దశమహా విద్యలలో 8వ మహావిద్య శ్రీ బగళాముఖీ దేవి. సృష్టిలో పరమాత్మ యొక్క సంహార శక్తికి ప్రతిరూపమే బగళాముఖి దేవి. ఆమ్మవారి జపము, స్మరణము, సాధన, ధ్యానము ఇవన్ని శత్రుబాధలనుండి మనలని రక్షించి వారిని జయించె శక్తినిస్తాయి. అమ్మవారి సాధనా తంత్రాన్ని “పీతాంబర విద్యా అంటారు. అందుకే అమ్మవారి సాధనలో పసుపు రంగు పూలు, వస్తువులు, పసువు రంగు దండ, పసుపు రంగు వస్త్రం అత్యంత శ్రేష్టమైనవి. మంగళవారంతో కూడిన చతుర్దశి నాటి అర్థరాత్రి సమయంలో బగళాముఖి జన్మించినట్లు చెబుతారు. విష్ణు తేజం వలన అవతరించింది కాబట్టి అమ్మవారు వైష్ణవి అయింది. ఈమెనే పీతాంబరదేవి, బ్రహ్మాస్త్రరూపిణి అని పిలుస్తారు. శ్రీ బగళాముఖీ దేవినే బగల, భగలా, వగళ అని కూడా అంటారు.
బగళాముఖీ పసుపు వస్త్రాలను ధరించి, గదా ధారిణియై మాదనుడనే రాక్షసుని నాలుకను ఛిద్రం చేస్తున్న రూపంలో కనబడుతుంది. కొన్ని చోట్ల అమ్మవారి రూపం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది.
ఒకనాడు భూమండలంపై పాపభారం వలన ప్రళయం సంభవించింది. బ్రహ్మ రుద్రాదులు సౌరాష్ట్ర ప్రాంతంలో సమావేశమై పరిష్కారం కొరకు అన్వేషించారు. ఆ సమయంలో అక్కడగల హరిద్రా సరోవరం నుండీ భగళాముఖీదేవి ఉద్భవించి భూమండలాన్ని పరిరక్షించింది. దేవీ పురాణంలో చెప్పబడ్డ హరిద్రా సరోవరాన్ని పోలిన సరోవరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియాలోగల పీతాంబర పీఠంలో ఉంది.
బగళాముఖీ అవతారానికి సంబంధించి మరొక కథ ప్రచారంలో ఉంది. మాదనుడనే రాక్షసుడు త్రిమూర్తుల కొరకు ఘోర తపస్సుని ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు వరం కోరుకోమని అడుగగా, తాను ఏది మాట్లాడితే అది సంభవించాలని అజేయమైన వాక్సుద్ధిని కోరుకున్నాడు. అందుకు త్రిమూర్తులు గత్యంతరం లేక సమ్మతించారు. వరం సహాయంతో ఆ రాక్షసుడు ముల్లోకాలనూ నాశనం చేయనారంభించాడు. అప్పుడు ఉగ్రరూపిణియెన కాళిక భగళాముఖిగా అవతరించి అతని నాలుకను ఛిద్రం చేసింది.
స్వతంత్ర తంత్రంలో అమ్మవారి కథ చెప్పబడి ఉంది. కృతయుగంలో ఒకసారి భయంకరమైన వాయు బీభత్సం ఏర్పడింది. అప్పుడు ముల్లోకాలూ అల్లకల్లోలాలై అతలా కుతలమైనాయి. ఈ జగద్వినాశనానికి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు హృదయం ద్రవించింది. “ఈ ఉపద్రవం నుండి జగత్తును కాపాడేశక్తి ఆ పరాశక్తి మాత్రమే” అని భావించాడు. సౌరాష్ట్రలోని ఒక హరిద్రాహ్రదం (పసుపు కొలను) సమీపంలో శ్రీ మహా త్రిపురసుందరీ దేవిని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తల్లి శ్రీ మహావిష్ణువు తపస్సుకు మెచ్చి, సాక్షాత్మరించింది. తన దివ్య తేజస్సును ఆ కొలనులోకి ప్రసరింప జేసింది. సరిగ్గా అప్పుడే శ్రీ మహావిష్ణువు తేజస్సుతో సమ్మిళితమై, దివ్య తేజో రూపంగా, అక్కడ శ్రీ బగళాముఖి దేవత పసుపు వర్ణంలో అవతరించింది. ఆ మహోపద్రవాన్ని తక్షణమే స్తంభింపజేసింది. జగతును ప్రశాంత స్థితికి తెచ్చింది. కనుకే, శ్రీ బగళాముఖీ దేవత 'స్తంభన శక్తి స్వరూపం'గా ప్రసిద్ధి పొందింది. హరిద్రాహదంలో ఆవిర్భవించినందువల్ల శ్రీ బగలాముఖి దేవతా స్వరూప మంతా 'పిత (పసుపు) వర్ణమే” అని అంటారు.
శత్రువులను స్తంభింపజేయడం భగళాముఖీ లక్షణం. శత్రుపీడలు తొలగి, ప్రమాదాలు నివారించబడతాయి. భగళా ముఖీదేవిని తాంత్రి కంగా కాకుండా సాత్వికంగా కూడా పూజించవచ్చు.
భగళాముఖీదేవిని తాంత్రిక ఉపాసన చేయదలచిన వారైనా, సాత్విక ఉపాసన చేయదలచినవారైనా తప్పని సరిగా గురువు అనుమతి తీసుకోవాలి. అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్టించి నియమ నిష్టలతో స్తోత్రాన్ని పఠించాలి.
బగళాముఖి సాధన చేసే వారి ఎదురుగా ఎవరైనా వశీకృతులౌతారు, అగ్నివలె ఉన్నవాడు కూడా చల్లబడతాడు, కుపితుడు శాంతుడౌతాడు, దుర్జనుడు సుజనుడౌతాడు, మహావేగి నెమ్మదిస్తాడు, గర్వితుడు వినయ వంతుడౌతాడు, సర్వజ్ఞుడు కూడా జడుడౌతాడు. బగళోపాసకుని ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు.
వారాహి అంటే వరాహముఖం కలిగిన దేవత. నారసింహీ అంటే సింహ ముఖం కలిగిన దేవత. అలాగే బగళాముఖి అంటే బగళ యొక్క ముఖము కల్గిన దేవత. బగ అన్న శబ్దము నిఘంటువులలో ఎక్కడా లేదు. దేవత యొక్క ఆకారం, చిత్రాలలోనూ ధ్యాన శ్లోకాలలోనూ మానవ ముఖంగానే చెప్పబడినది. దీనికి రెండు రకాలు అర్జాలు పండితులు చెబుతున్నారు. “బకంలాతి ఇతి బకళా” అదే భగల అయినది. అనగా కొంగ ముఖము కలిగినది అని అర్ధం. మరొక అర్ధం కశ్యప పశ్యక అయినట్లు పైన హింస సింహ అయినట్లు కళ్ళం అన్న అర్థం కల్గిన వల్ల శబ్దం వర్ణ వ్యత్యయం చేత వగళ అయిందని ఈ దేవత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. రుద్రయామళంలోని ఆమె స్తుతి ప్రకారం రభేదః అన్న సూత్రంచేత బగ అయిందని కొందరి అభిప్రాయము.
మరికొందరి అభిప్రాయం ప్రకారం బగళ అన్న పదానికి నిఘంటు అర్థమైతే కనిపించదు. వేద దేవతలకు సంబంధించిన కొన్ని కొన్ని వర్ణనలో మాత్రం వగళముఖి అన్నారు. వల్గ అంటే కళ్ళెం అని అర్థం. దీని నుంచి వగళ పుట్టి ఉండవచ్చు. బెంగాల్ లాంటి ప్రాంతాల్లో వ, బ లకు ఖేదం ఉండదు. అందుకే వగళ కాస్త బగళ అయి ఉండవచ్చు. అంటే ఎలాంటి కదిలే శక్తులకైనా కళ్లెం వేసేది అని అర్థం చెబుతారు.
బంగారు రంగు శరీరకాంతితో, పసుపు రంగు ధరించి, పచ్చని చంపక పుష్పాల మాల ధరించి, నాలుగు చేతులలో గద, పాశము, వజ్రము శత్రువు యొక్క నాలుక, చంద్రాలంకృతమైన కిరీటంలో, మూడు కన్నులతో బంగారు సింహాసనముపై సదా కూర్చుని ఉండే శత్రు స్తంభినియైన దేవత. చేతిలో శత్రువు నాలుకను పట్టుకొని గదతో మోడుతుందని ఆమెను బుషులు వర్ణించారు.
దశమహవిద్యల్లో ఏడుగురు విద్యాధిదేవతలు భయంకరంగా, బీభత్సంగా, సాత్వికంగా రకరకాల రూపాల్లో కనిపిస్తే బగళాముఖి రూపం మాత్రం కొత్తగా కనిపిస్తుంది. చేతిలో గద పట్టుకుని ఉంటుంది. రాక్షసుడి నాలుక బయటకు లాగి పట్టుకుని గదతో కొడుతుంది. ఈమె పేరే విచిత్రం. ఆ పైన ఆమె వేషధారణ మరీ విచిత్రం.
బగళాముఖి త్రిలోక స్తంభనం చేయగల సామర్థ్యం, శక్తి ఇస్తుంది. శత్రువులను మరియు హాని కలిగించే వారిని అదుపు చేయగల శక్తి ఇస్తుంది. యుద్దాలలో బగళాముఖి దేవి యొక్క శక్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పోలీస్, మిలటరి, సెక్యూరిటీ, గూఢచారి, వస్తాదులు, లాయర్లు , జడ్జిలు మొదలైన వారు బగళాముఖి యొక్క ఆధిపత్యము లో ఉంటారు. జన్మ కుండలిలో కుజుడు నీచం పొందిన వారు, కుజుడు శని కలిసి ఉన్న జాతకులు, కుజుడు రాహువు కలిసి ఉన్న జాతకులు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగు పుష్పాలతో బగళాముఖిని గురుముఖతః తీసుకుని సాధన చేయాలి. కాలేయం, జీర్ణవ్యవస్థ, క్లోమం, కడుపు, కుటుంబంలోని జేష్ట సంతానం వీరందరికీ బగళాముఖి ఆధిపత్యం వహిస్తుంది అని అంటారు.
సుధా సముద్రము మధ్యలో మణిమయ మండపములో సింహాసనముపై కూర్చొని పసుపు రంగు మాల, పూలు, వస్త్రాలు ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మ. ఒక చేత దుష్ట రాక్షసుల నాలుకను పట్టుకొని మరోచేత ముద్గరను పట్టుకొని దర్శనమిస్తుంది అమ్మ.
అమ్మ సృష్టిలోని అన్ని పదార్థాలలో స్తంబన, అస్తంబన శక్తిగా పృథ్వీ రూపమై కొలువుతీరింది. ఆ శక్తివల్లే ఆదిత్య మండలం, స్వర్గము మొదలైన వన్ని నిలబడి ఉన్నాయి. సమాజములోని దుఃఖాలను, పాపాలను, అన్యాయ అధర్మాలను పారద్రోలే మంత్రాలలో భగళాముఖి మంత్రానికి సమానమైనది లేదు. కుండలి తంత్రంలో అమ్మవారి జపానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది.
ముండమాలా తంత్రంలో అమ్మవారి సాధనకు నక్షత్ర గ్రహాది కాలశోధనము అవసరమే లేదని శ్రద్దాభక్తులు ముఖ్యమని చెప్పబడి ఉంది. అమ్మవారు తన మంత్రంలో ఐదు స్వరూపాలుగా మనకు కనిపిస్తారు.
1) బడవాముఖి 2) జాతవేదముఖి 3ఉల్కాముఖీ 4) జ్వాలాముఖి 5) బృహత్భానుముఖి.
మొట్టమొదటగా సృష్టికర్త అయిన బ్రహ్మ అమ్మవారి సాధన చేసాడట. ఆ తరువాత ఆ విద్యను సనకాది మునులకు ఉపదేశించగా సనత్కుమారులు నారదుడికి, నారదుడు సాంఖ్యునికి, అలా సాంఖ్యుడు పదహారు అధ్యాయాలు కల భగళాతంత్రాన్ని రచించాడు. అలా అది బ్రహ్మండ మంతా వ్యాప్తి చెందింది. ఈ విద్యని పరశురాముడు ద్రోణాచార్యుడికి కూడా ఉపదేశించాడు అని చెబుతారు.
దుర్గముడను అసురునితో దేవి ఘోరయుద్ధము చేయుచున్నప్పుడు, ఏకానేక స్వరూపధారణను క్రీడగా ధరించు తల్లి సంకల్పముచే, శస్త్రాస్తములను ధరించిన అనేక శక్తులు తల్లి శరీరము నుండి ఆవిర్భవించినాయి. శత్రువు నాలుకను పట్టిలాగి, వాని వాక్కును స్తంభింపచేసి గదతో వాని నెత్తిన మొత్తి, సంహరించుటకు, అహంకారమునకు బద్ధశత్రువు యోధినీ దేవతయైన బగళాముఖిని దేవి తన శరీరమునుండి ఆవిర్భవింపచేసి, సైన్యాధికారిని చేసినది.
చేతిలో పసుపు కమలముతో అర్ధచంద్రాకార మకుటములో చంపక మాలాధారియై, సముద్రమధ్యములో స్వర్ణసింహాసనమును అధిష్టించి బగళాముఖి ఉంటుంది. చేతిలో పాశాంకుశములతో పాటు కుడి చేతిలో గదను ధరించి, ఎడమచేతితో శత్రువు నాలుకను బయటకు లాగి ధర్మపాలన చేస్తుంటుంది. మేని పసిమి కాంతితో, పసుపురంగును సూచించు అక్షర సంకేతముతో ప్రకాశిస్తూ, ఎర్రతామరలు చుట్టబడిన స్వర్ణ సింహాసనము అధిష్టించి, భక్తులను అనుగ్రహిస్తుంటుంది.
సమ్మోహన-స్తంభన అను విరుద్ధ శక్తులను తన అధీనములో నుంచుకొని మనలను అనుగ్రహిస్తున్న తల్లి బగళాముఖి. మన విరుద్ధ శక్తులను తల్లి తన కటాక్షముతో సహాయక శక్తులుగా మారుస్తుంది. మనలకు మాయ కమ్ముకునే స్థితిని నివారిస్తుంది. మన క్షుద్ర శక్తులను స్తంభింపచేసి, సత్యమువైపు మనలను సమ్మోహితులను చేస్తుంది. అహంకారమునకు బద్ధశత్రువును నిర్మూలించే తల్లిని కొంగ ఏ విధముగా నీటిలోని ఎరను పట్టుకొనునపుడు బురద తగలనీయదో, అదే విధముగా తల్లి తన లోచూపుతో మనలను కర్తవ్య సుముఖులను చేస్తుంది.
బగళాముఖి మాయను నివారించే స్వభావము కలది. వాణికి ప్రతిరూపమైన ఈ శక్తి పరోక్ష ప్రీతిదాయిని. బగళాముఖిని ధ్యానించే సాధకుడు వామహస్తములో నాలుకని, దక్షిణ హస్తములో గదను భావించవలెను. దశావతారములలో కూర్మావతారముగ బగళాముఖి పరిగణించబడుతోంది.
మాయకు, అవిద్యకు ప్రతీకయెన పాశమును, జ్ఞానము విద్యకు సంకేతమైన అంకుశమును ధరించి ఉంటుంది. కుడిచేతిలో గద ఉంటుంది. సంమోహన, స్తంభన శక్తులుగల బగళదేవి మహాదేవి సైన్యమును రక్షిస్తుంటుంది.
నాలుకను మడిచి కొండనాలుకను తాకే విధానము హఠయోగ సాధన. కొండనాలుక మీద ధ్యానాన్ని కేంద్రీకరిస్తే భూతప్రపంచము మీద ఆధిక్యత లభిస్తుంది. మనలోని క్షుద్రభావములను మన దరిచేరనీయని గొప్పతనం బగళావిద్యకు మాత్రమే ఉందని చెబుతారు.
కుటుంబ పరంగాను, ఆధ్యాత్మికంగాను దేశంలోను, సమాజంలోను వికాసానికి అడ్డంకులుగా ఉన్న అరిష్టాలను రూపుమాపడానికి, శత్రువులను అణగత్రోక్కడానికి బగళాముఖీ మాతను ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణు, పరశురాములు ఈ దేవి ఉపాసకులే. చాలాకాలం వరకు తిరుపతి వేంకటేశ్వరుని బగళాముఖిగా పూజించారు అని కొందరి భావన.
ఓం భగళాముఖ్యై చ విద్మహే

సదంబిన్యై చ ధీమహి
తన్నో దేవ ప్రచోదయాత్
ఒకసారి కైలాసంలో రాక్షసులు మరియు దుష్టశక్తులు దండెత్తగా పార్వతీదేవి ఆగ్రహంతో వారిని అడ్డుకొనుటకు సిద్ధపడింది, ఎవ్వరు వారించినా ఆగలేదు, చివరకు బగాలముఖి అవతారంలో శత్రుసంహారం చేసింది. ఈ మహాశక్తి ఎదుటివారి ఆలోచనలు తిరగరాయగల శక్తి గలది. ఈమె శత్రువుల యొక్క నాలుకలను బయటకు లాగి విసిరి వేస్తుంది. మానవ శరీరంలో నాలుకకు ఎంతో ప్రాధ్యానంఉంది. మాటలు మాట్లాడటానికి, ఆహారం రుచి తెలియటానికి నాలుక అవసరం ఎంతైనా ఉంది. మనస్సులో ఉన్నమాటని దాచి ఇంకోరకంగా వివరించగల శక్తికూడా నాలుకకు ఉంది. శత్రువు యొక్క జీవితానికి అతిముఖ్యమైన నాలుకను పీకివెయ్యటం అంటే వాడిని శక్తి హీనుడిని చెయ్యటం అన్నమాటే. కనుకనే బగలాముఖీ శత్రువు నాలుకలను నిర్మూలిస్తుంది.
బగళాముఖీ దేవికి మూడు నేత్రాలుంటాయి. ఈమె శిరస్సుపై నెలవంక ఉంటుంది. ఈమె పసుపు రంగు వస్త్రాలు మరియు రత్నాలు ధరిస్తుంది. ఈమె తన శిరస్సున సంపంగి పూలను ధరిస్తుంది. ఈమె ఒకచేతిలో శత్రువుయొక్క నాలుకను పట్టుకుని, ఒక చేతో వాడి తల నరుకుతున్నట్లు కనిపిస్తుంది. మూడు లోకాలను స్తంభింపచేయగల ఈ ఉగ్రమూర్తిని వశంచేసుకోగలిగిన వారికి ఈ ప్రపంచంలో ఎదురనేది ఉండదు.
పసుపు పచ్చని పుష్పాలు, పసుపు పచ్చని వస్త్రం, పసుపు పచ్చని గంధం, పసుపు పచ్చని రత్నాలు బగలాముఖి దేవతకు అత్యంత ఇష్టమైనవి. అందుకే, ఆమెను 'పీతాంబా అని కూడా పిలుస్తారు.
శత్రువులు మనకు కష్టం కలిగించడానికి చేసే ప్రయత్నాలను తుత్తునియలు చేసే మహాశక్తిశాలిని ఆమె. శత్రువులు మన వినాశనం కోసం చేసే ప్రయత్నాలను తొలగించి, మనకు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. కాబట్టే, ఆమెను బగలాముఖి అని వ్యవహరిస్తారు. 'శత్రువులు చేసే దుష్ట ప్రయోగాలను నివారించి, శ్రేయస్సును ప్రసాదించేది'గా బగళాముఖి వ్యక్తమవుతుంది. బగళా ఉపాసకులను శత్రువులు ఏమీ చేయజాలరు. ఒకవేళ ఏమైనా చేయాలని అనుకుంటే వారు తమకుగా తాము వినాశనాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని దేవీ ఉపాసకులు విశ్వసిస్తారు.
బగళాంబ శత్రువులనుకూడా మిత్రులుగా మారుస్తుంది. అందుకే, బగళాముఖీ ఉపాసకులకు కష్టం కలిగించే సాహసం కూడా ఎవ్వరూ చేయజాలరు. బగళా శబ్దానికి మరొక అర్థంగా 'బగం వాచం లాతీతి బగలా'ను చెబుతున్నారు. వాచా అలతి భూషయతీతి అనే ఈ రెండు వ్యుత్పత్తులతో ఉపాసకులకు వాక్ ప్రదాయినియై, శత్రువులకు వాక్‌స్తంభనగా అమ్మవారు దర్శనమిస్తున్నది. దీని పరమార్థం ఇంతేకాదు, 'బగలా ఉపాసకుల మాటలకు ఎదురు చెప్పేవారు ఎవరూ ఉండరని, ఒకవేళ ఎవరైనా దానికి ప్రయత్నించినా అది విఫలయత్నమే అవుతుందని శాస్త్రప్రమాణం ఉన్నది.
బగళా ఉపాసకులకు అమ్మ గంగా ప్రవాహం వంటి గద్య పద్యాత్మకమైన కవితాధారను ప్రసాదిస్తుంది. రామాయణ, మహాభారత కాలాల్లో కూడా ఎందరో రాజులు తదితరులు ఈ విద్యను ఉపాసించి బగళాముఖీ అనుగ్రహాన్ని పొందినట్లు వేద విజ్ఞానులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ, సైంధవ సంహార సమయంలో స్తంభన దేవత అయిన బగలాముఖి అనుగ్రహంతోనే సూర్యుడిని స్తంభింపచేశాడు.
మన శరీరంలో నోటిలో ఉండే కొండ నాలుకని ఇంద్రయోని అంటారు. ఆ కొండనాలుక బగళాముఖీ దేవి నివాసస్థానం. ఈ యొక్క ప్రదేశం - కళ్ళు, చెవులు, ముక్కులని కలిపే సంగమ ప్రాంతం. ఇక్కడే ఈ మహావిద్య కొలువుదీరి ఉంటుంది.
శంకర భగవత్పాదులవారు వారి గురువు గోవింద భగవత్సాదుల వారి సమాధిని రేవానది ముంచేస్తుంటే త్రైలోక్య స్తంభన (బగళాముఖి) దేవతోపాసన, అనుగ్రహంతో దానిని స్తంభింపజేయడం చారిత్రక సత్యం. ఈ విధంగా ధార్మిక సంకల్పాలను శీఘ్రంగా సిద్ధింపజేస్తూ విశ్వకళ్యాణ దాయకమవుతున్నదీ బగళాముఖీ విద్య.
బగళాముఖీ బ్రహ్మాస్త్ర విద్యను అనాదిగా ఎందరో దేవతలు, ఋషులు ఉపాసించినట్లు పలు ప్రామాణిక కథనాలు వున్నాయి. తత్ఫలితంగా వారు తమ కార్యకలాపాలను అద్భుతంగా నిర్వహించుకున్నట్లు పురాణేతి హాసాలు తెలియజేస్తున్నాయి. మొదట బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాస్త్ర విద్యను ఉపాసించి దిగ్విజయంగా సృష్టి క్రియను ఆరంభించాడు. ఆ తర్వాత దీనిని సనత్కుమారులకు ఉపదేశించాడు. వీరు నారదునికి, నారదుడు సాంఖ్యాయనునికి ఉపదేశించినట్లు తెలుస్తున్నది. వారు దానిని దర్శించి, ప్రపంచానికి సాంఖ్యాయన తంత్రం తోపాటు అందించారు. ఆ తర్వాత విష్ణువు, శివుడు ఈ బ్రహ్మాస్త్ర ఉపాసన చేసినట్టుగా పురాణేతిహాసాల ద్వారా తెలుస్తున్నది.
అతి తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవత బగళాముఖీ. మనలో ఉన్న కామక్రోధాది అరిషడ్వర్గాలనే అంతః శత్రువుల్ని స్తంభింప చేయుటకు భక్తులు శ్రీ బగళాముఖీ మహావిద్యను ప్రార్థించాలి. ఎవరైతే ఈ దేవి స్తోత్ర పఠనం చేస్తారో వారి యొక్క శత్రువులను స్థంభింప చేస్తుంది. తన భక్తులకు అపకారం చేసే వారి నోరు కట్టిపడవేస్తుంది. శత్రునాశనం కావిస్తుంది.
గౌహతి లోని కామాఖ్య ఆలయంలో దశమహా విద్యల ఆలయాలు ఉన్నాయి. వాటిలో భగళాముఖి ఆలయం ఒకటి.
హిమాచల్ ప్రదేశ్‌లోని బంఖండిలో భగళాముఖి ఆలయం ఉన్నది. మధ్యప్రదేశ్‌లోని నల్ఖేడా లోనూ దాటియాలోనూ భగళాముఖి దేవి ఆలయాలు ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోగల పాపంకుళం లోనూ, కళ్ళిడై కురిచ్చి లోనూ భగళాముఖి దేవిని దర్శించవచ్చు.
ఉత్తర కర్ణాటకలోని సోమాల్పురాలో భగళాముఖి సిద్ధ పీఠం ఉంది. అమ్మవారు అక్కడి సిద్ధుని భక్తికి మెచ్చి స్వయంగా కొలువై ఉన్నదని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయం సుమారు 300 యేళ్ళ నాటిది.
నేపాల్‌లోని పఠాన్‌లో బగళాముఖి ఆలయం ఉంది.
చత్తీస్‌గఢ్‌లో బగలాముఖి ఆలయముకలదు. శ్రీ సూర్య మంగళ అద్వైత వేదపీఠము వారు తమిళనాడులోని పప్పంకులం గ్రామములో బగళాముఖీ ఆలయము నిర్మించడానికి పూనుకున్నారు
దశమహా విద్యలు

No comments:
Post a Comment