శ్రీరస్తు -శీమహాభాగవతము -చతుర్ధస్కంధము
శ్రీవిలసితధరణీతన, యావదనసరోజవాసరాధిప! సితరా
జీవదళనయన! నిఖిలధ, రావరనుత! సుగుణధామ! రాఘవరామా! |
మంచి సిరిగల సీత్రాదేవిముఖపద్నానికి సూర్యునివంటివాడా! తెల్లతామర పూరేకుల్లా విప్పారిన నేత్రాలు కలవాడా! సమస్త రాజలోకం కీర్తించినవాడా! మంచిగుణాలు రాశిగా కలవాడా! రామా! (అంటూ పోతన శ్రీరాముని సంబోధిస్తున్నాడు).
సూతుడు అష్టాదశపురాణాలను విప్పి చెప్పే వైఖరి కలవాడు. శౌనకాది మహామునులంతా గొప్ప గుణవంతులు. ఆ మునివరేణ్యులకు, సూతుడు కథను చెప్పడం ప్రారంభించాడు. ఉపవాసాలతో ప్రాణ పరిత్యాగానికి సిద్ధమవుతున్న మహారాజు పరీక్షిత్తుతో శుకయోగి ఇలా అన్నాడు.
మైత్రేయుండు విదురునకు స్వాయంభువ మనువుత్రికల వంశవిస్తారంబు దెలువుట
No comments:
Post a Comment