Thursday, April 23, 2026

Incarnation as Parvati - పార్వతిగా అవతరణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - పార్వతిగా అవతరణ

అను వారి వేడుకోలు విని దేవి యిట్ల పలికెను. నా యొక శక్తి హిమాలయముపై గౌరి యన నవతరింపగలను. అమెకు శివునితో పెండ్లియగును. అమె మీ కార్యము సాధింపగలదు. మీకు సతతము నా పదములందు భక్తి నిల్చుగాక! హిమాలయ పతియుము నన్నే పరమ భక్తితో నుపాసించుచున్నాడు.

కనుక నతని యింట జన్మమెత్తుట నా కత్యంతము ప్రియముగనున్నది. దేవి ప్రసన్న వాక్కులు విని హిమాచలపతి డగ్గుత్తికచే తొట్రిలు మాటలతో కన్నీట

మహారాజ్ఞి కిట్లనెను: ఓ దేవి ! నీవెవనిని అను గ్రహింతువో వానిని మహాపురుషునిగ జేతువు. కానిచో కదలని జడమగు నేనెక్కడ ! సచ్చిదానంద రూపిణివి నీ వెక్కడ! ఓ పావనీ ! నాకు నూఱు జన్మములకైన నీకు తండ్రిగ బుట్టుట సంభవముగాను అశ్వమేధాదుల పుణ్యముననో నీ దివ్య సమాధి పుణ్యముననోకాని యిది సంభవించదు.

ఓహో! హిమాలయుడెంచటి ధన్యుడు ! ఎంత దృష్టవంతుడు ! జగన్మాతను తన కుతురుగ బడసెనను కీర్తి జగమందంట వ్యాపించును. ఏ జగజ్జనని గర్బమునందు బ్రహ్మండకోటులు నిండియుండెనో యా తల్లి యొకనికి తనయగ పుట్టుటచే నతనివంటివాడు నేలపై లేడు. నావంటి వాడు తమ వంశములో జన్మించె నని సంతసించి నా పితరు లెంతటి యుత్తమగుతులందుదురో!

ఓ మాతా ! నీవు ప్రేమనీరదయతో నా కీ వరమిచ్చిన విధముగ సర్వ వేదాంత ప్రతిపాద్యవగు నీ స్వరూపముము నాకు వివరింపుము. ఓ పరమేశానీ ! భక్తితోడి యోగమును వేద సమ్మతమగు జ్ఞానమును గుఱిచి నాకు తేట పఱచుము. దాని వలన నేను నిన్నే కొల్చుచుండగలను. అ హిమాలయుని మాటలు వినియంబ విప్పారిన ముఖ పద్మముతో వేదాంత రహస్యము గూర్చి వారికి తెల్పుటకిట్లు ప్రారింభించెను.

జగన్మాత చేసిన జ్ఞానబోధ

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...