శ్రీకృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట
స్వామీ! ప్రాణనాయకా! నీవు విజృంభించి రాక్షసగణాలను సంహరిస్తుండగా నీ యుద్ధచాతుర్యాన్ని చూడాలని కోరుకుంటానుగదా! ఇప్పుడు నన్నుమన్నించి నీవెంట తీసుకొనివెళ్లు. యుద్ధంలో వెల్లడయిన నీ ప్రతాపాధిక్యాలను చూచివచ్చి నీదేవేరుల కందరికీ ప్రకటిస్తాను.
శ్రీకృష్ణుడు ప్రియపత్నితో ఈ రీతిగా పలికాడు.
సత్యభామా! మహాగజముల ఘీంకారాలు మదించిన తుమ్మెదల జుమ్మనే రొదలు కావు. గుర్రాల గిట్టల కొనలవల్ల రేగిన ధూళులు గాలికి చెదరిన తామరల పుప్పొళ్లు కావు. శత్రువుల ధనుస్సుల నుండి వదలిన బాణాలు, నీటి అలల తుంపురుల జడివానలు గావు.
రాక్షసరాజ సైన్యాలు - రాజహంసలూ, బెగ్గురు పక్షులూ కల సరస్సులు గావు. శత్రువులు ప్రయోగించే శూలాలూ, కత్తులు మొదలయిన యుద్ధపరికరాలు - తామరలూ కలువలూ కావు. నీవెక్కడ? యుద్ధప్రయాణ మెక్కడ? నేను తొందరగానే వస్తాను. నీవు ఇక్కడనే ఉండు. నా వెంట రానే రావద్దు.
శ్రీకృష్ణుడు పలికిన మాటలు విని సత్యభామ అతనికి ప్రేమ పుట్టునట్లుగా దగ్గరకు వచ్చి
ఆత్మాభిమానం గల సత్యభామ "దానవులయితే నాకేమి? దైత్యులయితే నాకేమి? నీ భుజాలు అనే కోటల చాటున ఉన్నప్పుడు అనుమానం కల్గుతుందా? నీవెంట వస్తాను" అని శ్రీకృష్ణుడు గౌరవపూర్వకమయిన చూపులతో చూస్తుండగా చేతులు మోడ్చి వంగి మొక్కింది.
శ్రీకృష్ణుడు తనకు నమస్కరించిన సత్యభామను పైకి లేవనెత్తి వెంటతీసుకొనిపోయి, గరుత్మంతుణ్ణి ఎక్కి ఆకాశమార్గాన ప్రాగ్జ్యోతిషపురంవైపు పయనించాడు. ఆ పట్టణం పర్వత, శస్త్ర, జల, అగ్ని వాయుదుర్గాలచేత చొరశక్యం గానట్టిది. అది మురాసురుడు కట్టిన త్రాళ్లచేత చుట్టబడింది. దాని దగ్గరకు చేరి
శ్రీకృష్ణుడు భయంకరుడై గదచేత పర్వతదుర్గాలను ముక్కలు ముక్కలు చేశాడు. వాడిగా ఉన్న బాణపరంపరలచేత శస్త్రదుర్గాలను నాశం చేశాడు. చక్రాయుధం దెబ్బతో వాయుజలాగ్ని దుర్గాలను రూపుమాపాడు. కత్తితో మురుడు చుట్టూ ఉన్న అగ్నిపాశాల్ని నరికాడు.
ఇంకనూ
మహారూపి అయిన శ్రీకృష్ణుడు గదాఘాతాలచే చుట్టుగోడనూ, దానిమీది యంత్రాలనూ పెకల్చినాడు. రాక్షసుల గుండెలు దిగులు పడేటట్లుగా ప్రళయకాల మేఘాల పిడుగుల వంటిదీ, జీవుల ఉసురులు దీసేదీ అయిన పాంచజన్యాన్ని పూరించాడు.
ప్రళయకాలమేఘగర్జవంటి పాంచజన్య ధ్వని విని, అయిదుతలలు గల మురాసురుడు నిద్రలేచాడు. ఆవులించాడు. ఒళ్లు విరుచుకొన్నాడు. నివాసస్థానమయిన నీటిని వదలి వచ్చి శ్రీకృష్ణుణ్ణి చూచాడు. ప్రళయకాలాగ్నివలె మండిపడుతూ చూడడానికి శక్యం కానివా డయ్యాడు. బొబ్బలు పెడుతూ, పంచభూతస్వరూపాలయిన లోకాలను పంచముఖాలతో మింగటానికి ప్రయత్నించే విధంగా దగ్గరకు వచ్చి, అగ్ని జ్వాలామయమయిన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. భూమ్యాకాశమధ్య ప్రదేశాలు నిండేటట్లుగా పెడబొబ్బలు పెడుతూ
మురాసురుడు బిరబిరా పరుగెత్తికొని వచ్చి "శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! ఆగు ఆగు!" అంటూ దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడు కూడా "మురాసురా! మురాసురా! ఇదిగో! ఈనాటితో దేవతల దుఃఖాలు తొలగిపోతాయి" అని మాటల్లో మించిపోయాడు. ఆతడిపైకి చెలరేగాడు.
ఆ సమయాన
శ్రీకృష్ణుడు గరుత్మంతునిమీద పడబోవుతున్న మురుని శూలాన్ని మధ్యలోనే చేతులతో ఆకస్మికంగా పట్టుకొని మూడు ముక్కలు చేశాడు. తర్వాత ఆ రాక్షసుని అయిదు ముఖాలందు వాడియయిన బాణాల్ని వేగంగా చొప్పించాడు.
మురుడు శ్రీకృష్ణునిమీద గదను ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు దాన్ని వేయిముక్కలు చేశాడు. తర్వాత మురాసురుడు చేతులు పైకెత్తికొని శ్రీకృష్ణునికి ఎదురుగా నడుస్తూ వేగంగా వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వినోదప్రాయంగా చక్రం దెబ్బతో అతనితలలు ఐదింటినీ ఖండించాడు.
ఇంద్రుడు వజ్రాయుధంతో శిఖరాల్ని బ్రద్దలు చేసి, పర్వతాన్ని కూల్చినట్లుగా శ్రీకృష్ణుడు చక్రంతో తలలు నరికి మురాసురుణ్ణి పడగొట్టాడు. మురుడు నీళ్లల్లో కూలిపోయాడు.

అతనికి ఏడుగురు కొడుకులు. వారు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు. వీరు తండ్రిచావుకు క్రోధం చెలరేగగా, శ్రీ కృష్ణుణ్ణి రణక్రీడలో చంపాలని నిశ్చయించారు.
శివుడు సప్తవిధవాయువులను ప్రళయకాలంలో ప్రేరేపించినట్లు, నరకాసురుడు మురుని కుమారులను ఏడుగురినీ రెచ్చగొట్టాడు. వారు పీఠుడనే సేనాపతి అండతో శ్రీ కృష్ణుణ్ణి ఎదిరించి నానావిధ యుద్ధసాధనాలను ప్రయోగింపగా
(సప్తవిధ వాయువులు - 1) ఆవహం 2) ప్రవహం 3) సంవహం 4) ఉద్వహం 5) నివహం 6) పరివహం 7) పరావహం.)
శ్రీకృష్ణుడు వాడి అమ్ములు ప్రయోగించి రాక్షసవీరుల ఆయుధాలన్నీ భూమిమీద విరిగి పడేటట్లు చేశాడు. అంతేకాకుండా వారిశరీరావయవాలు నువ్వు గింజలంత తునకలయి నేలమీద రాలేటట్లు ఖండించాడు.
శ్రీకృష్ణుని బాణాల వ్రేటులకూ, చక్రం దెబ్బలకూ, తనవారందరూ మరణించగా నరకాసురుడు ఆశ్చర్యం పొందాడు. కోపపడ్డాడు. శ్రీకృష్ణుణ్ణి తిట్టాడు. తన్ను తాను పొగడుకొన్నాడు. లెక్కసేయనివాడై చెవిపోగులు మొదలయిన నగలు ధరించి, యుద్దానికి బయలుదేరాడు.

అతనివెంట ఏనుగులు గుంపులుకట్టి నడిచాయి. వానిచెక్కిళ్లనుండి మదజలం ధారాపాతంగా స్రవిస్తూంది. చెట్టుబోదెలవంటి వానితొండాలు మహాభయం కలిగిస్తున్నాయి.
బలశాలి అయిన నరకాసురుడు చంద్రబింబంమీద మెరపుతో కూడిన మేఘమేమో అనిన చందంగా గరుత్మంతుని మూపుమీద సత్యభామతో కలసి కయ్యపుముచ్చట్లలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని చూచాడు. శ్రీకృష్ణుడు నల్లనిశరీరం కలవాడు. మంచి అమ్ములపొదులు కలవాడు. మాయాచాతుర్యం కలవాడు. యుద్ధంలో ఓడిపోనివాడు
నరకాసురుడు యుద్దానికి తలపడగా, సత్యభామ జంకూకొంకూ లేకుండా చూచి వేగిరపాటుతో
సత్యభామ జడను గట్టిచుట్టగా చుట్టింది. పోకముడిని గట్టిగా బిగించుకొనింది. నగలు సవరించుకొనింది. ముఖకాంతులు సర్వత్ర వ్యాపింపగా, ఒక మహావీరుని ఆటోపంతో లేచి తన ప్రాణనాయకుడైన శ్రీకృష్ణుని ముందు వీరవనితగా నిలబడింది.

No comments:
Post a Comment