Monday, August 3, 2026

Dhanishtha Nakshatra - ధనిష్ఠ నక్షత్రము

ధనిష్ఠ నక్షత్రము

నక్షత్రం - ధనిష్ఠ
అధిపతి - కుజుడు
గణము - రాక్షస
జాతి - పురుష
వృక్షం - జమ్మి
జంతువు - సింహం
నాడి - మధ్యనాడి
పక్షి - కాకము
అధిదేవత - అష్ట వసువులు
రాశి - 1,2 పాదాలు మకరం, 3,4 పాదాలు కుంభం

ధనిష్ఠా నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో ధనిష్ఠా నక్షత్రము 23వ నక్షత్రము. ఈ నక్షత్రానికి దోషం లేదు. ధనిష్టా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, రాశ్యాధిపతి శని, జంతువు సింహము.

ఈ రాశిలో జన్మించినవారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు.

అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మొండితనం కారణంగా విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి అడుగడుగునా ఎదురౌతుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు.

ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపములోనే నిలబడతాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెప్తారు. అందువలన నష్టపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు.


సంతానాన్ని అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురౌతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం కుటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ, మహర్దశలు, శుక్రదశ యోగిస్తాయి.

ధనిష్ఠా నక్షత్ర జాతకులు బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు చేసే ప్రతి పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. ఏ పరిస్థితినైనా వారు తమంతట తాము సర్దుబాటు చేసుకుంటారు. మనస్సు, చర్య, మరియు పదాలతో ఎవరికీ హాని చేయరు. మనస్సు చాలా పదునైనది మరియు ఎల్లప్పుడూ ఏదో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరి మనోహరమైన చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక స్వభావం ఉంటుంది మరియు నైపుణ్యాలు, క్యారెక్టర్ మరియు ప్రభావాల విషయంలో చక్కగా ప్రవర్తిస్తారు. చక్కగా మాట్లాడే స్వభావం ఉండటం వల్ల, ప్రజల నుంచి ప్రేమ మరియు మద్దతును వీరు పొందుతారు. ఇతరులను ఎలా గౌరవించాలి మరియు మర్యాద ఇవ్వాలనే విషయం వీరికి బాగా తెలుసు.

చుట్టూ ఉండే ప్రజలు సంతోషాన్ని మరియు ఆనందాన్ని పొందుతారు. ఉల్లాసం, సామాజికంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. అందువల్ల, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. వ్యక్తులతో సమయాన్ని గడిపినప్పుడు చక్కగా భావిస్తారు. వీరు తమ బాధ్యతలను విడిచి పెట్టడానికి ఇష్టపడరు. అన్ని రకాల సమస్యలు మరియు అడ్డంకులపై పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు.

వాదనల విషయానికి వచ్చినప్పుడు, అత్యుత్తమంగా ఉంటారు, అందువల్ల పాలసీలు మరియు చట్టం విషయంలో వీరు అత్యుత్తమంగా ఉంటారు. విషయాలను రహస్యంగా ఉంచగలుగుతారు. ఎంత చదువుకున్నప్పటికీ, వీరు తమ జ్ఞానం కోసం పేరుప్రఖ్యాతలను కలిగి ఉంటారు. ఏదైనా పనిని లేదా ఇతర పనులను ఒకేసారి చేయడం వీరి అలవాటు.

అంకితభావం మరియు క్రియాత్మత కారణంగా, వీరు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. వీరు ఎంతో ఉత్సాహ భరితంగా ఉంటారు. ఏది నిర్ణయించుకున్నప్పటికీ, పనిచేస్తూనే ఉంటారు లేదా పూర్తయ్యేంత వరకు పనిచేస్తారు.వీరికి ఆత్మగౌరవం ఎక్కువ, దీని వల్ల గౌరవమర్యాదలు లభిస్తాయి.

మానసిక శక్తి బలంగా ఉంది మరియు వీరు ఏ నిర్ణయమైనా వేగంగా తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. దీనితో ఎలాంటి సమస్య ఉండదు. నిర్ణయం తీసుకునే సామర్ధ్యాల వల్ల, వీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు. వీరు వ్యాపారానికి కాకుండా ఉద్యోగానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. అయితే, ఉద్యోగం లేదా వ్యాపారమైనా, వీరు ఉన్నత స్థానంలోనే ఉంటారు.


ధనిష్ఠా నక్షత్రము మొదటి పాదము
ధనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు. ఈ జాతకుల మీద సూర్య కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రము. కనుక వీరు ఏదైనా కార్యము యందు పట్టుదలగల వ్యక్తులై ఉంటారు. వీరికి యునియన్ నాయకులుగా ఉండే అవకాశం ఉంది.

ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, అతిశయం అధికంగా ఉంటాయి. వీరికి తండ్రితో అనుబంధం కాస్త అధికంగానే ఉంటుంది. సైనికపరమైన, విద్యుత్ సంబంధిత, అగ్ని సంబంధిత, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి 6 సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

విద్యలో అడ్డంకులు ఎదురుకావచ్చు. వీరికి రాహుదశ కాలం తల్లిదండ్రుల నీడలో జరిగిపోతుంది కనుక కష్టం తెలియకుండా గడిచిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

24 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు కాస్త తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

40 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.


ధనిష్ఠా నక్షత్రము రెండవ పాదము
ఈ జాతకులకు ఆవేశం, బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది. వ్యాపారం చేయడమంటే ఆసక్తి కనబరుస్తారు. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. సైనిక పరమైన వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం.

ఈ నక్షత్ర జాతకులకు 4 సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

విద్యలో అడ్డంకులు ఉంటాయి. వీరికి రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో జరిగిపోతుంది కనుక అప్పుడు కష్టాలు తెలియకుండా జరిగిపోతుంది. రాహుదశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

22 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు క్రమంగా తగ్గి జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే తరువాత వచ్చే శనిదశ కాలంలో ఆర్థిక సమస్యలు వస్తాయి.

38 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులే అధికమవుతాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కాస్త ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సుఖంగా సాగిపోతుంది.


ధనిష్ఠా నక్షత్రము మూడవ పాదము
ధనిష్ఠా నక్షత్ర మూడవ పాద జాతకులు పట్టుదలగల వ్యక్తులై ఉంటారు. వీరు కళాత్మకమైన వస్తు సేకరణ చేయడానికి ఆసక్తులై ఉంటారు. వీరికి జల విద్యుత్, జల భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తుంది. సైనిక సంబంధిత, కళా సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 2 సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.

రాహుదశ కాలం తల్లి దండ్రుల నీడలో జరిగిపోవడం వల్ల వీరికి కష్టం తెలియకుండా జరిగిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

20 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గుతాయి. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు తప్పవు.

36 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది.

72 సంవత్సరాల కాలంలో వచ్చే కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన, తీర్థ యాత్రలు అనుకూలిస్తాయి. మిగిలిన జీవితం సాఫీగా జరిగిపోతుంది.


ధనిష్ఠా నక్షత్రము నాలుగవ పాదము
ధనిష్ఠా నక్షత్ర నాల్గవ పాద జాతకుల మీద పరిపూర్ణ కుజ ప్రభావం ఉంటుంది. ఈ జాతకులకు ధైర్యసాహసాలు, ఆవేశం అధికంగా ఉంటాయి.

ప్రజా ఉద్యమాలలో వీరు ముందుంటారు. వీరికి సైనిక సంబంధమైన ఉద్యోగాలు, ధైర్య సహసాలు అవసరమైన ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు ఒక సంవత్సరము వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

విద్యలో అడ్డంకులు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంది. రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో ఉంటారు కనుక కష్టాలు లేకుండా జరిగిపోతుంది.

19 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుతాయి. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. అయితే సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

35 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 54 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనిష్ఠా నక్షత్ర జాతకులు పెంచాల్సిన చెట్టు
ధనిష్ఠా నక్షత్రం వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్ర జాతకుల తారా ఫలాలు :

తార నామం - తారలు - ఫలం

జన్మ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - శరీరశ్రమ

సంపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ధన లాభం

విపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్యహాని

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - క్షేమం

ప్రత్యక్ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - ప్రయత్న భంగం

సాధన తార - అశ్విని, మఖ, మూల - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - బంధనం

మిత్ర తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - సుఖం

అతిమిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: గోధుములు పుణ్యాత్ములకు శివాలయంలో దానం చేయాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
అష్టౌ దేవా వస'వస్సోమ్యాసః' ।
చత’స్రో దేవీరజరాః శ్రవిష్టాః ।
తే య్ణం పాంతు రజ'సః పురస్తా”త్ ।
సంవత్సరీణ'మమృతగ్గ్' స్వస్తి ।
యం నః' పాంతు వస'వః పురస్తా”త్ ।
దక్షిణతో' భియంతు శ్రవి'ష్ఠాః ।
పుణ్యన్నక్షత్రమభి సంవి'శామ ।
మా నో అరా'తిరఘశగా సాగన్న్' ॥

నక్షత్ర గాయత్రి
ఓం అగ్రనాథాయ విద్మహే 
వసూప్రితాయ ధీమహి 
తన్నో శర్విష్టా ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – వెల్వలపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి.
రెండవ పాదం – అయినవెల్లిలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి.

మూడవ పాదం – మసకపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి.
నాలుగవ పాదం – కుందూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.

No comments:

Post a Comment

Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం గాయత్రీ సహస్ర నామావళి నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్ర...