Thursday, July 10, 2025

Rahu Kethu Pradhakshina - రాహుకేతువులకి ప్రదక్షిణ ఏలా చేయాలి?

రాహుకేతువులకి ప్రదక్షిణ ఏలా చేయాలి?

ప్రదక్షిణం లో ప్ర' అనే అక్షరము పాపాలకి నాశనము.'ద అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరము మరుజన్మలో మంచి ఇవ్వమని.'ణ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుటూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది.

పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుటూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుటూ ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.

రాహుకేతువులకి ప్రదక్షిణ ఏలా చేయాలి?
గ్రహాలకి రాజు సూర్యుడు అన్నీ గ్రహాల మధ్యన ఉంటాడు. చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు. అంగారకుడు దక్షిణంగానూ, బుధుడు సూర్యునకు ఈశాన్యంగానూ, బృహస్పతి ఉత్తర దిక్కుగానూ ఉన్నారు. తూర్పున శుక్రుడు ఉంటాడు. పశ్చిమ దిక్కున్న శనైశ్చరుడూ, నైఋతిలో రాహువూ, వాయువ్యంలో కేతువూ ఉంటారు. అయితే గ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటే రాహుకేతువులు వేరుగా అప్రదక్షిణంగా తిరుగుతున్నట్లు ఉంటాయి. అయినా మనం ఆయా గ్రహాల పూజల ప్రకారమే చేయాలి.

ప్రదక్షిణంలో రకాలు:
ఆత్మ ప్రదక్షిణము : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం.
పాద ప్రదక్షిణము : పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం.
దండ ప్రదక్షిణము : అవ్యగ్ర చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం.
అంగ ప్రదక్షిణము : సాత్వికావయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం.
గిరి ప్రదక్షిణము : దేవుడు కొలువుండే కొండ చుట్టు చేసే ప్రదక్షిణం.

గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి..? ఎన్ని ప్రదక్షిణలు చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి..?
1 ప్రదక్షిణ - భగవంతుని ప్రాప్తి
3 ప్రదక్షిణలు - మానసిక భారం తగ్గుతుంది.
5 ప్రదక్షిణలు - ఇష్ట సిద్ధి.
7 ప్రదక్షిణలు - కార్య జయం.
9 ప్రదక్షిణలు - శత్రు నాశనం.
11 ప్రదక్షిణలు - జీవితంలో అభివృద్ధి.
13 ప్రదక్షిణలు - సిద్ధి ప్రార్థన.
15 ప్రదక్షిణలు - ధనప్రభతి.
17 ప్రదక్షిణలు - ధ్యానం అభివృద్ధి
19 ప్రదక్షిణలు- వ్యాధి నివారణ.
21 ప్రదక్షిణలు - విద్య అభివృద్ధి.
23 ప్రదక్షిణలు - సౌకర్యం.
108 ప్రదక్షిణలు - సర్వ దోష నివారణ
208 ప్రదక్షిణలు - అదృష్టకర ఫలితం

No comments:

Post a Comment

Parvathi Vallabha Ashtakam - పార్వతీ వల్లభ అష్టకం

పార్వతీ వల్లభ అష్టకం నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజమ్ । నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ 0 1 ॥ ...