రామాయణం సుందరకాండ పదునాలుగవ సర్గ - అశోకం
రావణ భవనప్రాకారం వదలి అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు. ఒక్కసారి శరీరమంతా పులకించింది. తెలయని సంతోషం ఆవహించింది.
వసంత ప్రారంభవేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పాన్న, మామిడి, అశోక, సంపెంగవృక్షాలు గుంపులు గుంపులుగా వున్నాయి.
నారి సారించి విడచిన బాణంలా దూసుకుపోయాడు హనుమంతుడు. రంగు రంగుల పక్షులు, ఎన్నెన్నో రకాల మృగాలు, తుమ్మెదలు, కోకిలలు, నెమళ్ళు.
ఆయన గమనవేగానికి పక్షులన్నీ నిద్రలేచాయి. ఆ పక్షులు రెక్కలాడిస్తూంటే సాలవృక్షం మీది పూలు వానజల్లులా నేలకు రాలాయి.
అవి శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్పపర్వతంలా ఉన్నాడు.
పుష్పాలంకృతుడై విహరించే ఆయన వసంతునివలె ఉన్నాడు. పూలతో నిండిన ఆ వనభూమి రకరకాల ఆభరణాలతో అలరారే సుందరీమణిలా ఉంది.
ఆకులురాలిన కొమ్మలతో, పూలు, పండ్లులేని శాఖలతో ఆ వృక్షాలు వస్త్రాభరణాలుకూడా ఓడిన జూదరిలా ఉన్నాయి.
ఆయన తన వాలంతో, దీర్ఘబాహువులతో, పాదాలతో మర్దించిన వృక్షాలు-
శరీరంమీది గంధపుపూత రాలిపోయి, జుట్టు విరబోసుకుని, దంతక్షత, నఖక్షతాలతో నిండిన యువతిలా ఉన్నాయి.
వింధ్యగిరిమీది వర్షామేఘాలు ప్రచండ వాయువుతో చెల్లా చెదరయినట్లు, హనుమంతుని విహారగమనతీవ్రతకు ఆ వనంలోని లతలన్నీ చెదరిపోతున్నాయి.
తిరుగుతూ చూస్తున్నాడు హనుమంతుడు.
సువర్ణ, మాణిక్య, రజత కాంతులీనే ప్రదేశాలు.
స్ఫటిక సోపానాలతో దిగుడుబావులు.
వాటినిండా కలువలు, కమలాలు.
హంసల, చక్రవాకాల, చాతకాల కలస్వనాలు, అమృతమధురంగా ఉండే జలాలు.
అందమయిన గిరిశిఖరాలు. వాటిమీద ఎన్నో వృక్షాలు. ఆ చుట్టూ శిలామండపాలు.
ప్రియుని ఒడినుండి దూకుతున్న ప్రియురాలివలె ఆ గిరిశిఖరం నుండి జారుతున్న సెలయేరు. దానిలోకి వంగిన కొమ్మలుగల వృక్షాలను చూస్తూంటే, ఎంత కోపం వచ్చినా ప్రియుని విడచి పోకూడదమ్మా, అని వారించే ఆత్మబంధువుల్లా వున్నాయి.
ఒక వంక దూకి, మలుపు తిరిగిన ఆ యేరు, కోపంవదలి ప్రసన్నురాలయి భర్తను చేరే ప్రేయసిలా ఉంది.
ఆ సమీపంలో రకరకాల విహంగాలు. ముత్యాలకాంతి యిసుకతో, మణిసోపానాలతో, చల్లని నీటితో అలరారే దిగుడుబావి.
ఆ పరిసరాలలో విశ్వకర్మ వినిర్మితమయిన క్రీడావన, భవనాలు. తెల్లని గొడుగులు, బంగారు వేదికలు, సెలయేళ్ళు, శింశుపావృక్షాలు.
అగ్నికాంతులీనే వృక్షాలమిద తిరిగే హనుమంతుడు మేరుపర్వత దీప్తులతో వెలిగే సూర్యునివలె ఉన్నాడు.
బంగరు కాంతుల తరువులను చూస్తూ, గాలి కదిలితే చిరుగంటల మ్రోతలీనే ధ్వనికల శింశుపావృక్షం అధిరోహించాడు. అది లేతచివుళ్ళతో, మొగ్గతొడిగి, వికసితముఖాలుకల పూలతో ఉంది.
ఇక్కడ జానకి ఉండవచ్చు. రామదర్శనకాంక్షతో ఆమె యీ పరిసరాలలో తిరుగుతూ ఉండాలి. ఈ చుట్టుప్రక్కల అంతా పొగడలు, సంపెంగలు, మంచిగంధపు తరువులు. జలపక్షి సమూహాలతో పద్మసరోనరం.
రామమనోహరి జానకి. వనశోభలెరిగిన ఆ రాఘవహృదయేశ్వరి, రామ విరహబాధతో తప్పకుండా యీ వనానికి వస్తుంది.
జనకరాజనందన, రామచంద్రుని అర్ధాంగి, వనవాసప్రియ, సంధ్యాసమయ విధ్యుక్త కార్యనిర్వహణకై యీ శుభప్రదమయిన జలాశయం దగ్గరకువచ్చి తీరుతుంది. ఆవిడ జీవించివుంటే యిక్కడకు రాకుండా ఉండదు, అనుకుంటూ శింశుపావృక్షం మీద నుండి అంతటా పరికిస్తున్నాడు హనువముంతుడు.
సీతాసందర్శనం
రామాయణం సుందరకాండ
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Tuesday, August 11, 2026
Subscribe to:
Post Comments (Atom)
Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం
శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం గాయత్రీ సహస్ర నామావళి నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్ర...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment