రామాయణం సుందరకాండ పారాయణం
శ్రీ సమృద్ధమూ, విద్వాంస భూషితమూ, వీరయోధ విలసితమూ అయిన అయోద్యానగరాన్ని పాలించే దశరథ మహారాజుకి కొసల్య, సుమిత్ర, కైకేయి అనే పేర్లుగల ముగ్గురు భార్యలవల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులు కలిగారు.
వీరిలో పెద్దవాడయిన రామచంద్రుడు తండ్రిమాట ప్రకారం అరణ్యానికి బయలుదేరగా ఆయన వెంట భార్య జానకీ, తమ్ముడు లక్ష్మణుడూ కూడా వచ్చారు.
పదమూడు సంవత్సరాలకాలం అరణ్యంలో మునీశ్వరుల ఆశ్రమాలను దర్శిస్తూ సాధు హింసకులయిన రాక్షసులను సంహరిస్తూ కాలం గడిపాక, ఒకనాడు లంకేశ్వరుడయిన రావణుడు (మాయచేసి మారీచుని సాయంతో) సీతను అపహరించాడు.
రామలక్ష్మణులు సీతను వెదకుతూ కిష్కింధ చేరారు.
చేరిన వారిని దూరాన ఋశ్యమూక పర్వతం మీద ఆప్తసచివులతో వున్న సుగ్రీవుడు చూశాడు.
చూస్తూనే గజగజలాడిపోయి పరుగు లంకించుకున్నాడు, అనుచర సమేతం.
గుట్టలు, మిట్టలు, కొండలు, కోనలు దూకుతున్నారు వారందరూ. కొంతదూరం సాగిన తరువాయి హనుమంతుడు సుగ్రీవుని ఆపి:
ప్రభూ! ఏమిటీ పరుగు, ఎక్కడకీ ప్రయాణం? అన్నాడు.
సుగ్రీవుడు: హనుమా! చూశావా ఆ కోదండపాణుల్ని, కరవాలధరులను, ఆజానుబాహు దేహులను. విషం క్రక్కే కోడెత్రాచుల వంటి కరవాలాలు, తాళప్రమాణంలో వున్న ధనుస్సులు, ముల్లోకాలనూ భస్మం చేయగల శక్తి సంపన్నులయిన వీరిని మా అన్నగారు వాలి నన్ను చంపడానికి పంపాడు.
హనుమ: ప్రభూ! భయగ్రస్త హృదయానికి శంకలు ఎక్కువ. నిజానికి వారెవరో ఎందుకు వచ్చారో తెలియకుండా ఎందుకీ పలాయనం. మీరిక్కడే ఆగండి. నేను విషయం తెలుసుకొని క్షణంలో తమకు నివేదిస్తాను.
అని భిక్షుక రూపంలో రామలక్ష్మణుల ముందు చేతులు జోడించి, తలవంచి నిలబడి:
ఆర్యా! దివ్యకాంతులతో విరాజిల్లే మీ శరీర కాంతీ, చతుర్దశ భువనాలనూ గజగజలాడించ గలిగిన మీ ధనుర్భాణాలూ, కరవాలాలూ మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇవన్నీ వీరవరులయిన రాజ పురుష లాంఛనాలు.
కాని - జటాజూటాలూ, నారచీరలూ ధరించి ముని బాలకులవలె వున్నారు. ఇది ఆశ్చర్యంగా వుంది. తమ రెవరు? ఏ పనిమీద యిటు వచ్చారు, అన్నాడు.
రామ లక్ష్మణులు మాట్లాడలేదు. అప్పుడు హనుమ:
మన్నించండి. నేనెవరినో తమకు చెప్పలేదు. ఈ కిష్కింధకు అధిపతి వాలి. ఆయన తన తమ్ముడయిన సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేసి, ఆయన భార్యను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. నేను సుగ్రీవుని అనుచరుడను, అన్నాడు.
రాముని వదనం సంతోషంతో వికసించింది. తమ్ముని వైపు తిరిగి:
నా నృగ్వేద వినీతస్య
నా యజుర్వేద ధారిణః
నా సామవేద విదుషః
శక్యమేవం విభాషితుం
అని హనుమంతుని ధీశక్తినీ, వాక్చాతుర్యాన్నీ ప్రశంసిస్తూ,
లక్ష్మణా! ఈ కపిప్రవరుని సంభాషణ ఎంత ఉదాత్తంగా వున్నదో చూశావా!
వేదత్రయం అధ్యయనం చేసి, ఆరుశాస్త్రాలూ, కంఠపాఠం అయి, నవ వ్యాకరణాలూ కరతలామలకం అయినవాడు కాని యిలా మాట్లాడలేడు. అంతేనా!
మాట్లాడుతూన్నప్పుడు తల విసరడం, కనుబొమలు ఎగరవేయడం, నుదురు బిగించడం వంటి వికారాలేమీ లేవు. ఇంకా చూశావా;
అ విస్తరం అ సందిగ్ధం
అ వలంబితం అవ్యధం
చెప్పవలసిన విషయాన్ని ముక్తసరిగా మూడు ముక్కలలో చెప్పాడు. అంతమాత్రాన మనకు వినబడకుండా అక్షరాలు మ్రింగేయలేదు; సాగతీత సంగీతంలేదు. గొంతు చించుకుని తను బాధపడి, మన చెవులకు కఠోరంగా అరవలేదు. సంస్కార సంపన్నమై మధ్యమస్థాయిలో హృదయాహ్లాదకరంగా మాట్లాడాడు.
ఇంత ప్రతిభ కల సచివుడుంటే - ముల్లోకాలనూ జయింఛగలం. కనుక ఇతనితో నువ్వు సముచితంగా మాట్లాడు, అన్నాడు.
తనంత వాడయిన లక్ష్మణుని ఈ విధంగా హెచ్చరించి రాముడు మాట్లాడడం ఇతఃపూర్వం ఎప్పుడూలేదు, అనంతరం అసలు కనబడదు.
రామాయణంలో ఈ చివరినుంచి ఆ చివరకు చదివిన వారికి కూడా రాముని నోట యిటువంటి ప్రశంస ఎవరికీలేదు. ఆయన ప్రశంసించిన వారే, లేరు. హనుమంతుడు తప్ప.

అంటే-
హనుమంతుడు వచ్చి మాట్లాడిన మూడు మాటలలో ఆయన శక్తి సామర్థ్యాలను గ్రహించి, ఆ శక్తిని అభినందించిన ఉత్తమనాయకుడు రామచంద్రుడు. అటువంటి ఉదాత్తశీలుని అభినందనలను అరనిమేషంలో అందుకున్న అద్భుత ప్రతిభాశాలి హనుమంతుడు.
వాల్మీకి రామాయణంలో హనుమంతుని పాత్ర ఇలా ప్రవేశించింది.
అంటే మాట్లాడడం అనే విద్య హనుమంతుని వెంట తిరిగి సర్వ మానవ ప్రాణీ నేర్చుకోవాలని భావించాడు మహర్షివాల్మీకి.
ఎందువల్ల?
మాట ఒక్కటే మానవ ప్రాణికి లభించిన వరం. మిగిలిన ఆహార, నిద్రా, భయ, మైథునాదులు సృష్టిలో అన్ని ప్రాణులకూ సహజమే,

భార్యా విరహంతో రాముడు తిరిగి తిరిగి కిష్కింధచేరి సుగ్రీవునితో స్నేహంచేసాడు.
భూగోళంలోని వానర సంఘాలకు అధిపతి - వాలి - మహా బలిష్ఠుడు.
చతుర్దశ భువనాలనూ విలవిలలాడించిన లంకేశ్వరుడైన, రావణుని వంటి మహావీరుని తన చంకలో ఇరికించి సముద్రాల ముంచి వదలిన వీరుడు వాలి.
అంతటివాడు - రాముడు విడిచిన ఒకే ఒక్క బాణంతో నేలకూలినాడు. అది చూసిన వానర యోధులు గజ, గవయ, గవాక్ష, గంధమాదన, నల, నీల, మైంద, ద్వివిదాదులందరూ కొయ్యబారిపోయారు.
నోట మాట లేకపోగా, గట్టిగా ఊపిరి పీల్చలేకపోయారు.
వాలి నేల కూలిన వార్త వినీ వినగానే హుటాహుటి వచ్చింది. వానరేశ్వరుని భార్య తార.
వస్తూనే భర్త దగ్గర కూలబడి ఏడ్చింది, ఏమేమో అనుకున్నది. అందరూ శిలా ప్రతిమలవలె నిలబడి వింటున్నారు. ఆవిడ ఎదుట నిలిచి మాట్లాడే ధైర్యం లేదెవరికీ.
అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి:
మహారాణీ! జగదేక మల్లుడయిన వానరేశ్వరుని పట్టపురాణివి, నువ్వు శోకిస్తున్నావా! సర్వవానరయోధులతో కిష్కింధ నీ కనుసన్నలలో నడుస్తుంది. గుండె నిబ్బరం చేసుకుని నీ బిడ్డను సింహాసనం మీద కూర్చోబెట్టు. నీ బుద్ధిబలం వానరరాజ్యానికి పెట్టనికోట........... అన్నాడు.
అదీ హనుమంతుని ధీశక్తి. అమే కుమారుని సింహాసనం ఎక్కించమన్నాడు.
భర్త మరణం ఎంతగా వేధిస్తున్నా, కన్నకొడుకు రాజు కాబోతున్నాడంటే తల్లి గుండె ఎంత పొంగి పులకించాలి. పయిగా నాటి వరకూ ఆవిడ అలోచన మీదనే వానర రాజ్యం నడుస్తున్నది. ఆ అధికారం పోకుండా ఆమె కొడుకు సింహాసనం ఎక్కుతాడు.
అయితే -
సుగ్రీవుడికి రాజ్యం యిస్తానని మాట యిచ్చాడుకదా రాముడు, ఆ విషయం ఎరగడా హనుమంతుడు!
ఎరగక కాదు- తారవంటి ధీశక్తి సంపన్నురాలు తన కొడుకుని ఆ సమయంలో రాజ్యాధిపతిని చెయ్యడానికి అంగీకరించదని తెలుసు హనుమకు.
అదే జరిగింది.
సుగ్రీవుడు రాజుగా పట్టాభిషిక్తుడయాడు.
వర్షాకాలం వచ్చింది. వానలు తగ్గగానే సీతాన్వేషణకు వానరసేనలను పంపుతానన్నాడు.
అన్నాడు కాని రాజ్య భోగాలలో, మదిరాపాన - మదవతీ, పరీరంభాలలో ప్రపంచాన్నే విస్మరించాడు.
వానలు తగ్గినా సుగ్రీవుని జాడ లేకపోవడంతో రాముడు లక్ష్మణుని పంపించాడు. కోటగుమ్మంలో నిలబడి ధనుష్టంకారం చేశాడు లక్ష్మణస్యామి. కిష్కింధ యావత్తూ కంపించింది. సుగ్రీవుని మత్తు దిగిపోయింది. లక్ష్మణుని వెంట రాముని సమీపించి, పాదాభివాదం చేసి, వానర వీరులను నాలుగు
దిక్కులకు పంపుతూ, దక్షిణదిశగా వెళ్ళేవారికి జాంబవంతుడు నాయకుడనీ, అంగదుడు బలాధిపతి అనీ, హనుమంతుడు సేనాధిష్ఠాత అనీ అన్నాడు.
వారు బయలుదేరుతూండగా రాముడు హనుమంతుని పిలిచి తన అంగుళీయకం యిచ్చి జానకీదేవికి గుర్తుగా చూపమన్నాడు. అంటే ప్రభువయిన రామునికి తన ఎదుట నున్న వారిలో ఎవరు ఎంతటివారో గ్రహించి వారిని ఉచితరీతిని సమ్మానించడం తెలుసు. అది మరో కథ.
వానరవీరులందరూ సముద్రతీరం చేరారు.
అంతవరకూ ఉరకలు వేసిన ఉత్సాహం సముద్ర దర్శనంతో చల్లబడింది.
నాయకుడయిన జాంబవంతుడు వారిని ఆశ్వాసించి, హనుమంతుని లేపాడు. బయలుదేరాడు హనుమంతుడు.
ఇది వెుదటి నాలుగు కాండలలో కథ, ఇక అయిదవదయిన సుందరకాం౦డ.
ప్రస్థానం
త్రికూటగిరి

No comments:
Post a Comment