Friday, February 27, 2026

Narasimha Dwadashi - నరసింహ ద్వాదశి

నరసింహ ద్వాదశి

నరసింహ ద్వాదశి (ఫాల్గుణ శుక్ల ద్వాదశి) విష్ణుమూర్తి యొక్క నరసింహ అవతారాన్ని పూజించే అత్యంత పవిత్రమైన రోజు.

నరసింహ ద్వాదశిని గోవింద ద్వాదశి అని కూడా పిలుస్తారు.

పురాణం:
పురాణాల ప్రకారం, ఒకప్పుడు అసుర రాజు హిరణ్యకశ్యపుడు తన సోదరుడి మరణానికి కారణమైన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మా గూర్చి ఘోరతపస్సు చేసాడు. బ్రహ్మ నుండి వరం పొంది, వరగర్వంతో విర్రవీగుతున్న తరుణంలో తనకుమారుడే ఆ శ్రీమహావిష్ణువు పరామభక్తుడని తెలిసి క్రోధం చెంది అతన్ని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తదుపరి ఒకనాడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని విష్ణువు ఉనికికి కోరగా, హరి అంతటా తానై వున్నాడు అని ప్రహ్లాదుడు పలుకగా, 
హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని విష్ణువుని ఈ స్తంభంలో చూపించు అని కోపంగా హిరణ్యకశ్యపుడు తన గదను స్తంభానికి కొట్టగా అంత  నరసింహుడి ఉగ్ర రూపంలో విష్ణువు స్తంభం నుండి ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుని చంపాడు.

ప్రహ్లాదుడు తన శత్రువుపై సాధించిన విజయాన్ని చెడుపై మంచి విజయంగా భావిస్తారు. విష్ణువు పట్ల అతని భక్తి అతని ప్రాణాలను కాపాడింది. అందుకే, నరసింహ అవతారాన్ని భక్తులు పూజిస్తారు.

ఇది హిరణ్యకశిపుని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించిన సంకేతంగా, దుష్టశిక్షణ-శిష్టరక్షణకు ప్రతీకగా జరుపుకుంటారు.

ఈ రోజున ఉపవాసం, నరసింహ స్వామి పూజ, మరియు మంత్ర పారాయణం చేయడం వల్ల భయం, వ్యాధులు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ 
నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం 

నరసింహ స్తోత్రం 
జ్వలత్ కరాళ జిహ్విక ధగత్ కఠోర ధంష్ట్రికా 
ప్రగీత దిగ్వి దిక్పట ప్రచండ అగ్ని కీలక 
నఖ సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర 
ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః 

పూజా విధానం:
ఉదయాన్నే స్నానం ఆచరించి, నరసింహ స్వామిని భక్తిగా పూజించి ఉపవాసం (నిర్జల లేదా ఫలాహారం) ఉండటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. 

ఉపవాసం అనగా స్వామికి దగ్గరగా వాసం చేయడం అంటే నిరంతరం స్వామి నామం జపిస్తూ, భక్తిగా దీక్షగా స్వామిని జపించడం. 

ఈ రోజున నరసింహ స్వామిని పూజించడం వల్ల దుష్టశక్తుల నుండి రక్షణ, కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం.

నరసింహ స్వామిని 12 పేర్లతో (నరసింహ ద్వాదశ నామ స్తోత్రం) పూజించడం చాలా ప్రసిద్ధి.

శ్రీ నృసింహ ద్వాదశనామావళిః

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...