Monday, February 16, 2026

Sri Maha Bhagavathamu Second Part Starting - శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము

శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము

శ్రీమద్భక్తచకోరక, సోమ! వివేకాభిరామ! సురవినుత గుణ
స్తోమ! నిరలంకృతాసుర, రామాసీమంతసీమ! రాఘవరామా!

భక్తి సంపదచే శ్రీమంతులైన భక్తులనే చకోరపక్షులపాలి చంద్రుడవూ, వివేకంతో విలసిల్లేవాడవూ, దేవతల స్తుతికి పాత్రమైన సద్గుణసముదాయం కలవాడవూ, రాక్షసస్త్రీల పాపటబొట్టులు తొలగించినవాడవూ అయిన ఓ రఘువంశజుడవగు శ్రీరామా! అవధరించు.

నైమిశారణ్యంలో భాగవతశ్రవణం చేయాలన్న కోరికతో చేరిన మునులు ఉన్నతగుణవంతులు. వారిని చూచి సర్వపురాణాలనూ విశదీకరించడంలో నిపుణుడైన సూతుడు ఇలా అన్నాడు.

ఆ రీతిగా ప్రాయోపవేశం చేసి ముక్తిమార్గం చూపుమని అడిగిన పరీక్షిన్మహారాజు నుద్దేశించి యోగివర్యుడైన శుకుడు ఈ విధంగా చెప్పాడు.

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...