దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట
దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్యరులయొక్కఅంశమున జన్మించినవాడు. అతడుకూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించివున్నారు.
దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని యాశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి "గురువర్యా మీ అనుగ్రహమువలన అనేక విషయాలుతెలిసికొనివుంటిని. మాఘమాసముయొక్క మాహాత్మ్యమును వినియుండ లేదు. గాన మాఘమాసముయొక్క విశిష్టతనుగురించి, మాఘస్నాన ఫలముగురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను" అని దత్తాత్రేయునికోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికన్ను మన్నించి ఈవిధముగా వివరించిరి.
"భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కరప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నపుడు ఆయనదులకు పుష్కరారంభమగును. గనుక అటువంటి నదులయందు స్నానముచేసి దానపుణ్యము లాచరించినయెడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకుకూడ సాధ్యము కాదు. అందునూ మాఘమాసమందు నదిలో స్నానముచేసిన గొప్పఫలితం కలుగుటయేగాక జన్మరాహిత్యము కలుగును. గనుక ఏమానవుడైననూ మాఘమాసములో నదీస్నానము తప్పకుండ చేయవలెను. అటుల చేయనియెడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము పాపఫలము అనుభవించక తప్పదు.
పూర్వ కాలమున గంగానదీతీరమున ఉత్తరభాగమున భాగ్యపురమును పట్టణము గలదు. అందు నివసించుజనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి ధనము సంపాదించి అపార కుబేరునివలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు గలడు. అతడును గొప్ప ధనవంతుడు. బంగారునగలు, నాణెములు రాసుల కొలదీ ఉన్నవాడు.
మరికొంత కాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రిఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్ట మొచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులయి ఉండిరి. ఒకనాడు పెద్దకుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటివెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరునీ కమారులిద్దదూ చనిపోయినారు.

“ఆహా! ఏమి నాభాగ్యం! గంగాజలము నామీద పడనంత మాత్రముననే నా కింతటి మోక్షము కలిగినదా" అని వైశ్యకుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.
No comments:
Post a Comment