చేస్తాడు: పడుకోవడానికి తగినంత చదునైన చక్కని నేల ఉండగా దూదిపరుపు లెందుకు? పుట్టుకతో వచ్చిన దోసిళ్ళు ఉన్నాయి కదా? మరి భుజించడానికి కంచాలు మొదలైనవి ఎందుకు? నారచీరలూ, జింకచర్మాలూ, దర్భచాపలూ ఉన్నవి కదా! ఇక కట్టుకోవడానికి పట్టు పుట్టాలందుకు? నివసించడానికనువైన కొండ గుహలున్నాయి కదా! ఇక మేడలూ, రాజప్రాసాదాలూ ఎందుకు? చెట్లు తగినట్లు ఫలరసాలను ప్రసాదిస్తున్నాయి కదా! నదులలో తియ్యని నీటికి లోటు లేదుకదా! పుణ్యస్త్రీలు పుష్కలంగా భిక్షలిస్తూనే ఉన్నారు కదా! ఇవన్నీ ఉండగా తపోధనులైనవారు, ధనమదంతో కన్నూ మిన్నూ కానని సంపన్నులను ఎందుకు సేవించాలి?
దిక్కులేని వారికి దిక్కై తాను కాపాడుతానంటూ చక్రధారియైన శౌరి తానున్నాడు. అలాంటప్పుడు ఆత్మజ్ఞులైన వివేకవంతులు అసమర్థుడైన ఒక మనుజుణ్ణి రక్షించుమంటూ ప్రార్ధింపవలసిన అవసర మేమున్నది?
ఈ విధంగా భావించి బుద్ధిమంతుడైనవాడు, జీవుల హృదయంలో స్వతస్సిద్ధంగా ఉన్నవాడూ, అంతర్యామీ, ప్రీతిపాత్రుడూ, నిత్యుడైనవాడూ, సత్యస్వరూపుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడైన భగవానుడగు వాసుదేవుణ్ణి సేవిస్తాడు. ఆ సేవవలన కలిగే ఆనందం అనుభవిస్తాడు. తద్ద్వారా సంసారానికి హేతువైన అవిద్య అనే ప్రకృతినుండి విడుదల పొందుతాడు కాబట్టి-
నృపశ్రేష్ఠా! శ్రీహరిని ధ్యానించకుండా మదోన్మత్తచిత్తుడై విషయభోగాలనే చింతిస్తూ దినాలు గడిపేవాడికి యమభటుల గదల దెబ్బలు తప్పవు. అతడు యమపురద్వారం వద్ద వైతరణీనదిలోని అగ్ని జ్వాలల్లోపడి మలమల మాడిపోతాడు.
భగవచ్చింతనలేని పాషండులను యమకింకరులు గదలతో మోదుతారు. వాళ్ళ దేహాలను మంటలపాలు చేసి మాడుస్తారు. వాటిని ముక్కలు ముక్కలయ్యేటట్లు పిసికి ఆపై వాటిలోకి చురకత్తులు దూరుస్తారు.
అంతేకాదు. శ్రీహరి పాదపద్మాలలోని పరిమళం మకరందానికున్న మాధుర్యం చవిచూడడానికి విముఖులైనవాళ్ళు తమతమ కర్మబంధాలలో చిక్కుకొంటారు. తద్ద్వారా యమనగరద్వారంవద్ద ప్రవహించే వైతరణీనదిలోని భగభగమండే అగ్ని జ్వాలల్లో కాలిపోతున్న వాళ్ళతో జతగూడుతారు. విశిష్టజ్ఞానులై జీవించే శరణాగతులు మాయకు లోబడక నేర్పుతో తమ తమ హృదయాలలోని భగవంతుని ధ్యానిస్తారు.
ఆ భగవానుడు జుత్తెడు కొలతగల శరీరం కలవాడు, దిగ్గజాల తొండాలలాగా పొడవైన నాలుగు చేతులుగలవాడు, చక్కదనంలో కోటి మంది మన్మథులకు దీటైనవాడు, మందరగిరిని ధరించినవాడు, పున్నమ నాటి జాబిల్లిని పోలిన మోము కలవాడు, సౌభాగ్యానికి నెలవైనవాడు, ప్రాతఃకాలపు సూర్య బింబంలాగా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కిరీట కుండలాలు తాల్చినవాడు, వక్షఃస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ గలవాడు, కమనీయమైన కౌస్తుభరత్నం పొదిగిన కంఠాభరణం మెడలో అలంకరించుకొన్నవాడు. ఎప్పుడూ సువాసన లీనే వనమాలతో ఒప్పారేవాడు, పలువిధాలైన పెద్ద పెద్దహారాలూ, భుజకీర్తులూ, కడియాలూ, మురుగులూ, మొలనూలూ, ఉంగరాలూ మొదలగు సొమ్ములతో శోభిల్లేవాడు, నొసట ముసురుకొన్న నిగనిగలాడే నీలి ముంగురులు గలవాడు, రాకాచంద్రుని వెన్నెలవలె తెల్లని మందహాసం కలవాడు, కరుణామయమైన కడగంటి చూపులతోడి భ్రూవిలాసాలతో భక్తులపై పరమానుగ్రహం ప్రసరింపజేసేవాడు, మహాయోగీశ్వరుల హృదయపద్మాలలో చివుళ్ళవంటి తన అడుగులు మోపినవాడు, సదా ఆనందస్వరూపుడు, వేయికోట్ల సూర్యులతో సమానమైనవాడు, లోకాలకు ప్రభువు అయిన ఆ పరమేశ్వరుణ్ణి విజ్ఞాన సంపన్నులు మనోధారణతో చిక్కబట్టి ఆ దేవుని చీలమండలు, అడుగులు, మోకాళ్ళు, పిక్కలు మున్నగు అవయవాలలో ఒక్కొక్కదానిని అనుక్షణం క్రమంగా ధ్యానిస్తారు. అచంచలమైన పూర్ణభక్తియోగం సిద్ధించేవరకూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో నిమగ్నులై ఉంటారు.

ఇలా చెప్పి శుకుడు మళ్ళీ ఈ రీతిగా అన్నాడు.
రాజా! ప్రారబ్ధకర్మ తీరేసరికి శరీరం పరిత్యజించాలనుకొన్న సన్న్యాసి దేశకాలాల కోసం ఎదురుచూడడు. మరణించాలన్న భావన కల్గగానే అతడు సుఖాసనస్థు డవుతాడు. మనస్సుతో ప్రాణవాయువును నిగ్రహిస్తాడు. మనోవేగాన్ని బుద్ధితో అరికడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడే జీవాత్మతో పొందుపరుస్తాడు. జీవాత్మను శుద్దాత్మలో చేరుస్తాడు. శుద్దాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. అలాచేసి శాంతుడై పనులన్నింటినీ వదలిపెడతాడు. ఆపై శాశ్వతసుఖం కావాలని అభిలషిస్తాడు.
రాజా! విను. పరమాత్మయైన పరబ్రహ్మానికి తప్ప కాలానికి లోబడిన బ్రహ్మాదులైన దేవతలకూ, సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలకూ, అహంకారానికీ, మహత్తత్త్వనికీ, సమస్త సృష్టికీ మూలమైన ప్రధానమనబడే ప్రకృతికీ ఎట్టి ఆధిపత్యమూ లేదు. అందుచేత పరమాత్మకంటె భిన్నమైన పదార్థమేదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదలుతారు. ఇతర విషయాలపై వ్యామోహం విడనాడుతారు. పూజనీయమైన మాధవుని పాదపద్మాలను మనస్సులో అనుక్షణమూ నిల్పుకొని ఉంటారు. వైకుంఠమే అన్నిటికంటె ఉత్తమ స్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్రజ్ఞాన బలమనే మంటలో విషయవాసనలను తగులబెట్టి వారు దేనిపైనా అపేక్ష లేకుండా ఉంటారు.
రాజా! యోగియైనవాడు కాలిమడమతో మూలాధార చక్రాన్నీ గుదస్థానాన్ని అదిమిపడతాడు. ఆ మీదట ప్రాణ వాయువును బిగబట్టి బొడ్డు వద్దగల మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడనుండి హృదయంలోని అనాహతచక్రానికీ, అందుండి వక్షఃస్థలంలోని విశుద్ధచక్రానికీ, అక్కడనుండి తాలుమూలానికీ, అచ్చటనుండి కనుబొమ్మల మధ్యగల ఆజ్ఞాచక్రానికీ ప్రాణవాయువును తరలిస్తాడు. ఆపై కళ్ళు, చెవులు, ముక్కు నోరు ఇవి మూసుకొని ఏ కోరికలూ లేనివాడై అర్ధముహూర్తసమయంలో ఇంద్రియాలతో ఎట్టి సంబంధమూ లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిదప నెత్తిపై గల బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బ్రహ్మంలో లీనమై పోతాడు.
శరీరం పరిత్యజించే వేళలో ఇంద్రియాలతో సంబంధం వీడనివాడు వాటితో కూడ గుణమయమైన బ్రహ్మాండంలో ఖేచరులు, సిద్దులు విహరించడానికి తగినదీ, అణిమ, మహిమ మొదలయిన ఐశ్వర్యాలన్నింటితో గూడినదీ అయిన బ్రహ్మలోకం చేరుకొంటాడు. విద్య, తపస్సు, యోగం, సమాధి-వీటిని అనుష్ఠిస్తూ లింగశరీరాన్ని వాయువులో లీనం చేసిన యోగివర్యులు బ్రహ్మాండం లోపలా, వెలుపలా సంచరిస్తూ ఉంటారని పెద్దలంటారు. కేవలం కర్మలతో అట్టిగతిని ఎవరూ పొందలేరు. బ్రహ్మలోకాభిముఖుడైన యోగి సుషుమ్నానాడి ద్వారా బయలుదేరి ఆకసంలో పయనిస్తూ అగ్ని దేవతను చేరుకొంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు తొలగించుకొని నిర్మలుడై భాసిస్తాడు. అతడు దేనిలోనూ తగులువడడు. నక్షత్రపథం అతిక్రమించి పోతాడు. ఆపైన సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకూ అన్ని మండలాలనూ వరుసగా దాటుకొంటాడు. చివరికి విష్ణుసంబంధమైన శింశుమార చక్రం చేరుతాడు. అక్కడ ఒంటరిగా పరమాణుస్వరూపమైన లింగశరీరంతో బ్రహ్మవేత్తలకు నెలవైన మహర్షోకం ప్రవేశిస్తాడు. అక్కడే ఉండి మహాకల్పకాలం వరకూ క్రీడిస్తాడు. కల్పాంత కాలంలో అనంతుని వదనంనుండి వెలువడే కరాళాగ్ని జ్వాలల్లో దగ్ధమవుతున్న ముల్లోకాలనూ చూస్తాడు. అందువల్ల కలిగే అగ్నిదాహం సహించలేక అక్కడనుండి బ్రహ్మలోకం చేరుకొంటాడు.
భూలోకంలో పదునలుగురు మనువులూ పుట్టి గిట్టె కాలమంతా కలిస్తే బ్రహ్మలోకంలో ఒక్కదిన మవుతుంది. అక్కడ మహనీయులైన సిద్దుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతుంటాయి. శోకం, వార్ధక్యం, చావు, కృశత్వం, భయం, దుఃఖం, ఇలాంటి బాధలు లేని చోటది. హరిచరణాలను ధ్యానించాలనే తెలివిలేక మూఢులైనవారి శోకస్థితిని ఆ లోకంనుండి చూడవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులూ, యోగులూ అక్కడ అమృతప్రాయంగా మాట్లాడుకోవడాన్ని చెవుల పండువుగా వినవచ్చు. రాజేంద్రా! అట్టి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు. ఆ లోకంనుండి మళ్ళీ తిరిగిరాడు.
ఇంకనూ ఒక విశేషం ఉన్నది. గొప్ప పుణ్యంవల్ల బ్రహ్మలోకం చేరినవారు మరొక కల్పంలో తమ సుకృతంయొక్క హెచ్చుతగ్గుల ననుసరించి ఆ యా అధికారాలు పొందుతారు. బ్రహ్మాదిదేవతలను భజించి శరీరత్యాగం చేసినవారు ఆ బ్రహ్మ జీవించినంతకాలం బ్రహ్మలోకంలో జీవించి ఆపై ముక్తిపొందుతారు. శ్రీహరి పాదపద్మాలపై మిక్కిలి భక్తి గలిగి దేహం వీడినవారు స్వేచ్చతో నిరాటంకంగా పయనించి బ్రహ్మాండాన్ని ఛేదించుకొని అత్యున్నతమైన వైష్ణవస్థాన మధిష్టించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడధిష్టించిన ప్రకృతి యొక్క అంశంనుండి మహత్తత్త్వం జనిస్తుంది. మహత్తత్త్వాంశతో అహంకారం కల్గుతుంది. అహంకారాంశనుండి శబ్దతన్మాత్ర ఉదయిస్తుంది. శబ్దతన్మాత్రాంశం నుండి ఆకాశం పుడుతుంది. ఆకాశంలో స్పర్శతన్మాత్ర ప్రభవిస్తుంది. స్పర్శతన్మాత్రఅంశం నుండి వాయువు జనిస్తుంది. వాయువు అంశం నుండి రూపతన్మాత్ర కల్గుతుంది. రూపతన్మాత్రాంశం నుండి తేజస్సు జనిస్తుంది. తేజోంశం నుండి రసతన్మాత్ర కల్గుతుంది. రసతన్మాత్ర అంశం నుండి జలం జనిస్తుంది. జలాంశంనుండి గంధతన్మాత్ర కల్గుతుంది. గంధతన్మాత్రాంశం నుండి పృథ్వి ఉదయిస్తుంది. వీటన్నింటి కలయికవల్ల పదునాల్గు భువనాలతో గూడిన విరాట్ స్వరూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి కోటి యోజనాల విస్తీర్ణమైన పెద్ద బానవంటిది మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీన్ని ఏబది కోట్ల యోజనాల వైశాల్యం కలదని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజం, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఆరు ఆవరణాలున్నాయి. అవి క్రమంగా ఒకదానికంటె ఒకటి పదేసిరెట్లు పెద్దవి. ఆ ఏడావరణాల మీద ఎనిమిదవదైన ప్రకృత్యావరణం గొప్పగా వ్యాపించి ఉన్నది.
ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విష్ణుపదం అధిస్టించినవాడు మరణాది భయంలేని వాడవుతాడు. అతడు మెల్లమెల్లగా లింగశరీరంతో పృథివీతత్త్వం పొందుతాడు. ఆ తత్త్వంలో ఘ్రాణేంద్రియంతో గంధం గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని ఆస్వాదిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగన స్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దగ్రహణం చేస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాదులైన పంచభూతాలకూ, సూక్ష్మేంద్రియాలకూ లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయమూ, దేవమయమూ ఐన సాత్త్వికాహంకారంతో మహత్తత్త్వంలో ప్రవేశిస్తాడు. ఆపై సత్వరజస్తమోగుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మకత్వంతో దేహాన్నీ ఉపాధి పరంపరలన్నీ ముగిసిన తరువాత ప్రకృతినీ పరిత్యజించి ఆనందమయు డవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఈ విధంగా చెప్పి శుకయోగి పరీక్షిన్నరేంద్రునితో ఇంకా ఇలా అన్నాడు.
కౌరవశ్రేష్ఠా! ఇది భాగవతోత్తములు అనుసరించే త్రోవ. ఈ మార్గాన పయనించిన యోగి వందలాది యుగాలు గడచినా మళ్ళీ తిరిగి రాడు. ఇందులో సందేహం లేదు.
రాజా! సద్యోముక్తి, క్రమముక్తి అనే రెండు మార్గాలను గురించి నీవు నన్నడిగావు. ఇవి రెండు వేదగీతలలో వివరింపబడి ఉన్నాయి. పూర్వం బ్రహ్మదేవుడు తన్ను ఆరాధింపగా విష్ణుదేవుడు ఆయనకు వీటిని గురించి బోధించాడు. సంసారంలో ప్రవేశించినవానికి, తపస్సు, యోగం మొదలయిన ఎన్నో మోక్షమార్గాలు ఉన్నాయి. అన్నింటికంటె భక్తిమార్గం సులభమైనది.
శుకుడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

No comments:
Post a Comment