Friday, April 24, 2026

air retention - వాయు ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - వాయు ధారణ

హిమగిరీంద్రా తొలుత పూరకముతో నాధరచక్రమున మనస్సు నిలుపవలయును. పిదప గుడి మేఢ్రముల నడుమగల కుండలినీ శక్తి నచటి వాయువుతో సంకోచించి మేలుకొలుపవలయును. అటుపిమ్మట క్రమముగమెల్లగ నెల్లచక్రములు భేదించి సహస్రారచక్రము జేరి యందు గల పరమశివునితోపరాశక్తి నేకమొనరించి వారిని ధ్యానింపవలయును. అచటనుండి లక్కరసమువలె నమృతము వెడలుచుండును. దానితోయోగసిద్ది గల్గించుమాయాశక్తిని తనుప వలయును.

స్థితప్రజ్ఞుడైనవా డమృతధారతో షట్చక్రములందున్న దేవతలను తనిపి పిదప నా యమృతధారను మూలాధారమునకు తేవలయును. ఈ విధముగ నిత్యము యోగాభ్యాసముచేయు యోగిదోషము లన్నియును తొలిగిపోవును. ఎల్లమంత్రము లతనికి కరతలామలకము లగును. వేరు విధముగ లభించవు. 

ఇట్టి యోగి జరామరణ దుఃఖముల కాటపట్టగు సంసారబంధములనుండి విడివడును. జగన్మాతనగు నాలోనెన్నియో సుగుణవిధులు గలవు. అట్టి సుగుణములన్నియును సాధకునిలో తప్పక వెలయుచుండును.

మంత్ర ధారణ

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...