గాయత్రీ కవచానికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులే ఋషులు. ఋగ్యజుస్సామాధర్వణాలే ఛందస్సులు. బ్రహ్మరూపిణి గాయత్రీదేవియే అధిదేవత. కవచమిది తద్బీజకం. భర్గశక్తికం. ధీకీలకం. (ధియ ఇత్తి కీలకమ్). మోక్షార్థే వినియోగః. దీనిలో నాలుగు వర్ణాలు హృదయం. మూడు వర్ణాలు శిరస్సు. నాల్గింటితో శిఖ. తర్వాత మూడింటితో కవచం. అటుపైని నాల్గింటితో నేత్రం. తక్కిన నాల్లూ అస్త్రకం. ఇక దీని ధ్యానశ్లోకమేమిటంటే -
ముక్తావిద్రుమహేమనీల ధవళచ్చాయైర్ముఖైస్త్రీక్షణై
ర్యుక్తా మిందు నిబద్ద రత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ ।
గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదామ్
శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే॥
గాయత్రీదేవి తూర్పుదిక్కున రక్షించుగాక. సావిత్రి దక్షిణదిక్కునా, (బ్రహ్మ) సంధ్యాదేవి పశ్చిమదిక్కునా, సరస్వతీదేవి ఉత్తరదిక్కునా, పార్వతి ఆగ్నేయదిక్కునా జలశాయిని నైరృతిదిక్కునా పవమానవిలాసిని వాయవ్యదిక్కునా రుద్రాణి ఈశాన్యదిక్కునా బ్రహ్మాణి ఊర్ధ్వదిక్కునా వైష్ణవి అధోదిక్కునా - ఇలా దశదిశలా ఆ భువనేశ్వరి నన్ను రక్షించుగాక.
తత్పదం నా పాదాలనూ, సవితుః పదం జంఘలనూ, వరేణ్యం పదం కటిప్రదేశాన్నీ, భర్గః పదం నాభినీ, దేవస్య పదం హృదయాన్నీ ధీమహి పదం చెక్కిళ్ళనూ, ధియఃపదం నేత్రాలనూ, యఃపదం లలాటాన్ని, నః పదం శిరస్సునూ, ప్రచోదయాత్ పదం శిఖాభాగాన్నీ - రక్షించును గాక! ఇలాగే తత్‌వర్ణం శిరస్సునూ, సకారం ఫాలాన్నీ 'వి' వర్ణం నేత్రాలనూ, తుకారం కపోలాలనూ, వకారం నాసాపుటాలనూ, రేకారం ముఖాన్నీ, ణికారం పై పెదవిని, యమ్‌కారం కింది పెదవినీ, భకారం ఆస్య మధ్యభాగాన్నీ, ర్గోవర్ణం చిబుకాన్నీ, దేకారం కంఠప్రదేశాన్నీ, వకారం భుజస్కంధాలనూ, స్యకారం కుడి చేతినీ, ధీకారం ఎడమ చేతినీ, మకారం హృదయాన్నీ, హికారం ఉదరభాగాన్నీ, ధికారం నాభినీ, యోకారం కటి ప్రదేశాన్ని, మరొక యోకారం మర్మాంగాన్నీ, నః వర్ణం రెండు తొడలనూ, ప్రకారం జానువులనూ, చోకారం జంఘలనూ, దకారం గుల్భాలనూ, యాకారం పాదాలనూ, తకారపు పొల్లు సర్వాంగాలనూ రక్షించుగాక!
నారదా! ఇది గాయత్రీ కవచం. దీన్ని ఇట్లా అనుసంధానం చేసుకున్నవారూ (ధరించినవారూ) విన్నవారూ అనంతకోటి బాధలనుంచి విముక్తి పొందుతారు. చతుష్షష్టి కళావేత్తలవుతారు. సర్వపాపవిముక్తులవుతారు. పరబ్రహ్మస్వరూపాన్ని అందుకుంటారు. సందేహంలేదు.
గాయత్రీ హృదయం

No comments:
Post a Comment