ఈ ప్రాతస్సంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత ఖేచరీముద్రను మునిపుంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే - ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తమూ జిహ్వా ఆకాశంలో (ఖే) సంచరిస్తూ ఉంటాయి. దృష్టి భూమధ్యభాగంలో స్థిరంగా నిలుస్తుంది. కనక దీన్ని ఖేచరీముద్ర అన్నారు. నారదా! సిద్ధసమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు, ఖేచరీ సమానమైన ముద్రలేదు. ఇది ముమ్మాటికీ సత్యం.
అంఘ్రిమూలాలతో యోనిముద్ర చేసి దానిమీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచాలి. మనస్సును కదలనివ్వకూడదు. నడుం నిలబెట్టి సమంగా స్థాణువులా కూర్చోవాలి. భ్రూమధ్యభాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైన సిద్దాసనం. ఇలా కూర్చుని ఆయాతు వరదా దేవీత్యాది శ్లోకాలతో గాయత్రీమాతను ఆహ్వానించి సర్వదేవి నమోస్తుతే అని నమస్కరించాలి. తేజోஉసీత్యాది మంత్రాలతో ఆవాహన చెయ్యాలి. నేను చేసిన ఈ నీ అనుష్ఠానం సంపూర్ణమగుగాక ఆని అకాంక్షించాలి. అభ్యర్థించాలి.

అటుపైని శాపవిమోచన విధానాన్ని శ్రద్ధగా ఆచరించాలి. బ్రహ్మ- వసిష్ట - విశ్వామిత్ర శాపాలు వారి స్మరణలతో అంతరిస్తాయి. ఇది అయ్యాక సత్యాత్మకుడూ సర్వజగత్స్వరూపుడూ చిద్రూపుడూ వాచామగోచరుడూ అద్వితీయుడూ అయిన ఆ పరమాత్మను హృదయపద్మంలో ధ్యానించాలి.
అటు పైని సంధ్యావందనానికి అంగభూతాలైన అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి. ప్రతీమంత్రానికీ ముందు ఓంకారం పలకాలి. ఓం భూః పాదాభ్యాం నమః ఓం భువః జానుభ్యాం నమః. ఓం స్వః కటిభ్యాం నమః. ఓం మహః నాభ్యై నమః. ఓం జనః హృదయాయ నమః. ఓం తపః కంఠాయనమః. ఓం సత్యం లలాటాయ నమః. ఓం తత్సవితుః అంగుష్టాభ్యాం నమః. ఓం వరేణ్యం తర్జనీభ్యాం నమః. ఓం భర్గోదేవస్య మధ్యమాభ్యాం నమః. ఓం ధీమహి అనామికాభ్యాం నమః. ఓం ధియో యోనః కనిష్ఠికాభ్యాం నమః. ఓం ప్రచోదయాత్ కరతలకరపృష్ఠాభ్యాం నమః.
ఓం తత్సవితుర్బ్రహ్మాత్మనే హృదయాయ నమః. ఓం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా. ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వౌషట్. ఓం ధీమహి శక్త్యాత్మనే కవచాయ హుమ్. ఓం ధియో యోనః కళాత్మనే నేత్రత్రయాయ నమః. ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్.
అక్షరన్యాసమూ ముద్రలూ

No comments:
Post a Comment