Sunday, August 23, 2026

Sri Krishnudu Uddhavunitho Jeri Kubjaa Grhambunaku Naruguta - శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో జేరి కుబ్జా గృహంబునకు నరుగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో జేరి కుబ్జా గృహంబునకు నరుగుట

తనతో శృంగారక్రీడ జరపాలని కుబ్జ మునుపే శ్రీకృష్ణుణి కోరింది. ఆమె తీగవలె సన్నగా ఉన్న అందగత్తె అలాంటి కు
బ్జను మన్మథ కేళిలో తేల్చవలెనని శ్రీకృష్ణుడు భావించాడు. ఆమెఇల్లు రత్నాలతో, బంగారంతో, పూలదండలతో కమ్మని మైపూతలతో, నగలతో, వస్రాలతో, అగరుసువాసనలతో, దీపాలతో విలసిల్లుతూ మన్మథో ద్రేకాన్ని రేకెత్తిస్తున్నది. అలాంటి ఇంటికి మన్మథునికే మన్మథుడైన శ్రీకృష్ణుడు వెళ్లాడు.

ఇలా ఆ కు
బ్జఇంటికి వెళ్లి, ఆ ఇంట్లో

ఆ కు
బ్జ మన్మథుని బాణంలాగా ఉంది. చంద్రుడి కళలాగా కాంతు లీనుతూంది. కదలుతూ నర్తించే మెరుపుతీగలాగా ఉంది. మొత్తం జగత్తుకే మోహినీదేవతలాగా ఉంది. అందంతో మెరిసిపోతూ ఉంది. అలాంటి సౌందర్యవతిని శ్రీకృష్ణుడు చూచాడు.

శ్రీకృష్ణుడు తన ఇంటికి రాగానే కు
బ్జ తత్తరపాటుతో లేచినిలబడింది. తన చెలికత్తెల బృందాన్ని పిలిచింది. తన వైభవానికీ, సంపదకూ తగినరీతిలో ఆయనకు ఉపచారాలను చేయించింది. అందంగా ఉన్న బంగారుమంచంపై శ్రీకృష్ణుణ్ణి కూర్చో పెట్టింది. ఆయన వెంట వచ్చిన ఉద్ధవుణ్ణి ఎంతో ఆదరంతో పూజించి, మెరిసిపోతున్న ఒక బంగారు పీఠంపై ఆయన్ను కూర్చో బెట్టింది. ఆమెమనసులో ఉత్సాహం, పరవళ్లు తొక్కింది.

చెలికత్తెలబ్బందం కు
బ్జకు పూలదండలను, కస్తూరి లేపనాన్ని మణులతో మెరిసిపోతున్న ఆభరణాలను, అందమైన వస్త్రాలను సమర్పించారు. వాటిల్ని ధరించి, ఆ విలాసవతి శ్రీకృష్ణుడితో సంగమాన్ని కోరింది.

విలాసవతులైన చెలికత్తెలు ఒక మద్యాన్ని తయారు చేశారు. అది ఏలకి, పచ్చకర్పూరంవంటి సుగంధ ద్రవ్యాలతో కూడింది. ఎంతో రుచికరమైంది. కమ్మనిది. అలాంటి ప్రశస్తమైన మద్యాన్ని త్రాగిన కు
బ్జ తూలుతూ, అతణ్ణి సమీపించింది.

శ్రీకృష్ణుడు అనురక్తిగల్గిన చూపులనే వానతో కు
బ్జను ముంచెత్తాడు. సరసమైన మాటలతో ఆమెను కరిగించాడు. బంగారు కంకణాలతో నిండిన ఆమెచేతిని కోమలమైన తనచేత్తో పట్టుకున్నాడు. పానుపుమీదకు లాగాడు. గంభీరంగా కౌగిళ్లు మొదలైన చేష్టలతో సిగ్గు పోగొట్టాడు. మన్మథకేళిపట్ల ఆసక్తి చూపుతూ, వేడుకతో

కు
బ్జ జాతిని, కాలాన్ని కళను, సత్త్వాన్ని, దేశాన్ని భావచేష్టలను, ధాతువును, వయసును, గుణాన్ని దశను, మనసును, చూపులను, ప్రీతి విశేషాలను తెలుసుకుని, అనేక విధాలుగా ఆమె మనసును దోచుకుని, మదనకేళీసుఖాలలో ఆమెను ముంచెతాదు.

పద్మాల్లాంటి తన చేతులతో కు
బ్జ గట్టిగా అందంగా శ్రీకృష్ణుణ్ణి కౌగిలించుకుంది. ఆ ఆలింగనం చేత కరభంలాంటి సుతిమెత్తని తొడలుగల కుబ్జ తన మదనతాపాన్ని పోగొట్టుకుంది. అది గమనించిన చంద్రవదనలైన ఆమె చెలికత్తెలు ఇది అరుదైన విషయమని సంతోషపడ్డారు.

శ్రీకృష్ణుణి పొందగలగడం గొప్ప భాగ్యం. సనకాదులవంటి మహాజ్ఞానులకు కూడా దొరకనివాడు - ఆ మహాత్ముడు. అలాంటి శ్రీకృష్ణుడు కు
బ్జకు లభించాడు. ఆమె ఒకప్పుడు చందన మివ్వడంవల్ల ఈ పుణ్యం లభించింది. అంతటి శ్రీకృష్ణుడు తనకు లభిస్తే మోక్షం కోరుకోవాలి. కానీ, ఆమె కొన్నాళ్లు తన ఇంట్లోనే ఉండి, తనను మదనకేళిలో తేల్చుమని కోరింది.

శ్రీకృష్ణుడు ఆ విధంగా కు
బ్జ కోరుకున్న వరాన్ని ఇచ్చాడు. ఆమెఇంటినుండి ఉద్ధవుడితో శ్రీకృష్ణుడు బయటకు వచ్చాడు. అదెలా ఉందంటే, తీగలతో అల్లిన పొదరింటి నుండి కామధేనువుతో కలసి మన్మథుడు బయటకు వస్తున్నట్లుంది.

ఎటువంటి వేదాలుగూడా దర్శించలేని ఉత్తమదైవం శ్రీకృష్ణుడు. అలాంటివాణ్ణి చూడటమే భాగ్యం. అట్టి దర్శనం దొరికాక, మోక్షాన్ని కోరుకోవాలి. అలా అడగకుండా తనతో రతిక్రీడ జరుపుమని కోరింది. ఆమె కర్మఫలం ఎలాంటిదో కదా!

కు
బ్జ వైభవం శచీదేవిని మించి పోతూంది. శ్రీకృష్ణుడి యౌవనం మెరిసిపోతూంది. ఆ కుబ్జను మదన తంత్రమనే వన వీథిలో విహరింపజేశాడు. శృంగారక్రీడలో ఆమెను సంతృప్తి పరచాడు.

ఆ తర్వాత బలరాముడితో, ఉద్ధవుడితో కలిసి శ్రీకృష్ణుడు అక్రూరుని ఇంటికి వెళ్లాడు. హస్తినాపురానికి అక్రూరుణ్ణి పంపాలని శ్రీకృష్ణుడి ఆలోచన. అలా వారు రాగానే అక్రూరుడు లేచి నిలబడి, వారికి నమస్కరించాడు. ఉద్ధవుడిని కౌగిలించుకున్నాడు. అందరికీ తగిన రీతిలో గౌరవమర్యాదలు జరిపాడు. శ్రీకృష్ణుని పాదాలను తన తొడలమీద ఉంచుకుని ఇలా అన్నాడు.

మహానుభావులారా! మీ పరాక్రమంచేత కంసుడు తన అనుచరులతో కూడ మరణించాడు. మీ శక్తివల్ల యాదవకులం ఉద్ధరించబడింది.

మహితాత్ములైన బలరామ కృష్ణులారా! ఈ విశ్వానికి మీరు ఆదిపురుషులు, విశ్వం జన్మించడానికి మీరు కారకులు, మీరు విశ్వమంతా నిండినవాళ్లు, మీకు కార్యం, దానికి కారణం అనేవి లేవు; 

దేవా! శ్రీకృష్ణా! నా మనవి విను. నీవు రజోగుణంతో ఈ సృష్టి చేశావు. దానికి కారణరూపుడిగా అందులోకి ప్రవేశిస్తావు. వినబడడం, కనబడడం అనే కార్యరూపాలతో కూడిన ప్రపంచాకారంలో వెలిగిపోతుంటావు. భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం వంటివి ఒకదాన్నొకటి అనుసరించి కదిలేవీ, కదలనివీ అయిన దేహాలకు కారణమవుతాయి. అవి కార్యరూపదేహాలై ప్రకాశిస్తాయి. 

అలాగ నీవు ఒక్కడివి, కారణరహితుడివి, ఆత్మలో స్వతంత్రత ఉండికూడా విశ్వాకారంలో ఎన్నో రూపాలుగా కనిపిస్తావు. కల్పించడం, కాపాడడం, నశింపచేయడం అనేవి చేస్తూ ఉండికూడా పరబ్రహ్మతత్త్వానివి నీవే కాబట్టి జననమరణచక్రంలో పడిన జీవుడివలె ఉండవు. గుణాలతో, కర్మలతో కట్టుబడవు. కాబట్టి దానివల్ల బంధకారణమూ నీకు కలుగదు.

పద్మాలవంటి కండ్లు గల శ్రీకృష్ణా! బంధం, దానినుండి ముక్తి పొందడం అనే రెండూ జీవుడినే అంటవు. అలాంటిది - జ్ఞానతత్త్వ స్వరూపమైన నిన్ను అంటుతాయా? దేవా, స్థూల సూక్ష్మకారణదేహాలు వంటివి లేనందువల్ల నీకు పుట్టుక లేదు. దానికి కారణమైన అవిద్యవంటివి కూడా లేవు. అందుచేత, నీకు బంధంగానీ, మోక్షంగానీ లేవు.

నిన్ను రోటికి కట్టెశారని అనుకోవడం, కాళీయుడనే పెద్దపాము నిన్ను వదిలిపెట్టింది అనుకోవడం రెండూ కూడా మా అపరిపక్వమైన పసిమనసునే సూచిస్తున్నాయి. వేదబాహ్యులు అప్రియమైన మాటలను పలికే వాళ్లూ కొందరున్నారు. జగతికి హితం కలిగించే వేదమార్గం వాళ్లకారణంగా అణగారిపోతున్నపుడు నీవు అవతారమెత్తి ఆ వేదమార్గాన్ని కాపాడుతావు.

అలాంటి నీవు రాక్షసులను అందరినీ అణచి వేసి, భూ భారాన్ని తొలగించడంకోసం, పదిమంది గొప్పగా చెప్పుకునే రీతిలో వసుదేవుడి ఇంటిలో పుట్టావు.

(వసుదేవుడు పుట్టినపుడు, ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయట. కనుక, అతడికి 'ఆనకదుందుభి' అని పేరు వచ్చింది.)

నీ పాదాలనుండి పుట్టిన ఆకాశగంగ మూడులోకాలనూ పావనం చేస్తున్నది. వేదాలకు, దేవతలకు, ద్విజులకు నీవు ప్రముఖ స్వరూపానివి. అలాంటి తేజస్సుగల నీవు దయతో వచ్చినందువల్ల మా ఇండ్లు ధన్యమయ్యాయి. పెద్దలు, మహాత్ములు నిన్ను పూజిస్తారు. ఇంద్రియజయాన్ని దయతో వాళ్లకు ప్రసాదిస్తావు.

భక్తులకు కోరినవన్నీ ప్రసాదించే చింతామణివంటి శ్రీకృష్ణా! ఏ మహాపుణ్యమహిమవల్లనో ఈ జన్మలో ఇక్కడ నీ పాదాలను దర్శించగలిగాను. నిన్నుగురించి తెలుసుకొన గలిగినాను. నీవుకూడా నా పై దయతో, ప్రేమతో నానావిధాలైన ధనమూ, ఇల్లూ, వాకిలీ, భార్యాపిల్లలూ మొదలైనవాటిపై కలిగే మోహపాశాన్ని తొలగించు.

అక్రూరుడు పై విధంగా మాట్లాడితే దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ, అతనికి(అక్రూరునికి) సంసారం పట్ల ఇష్టాన్ని కలిగిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుడు అక్రూరుని హస్తినాపురంబునకు బంపుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...