మహా గణపతికి 33వ రూపమే శుభదృష్టి గణపతి (కంటి దృష్టి గణపతి)
'నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది' అంటారు. దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దృష్టి అంటే చూపు. మనం చూసేది. సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు. కానీ ఈర్ష్యా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది. ఆ చెడుదృష్టి తాకే మనిషినైనా, మరిదేనినైనా మాడి మసి చేస్తుంది.
నరదృష్టి కారణంగా చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవటం, మనుషుల మధ్య ఈర్ష్య, అసూయా ద్వేషాల వంటి సమస్యలు వస్తాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని నిరోధించి, సత్ఫలితాలు పొందేందుకు శుభదృష్టి గణపతి (కంటి దృష్టి గణపతి) చిత్రం ఎంతో మేలుచేస్తుంది.
మహాగణపతి 33వ రూపమే ఈ శుభ దృష్టి గణపతి. అగస్త్య మహాముని ఈ గణపతి రూపాన్ని సృష్టించాడు. ఈ శుభదృష్టి గణపతి యొక్క రూపం చాలా విచిత్రంగా వుంటుంది. శ్రీ మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన ఏకైక దైవశక్తి ఈయనే.
శివపార్వతుల ముద్దుబిడ్డ అయిన ఈ గణపయ్య తండ్రివలే, త్రినేత్రుడు, తల్లిచేతిలోని త్రిశూలాన్ని ధరించి దర్శనమిస్తాడు. ఇతర దేవతల వలె అనేక ఆయుధాలను ధరించి, సింహమును వాహనంగా చేసుకుని వుంటాడు. మూషికము కూడా ఈయన పాదాల చెంత వుంటుంది. మహా పరాక్రమశాలిగా పూర్ణ వికసిత పద్మంలో విజయోత్సాహం గల వీరుడిలా ఉంటాడు.
ఈ గణపతి దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది. ఇంటిలో ఈ దృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తరదిశ చూసేలా తగిలించాలి. పూజ గదిలో కానీ, ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
నిత్య స్తోత్రావళి
పంచాంగం
Subscribe to:
Post Comments (Atom)
Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య
న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...

No comments:
Post a Comment