Wednesday, August 26, 2026

Krishnudu Rukminidevi Nuradinchuta - కృష్ణుడు రుక్మిణీదేవి నూరడించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - కృష్ణుడు రుక్మిణీదేవి నూరడించుట

ఓ రుక్మిణీ! కేవలం నవ్వులకు మాట్లాడిన మాటలకు బాధపడుతున్నావా? వేట సమయాల్లో, కలహాల్లో, రతి సమయాల్లో బాధించేమాటల్ని పలికినా విచారిస్తారా? నీ మనస్సు తెలియగోరి పలికాను. నీవు మనస్సులో బాధపడకు.

ఓ హరిణలోచనా! అలుకలు, ముద్దుపలుకులు, ఎర్రవారిన కన్నులు, తియ్యని పెదవి, బెదరింపులు, వేళాకోళాలు, కనుబొమల చిట్లింపులు, విదిలింపులకు సంకోచించక వలపుగల స్త్రీ సమాగమం లభిస్తే అది జన్మఫలం లభించినట్లే కదా!

అని ఇంకా ఈ విధంగా చెప్పాడు.

ఓ రుక్మిణీ! నీవు పతివ్రతవు, పుణ్యాత్మురాలవు, మహాసద్గుణశీలవు, బాల్యంనుండీ నీవు స్థిరమైన భావంతో నన్ను సేవించావు. ఇదంతా తెలిసికూడా తప్పుగా మాట్లాడిన నన్ను క్షమించుము.

నీ మాటలు నాకు ఆనందాన్ని కలిగించాయి. నీవు పతివ్రతవు. ఏకాంతసేవలో నేర్పరివైన నీకు అన్నీ నెరవేరుతాయి. నీ పాతివ్రత్యం, నీకు నాయందుగల ప్రేమ స్పష్టమైనాయి. కాబట్టి, ద్వారకానగరంలో గృహస్థునిమాదిరి నీయందు గాఢానురాగంతో ఉంటాను. 

ఇంద్రియలోలవై కాంతలు నన్నుపొందడం మిక్కిలికష్టం. వ్రతాలవల్ల, తపస్సుచేత, నన్ను పొందాలని ప్రయత్నించి, విఫలవై నరకాన్ని పొందుతారు. నీవు వివాహకాలంలో ఎందరో రాజశ్రేష్ఠులను తిరస్కరించావు. "నా శరీరంపై ఇతరులకు అధికారం లే"దంటూ చెప్పి - బ్రాహ్మణుణ్ణి నాయొద్దకు పంపావు.

నిన్ను వివాహమాడే సమయంలో నీ సోదరుణ్ణి వికృతుణ్ణి కావించాను. నా ఎడబాటును సహించలేక, ఏమీ మాటాడక ఊరకున్నావు. ఇట్టి నీ మంచిగుణాలకు మిక్కిలి సంతోషించాను-” అని పలికి దేవకీదేవి కుమారుడగు శ్రీకృష్ణుడు సామాన్యగృహస్థునివలె ద్వారకలో గృహకృత్యాలు నిర్వహిస్తూండినాడని శుకమహర్షి పరీక్షిత్తుకు తెలిపాడు.

అని పలికిన శ్రీకృష్ణుని వినయ, వివేచనాపూర్వకమైన మాటలకు అమృతం చల్లినట్లై సంతోషాన్ని కల్గించగా, వికసించిన ముఖకమలం కలదవుతూ

రుక్మిణి చిరునవ్వును ఆహ్వానిస్తున్న చూపులతో శ్రీకృష్ణుణ్ణిచూచి, చేతులు జోడించి, గరుడవాహనుడూ, అందగాడూ, ఉత్సాహపూర్ణుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి పొగడింది.

దేవతాగణాలచే ప్రశంసింపబడి, సాటిలేని ప్రకాశవంతమైన ముఖంతో శుభప్రదమైన ఆకారంతో, దయతో కూడిన శ్రీకృష్ణుడు, చిగురులవలె ఎర్రగానున్న(సుకుమారమైన) చేతులు కలిగిన రుక్మిణికి వస్త్రాలు, నగలు, వరాలూ కోరినరీతిగా ఇచ్చాడు.

రుక్మిణిని సన్మానించిన పిదప, తానును రుక్మిణియు

శ్రీకృష్ణుడూ, రు
క్మిణీదేవీ చెట్లనీడల్లో మల్లైలలతలసమూహాల్లో, విరజాజిపొదల్లో, శిలావేదికలపై, కొలనుల అందమైన తీరాల్లో కలసి,

కేళీ ఉద్యానవనాల్లో విలాసంగా విహరించడానికి అనుకూలమైన స్వచ్చమైన ప్రదేశాలలో సుఖలీలావిలాసాలతో, ఎంతో సంతోషంతో, ఆ రు
క్మిణీదేవితో కలిసి జంటగా బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు చరించాడు.

రకరకాలైన మణులచే ప్రకాశించే రాజసౌధాల పైభాగాలలోను; నెమళ్ళు, కోకిలలు, ఊరపిచ్చుకలు, చిలుకలు ఉండే ప్రాంతాలలోను, చల్లనిసరస్సులలోను, జలప్రవాహాలలోను, ధాతువులతో కూడిన సెలయేర్లలోను, కొండలలోను, క్రీడా గృహాలలోను, ఉత్సాహంగా శ్రీకృష్ణుడును రు
క్మిణియును మన్మథక్రీడల్లో మునిగారు. 

ఆ తరువాత శ్రీకృష్ణునివల్ల ఆమెకు పదిమందికుమారులు కలిగారు. వారు - 1. ప్రద్యుమ్నుడు; 2.చారుధేష్ణుడు; 3. చారుదేవుడు; 4. సుధేష్ణుడు; 5. సుచారువు; 6. చారుగుప్తుడు; 7. భద్రచారువు; 8.చారుభద్రుడు; 9. విచారువు; 10. చారువు. ఆ విధంగానే సత్యభామ, 2. జాంబవతి 3. నాగ్నజితి 4.కాళింది 5. మాద్రి 6. మిత్రవింద 7. భద్రలకూ వేరువేరుగా పదిమంది కుమారులు కలిగారు.

పుణ్యాత్ముడా! పదహారువేల భార్యల్లో ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు శ్రీకృష్ణునకు కలిగారు. ఇలా వారికి పిల్లచెరకు ప్రసవించినట్లు పిల్లలు కలిగారు. పుత్రులతో, మనుమలతో, మునిమనుమలతో శ్రీకృష్ణుడు సంతోషంగా ఉన్నాడు.

ఆ ప్రకారం యదు, వృష్టి, భోజ, అంధక, మున్నగునవి నూటొక్కవంశాలై మిక్కిలి అభివృద్ది చెందాయి. ఆ రాజపుత్రులకు విద్యనేర్పడానికి ప్రావీణ్యం కలిగిన

వారందరికి మూడుకోట్ల, ఎనభైఎనిమిదివేల ఒక నూరుమంది విద్యనేర్చే గురువులున్నారంటే, ఆ బాలుర సంఖ్య లెక్కించడానికి ఈశ్వరునకీ, బ్రహ్మకూ శక్యంకాదు(గురువులు 3 కోట్ల, 88 వేల, 100 మంది).

శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నునికి రుక్మి కూతురైన 
రుక్మవతికి అనిరుద్ధుడనే కుమారుడు కలిగాడనిచెప్పగా పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఈ విధంగా అడిగాడు.

అనిరుద్దుని వివాహ సమయమున బలరాముడు రుక్మి మొదలగు వారినిం జంపుట






No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...