Wednesday, February 4, 2026

Magha Puranam 29 - మాఘ పురాణం 29 మాఘ ఏకాదశీ మహాత్మ్యము (క్షీరసాగర మథనము)

మాఘ పురాణం - 29 వ అధ్యాయం

మాఘ ఏకాదశీ మహాత్మ్యము (క్షీరసాగర మథనము)

ఓ దిలీపుడా! అశ్వమేధయాగము చేసినవాడును, మాఘమాసములో స్నానము చేయేయువాడును, అటులనే ఏకాదశీ వ్రతము చేసి ఉపవాసముండువాడును వైకుంఠ ప్రాప్తుడగును, ఇందుల కెట్టి సందియమూ లేదు. ఏకాదశీ వ్రతమహిమవలన అంబరీషుడు దూర్వాసుని వలన ఎట్టి అటంకమును పొందక తిరిగ 
దూర్వాసునే ఆశక్తి  వెంబడించి ఆతని గర్వమణచినది, ఈ వృత్తాంతము నీకు తెలిసియేయున్నది. అయినను నీవు అడిగితివిగాన మరియొక దృష్టాంతరం నీకు వివరించెదను.

ఒకనాడు దేవతలును, రాక్షసులును అమృతము కొరకు పాలనముద్రము మధించినారు. మేరు  పర్వ'తాన్ని తీసుకువచ్చి కవ్వముగాను, వాసుకి యనుపామును, కవ్వపుత్రాడుగాను చేసిరి. ఆ పామును మేరువర్వతానికి చుట్ట బెట్టినారు. పాముతల వైపు ఎవరుందురా ? యని సందేవామురాగా, మేముందుమని వాసుకి తల వైపు పట్టుకొనిరి. దేవతలు తోకవైపు వుండిరి. ఈ విధముగా దేవదానవులు పాలసముద్రాన్ని మధించగా మొదట లక్ష్మీదేవి జన్మించెను. విష్ణుమూర్తి శ్రీమహాలక్ష్మిని తీసుకొని తన భార్యగా స్వీకరించెను. తరువాత ఉచ్చైశ్రవమను గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము, అమృతభాండము జన్మించెను. అన్నియు భ|దవరచి వుంచమని దేవేంద్రునికి విష్ణుమూర్తి వప్పగించెను.

మరల 
పాలనముద్రము చిలికినారు. అందులోనుండి అగ్నితో సమానమైన గొప్ప తేజస్సుతో కూడిన హాలాహాలము బైటకు వచ్చినది అది మహావిషము, ఆ విషజ్వాల అన్నిలోకాలకు వ్యాపించినది. ఆ వేడికి సర్వము నాశనమగుచున్నది. ఆ మహావిషాన్ని చూచి దేవతలు, రాక్షసులుకూడ భయపడసాగిరి. మరికొంత సేపువున్న యెడల వారందరిని హతమార్చి వేయగలదు, వారికి మరో మార్గము లేక ఈశ్వరుని "హరర మహాదేవా! వృషభధ్వజా! శరణు, మము యీ ఆపదనుండి రక్షింపుము” అని స్తుతించిరి. 

శంకరుడు దేవతలయొక్క రాక్షసులయొక్క ఆర్తనాదమును విన్నాడు. ఇక ఒక్క క్షణమైనను జాగు చేయకూడదని గ్రహించి తన నోరు తెరచి, ఆ కాలకూట విషాన్ని మ్రింగి, కంఠము నందుంచుకున్నాడు.  ఆ కాలకూట విషమువల్త శంకరుని కంఠము నల్లబడిపోయినది. అందుచేతనే నీలకంఠుడనే పేరు సార్థకమయ్యెను.

పాలనముద్రాన్ని మధించుట ఆపుజేసిరి. అమృతం మాకు కావలయునని దేవతలు, మాకు కావలయునని రాక్షసులు, వాదన చేసిరి.

మాయామాను వేషధారుడగు శ్రీహరి ఈ వాదములను గ్రహించినాడు, ఆయన స్త్రీ రూపము ధరించెను. ఆమెయే మోహిని, ఆమె అందచందాలు జూచిన ఏ స్త్రీ కూడా సరితూగదు.

అమృతముకొఱకు జగడమాడుకొనుచున్న దేవదానవులు మధ్యకు జగన్మోహిని వచ్చి " ఓ  అమాయకులారా! ఎందులకీ రాద్దాంతం? మీకందరికీ నేను సమానముగా అమృతాన్ని పంచి పెట్టుదును. కనుక దేవతలందరూ ఒక వరుసలోను, దానవులందరూ ఒక వరుసలోను అసీనులు కండు అని చెప్పి ఆ మోహిని రూపమును చూడగానే మారు మాటలాడలేక అటులే చేయమనికోరి రెండు పంక్తులుగా కూర్చుండిరి. జగన్మోహిని అమృత బాండాన్ని రెండుగా జేసి ఒక దానిలో సురాపానం, వేరొక దానితో అమృతాన్ని వేసి నాట్యము చేయుచున్నట్లు వయ్యారి నడకలతో చిరునవ్వునవ్వుచూ వారలను ముగ్ధులను జేసి అమృతాన్ని దేవతలకు, కల్లును రాక్షసులకు గుర్తుతెలియకుండా వడ్డించు చుండగా, ఈ మాయ కనిపెట్టి ఇద్దరు రాక్షసులు రాహువు, కేతువు 
అనువారు రాక్షస పంక్తినుండి దేవతలలోనికీ మారురూపమున వచ్చి కూర్చొని జగన్మోహిని పంచుతున్న అమృతాన్ని గ్రోలిరి.

జగన్మోహిని అది కనిపెట్టి చక్రాయుధముతో వారి శిరస్సులు త్రెంచెను. వారు త్రాగిన అమృతమింకను గొంతుక నుండి దిగనందున వారు చనిపోయిరి. ఆ యమృతమును దేవతలు జుఱ్ఱుకొనిరి. యీ మోసమునకు రాక్షసులు హాహాకారాలు చేసిరి. ఇద్దరు రాక్షసులు మాయచేత పంక్తిలోకివచ్చి అమృతము సేవించెనని, దేవతలు రొదచేసిరి. కడకు రాక్షసులంతా ఏకమై "ఈ అమృతం మాకక్కరలేదు. మేమెవరికి భయపడము, మాకు చావులేదు" అని ఎవరిమట్టుకు వారు వెళ్లిపోయిరి. మిగిలిన అమృతముని విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు ముగ్గురు కలసి దేవేంద్రునికిచ్చి వారి నివాసములకు వెళ్లిపోయిరి.

పాలసముద్రము మధించగా వచ్చిన అమృత కలశము నొక చోట వుంచు సమయమున విధివశమున రెండు చుక్కలు భూమి మీద పడినవి. ఆ రెండు చుక్కలు పడిన చోట రెండు అందమైన మొక్కలు బయలుదేరినవి. ఆ రెండు మొక్కలలో ఒకటి పారిజాత మొక్కగను
రెండవది తులసి మొక్కగను భూమియందు పెరిగినవి. అటుల పెరుగు చున్న మొక్కలకు సత్రాజిత్తు అనువాడు ప్రతినిత్యము నీరు పోసి పెంచుచుండెను.

కొంత కాలమునకు పారిజాతవృక్షము పుష్పించెను. దేవేంద్రుడు గగన మార్గమున బోవుచు పారిజాత పుష్ప సువాసనకు దిగివచ్చి పువ్వునుకోసి తన భార్యయగు శచీదేవి కిచ్చెను. మిగిలిన దేవత స్త్రీలుకూడా అడిగిరి. మరల ఇంద్రుడు రహాస్యముగ ఆ తోటలో ప్రవేశించెను. పారిజాత పువులు ఎవరో కోయుచున్నారని సత్రాజిత్తు విష్ణుపాదాలవద్దనున్న అక్షతలు పువ్వులపైన ఆ వనమంతా చల్లి యున్నందున, దేవేంద్రుడు పారిజాత పుష్పమును తెంచుచుండగా విష్ణు  మహిమ వలన అతనికి దేవత్వముపోయి మూర్చపోయాడు. దేవతలు ఈ వార్తవిని నారదుని బ్రతిమలాడి వారందరూ కృష్ణునికడకు వెళ్ళి జరిగిన సంగతులు విన్నవించగా కృష్ణుడు సత్రాజిత్తుకడకు బయలు దేరెను.

సత్రాజిత్తు ఆషాఢశుద్ధ ఏకాదశినాడు ఉపవాసముండి ఆ రాత్రి జాగరణ చేసి ద్వాదశినాడు సద్బ్రాహ్మణులకు దానములు యిచ్చి వున్నందున అతడు అమోఘమైన శక్తి  కలిగి యున్నందున కృష్ణభగవానుడు వరమిచ్చి అతని తోటలో ఉన్న'పారిజాత వృక్షమును' దేవేంద్రుని కిప్పించెను. ఈవిధముగ నే తులసీవనమునకు వెళ్ళి తులసిని తన సన్నిధిలో వుండమని చెప్పగా తులసీదేవి  అటులనే అని అప్పటి నుండి విష్ణుదేవునితో సమానముగా పూజింపబడెను.

యన్మూలే సర్వతీర్థాని యన్నధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాస్య తులసి తాం నమామ్యహమ్ 


అని తులసీ దేవిని శుచియై పూజించిన యెడల సకల సౌభాగ్యములు చేకూరును.

No comments:

Post a Comment

The Enmity between Lord Narayana (Vishnu) and the Asuras - రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట

రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట ఓ మునిశ్రేష్ఠా! శుకమహర్షీ! వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి. అన్ని ప్రాణుల పట...