Sunday, June 1, 2025

Katyayani mantra - కాత్యాయని మంత్ర

కాత్యాయని మంత్ర

కాత్యాయని మంత్రాః
కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి ।
నంద గోపసుతం దేవిపతిం మే కురు తే నమః ॥

॥ఓం హ్రీం కాత్యాయన్యై స్వాహా ॥ ॥ హ్రీం శ్రీం కాత్యాయన్యై స్వాహా ॥

వివాహ హేతు మంత్రాః
ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీస్వరి ।
నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః ॥

హే గౌరీ శంకరార్ధాంగి । యథా త్వం శంకరప్రియా ॥
తథా మాఁ కురు కల్యాణి । కాంత కాంతా సుదుర్లభాం॥

ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని।
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం చ దేహి మే ॥

ఓం శం శంకరాయ సకల జన్మార్జిత పాప విధ్వంస నాయ పురుషార్థ చతుస్టయ లాభాయ చ పతిం మే దేహి కురు-కురు స్వాహా ॥

వివాహార్థం సూర్యమంత్రాః
ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని ।
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభం చ దేహి మే ॥

శ్రీ కాత్యాయని అష్టోత్తర శత నామావళి

Saraswati suktam - సరస్వతీ సూక్తం

సరస్వతీ సూక్తం


(ఋ.వే.6.61)
ఇ॒యం॑దదాద్రభ॒సమృ॑ణ॒చ్యుతం॒ దివో᳚దాసం-వఀద్ర్య॒శ్వాయ॑ దా॒శుషే᳚ ।
యా శశ్వం᳚తమాచ॒ఖశదా᳚వ॒సం ప॒ణిం తా తే᳚ దా॒త్రాణి॑ తవి॒షా స॑రస్వతి ॥ 1 ॥

ఇ॒యం శుష్మే᳚భిర్బిస॒ఖా ఇ॑వారుజ॒త్సాను॑ గిరీ॒ణాం త॑వి॒షేభి॑రూ॒ర్మిభిః॑ ।
పా॒రా॒వ॒త॒ఘ్నీమవ॑సే సువృ॒క్తిభి॑స్సర॑స్వతీ॒ మా వి॑వాసేమ ధీ॒తిభిః॑ ॥ 2 ॥

సర॑స్వతి దేవ॒నిదో॒ ని బ॑ర్​హయ ప్ర॒జాం-విఀశ్వ॑స్య॒ బృస॑యస్య మా॒యినః॑ ।
ఉ॒త క్షి॒తిభ్యో॒ఽవనీ᳚రవిందో వి॒షమే᳚భ్యో అస్రవో వాజినీవతి ॥ 3 ॥

ప్రణో᳚ దే॒వీ సర॑స్వతీ॒ వాజే᳚భిర్వా॒జినీ᳚వతీ ।
ధీ॒నామ॑వి॒త్ర్య॑వతు ॥ 4 ॥

యస్త్వా᳚ దేవి సరస్వత్యుపబ్రూ॒తే ధనే᳚ హి॒తే ।
ఇంద్రం॒ న వృ॑త్ర॒తూర్యే᳚ ॥ 5 ॥

త్వం దే᳚వి సరస్వ॒త్యవా॒ వాజే᳚షు వాజిని ।
రదా᳚ పూ॒షేవ॑ నః స॒నిమ్ ॥ 6 ॥

ఉ॒త స్యా నః॒ సర॑స్వతీ ఘో॒రా హిర᳚ణ్యవర్తనిః ।
వృ॒త్ర॒ఘ్నీ వ॑ష్టి సుష్టు॒తిమ్ ॥ 7 ॥

యస్యా᳚ అనం॒తో అహ్రు॑తస్త్వే॒షశ్చ॑రి॒ష్ణుర᳚ర్ణ॒వః ।
అమ॒శ్చర॑తి॒ రోరు॑వత్ ॥ 8 ॥

సా నో॒ విశ్వా॒ అతి॒ ద్విషః॒ స్వసౄ᳚ర॒న్యా ఋ॒తావ॑రీ ।
అత॒న్నహే᳚వ॒ సూర్యః॑ ॥ 9 ॥

ఉ॒త నః॑ ప్రి॒యా ప్రి॒యాసు॑ స॒ప్తస్వ॑సా॒ సుజు॑ష్టా ।
సర॑స్వతీ॒ స్తోమ్యా᳚ భూత్ ॥ 10 ॥

ఆ॒ప॒ప్రుషీ॒ పార్థి॑వాన్యు॒రు రజో᳚ అం॒తరి॑క్షమ్ ।
సర॑స్వతీ ని॒దస్పా᳚తు ॥ 11 ॥

త్రి॒ష॒ధస్థా᳚ స॒ప్తధా᳚తుః॒ పంచ॑ జా॒తా వ॒ర్ధయం᳚తీ ।
వాజే᳚వాజే॒ హవ్యా᳚ భూత్ ॥ 12 ॥

ప్ర యా మ॑హి॒మ్నా మ॒హినా᳚సు॒ చేకి॑తే ద్యు॒మ్నేభి॑ర॒న్యా అ॒పసా᳚మ॒పస్త॑మా ।
రథ॑ ఇవ బృహ॒తీ వి॒భ్వనే᳚ కృ॒తోప॒స్తుత్యా᳚ చికి॒తుషా॒ సర॑స్వతీ ॥ 13 ॥

సర॑స్వత్య॒భి నో᳚ నేషి॒ వస్యో॒ మాప॑ స్ఫరీః॒ పయ॑సా॒ మా న॒ ఆ ధ॑క్ ।
జు॒షస్వ॑ నః స॒ఖ్యా వే॒శ్యా᳚ చ॒ మా త్వత్ క్షేత్రా॒ణ్యర॑ణాని గన్మ ॥ 14 ॥

(ఋ.వే.7.95)
ప్ర క్షోద॑సా॒ ధాయ॑సా సస్ర ఏ॒షా సర॑స్వతీ ధ॒రుణ॒మాయ॑సీ॒ పూః ।
ప్ర॒బాబ॑ధానా ర॒థ్యే᳚వ యాతి॒ విశ్వా᳚ అ॒పో మ॑హి॒నా సింధు॑ర॒న్యాః ॥ 15 ॥

ఏకా᳚చేత॒త్సర॑స్వతీ న॒దీనాం॒ శుచి᳚ర్య॒తీ గి॒రిభ్య॒ ఆ స॑ము॒ద్రాత్ ।
రా॒యశ్చేతం᳚తీ॒ భువ॑నస్య॒ భూరే᳚ర్ఘృ॒తం పయో᳚ దుదుహే॒ నాహు॑షాయ ॥ 16 ॥

స వా᳚వృధే॒ నర్యో॒ యోష॑ణాసు॒ వృషా॒ శిశు᳚ర్వృష॒భో య॒జ్ఞియా᳚సు ।
స వా॒జినం᳚ మ॒ఘవ॑ద్భ్యో దధాతి॒ వి సా॒తయే᳚ త॒న్వం᳚ మామృజీత ॥ 17 ॥

ఉ॒త స్యా నః॒ సర॑స్వతీ జుషా॒ణోప॑ శ్రవత్సు॒భగా᳚ య॒జ్ఞే అ॒స్మిన్న్ ।
మి॒తజ్ఞు॑భిర్నమ॒స్యై᳚రియా॒నా రా॒యా యు॒జా చి॒దుత్త॑రా॒ సఖి॑భ్యః ॥ 18 ॥

ఇ॒మా జుహ్వా᳚నా యు॒ష్మదా నమో᳚భిః॒ ప్రతి॒ స్తోమం᳚ సరస్వతి జుషస్వ ।
తవ॒ శర్మ᳚న్ప్రి॒యత॑మే॒ దధా᳚నా॒ ఉప॑ స్థేయామ శర॒ణం న వృ॒క్షమ్ ॥ 19 ॥

అ॒యము॑ తే సరస్వతి॒ వసి॑ష్ఠో॒ ద్వారా᳚వృ॒తస్య॑ సుభగే॒ వ్యా᳚వః ।
వర్ధ॑ శుభ్రే స్తువ॒తే రా᳚సి॒ వాజా॑న్యూ॒యం పా᳚త స్వ॒స్తిభిః॒ సదా᳚ నః ॥ 20 ॥

(ఋ.వే.7.96)
బృ॒హదు॑ గాయిషే॒ వచో᳚ఽసు॒ర్యా᳚ న॒దీనా᳚మ్ ।
సర॑స్వతీ॒మిన్మ॑హయా సువృ॒క్తిభి॒స్స్తోమై᳚ర్వసిష్ఠ॒ రోద॑సీ ॥ 21 ॥

ఉ॒భే యత్తే᳚ మహి॒నా శు॑భ్రే॒ అంధ॑సీ అధిక్షి॒యంతి॑ పూ॒రవః॑ ।
సా నో᳚ బోధ్యవి॒త్రీ మ॒రుత్స॑ఖా॒ చోద॒ రాధో᳚ మ॒ఘోనా᳚మ్ ॥ 22 ॥

భ॒ద్రమిద్భ॒ద్రా కృ॑ణవ॒త్సర॑స్వ॒త్యక॑వారీ చేతతి వా॒జినీ᳚వతీ ।
గృ॒ణా॒నా జ॑మదగ్ని॒వత్స్తు॑వా॒నా చ॑ వసిష్ఠ॒వత్ ॥ 23 ॥

జ॒నీ॒యంతో॒ న్వగ్ర॑వః పుత్రీ॒యంతః॑ సు॒దాన॑వః ।
సర॑స్వంతం హవామహే ॥ 24 ॥

యే తే᳚ సరస్వ ఊ॒ర్మయో॒ మధు॑మంతో ఘృత॒శ్చుతః॑ ।
తేభి᳚ర్నోఽవి॒తా భ॒వ ॥ 25 ॥

పీ॒పి॒వాంసం॒ సర॑స్వతః॒ స్తనం॒-యోఀ వి॒శ్వద॑ర్​శతః ।
భ॒క్షీ॒మహి॑ ప్ర॒జామిషం᳚ ॥ 26 ॥

(ఋ.వే.2.41.16)
అంబి॑తమే॒ నదీ᳚తమే॒ దేవి॑తమే॒ సర॑స్వతి ।
అ॒ప్ర॒శ॒స్తా ఇ॑వ స్మసి॒ ప్రశ॑స్తిమంబ నస్కృధి ॥ 27 ॥

త్వే విశ్వా᳚ సరస్వతి శ్రి॒తాయూం᳚షి దే॒వ్యామ్ ।
శు॒నహో᳚త్రేషు మత్స్వ ప్ర॒జాం దే᳚వి దిదిడ్ఢి నః ॥ 28 ॥

ఇ॒మా బ్రహ్మ॑ సరస్వతి జు॒షస్వ॑ వాజినీవతి ।
యా తే॒ మన్మ॑ గృత్సమ॒దా ఋ॑తావరి ప్రి॒యా దే॒వేషు॒ జుహ్వ॑తి ॥ 29 ॥

(ఋ.వే.1.3.10)
పా॒వ॒కా నః॒ సర॑స్వతీ॒ వాజే᳚భిర్వా॒జినీ᳚వతీ ।
య॒జ్ఞం-వఀ ॑ష్టు ధి॒యావ॑సుః ॥ 30 ॥

చో॒ద॒యి॒త్రీ సూ॒నృతా᳚నాం॒ చేతం᳚తీ సుమతీ॒నామ్ ।
య॒జ్ఞం ద॑ధే॒ సర॑స్వతీ ॥ 31 ॥

మ॒హో అర్ణః॒ సర॑స్వతీ॒ ప్ర చే᳚తయతి కే॒తునా᳚ ।
ధియో॒ విశ్వా॒ వి రా᳚జతి ॥ 32 ॥

(ఋ.వే.10.17.7)
సర॑స్వతీం దేవ॒యంతో᳚ హవంతే॒ సర॑స్వతీమధ్వ॒రే తా॒యమా᳚నే ।
సర॑స్వతీం సు॒కృతో᳚ అహ్వయంత॒ సర॑స్వతీ దా॒శుషే॒ వార్యం᳚ దాత్ ॥ 33 ॥

సర॑స్వతి॒ యా స॒రథం᳚-యఀ॒యాథ॑ స్వ॒ధాభి॑ర్దేవి పి॒తృభి॒ర్మదం᳚తీ ।
ఆ॒సద్యా॒స్మిన్బ॒ర్​హిషి॑ మాదయస్వానమీ॒వా ఇష॒ ఆ ధే᳚హ్య॒స్మే ॥ 34 ॥

సర॑స్వతీం॒-యాంఀ పి॒తరో॒ హవం᳚తే దక్షి॒ణా య॒జ్ఞమ॑భి॒నక్ష॑మాణాః ।
స॒హ॒స్రా॒ర్ఘమి॒ళో అత్ర॑ భా॒గం రా॒యస్పోషం॒-యఀజ॑మానేషు ధేహి ॥ 35 ॥

(ఋ.వే.5.43.11)
ఆ నో᳚ ది॒వో బృ॑హ॒తః పర్వ॑తా॒దా సర॑స్వతీ యజ॒తా గం᳚తు య॒జ్ఞమ్ ।
హవం᳚ దే॒వీ జు॑జుషా॒ణా ఘృ॒తాచీ᳚ శ॒గ్మాం నో॒ వాచ॑ముశ॒తీ శృ॑ణోతు ॥ 36 ॥

(ఋ.వే.2.32.4)
రా॒కామ॒హం సు॒హవాం᳚ సుష్టు॒తీ హు॑వే శృ॒ణోతు॑ నః సు॒భగా॒ బోధ॑తు॒ త్మనా᳚ ।
సీవ్య॒త్వపః॑ సూ॒చ్యాచ్ఛి॑ద్యమానయా॒ దదా᳚తు వీ॒రం శ॒తదా᳚యము॒క్థ్యం᳚ ॥ 37 ॥

యాస్తే᳚ రాకే సుమ॒తయః॑ సు॒పేశ॑సో॒ యాభి॒ర్దదా᳚సి దా॒శుషే॒ వసూ᳚ని ।
తాభి᳚ర్నో అ॒ద్య సు॒మనా᳚ ఉ॒పాగ॑హి సహస్రపో॒షం సు॑భగే॒ రరా᳚ణా ॥ 38 ॥

సినీ᳚వాలి॒ పృథు॑ష్టుకే॒ యా దే॒వానా॒మసి॒ స్వసా᳚ ।
జు॒షస్వ॑ హ॒వ్యమాహు॑తం ప్ర॒జాం దే᳚వి దిదిడ్ఢి నః ॥ 39 ॥

యా సు॑బా॒హుః స్వం᳚గు॒రిః సు॒షూమా᳚ బహు॒సూవ॑రీ ।
తస్యై᳚ వి॒శ్పత్న్యై᳚ హ॒విః సి॑నీవా॒ల్యై జు॑హోతన ॥ 40 ॥

యా గు॒ఙ్గూర్యా సి॑నీవా॒లీ యా రా॒కా యా సర॑స్వతీ ।
ఇం॒ద్రా॒ణీమ॑హ్వ ఊ॒తయే᳚ వరుణా॒నీం స్వ॒స్తయే᳚ ॥ 41 ॥

|| ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑

Ashwini - అశ్విని

అశ్విని

1. అశ్వని నక్షత్రము

అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు

నక్షత్రం - అశ్వని
రాశి - మేషం
అధిపతి - కేతువు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - అడ్డరస
జంతువు - గుర్రం
నాడి - ఆది
పక్షి - గరుడ
అధిదేవత - అశ్వినీదేవతలు

అశ్వని నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
1) తస్కరాంశ : అశ్వని నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు మంచి సంపద, భోగాలను అనుభవించువాడు, లోభ గుణం కలవాడు,

2) భోగ్యాంశ : అశ్వని నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు తేజస్సు కలవాడు, ధన, ధాన్యాభివృద్ధి కలవాడు, దాన గుణం కలవాడు అగును.

3) విచక్షణాంశ : అశ్వని నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు సమస్త భోగాలు కలవారు, ప్రతి పనిని సాధించువాడు, పనులను నేర్పుతో చేయువాడు అగును.

4) ధర్మాంశ : అశ్వని నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు భగవంతుడి పైన భక్తి కలవాడు, పూజలు చేయువాడు, సంధ్యావందన తత్పురుడును, నిత్యం ధర్మ కార్యాచరణలో ఉండువారు అగును.

నక్షత్రం - అధిపతులు

నామం - 1 పాదం - 2 పాదం - 3 పాదం - 4 పాదం

అశ్విని - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

అశ్విని 1వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండును. ఇక్కడ గమనించవలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2,3,4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.

నక్షత్రాలు - శాంతులు
ప్రతి నక్షత్రంలో పుట్టిన జాతకుడు కొన్ని దానాలు చేయడం వలన ఆ జాతకుడి భవిష్యత్తు ఆనందకరంగా ఉంటుంది అని అంటారు. అలాగే నక్షత్ర శాంతికి హోమాలు, జపాలు చేయించుకోవలసి ఉంటుంది. అవి చాలా వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉంటాయి. అలా చేయించుకోలేని వారి కోసం తంత్ర శాస్త్రం ప్రకారం ఈ పరిష్కారాలు చెప్పటం జరిగింది.

అశ్వని: వాయువ్యంలో గుఱ్ఱపు బొమ్మ లొహంతో చేసినది పెట్టడం మంచిది.

॥ ఓం
తదశ్వినావశ్వయుజోపయాతామ్ ।
శుభంగమిష్టౌ సుయమేభిరశ్వై: ।
స్వం నక్షత్రగ్మ్ హవిషా యజ౦తౌ ।
మధ్వాసంపృక్తౌ యజుషాసమక్తౌ ।
యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ ।
విశ్వస్య దూతావమృతస్య గోపౌ ।
తౌ నక్షత్రం జుజుషాణోపయాతామ్ ।
నమో శ్విభ్యాం కృణుమో శ్వయుగ్భ్యామ్ 

నక్షత్రాల మంత్రాలను వారి వారి నక్షత్రాలను బట్టి రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

అశ్వని నక్షత్ర జాతకుల గుణగణాలు :
అశ్వత్థామ ఈ అశ్వని నక్షత్రం నందు జననం పొందినాడని ప్రతీతి. సువర్ణ దానం మంచిది. రెవత్యేశివని యేర్మధ్యే పితృగాండా: ప్రకీర్తితా: కావున అశ్వని ప్రథమ పాదంలో పుడితే యథావిధిగా హోమ శాంతి చేయాలి. ఏ పాదంలో జననం కలిగినా ఎక్కువ ఆయుర్ధాయం కలవారు వీరు.

ఏకాగ్రత నక్షత్రములో మొదటిదైన అశ్వని నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాన్ని సొంతం చేసుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అశ్వనీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. వీరు సూర్య భగవానునికి మరియు ఇతని భార్య సంజ్ఞ దేవికి పుట్టినవారు అశ్వని దేవతలు. ఈ నక్షత్రం సన్య నక్షత్రంగా క్షిపు తారగా పురుష లక్షణంగా వుంది. దీనికి అధిష్టాన దేవత కేతువు. ఈ నక్షత్రంలో జన్మించినవారు శివుడి అర్చన చేస్తే మంచిది.

అశ్వనీ నక్షత్రజాతకులు అశ్వమువలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వనీ నక్షత్ర జాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము నందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు.

రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోధైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతులుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు.

ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు.

నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు.

క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వనీ నక్షత్ర జాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టిన సమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.


అశ్వని నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్య 9. ఇంకా 9, 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అలాగే అశ్వని నక్షత్ర జాతకులకు మంగళవారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. బుధవారం, ఆదివారాల్లో శుభకార్యాలు ఆరంభించడం మంచిది. అయితే గురువారం మాత్రం అశ్వని నక్షత్ర జాతకులకు ఏ మాత్రం కలిసిరావడం కష్టం.

ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయం, ధర్మము పాటిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయ నాయకులుగా, అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. ఇతరుల కింద పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకు కటి ప్రదేశంలో మత్స్య రేఖలు ఉండవచ్చు.

అశ్వని నక్షత్ర జాతకులు చాలా శక్తివంతంగాను మరియు చురుకుగాను ఉంటారు. అదనంగా, మీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ప్రాథమిక విషయాలు ఎన్నడూ వీరికి సంతృప్తిని ఇవ్వవు. ప్రతి పనిని కూడా వేగంగా పూర్తి చేసే అలవాటును కలిగి ఉంటారు. వేగం, శక్తి మరియు చురుకుదనం అనేవి వీరిలో స్పష్టంగా ఉంటాయి. వీరికి ఎప్పుడైనా ఏదైనా ఆలోచన వస్తే, వెంటనే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. వీరు కాస్తంత క్రీడాస్ఫూర్తిని కలిగి ఉంటారు మరియు వీరు తెలివైన వారు కూడా.

ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకున్న తరువాత వీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరు చాలా నిర్భయంగాను మరియు సాహసోపేతంగా ఉంటారు, కానీ వీరు తప్పనిసరిగా తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. శత్రువులు వీరికి ఎన్నడూ సమస్యలను కలిగించలేరు, ఎందుకంటే వారితో ఎలా వ్యవహరించాలనే విషయం వీరికి సహజసిద్ధంగానే తెలుసు.

అధికారం, ఒత్తిడి లేదా మరేదైనా వీరిని నియంత్రించలేదు, కేవలం ప్రేమ మరియు అభిమానం ద్వారా మాత్రమే వీరిని గెలవవచ్చు. వీరు ఎన్నడూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకోరు. ఒక విషయం గురించి లోతైన విశ్లేషణ చేసిన తరువాత మాత్రమే వీరు నిర్ణయాలు తీసుకుంటారు, మరియు వీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న తరువాత, వారి అభిప్రాయాన్ని మార్చడం అంత తేలిక కాదు. ఇతరుల యొక్క ప్రభావంతో నిర్ణయాలు మార్చుకునే స్వభావం వీరికి ఉండదు. వీరు తమ పనుల్ని ఎలా పూర్తి చేయాలో వీరికి బాగా తెలుసు. వీటన్నింటిని మించి, వీరు ఒక అద్భుతమైన స్నేహితుడిగా రుజువు చేసుకుంటారు.

వీరు ఇష్టపడే వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. ఎవరైనా బాధపడుతున్నట్లుగా వీరు చూస్తే, వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి వీరు ప్రయత్నిస్తారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా వీరు సహనంగా ఉంటారు మరియు వీరికి దేవుడిపై అచంచల నమ్మకం ఉంటుంది. సంప్రదాయల పట్ల వీరికి ప్రేమ ఉండటం వల్ల, వీరు ఆధునీకీకరణను వ్యతిరేకిస్తారు. వీటన్నింటికి అదనంగా, వీరు తమ పరిసరాలను శుభ్రంగాను మరియు నిర్వహించుకునే విధంగా ఉంచుకుంటారు.


అశ్వని నక్షత్ర నాలుగు పాదాల వారి గుణగణాలు

అశ్వని 4 పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి :

అశ్వని నక్షత్రం మొదటి పాదం
అశ్వని నక్షత్రం తొలి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతి కుజుడు. వీరు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. కొన్నిసార్లు రాజీ ధోరణితో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెడతారు. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలన్న తాపత్రయం ఉంటుంది.

మొదటి పాదం వారు దర్శనీయ క్షేత్రం :
తమిళనాడులోని తిరుతురైపూండి సమీపంలో ఉన్న శ్రీ పిరవి ముందీశ్వరర్ (శివాలయం) ని దర్శించడం వల్ల నక్షత్ర దోషాలు తొలగిపోతాయి.

మొదటి పాదం గ్రహ దశలు :
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు, రవి మహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది.

అశ్వని నక్షత్రం రెండో పాదం
అశ్వని నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతి కుజుడు. నవాంశ రాశ్యధిపతి శుక్రుడు. వీరు పట్టుదల గలవారు. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని వెంటనే గ్రహించే నేర్పు ఉంటుంది. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. మొదలు పెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు.

రెండో పాదం వారు దర్శనీయ క్షేత్రం :
ఆంధ్రప్రదేశ్ లోని ఉప్పుమిల్లి భవానీ శంకర లింగం క్షేత్రాన్ని దర్శించడం విశేష ఫలితాలను ఇస్తుంది.

రెండో పాదం గ్రహ దశలు :
వీరు పుట్టినప్పటి నుంచి కేతు దశ ఐదు సంవత్సరాల మూడు నెలలు. శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు అనుభవిస్తారు.

అశ్వని నక్షత్రం మూడో పాదం
అశ్వని మూడో పాదంలో జన్మించినవారు ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడతారు. ముఖ్యంగా జ్యోతిష్య, తర్కశాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు. అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు.

మూడో పాదం వారు దర్శనీయ క్షేత్రం :
శ్రీ పిరవి మరుందీశ్వరర్ ఆలయం (తమిళనాడు, తిరుతురైపూండి) క్షేత్రం అత్యంత ప్రధానమైన క్షేత్రం. ఇక్కడ శివుడిని దర్శించడం వల్ల నక్షత్ర దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

మూడో పాదం గ్రహ దశలు :
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ మూడున్నర సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 ఏళ్ల పాటు అనుభవిస్తారు.

అశ్వని నక్షత్రం నాలుగో పాదం
అశ్వని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి చూపిస్తారు. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరు. అయినా వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.

నాల్గవ పాదం వారు దర్శించవలసిన క్షేత్రం :
ఈ పాద జాతకులు దుగ్గుదుర్రులోని శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారిని అర్చించుకొంటే శుభమని చెబుతారు.

నాలుగో పాదం గ్రహ దశలు :
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరాల 9 నెలలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.

అదృష్ట సంఖ్యలు : 1, 4, 5, 9
మణి : వైఢూర్యం/రత్నం
వారములు : ఆదివారము, బుధవారము, శుక్రవారము
ఫలములు : ఏకాగ్రత.

అశ్వని నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు:
అశ్వని నక్షత్రం వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటిగా వ్యవహరించడం, సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

అశ్వినీ నక్షత్ర జాతకులకు తారాఫలాలు:
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - అశ్వని, మఖ, మూల - శరీరశ్రమ
సంపత్తార - భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ - ధన లాభం
విపత్తార - కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్యహాని
క్షేమత్తార - రోహిణి, హస్త, శ్రవణం - క్షేమం
ప్రత్యక్ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - ప్రయత్న భంగం
సాధన తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - బంధనం
మిత్ర తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - సుఖం
అతిమిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం, లాభం

అశ్వము (గుఱ్ఱం):అశ్విని నక్షత్రానికి ముఖ్యమైన చిహ్నం గుఱ్ఱము ఇది వేగం, చురుకుదనం, శక్తిని సూచిస్తుంది. అశ్వినీ దేవతలు గుఱ్ఱపు తలలతో ఉన్న వైద్య దేవతలుగా పేర్కొనబడతారు.

ఆధ్యాత్మిక చిహ్నం:ఈ నక్షత్రానికి శివుడు అధిపతి కావడంతో, ఓం లేదా శివలింగం కూడా ఒక ఆధ్యాత్మిక ప్రతీకగా ఉపయోగిస్తారు.

ఆధ్యాత్మిక అభివృద్ధి: అశ్వినులు దేవతల వైద్యులు కాబట్టి, ఈ నక్షత్రం వారికి ధ్యానం, పూజలు, మంత్రోచ్చారణ వంటి కార్యక్రమాల ద్వారా అంతరంగిక శక్తి పెరుగుతుంది.

ఆరోగ్య లాభాలు: అశ్విని నక్షత్రంలో జన్మించినవారు లేదా దీని సమయాన పూజలు చేసినవారికి శరీరారోగ్యం మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దుష్ట ప్రభావాల నివారణ: శని, రాహు వంటి దోషాల నివారణకు ఈ నక్షత్ర సమయములో రుద్రాభిషేకం లేదా హనుమాన్ పూజ లాంటి ఆధ్యాత్మిక చర్యలు మంచివిగా పరిగణించబడతాయి.

ఆర్థిక స్థిరత: అశ్విని దేవతలు శుభలక్షణాలకు ప్రతీకలుగా ఉన్నందున, దీని ప్రభావంలో ఉన్నవారికి ధనం, ఉద్యోగ విజయాలు కలిగే అవకాశం ఉంటుంది.

పరమేశ్వర అనుగ్రహం: అశ్విని నక్షత్రానికి శివుడు అధిపతి. కాబట్టి శివపూజ, శివనామస్మరణ చేస్తే అధిక శుభఫలాలు లభిస్తాయి. అశ్విని నక్షత్ర సమయంలో శివారాధన, హనుమాన్ ఉపాసన చేయడం వల్ల ఆరోగ్యం, ధనం, శాంతి, రక్షణ లభిస్తాయి.

అశ్విని నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు:
అశ్విని నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు. ఈ నక్షత్రానికి అధిపతి కేతువు. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు కేతు గ్రహ దోష నివారణకు మరియు అశ్విని దేవతల అనుగ్రహం కోసం ఈ క్రింది క్షేత్రాలను దర్శించడం శుభప్రదం. అశ్విని నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

1. తిరువణ్ణామలై (అరుణాచలం) - తమిళనాడు
అశ్విని నక్షత్రం కేతు గ్రహానికి సంబంధించింది కాబట్టి, కేతు దోషాల నివారణకు అరుణాచలం అత్యంత శక్తివంతమైన క్షేత్రం. ఇక్కడ శివుడు అగ్ని లింగ రూపంలో ఉంటాడు. గిరిప్రదక్షిణం చేయడం వల్ల అశ్విని నక్షత్రం వారికి మానసిక ప్రశాంతత, ఆరోగ్య సిద్ధి కలుగుతాయి.

2. శ్రీ వత్తవనేశ్వర స్వామి ఆలయం (తిరుత్తురైపూండి)
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉన్న తిరుత్తురైపూండి లోని వత్తవనేశ్వర స్వామి ఆలయం అశ్విని నక్షత్రం వారికి ప్రత్యేకమైనది.

విశిష్టత: ఇక్కడ అశ్విని దేవతలు స్వామివారిని పూజించారని పురాణాలు చెబుతున్నాయి.

3. శ్రీ కాళహస్తి - ఆంధ్రప్రదేశ్: రాహు-కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీకాళహస్తి. అశ్విని నక్షత్ర జాతకులు ఇక్కడ కేతు శాంతి పూజలు లేదా రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.

4. ఇతర ముఖ్యమైన దేవాలయాలు:
శ్రీ విఘ్నేశ్వర ఆలయం (కాణిపాకం): కేతువుకు గణపతి అధిదేవత. కాబట్టి కాణిపాకం వినాయకుడిని దర్శించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది.

శ్రీ నవపాషాణ క్షేత్రం (దేవిపట్నం): ఇక్కడ కేతు గ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం శుభప్రదం.

అశ్విని నక్షత్రం వారు చేయవలసిన కొన్ని పరిహారాలు:
మంగళవారం లేదా శనివారం రోజుల్లో కేతువుకు పూజ చేయడం మంచిది.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Bharani - భరణి

భరణి

భరణి నక్షత్రము కొన్ని వివరణలు

నక్షత్రం - భరణి
రాశి - మేషం
అధిపతి - శుక్రుడు
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - దేవదారు
జంతువు - ఏనుగు
నాడి - మధ్య
పక్షి - కాకి
అధిదేవత - యముడు

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
తదశ్వినావశ్వయుజోపయాతామ్ ।
శుభంగమిష్టౌ సుయమేభిరశ్వై: ।
స్వం నక్షత్రగ్మ్ హవిషా యజ౦తౌ ।
మధ్వాసంపృక్తౌ యజుషాసమక్తౌ ।
యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ ।
విశ్వస్య దూతావమృతస్య గోపౌ ।
తౌ నక్షత్రం జుజుషాణోపయాతామ్ ।
నమో శ్విభ్యాం కృణుమో శ్వయుగ్భ్యామ్ ।।

నక్షత్ర శాంతి: ఏ పప్పుతో అయినా పంచదార వేసి “పూర్ణం” తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టడం మంచిది.

భరణి నక్షత్ర జాతకుల గుణగణాలు :
నక్షత్రములలో భరణి నక్షత్రము రెండవది. అభిమాన ధనుడైన దుర్యోధనుడు మరియు యమధర్మరాజు భరణి నక్షత్రంలో పుట్టినారని ప్రతీతి. ఈ నక్షత్రంలో జననంనకు శాంతి అవసరం. మూడవ పాదం శిశువుకు దోషం. కనుక విశేష శాంతి అవసరము.

భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు.

ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదేవిధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. స్వార్థము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు.

సంఘములో పేరు, ప్రతిష్ఠ, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణయందు ఆసక్తి అధికము. భార్య వలన కలసి వస్తుంది. వీరి వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి తగినవారే. వీరు సలహాదారులుగా రాణిస్తారు.

బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు, జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము.

వీరి వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది. వీరిలో చాలా బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరు మనస్సులో ఎంత ఆందోళన చెందారనే దానితో సంబంధంలేకుండా, వీరు బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటారు కనుక, దీర్ఘకాలం వీరు పెద్దగా ఆలోచించరు. సంపూర్ణ జీవితాన్ని జీవిస్తారు మరియు రిస్కులను తీసుకోవడాన్ని ఆస్వాదిస్తారు.

సరైన దిశ మరియు ప్రేమపూర్వకమైన మద్దతు వల్ల వీరు లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. షార్ట్కట్ మార్గాలను తీసుకోవడాన్ని వీరు పరిహరించాలి మరియు సరళ మార్గాలను వీరు ఇష్టపడతారు. వీరి వివేచనకు విరుద్ధంగా ఏమీ చేయరు మరియు ప్రతిదీ కూడా స్పష్టంగా ఇతరుల ముందు పెడతారు.

ఆరోగ్యవంతమైన సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, వీరు విషయాన్ని స్పష్టం చేస్తారు. వీరు నిజాయితీగా ఉంటారు మరియు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు. భరణీ నక్షత్రం యొక్క అధినేత శుక్రుడు, దీని వల్ల వీరు కళల్లో రాణిస్తారు, మరియు దీని వల్ల వీరు తెలివైన వారిగా, సంగీతాన్ని ప్రేమించేవారిగా మరియు ప్రయాణికుడిగా ఉంటారు.

వీరు రాజులా జీవించడానికి ఇష్టపడతారు. అదేవిధంగా, వీరు కళలు, పాడటం, ఆటలు మరియు స్పోర్ట్స్ వంటి విషయాల్లో ఆసక్తిని పెంచుకుంటారు. గ్రహస్థితి వలన మహిళలు అత్యంత అనుకూలంగా ఉంటారు. శుక్రుని (అందం మరియు ప్రేమ కథకు అధిపతి) యొక్క ప్రభావం వల్ల మహిళా లక్షణాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది.

వీరు ఎంతో ఆశావహనంగా ఉంటారు మరియు పెద్దవారిని గౌరవిస్తారు. వీరు అవకాశాల కొరకు వేచి ఉండరు, దానికి బదులుగా వీరు వాటి కోసం చూస్తుంటారు. వీరి వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది.

భరణి నక్షత్ర నాలుగు పాదాల వారి గుణగణాలు

భరణి 4 పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి :

భరణి నక్షత్రం మొదటి పాదం :
పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసలుకుంటారు.

గ్రహ దశలు : పుట్టినప్పటి నుంచి శుక్ర మహాదశ 20 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలోని కోలంక గ్రామంలోగల శ్రీ ఉమాసమేత సోమేశ్వరస్వామిని అర్చించాలి.

భరణి నక్షత్రం రెండో పాదం :
కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనాధోరణి అధికం. అనుకొన్నది పూర్తి చేయాలన్న తలంపు, పంతం ఎక్కువ. దీంతో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచిచెడులపై అవగాహన, నీతినియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు.

గ్రహ దశలు : పుట్టినప్పటి నుంచి శుక్ర మహాదశ (సుమారుగా) 20 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : వీరు ఇంజరం గ్రామంలో వెలసిన శ్రీ ఉమాసమేత కొప్పేశ్వరస్వామి క్షేత్రంలో అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటే దోషరహితులు కాగలుగుతారు.

భరణి నక్షత్రం మూడో పాదం:
వీరికి తొందరగా కోపం వచ్చినా నిగ్రహశక్తిని కలిగి ఉంటారు. దైవభక్తి వీరిలో అధికం.

గ్రహ దశలు : తొలుత శుక్ర మహాదశ (సుమారుగా) 10 సం, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలోని పల్లిపాలెంలో కొలువు దీరిన శ్రీగంగా పార్వతీ సమేత విశ్వేశ్వరస్వామిని అర్చించడం శుభప్రదం.

భరణి నక్షత్రం నాలుగో పాదం:
వాస్తవ పరిస్థితులకన్నా ఊహలు అంటే చాలా ఇష్టం. బతిమాలించుకునే మనస్తత్త్వం. పంతంపట్టి ఏ పనులైన సాధిస్తారు.

గ్రహ దశలు : వీరికి శుక్ర మహాదశ (సుమారుగా) 5 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : ఈ పాదంలో జన్మించినవారు ఉప్పాంగల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని అర్చించడం శుభప్రదం అంటారు.


భరణి నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు :
భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణవ్యవస్థ, ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని అందులో చక్కగా రాణించడానికి అవకాశం ఉంది.

భరణి నక్షత్రజాతకుల తారాఫలాలు

తార నామం - తారలు - ఫలం

జన్మ తార - భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ - శరీరశ్రమ

సంపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - ధన లాభం

విపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - కార్యహాని

సంపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - క్షేమం

ప్రత్యక్ తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ప్రయత్న భంగం

సాధన తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - బంధనం

మిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం

అతిమిత్ర తార - అశ్వని, మఖ, మూల - సుఖం, లాభం

భరణి నక్షత్రాన్ని శుక్రుడు పాలించే గ్రహం. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, అందం, సృజనాత్మకత మరియు భౌతిక శ్రేయస్సు యొక్క గ్రహం.

చంద్రుడి దృష్టి:
ఇది చంద్రుడి ఆధిపత్యంలో ఉండే శక్తిగా భావించబడుతుంది. భావోద్వేగాలు, భావుకతకు ప్రాధాన్యత ఉంటుంది.

ధైర్యం మరియు పట్టుదల:
ఈ నక్షత్రం వారి మనస్సులో గట్టి ఆత్మవిశ్వాసం మరియు లక్ష్యసాధనకు శక్తి లభిస్తుంది.

ఆధ్యాత్మిక విజ్ఞానం:
శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల జీవితం పై ఉన్న దృష్టి మారుతుంది. సత్యం, ధర్మం వైపు మొగ్గు పెరుగుతుంది.

ఆర్థిక లాభాలు:
భరణి నక్షత్ర సమయాల్లో లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ధనలాభం కలుగుతుందని జ్యోతిషం చెబుతోంది.

శివపూజ మహత్యం:
ఈ నక్షత్రంలో శివుడి ఆరాధన, లేదా కాళీ మాత పూజ ద్వారా అభయము, శాంతి, శక్తి లభిస్తాయి.

ప్రధాన లక్షణాలు & ప్రయోజనాలు:-
కష్టకాలంలో కూడా మనోబలాన్ని కోల్పోకుండా ముందుకు సాగే శక్తి వీరిలో ఉంటుంది.
జీవితంలో తీవ్రమైన అనుభవాలను ఎదుర్కొని వాటినుంచి నేర్చుకునే శక్తి ఉంటుంది.
భరణి నక్షత్రం స్త్రీశక్తిని సూచిస్తుంది. శక్తిని, రక్షణను, దైర్యాన్ని కోరుకునే వారికి దుర్గామాత పూజ చాలా శుభప్రదం.

భరణి నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
భరణి నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు శుక్ర గ్రహ దోష నివారణకు మరియు యమధర్మరాజు అనుగ్రహం కోసం ఈ క్రింది క్షేత్రాలను దర్శించడం శుభప్రదం.

1. శ్రీ అగ్నీశ్వర స్వామి ఆలయం (కంజనూర్) - తమిళనాడు:-
శుక్ర గ్రహానికి సంబంధించిన అతి ముఖ్యమైన క్షేత్రం ఇది (నవగ్రహ క్షేత్రాలలో ఒకటి).

విశిష్టత: ఇక్కడ శివుడు అగ్నీశ్వర స్వామిగా పూజలందుకుంటాడు. ఈ ఆలయం శుక్రుడికి పరిహార క్షేత్రం.

ప్రయోజనం: భరణి నక్షత్రం వారు ఇక్కడ పూజలు చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగి, సుఖ సంతోషాలు కలుగుతాయి.

2. శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయం (నల్లడై) - తమిళనాడు:-
భరణి నక్షత్రం వారికి ఇది అత్యంత విశిష్టమైన ఆలయం.విశిష్టత: ఈ ఆలయంలో భరణి నక్షత్ర దేవతలు శివుడిని పూజించారని నమ్ముతారు. ఇక్కడ స్వామి వారిని "నల్లడై ముక్తీశ్వర స్వామి" అని పిలుస్తారు.

ప్రయోజనం: జన్మ నక్షత్రం రోజున ఇక్కడ అభిషేకం లేదా అలంకారం చేయించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

3. శ్రీ కాళహస్తి - ఆంధ్రప్రదేశ్:-
రాహు-కేతువులతో పాటు, భరణి నక్షత్ర జాతకులు శుక్రుడి అనుగ్రహం కోసం ఇక్కడ ఉన్న జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది. అమ్మవారు ఇక్కడ శుక్రుడికి అధిదేవతగా భావించబడుతుంది.

4. శ్రీరంగం - రంగనాథ స్వామి ఆలయం:-
శుక్ర గ్రహానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందువల్ల భరణి నక్షత్రం వారు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.

భరణి నక్షత్రం వారు చేయవలసిన కొన్ని పరిహారాలు:
శుక్రవారం రోజు: మహాలక్ష్మి అమ్మవారికి లేదా దుర్గాదేవికి పూజ చేయడం చాలా మంచిది.

దానం: శుక్రవారం రోజు పేదలకు తెల్లని వస్త్రాలు లేదా బియ్యం దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.

మంత్రం: "ఓం యమాయ నమః" లేదా "ఓం శుక్రాయ నమః" అనే మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Krittika - కృత్తిక

కృత్తిక

కృత్తిక నక్షత్రము కొన్ని వివరణలు
నక్షత్రం - కృత్తిక
అధిపతి - సూర్యుడు
గణము - రాక్షస
జాతి - పురుష
వృక్షం - బెదంబర
జంతువు - మేక
నాడి - అంత్య
పక్షి - నెమలి
అధిదేవత - సూర్యుడు
రాశి - 1 పాదం మేషం 2,3,4 పాదాలు వృషభం

కృత్తికా నక్షత్ర జాతకుల గుణగణాలు :
అశ్వన్యాది నక్షత్రములలో కృత్తికా నక్షత్రము మూడవది. కృత్తికా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి జన్మ నక్షత్రంగా పేరొందినది. (అందుకే మంగళవారం షష్టి తిథి కృత్తిక నక్షత్రం వస్తే స్వామికి విశేష పూజలు కూడా ఆలయాల్లో నిర్వహిస్తారు). ద్రావిడ దేశమునందు సుప్రిద్ధముగా ఇది అగ్ని దేవలూకమైన నక్షత్రంబని యధావిధిగా శాంతి జరుపుచున్నారు. ఉత్తర కాలామృతమున సామాన్య దోషంగా వ్రాయబడినది. కొందరు కృత్తికకు జననశాంతి జరుపుట లేదు.

అంబ, దుల, నితల్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణీక అను ఏడు నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం. అధిదేవత అగ్ని, పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత. కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, సోముడు, అగ్ని దేవతల కాంతులు ఉన్నాయి.

ఒకప్పుడు అగ్నిదేవుడు సప్తఋషుల భార్యలను చూచి మోహింపగా అతని భార్య అగు స్వాహాదేవి, తన భర్త ఆ ఋషి భార్యలచేత శపింప బడును అని భయపడి వసిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆరుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను. అంతట ఆ ఋషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచి వారిని విడనాడిరి.

అప్పుడు వారు తాము అట్టి అకృత్యము చేయలేదు అనియు అగ్ని భార్యయే తమ రూపములను వహించెను అనియు దోషములేని తమ్ము పరిగ్రహింప వలెను అనియు ప్రార్ధింపగా వారు అది నిజము అని తెలిసియు వారితోడిది అగు అరుంధతి యొక్క రూపమును స్వాహాదేవి వహింపలేక పోయెను. అట్టి పాతివ్రత్య మహిమ వీరియందు ఉండినయెడల వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్ధనమును అంగీకరింపకపోయిరి.

ఆ ముని భార్యలనే షట్కృత్తికలు అంటారు. కొందరు అపుడు కుమారస్వామి వీరివల్ల అగ్నికి పుట్టినట్లు చెబుతారు. కొందరు జెల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈ కృత్తికాదేవులు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిగా చేసికొనిరి అని చెప్పుదురు. కనుకనే కుమారస్వామికి కార్తికేయుడు అను పేరు కలిగెను అంటారు.

కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సూర్యుడు, గణము రాక్షసగణము. బాల్యములో మంచి పోషణ, ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నేర్పరితనము, విశేషమైన పోటీ మనస్తత్వము కలిగి ఉంటారు. స్వశక్తితో ఆస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ. అపాత్రా దానము చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ.

స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. పద్దెనిమిది-ఇరవై మూడు సంవత్సరముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమస్యల నుండి భయటపడి సుఖజీవితము సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవాంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి. వీరు చక్కటి సలహాదారు మరియు దయా హృదయాన్ని కలిగి ఉండటంతోపాటుగా మర్యాదపూర్వక జీవితాన్ని గడపడమే వీరి ప్రత్యేకత.

ఏదైనా పని యొక్క ఫలితాన్ని విశ్లేషించడానికి మరియు వాటిలో అంతర్గతంగా ఉండే లాభనష్టాలను కనుగొనడంలో వీరు నిపుణులు. వీరు చేసిన వాగ్ధానాలకు వీరు కట్టుబడి ఉండే వ్యక్తి మరియు వీరికి సామాజిక సేవలో ఆసక్తి ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల విషయానికి వస్తే, వాటితో వీరు ఏమీ పొందరు మరియు ఎవరి నుంచి లబ్దిని పొందడానికి ఇష్టపడరు. ఈనక్షత్ర జాతకులు బయటకు కాస్తంత మొండిగా కనిపిస్తారు, అయితేవీరిలో అంతర్గతంగా ప్రేమ, అభిమానం మరియు ఆత్మీయత ఉంటాయి.

వీరికి కోపం వచ్చినప్పుడు, క్రమశిక్షణ పాటిస్తారు. దీనితో పాటుగా, వీరికి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉంటుంది. జప, తప, ఉపవాసాలు మొదలైనవి చేయడం ద్వారా వీరు ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు. బాగా కష్టపడి పనిచేస్తారు కనుక, దేనినైనా రెగ్యులర్గా చేయడానికి ఇష్టపడతారు.

సాధ్యమైనంత వరకు పుట్టిన స్థలం నుంచి దూరంగా ఉండటం ద్వారా, వీరికి మరింత ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల సమస్యలకు వీరు సమర్థవంతమైన సూచనలను చేయగలుగుతారు. పేరుప్రఖ్యాతలు, సంపద విషయానికి వస్తే, వీరు ఎవరి దయాదాక్షణ్యాలపైనా లేదా తప్పుడు మార్గాలపై ఆధారపడరు.

డబ్బు సంపాదించే అద్భుతమైన నైపుణ్యం వీరికి ఉంటుంది మరియు కష్టపడి పనిచేయడం ద్వారా ఏ పనినైనా సాధించే అలవాటు ఉంటుంది. వీరి ప్రజాజీవితం సైతం అద్భుతంగా ఉంటుంది. వీరు ఆకర్షణీయంగా ఉంటారు మరియు పరిశుభ్రతను ఇష్టపడతారు. జీవితానికి వస్తే, వీరు పాటించే నియమనిబంధనలపై ఆధారపడి ఉంటుంది. సంగీతం మరియు కళల పట్ల వీరికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా, ఇతరులకు బాగా బోధిస్తారు.


కృత్తికా నక్షత్రం మొదటి పాదము :
కృత్తిక మొదటి పాదములో జన్మించిన వారు శారీరక బలంతోపాటు విద్యావంతులు, సామర్థ్యానికి మించి తలపడి చిక్కుల్లో పడుతుంటారు. అయితే ప్రయత్నపూర్వకంగా నిదానంగా ఫలితాలు సాధించడం వీరి సానుకూల లక్షణం. గంభీర స్వభావులై ప్రజాపాలనలో ఆసక్తి కలిగి ఉంటారు.

కృత్తిక మొదటి పాదములో గ్రహ దశలు : వీరికి ముందుగా రవి మహర్దశ 6 సంవత్సరాలు. అటు తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజదశ 7 ఏళ్లు, రాహుదశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : నీలపల్లిలోని శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామిని సేవించడం శుభప్రదం అని అంటారు.

కృత్తికా నక్షత్రం రెండో పాదము :
కృత్తిక రెండో పాదములో జన్మించిన వారి స్వభావం. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తారు. ఇతరులపట్ల ఆదరణ ఉంటుంది కానీ పరిమితమే. పంతం పట్టకుండా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.

కృత్తిక రెండో పాదములో గ్రహ దశలు : ముందుగా రవి మహర్దశ నాలుగున్నర సంవత్సరాలు. ఆ తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 18 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లాలోని అద్దంపల్లిలోగల శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామిని అర్చించాలి.


కృత్తికా నక్షత్రం మూడో పాదము :
కృత్తిక మూడో పాదములో జన్మించిన వారు శక్తివంతులుగా మెలుగుతారు. ఎల్లప్పుడు ధైర్యంతో ఉంటారు. గంభీర వదనంతో కనిపిస్తారు. అయితే, లాభ నష్టాలపై అతిగా ఆలోచిస్తుంటారు. పైకి మాత్రం ఏమీ పట్టనట్టు, ఏదీ పట్టించుకోనట్టుగా నటిస్తారు.

గ్రహ దశలు : ముందుగా రవి మహర్దశ మూడు సంవత్సరాలు, ఆ తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లాలోని అద్దంపల్లిలోగల శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామిని అర్చించాలి.

కృత్తికా నక్షత్రం నాలుగో పాదము :
తమ తీరుతో, రకరకాల వ్యాఖ్యలతో చిత్రమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. భగవదారాధన, సత్సంగ మార్గంలో ఉండడం అవసరం. లేకుంటే వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ తెలిసిన వ్యక్తి మాదిరి హడావుడి చేయడానికి ప్రయత్నిస్తారు. తమకున్న పరిజ్ఞానం పరిమితులు గ్రహించి మసలుకుంటే మంచిది.

గ్రహ దశలు : ముందుగా రవి మహర్దశ ఒకటిన్నర సం||లు, తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : ఉండూరులో కొలువైన శ్రీ ఉమాసమేత మార్కండేయ స్వామిని దర్శించటం శుభప్రదమని నమ్మకము.


కృత్తిక నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు :
కృత్తిక నక్షత్రం వారు అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది.

చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి. వీరు సూర్య జపం, ఆదిత్య హృదయ, సూర్య కవచ పారాయణ చేయడం మంచిది.

కృత్తికా నక్షత్ర జాతకుల తారాఫలాలు

తార నామం - తారలు - ఫలం

జన్మ తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - శరీరశ్రమ

సంపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - ధన లాభం

విపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - కార్యహాని

సంపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - క్షేమం

ప్రత్యక్ తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - ప్రయత్న భంగం

సాధన తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - బంధనం

మిత్ర తార - అశ్విని, మఖ, మూల - సుఖం

అతిమిత్ర తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: తెల్లని పువ్వులు దేవాలయంలో దానంగా ఇవ్వాలి. వేదజ్ఞుల ఆశీర్వాదం తీసుకోవాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
అగ్నిర్నః పాతు కృత్తికాః ।
నక్షత్రం దేవమిఇంద్రియమ్ ।
ఇదమాసాం విచక్షణమ్ ।
హవిరాసం జుహోతన ।
యస్య భాంతి రశ్మయో యస్యకేతవః ।
యస్యేమా విశ్వా భువనాని సర్వా ।
స కృత్తికాభిరభిసంవసానః ।
అగ్నిర్నో దేవస్సువితే దధాతు ।।

కృత్తిక నక్షత్రం ప్రయోజనాలు:
కృత్తిక నక్షత్రం అగ్నితత్వం కలిగిన శక్తివంతమైన నక్షత్రం. దీని అధిపతి సూర్యుడు, దేవత అగ్ని దేవుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కొన్ని ప్రత్యేకమైన శక్తులు, లక్షణాలు, మరియు జీవిత ప్రయోజనాలు ఉంటాయి.

కృత్తిక నక్షత్రానికి చెందిన రాశులు:
మేష రాశి - కృత్తిక మొదటి పాదం
వృషభ రాశి - రెండవ, మూడవ, నాలుగవ పాదాలు

కృత్తిక నక్షత్రం ప్రయోజనాలు:
బలమైన దీక్ష : ఈ నక్షత్రం వారు ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వారు నిర్ణయించినదాన్ని పూర్తి చేసే శక్తి కలిగివుంటుంది.

శక్తివంతమైన గుణాలు: మాట్లాడటంలో స్పష్టత, ధైర్యం ఉండటం వల్ల నాయకత్వ గుణాలు మెరుగవుతాయి.

ఆధ్యాత్మిక శక్తి: అగ్ని తత్వం ఉన్న కృత్తిక నక్షత్రం వారికి మంత్రోచ్చారణ, హోమాలు, శుద్ధి పద్ధతులపై ప్రాభవం ఉంటుంది.

సమస్యలను తొలగించే శక్తి: నిగ్రహ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఈ నక్షత్రం వారు సవాళ్లను అధిగమించగలరు. 

అగ్ని దేవుడు : అతని ఆరాధన వల్ల శుద్ధి, బల, మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

సరైన దిశలో శ్రద్ధ, సాధన పెట్టినప్పుడు కృత్తిక నక్షత్రం వారు జీవితంలో గొప్ప విజయాలను సాధించగలరు.

కృత్తికా నక్షత్రం ప్రత్యేకత:
సానుకూల లక్షణాలు: కృత్తిక నక్షత్ర వ్యక్తులు ధైర్యం, స్థితిస్థాపకత మరియు సవాళ్ల పట్ల ముందస్తు వైఖరి వంటి లక్షణాలను ప్రదర్శిస్తారు. వారు తమ చర్యలలో నిర్ణయాత్మకంగా ఉంటారు మరియు న్యాయం మరియు న్యాయానికి బలమైన భావాన్ని కలిగి ఉంటారు.

కృత్తిక నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
కృత్తిక నక్షత్రానికి అధిపతి అగ్ని దేవుడు మరియు గ్రహాధిపతి సూర్యుడు. ఈ నక్షత్రం కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) కి అత్యంత ప్రీతికరమైనది.

అరుణాచలం (తిరువణ్ణామలై) - తమిళనాడు: కృత్తిక నక్షత్రం వారికి అత్యంత ముఖ్యమైన క్షేత్రం అరుణాచలం.

కారణం:పరమశివుడు ఇక్కడ అగ్ని లింగ స్వరూపంలో కొలువై ఉన్నాడు. కృత్తిక నక్షత్రం అగ్ని తత్వానికి సంబంధించింది కాబట్టి, ఇక్కడ గిరిప్రదక్షిణం చేయడం వల్ల దోషాలు తొలగి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా 'మహా దీపం' రోజున దర్శనం విశేష ఫలితాన్నిస్తుంది.

శ్రీ కాట్రవనేశ్వర స్వామి ఆలయం (కకంజనూర్): 
తమిళనాడులోని నాగపట్నం జిల్లా కకంజనూర్ వద్ద ఉన్న ఈ ఆలయం కృత్తిక నక్షత్రం వారికి ప్రత్యేకమైనది.

విశిష్టత: అగ్ని దేవుడు తన పాప పరిహారం కోసం ఇక్కడి శివుడిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు: కృత్తిక నక్షత్రం కుమారస్వామికి జన్మ నక్షత్రం వంటిది. కాబట్టి ఈ క్రింది క్షేత్రాలు దర్శించడం మంచిది:

పళని (తమిళనాడు): సుబ్రహ్మణ్య స్వామి కొలువైన ఈ క్షేత్రం కృత్తిక నక్షత్రం వారికి చాలా ప్రత్యేకం.

మోపిదేవి (ఆంధ్రప్రదేశ్): ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల సంతాన సమస్యలు, కుజ దోషాలు ఉంటే తొలగిపోతాయి.

సూర్యనారాయణ స్వామి ఆలయం (అరసవల్లి): కృత్తిక నక్షత్రానికి గ్రహాధిపతి సూర్యుడు. కాబట్టి శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు కంటి సమస్యలు, చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

కృత్తిక నక్షత్రం వారు చేయవలసిన పరిహారాలు: మంగళవారం లేదా కృత్తిక నక్షత్రం ఉన్న రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం. ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్య గ్రహ అనుగ్రహం లభిస్తుంది.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Mrigashira - మృగశిర

మృగశిర

నక్షత్రం - మృగశిర
అధిపతి - కుజుడు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - చండ్ర
జంతువు - సర్పం
నాడి - మధ్య
పక్షి - కోడి
అధిదేవత - కుమారస్వామి
రాశి - 1,2 వృషభం, 3,4 మిధునం

మృగశిర నక్షత్ర జాతకుల గుణగణాలు:
మృగశిర నక్షత్రంనందున జన్మించిన వారికీ దోషములేదు కానీ, విష ఘటికయుక్తమైన కాలమైతే దోషం ఉండును. అందుకు శాంతి చేయవలెను. ఆ దోషం నివర్తించును. నక్షత్రం తిరుగక ముందే చేయుట మంచిది.

మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్ర జాతకులుగా అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు.

బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు.

ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. సంగీతములో రాణిస్తారు. తల్లి తండ్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు.

అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్దాయము ఎక్కువ. వీరికి ప్రతి విషయం గురించి ఆసక్తి కలిగి ఉంటారు కనుక, వీరికి 'పరిశోధకుడు' అనే పదం ఎంతో చక్కగా సరిపోతుంది.

ఆధ్యాత్మికత, సైకాలజీ మరియు భావోద్వేగాలకు సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు తమ యొక్క విషయావగాహన మరియు అనుభవాన్ని పెంపొందించు కోవాలనే లక్ష్యంతో ఉంటారు.

వీరు ఎంతో చురుకైనవారు మరియు అనేక విషయాలను ఏకకాలంలో అర్థం చేసుకుంటారు. వీరిలో మర్యాద, గౌరవం, సంతోషం, స్నేహపూర్వకంగా మరియు ఉత్సాహంగాను ఉండే స్వభావం ఉంటుంది.

వీరి మనస్సు మరియు మెదడు ఎల్లప్పుడూ క్రియాత్మకంగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు.

వ్యక్తులను కలుసుకోవడం మరియు వారికి సహాయపడటం ద్వారా వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరళమైన జీవితాన్ని గడపడం ద్వారా సంతోషంగా ఉండటం అనే జీవిత సూత్రాన్ని పాటిస్తారు. వీరి ఆలోచనలు నిష్పాక్షికంగాను మరియు పక్షపాతం లేకుండా ఉంటాయి. వీరు ఏదైనా విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తారు.

వీరు సాధారణంగా వాదనలు, విబేధాలు, మరియు చర్చలకు దూరంగా ఉంటారు. విజయం మరియు సంతోషానికి ప్రేమ మరియు మద్దతు ఎంతో కీలకమైనవని వీరు విశ్వసిస్తారు. వీరికి వీరి నమ్మకాలు మరియు ఆలోచనలపై బలమైన విశ్వాసం ఉంటుంది. వీరిలో అసాధారణమైన నాయకత్వ లక్షణాలున్నాయి.

మృగశిర నక్షత్రం మొదటి పాదం :
తమ తమ పనులవల్లనే కార్యసిద్ధి పొందగలరు. వేచి చూసే ధోరణి ఉంటుంది. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు వికటిస్తే ఈ నిర్ణయాలు ఎదురు తిరుగుతాయి. అటువంటప్పుడు శాంతంగా ఉండడం అవసరం. కోపంతో సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవని గ్రహించాలి.

గ్రహ దశలు : తొలుత కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, తదుపరి గురు 18 సం.లు, శని 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు, శుక్ర దశ 10 సం.లు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులోని శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి అర్చన మేలు చేస్తుంది అని నమ్మకము.

మృగశిర నక్షత్రం రెండో పాదం:
ప్రతి పనిలోను పూర్తి ఫలితం ఆశిస్తారు. సమగ్రమైన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు. తెలివితేటలు ఉపయోగించాల్సినచోట వాడక పోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మెళకువతో వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుని రావాలి.

గ్రహ దశలు : తొలుత కుజ మహర్దశ 5 సం. 9 నెలలు, తర్వాత రాహు 18 సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు, శుక్ర దశ 20 సం.లు ఉంటుంది.

దర్శనీయ క్షేత్రం : తూ.గో. జిల్లా గురజనాపల్లిలోని శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని అర్చించడం శుభప్రదం అని చెబుతారు.

మృగశిర నక్షత్రం మూడో పాదం:
ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వాస్తవానికి చాలా దూరంగా ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిర్ణయాలు ఆలస్యం అవుతుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో గోప్యత పాటిస్తారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నక్షత్ర పాదంలో జన్మించినవారికి జన్మతః కుజ మహర్దశ ఉండును.

గ్రహ దశలు : జన్మించిన లగాయితు మూడున్నర సం.లు కుజ మహర్దశ, తర్వాత రాహు 18 సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు, బుధ 17సం., కేతు 7సం., శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.

దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లా అండ్రంగి గ్రామంలోని పార్వతీ సమేత మల్లేశ్వరస్వామిని అర్చిస్తే నక్షత్ర దోష నివారణ జరుగుతుంది.

మృగశిర నక్షత్రం నాలుగో పాదం:
వీరు సాధు స్వభావంతో ఉంటారు. నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో ఆయా వ్యక్తులు ఇబ్బంది పడడమే గాక, మిగిలినవారు సైతం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. నిలకడకోసం ప్రయత్నించుట మేలు.

గ్రహ దశలు : పుట్టినప్పటినుంచి సుమారుగా 21 నెలల పాటు కుజ మహర్దశ, తర్వాత రాహు 18సం.లు, గురు 16సం.లు, శని 19 సం.లు, బుధ 17సం.లు, కేతు 7సం.లు, శుక్ర మహర్దశ 20సం.లు ఉంటాయి.

దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ శివారుల్లోని జగన్నాథ గిరిలోగల అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని అర్చిస్తే విశేష ఫలితం లభించగలదని నమ్మకం.

మృగశిర నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు :
మృగశిర నక్షత్రం వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు:
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - శరీరశ్రమ

సంపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ధన లాభం

విపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్యహాని

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - క్షేమం

ప్రత్యక్ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - ప్రయత్న భంగం

సాధన తార - అశ్విని, మఖ, మూల - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - బంధనం

మిత్ర తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - సుఖం

అతిమిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: అమ్మవారికి యాలుకులతో పుజ చేయించాలి. అమ్మవారి ఆలయంలో పళ్ళు దానం చేయాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
సోమో రాజా' మృగశీర్షేణ ఆగన్న్' ।
శివం నక్షత్రం ప్రియమ’స్య ధామ' ।
ఆప్యాయ'మానో బహుధా జనేషు ।
రేతః' ప్రజాం యజ'మానే దధాతు ।
యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి' ।
ప్రియగ్మ్ రా'జన్ ప్రియత'మం ప్రియాణా”మ్ ।
తస్మై' తే సోమ హవిషా’ విధేమ ।
శన్న' ఏధి ద్విపదే శం చతుష్పదే ॥

మృగశిర నక్షత్ర జాతకులకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అన్వేషకులుగా మరియు అన్వేషణలో సిద్ధత కలిగి ఉంటారు. వీరు దృఢ సంకల్పం, ఆశయం మరియు మేధోపరంగా మరియు శారీరకంగా కొత్త క్షితిజాలను అన్వేషించాలనే బలమైన కోరికను కలిగి ఉంటారు.

బాషా నైపుణ్యం:
ఈ నక్షత్రానికి చెందినవారికి మాట్లాడటంలో అసాధారణ నైపుణ్యం ఉంటుంది. వారు రచయితలు, కవి, ఉపన్యాసకులు, మానవ వనరుల నిపుణులుగా మెరుగైన స్థానాలు పొందగలరు.

కళలపై ఆసక్తి:
వీరికి సంగీతం, నాట్యం, డ్రాయింగ్, కళలపై మక్కువ ఉంటుంది. వీరు సృజనాత్మకత కలిగిన వారు. చలన చిత్రరంగం, కళారంగాల్లో మంచి ప్రతిభ చూపగలరు.

జ్ఞానం సాధించేవారు:
చదువుపట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చదువులో మెరుగైన పురోగతి సాధించగలరు. శాస్త్రీయ, ఆధునిక విద్యా రంగాలలో విజయం సాధించేవారు.

ఆధ్యాత్మికత:
వీరికి ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ ఉంటుంది. మానసికంగా ప్రశాంతతను కోరుకుంటారు. పూజలు, వ్రతాలలో చురుగ్గా పాల్గొంటారు.

వృత్తి రంగం:
ఈ నక్షత్రంలో జన్మించిన వారు వృత్తి పరంగా క్రియేటివ్ ఫీల్డ్స్, మీడియా, టెక్నాలజీ, డిజైన్, రచన, ఉపాధ్యాయులు, మరియు మానవ వనరుల రంగాలలో సఫలం అవుతారు.

వ్యక్తిత్వం:
వారు మృదువైన మాటలు మాట్లాడతారు, అందంగా కనిపిస్తారు, సహృదయులు, శాంత స్వభావం కలిగి ఉంటారు. వారు చుట్టూ ఉన్నవారిని ఆకర్షించగలరు.

ఆరాధించవలసిన దేవత:
సోమేశ్వర స్వామి, చంద్రుడిని ప్రసన్నం చేసుకునే పూజలు, శివుడి ఆరాధన మృగశిర వారికి ఎంతో మేలును ఇస్తుంది.

మృగశిర నక్షత్రం వారు తెలివైనవారు, శోధనాత్మక స్వభావం కలిగి ఉండి కళలు, జ్ఞానం, సంభాషణలో ప్రతిభ చూపగలవారు.

మృగశిర నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
మృగశిర నక్షత్రం వారికి ప్రత్యేకమైన మరియు వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

శ్రీ ఆది నారాయణ పెరుమాళ్ ఆలయం (ఎంకన్) - తమిళనాడు: మృగశిర నక్షత్ర జాతకులకు ఇది అత్యంత ప్రధానమైన పరిహార క్షేత్రంగా పరిగణించబడుతుంది. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, ఎంకన్ అనే గ్రామంలో ఉంది. (తంజావూరు నుండి తిరువారూర్ వెళ్లే మార్గంలో ఉంటుంది).

ఇక్కడ విష్ణుమూర్తి "ఆది నారాయణ స్వామి"గా గరుడ వాహనంపై కొలువై ఉంటాడు. సాధారణంగా గరుడ వాహన సేవ ఉత్సవాల సమయంలోనే కనిపిస్తుంది, కానీ ఇక్కడ స్వామివారు నిరంతరం గరుడునిపైనే దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.

మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల కుజ దోషాలు తొలగిపోతాయి. వివాహ లేమి, భూమి సంబంధిత వివాదాలు, మరియు ఆరోగ్య సమస్యలతో బాధపడే మృగశిర నక్షత్రం వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి.

కథిరామంగళం వన దుర్గా దేవి ఆలయం - తమిళనాడు:  కుంభకోణం సమీపంలోని కథిరామంగళంలో ఉన్న వన దుర్గ అమ్మవారి ఆలయం కూడా మృగశిర నక్షత్ర జాతకులకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. మృగశిరా నక్షత్రం వారు తమ నక్షత్రం రోజున ఇక్కడి అమ్మవారికి రాహుకాలంలో పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి ఆలయం (హసనబాద) - ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'విలాస హసనబాద' గ్రామంలో ఉంది.

ఇది 108 నక్షత్ర పాద శివాలయాలలో ఒకటి. మృగశిర నక్షత్రం (వృషభ రాశి మరియు మిథున రాశి) వారు ఈ క్షేత్రంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి.

మృగశిర నక్షత్రం వారు చేయవలసిన ఇతర పరిహారాలు:
మృగశిర నక్షత్రానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి) మరియు చంద్రుడు. కాబట్టి తరచూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించడం, మంగళవారం రోజు అభిషేకం చేయించడం మంచిది.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

GURUVU - గురువు

స్వభావము - మృదు, శుభుడు
అధిపతి -పరమశివుడు
లింగము -పురుష
తండ్రి - అంగీరసుడు
తల్లి: - సురూప
భార్య - తార
పిల్లలు -భరద్వాజ, కుచ మరియు కేసరి
వారం - గురువారం లేదా బృహస్పతి వారం
రుచి -తీపి
జాతి -బ్రాహ్మణ
వర్ణము - లేత పసుపు పచ్చ
అధి దేవత -బ్రహ్మ
దిక్కు -ఈశాన్య
వాహనం - ఏనుగు
తత్వం - ఆకాశ
జీవులు -ద్విపాదులు
ప్రకృతి -కఫ
ఋతువు -హేమంత
లోహము -బంగారము
రత్నము -పుష్యరాగము
గ్రహ సంఖ్య -మూడు
గుణం -సత్వ గుణం
ప్రదేశం -గోదావరి నుండి వింధ్య ప్రాంతాలు
జప సంఖ్య - 19000
మిత్రులు -రవి, చంద్ర, కుజులు
శత్రువులు -బుధ, శుక్రులు
సములు - శని
గురు మహా దశ - 16 సంవత్సరములు

గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి, వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి.

అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు
గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు.

గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ.

గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు.



ద్వాదశస్థానాలలో గురువు
లగ్నంలో గురువు ఉన్న జాతకుడు అదృష్టవంతుడు, సౌందర్యవంతుడు, నిర్భయుడు, సంతానవంతుడు, చీరంజీవి ఔతాడు.

ద్వతీయ స్థానమున గురువు ఉన్న జాతకుడు స్వచ్ఛమైన వాక్కులు కలవాడు, భోజనప్రియుడు, సుందరవదనుడు, ధనవంతుడు, విద్యావంతుడు ఔతాడు.

తృతీయ స్థానమున గురువు ఉన్న జాతకుడు కష్టజీవి, అమర్యాదస్తుడు, ఖ్యాతి కలిగిన సోదరవర్గం ఉన్నవాడు, పాపకార్యములు చేయువాడు మాయావి ఔతాడు.

చతుర్ధ స్థానమున గురువు ఉన్న జాతకుడు సుఖజీవి, తల్లి, సేవకులు, భార్యా పుత్రులు, బంధువులతో కలిసి జీవించు వాడు, సంపద్వైభవం కలవాడు ఔతాడు.

పంచమస్థానమున గురువు ఉన్న జాతకుడు పుత్రుల వలన క్లేశములు అనుభవిస్తాడు. మేధావి, మంత్రి పదవిని అలంకరించు వాడు ఔతాడు.

షష్టమ స్థానమున గురువు ఉన్న జాతకుడు నిరుత్సాహి, అగౌరవములు పొందువాడు, శతృనాశకుడు, మంత్రభినివేశనం కలవాడు ఔతాడు.

సప్తమమున గురువు ఉన్న జాతకుడుఊతి ఉదారుడు, మంచి కళత్రం కలవాడు, మంచి పుత్రులను కలిగినవాడు, వినయసంపన్నుడు ఔతాడు.

అష్టమ స్థానమున గురువు ఉన్న జాతకుడు కడుబీదవాడు, అతి తక్కువ సంపాదనా పరుడు, పాపి, చిరంజీవి ఔతాడు.

నవమస్థానమున గురువు ఉన్న జాతకుడు ఖ్యాతి వహించిన మంత్రిగానూ, సంతతి కలవాడు, ఐశ్వర్యం కలవాడు, పవిత్రకార్యములందు అనురక్తుడై ఉంటాడు. ఉంటాడు.

దశమ స్థానమున గురువు ఉన్న జాతకుడు రుజువర్తనుడు, పవిత్రకార్యములు చేసి ప్రఖ్యాతి చెందు వాడు, బహుధనవంతుడు, రాజమిత్రుడు ఔతాడు.

ఏకాదశ స్థానమున గురువు ఉన్న జాతకుడు ధనవంతుడు, నిర్భయుడు, వాహనములు కలవాడు, చిరంజీవి, అల్పసంతానవంతుడు ఔతాడు.

ద్వాదశ స్థానమున గురువు ఉన్న జాతకుడు ఇతరులచేత అసహ్యించుకొనబడువాడు, అసంగతములు పలుకువాడు, అప్రమత్తుడు, పాపము చేయువాడు, అలసట పొందువాడు ఔతాడు.

గురు


Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...