Saturday, April 25, 2026

Creation of the universe by Svayambhuvamanu - స్వాయంభువమను సృష్టి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - స్వాయంభువమను సృష్టి

నారాయణ డిట్లనెను: నారదా! ఆ ప్రకారముగ విష్ణువు తన శతబాహూవులతో భూమిని యథాస్థానమున నెలకొల్పి తిరిగి తన వైకుంఠథామ మరిగెను. పిమ్మట 

బ్రహ్మ మనువుతో నిట్లనెను: స్వాయంభువ మనూ! మహాబాహూ! పుత్రా! తేజస్వులలో శ్రేష్ఠా! ఈ నేలపై నుండి నీకు దోచిన రీతిగ ప్రజా సృష్టి కొనసాగింపుము. దేశకాలములకు తగినచట్లు నుత్తమమైన యజ్ఞసాధనములు సమకూర్చుకొని యజ్ఞ పూరుషునిగూర్చి వేల్పుము. శాస్త్రక్తముగ వర్ణాశ్రమ ధర్మము పాటించుచు ఈ క్రమపద్దతి నే ప్రజావృద్ది జరుగగలదు. 

విద్యావినయసం పదలు-సదాచారము - గల్గి కీర్తిలో కాంతిలో నీకు ప్రతిరూపులగు కుమారవరులను పెక్కురను త్రిగుణాను గుణశీలవతులగు కన్యలను గని పిదప మనస్సును ప్రధాన పురుషునందు చక్కగ నిలుపుము. భక్తిసాధన యోగముతో భగవంతునకు కైంకర్యములు చేయుచు పరమయోగులు పొందునట్టి మాన్యపరమగతిని బొందుము. 

ఈ రీతిగ కమలనిలయుడగు ప్రజాపతి తన పుత్రుడగు మనువును ప్రజాసృష్ఠిలో నియమించి తన నివాసమున కరిగెను. 'సంతతి బడయు' మను తండ్రిమాట జవదాటక స్వాయంభువమను మహీపతి ప్రజాసృష్టికి గండగెను. అంతమునువునకు ప్రియవ్రతుడు - ఉత్తానపాదు డను నిర్వురు కొమరులు గల్గిరి. పిదప మువ్వురు కన్నియలు గల్గిరి. వారి పేర్లు వినుము: 

మొదటి కన్య 'అకృతి' రెండవ కన్నియ 'దేవహూతి' మూడవ కన్నె 'ప్రశూతి'. వీరులోకపావనలై వన్నె గాంచిరి. ఆకృతిని రుచికి - దేవహూతిని కర్దమునకు - ప్రసూతిని దక్షున - కిచ్చి మనువుపెండ్లిచేసెను. ఈ లోకమంతయును వీరి సతంతియే.

ఆకృతి రుచులకు యజ్ఞడను పేరుతో నాది పూరుషుడగు భగవానుడవతరించెను. దేవహూతి కర్దములకు కపిలుడుగ హరి యవతరించెను. ఈ కపిలుడే సాంఖ్యయోగ ప్రవర్తకుడని లోకమున విఖ్యాతి గాంచెను. ప్రసూతి దక్షులకు పెక్కురు ప్రజలు గలిగిరి. వారికి దేవ - తిర్యక్కులు - నరులు మున్నగు వారు లోకవిఖానితులైన వారు గల్గిరి. వీరెల్లరును సృష్టి కర్తలే. 

యజ్ఞభగవానుడు స్వాయంభువ మన్వంతరమందు యామదేవ గుణములతో గూడి రాక్షసుల బారినుండి మనువును గాపాడెను. మహీయోగియగు కపిల భగవానుడు తన యాశ్రమమందుండి దేవహూతికవిద్యనాశకమగు పరమ జ్ఞానము భోధించెను. ఆది సవిశేషమైన ధ్యానయోగము; ఆధ్యాత్మజ్ఞాన నిశ్చయము; అజ్ఞానమను పెంజీకట్లు బాపువెల్గుబాట; కాపిలశాస్త్రమని ప్రచారది మందినది. 

కపిల మహాయోగి తన తల్లికి సాంఖ్య ముపదేశించి పులహాశ్రమ మేగెను. అసాంఖ్యా చార్య మహాశయు డిప్పటికి నచ్చటనే కలడు. ఎవ్వాని దివ్యనామ సంస్మరణమున సాంఖ్యయోగము సిద్దించునో- యోగాచార్యడు-సర్వవరప్రదుడు నగునట్టి కపిలునకు నమస్కారములు. ఇట్లు మను కన్యల యుత్తమవంశము వర్ణించితిని. దీనిని చదివిన-వినన వారి సర్వపాపములు పటాపంచలగును. 

ఇకమీదుట మునుపుత్రుల శుభవంశ వర్ణనము వినిపింతును. దానిని విన్నంతమాత్రన పరమపదము చేకూరును. లోక్యవ్యహారము కొఱకు సకల భూతముల కల్యాణము కొఱకు మనుపుత్రులు ద్వీప- వర్ష- సముద్రములను నేర్పాటు లేర్పరచిరి.

నారాయణుడిట్లనెను: స్వాయంభువ మనువు పెద్దకొడుకు ప్రియవ్రతుడు; పితృసేవాపరుడు; నిత్య-సత్య-ధర్మపరాయణుడు. అతడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క కన్యను - బర్హిష్మతి యను సమాన-శీల- వయో- రూపములు గల యందాలరాశిని-చేపట్టెను. 

ప్రియవ్రతుడు మహాత్ముడామె యందు గుణవంతులగు పదిమంది పుత్రులను ఊర్జస్వతియను కన్నియను గనెను. మొదటివాడు అగ్నీధ్రుడు; రెండవవాడు ఇధ్మజిహ్వుడు; మూడవవాడు యజ్ఞబాహుడు; నాల్గవవాడు - మహావీరుడు; ఐదవ రుక్మశుక్రుడు; ఆరవవాడు ఘృతపృష్ఠుడు; ఎనిమిదవవాడు మేధాతిథి; తొమ్మిదవవాడు వీతిహోత్రుడు; పదవవాడు కవి; ఈపదిమందియు వహ్నినామము గలవారు. 

ఈ పదిమంది పుత్రులలో కవిసవనుడు మహావీరుడను మువ్వురును విరాగులైరి. వీరు ఆత్మ విద్యా నిష్ణాతులై-ఊర్ద్వ రేతస్కులై వీతరాగులై-పరమహంసాశ్రమంమందానందమున నుండిరి. 

ప్రియవ్రతునకు వేరొక భార్యయందు 'ఉత్తమ-తామస-రైవతు'లను మువ్వురు ప్రసిద్ద పుత్రు లుద్బవించిరి. వీరు మన్వంతరముల కధిపతులై ప్రసిద్ధి గాంచిరి. వీరు మహావిక్రమవంతులు. ఇట్లు ప్రియవ్రత మహారాజీ భూమి నేలెను. ప్రియవ్రతుడు మొక్కవోని యింద్రియ పటుత్వముతో పదునొకండరర్బుదముల యేండ్లు పరిపాలించెను. 

సూర్యుడీ భూమిపైనెప్పుడును అర్ధభాముననే వెల్గును. భూమి రెండవ భాగమున కాఱు చీకట్లలముకొనును. ఇట్టి వైపరీత్యము తన యేలుబడిలో నుండుట రాజు మదికి బాధ గలిగించెను. నేనీ సమస్త భూమండలమును నిరాటంకముగ నేలుచుండగ నీ చీకటి యలముటేమి? నీ యోగబలముతో భూమిపై చీకటి తొలగింపగలను. అని స్వాయంభువ పుత్త్రుడు నిశ్చయించుకొని సూర్యప్రభలు చిందించు రథము నిర్మింపజేసి యేడు మారులు భూమిని ప్రదక్షిణించెను. అతని రథము సాగుచుండగ నేమి రేఖలచే భూమిపై నేడు గుర్తలు పడి యవిలోకమున సప్తసముద్రములుగ ప్రసిద్ధిగాంచెను.

భూమిపై గుర్తులు పడని భాగములు ద్వీపములుగ పేర్కొనబడెను. ఆ రథపు చక్రపుంటచుల గుర్తులు గల భాషములు పెద్దయగడ్తలై యేడు సంద్రములుగమారెను. వాని మధ్యభూమి యేడు దీవులుగ నయ్యెను. అవి జంభూద్వీపము, ప్లక్ష ద్వీపము-శాల్మలీ ద్వీపము-కుశద్వీపము - క్రౌంచద్వీపము శాకద్వీపము పుష్కరద్వీపము; 

వాని పరిమాణము లుత్తరోత్తములుగ రెండింతులుగ నుండును. వీనికి నలు వైపుల బైట క్రమముగ క్షార-ఇక్షు-సురా-ఘృత క్షీర దధిజలసముద్రములు గలవు. ఈ నేలపై నీ యేడు సముద్రములును ప్రసిద్ధి గాంచినవి. మొదటిదగు జంబూద్వీపము క్షారసముద్రముచే చుట్టబడియున్నది. ప్రియవ్రతుడు దానికాగ్నీధ్రుని రాజుగతేసెను. ప్లక్షద్వీపముచుట్టును చెఱకు సంద్రము గలదు. ప్లక్ష ద్వీపమువన కిధ్మజిహ్వుడధిపతిగ చేయబడెను. యజ్ఞబాహుడు సురాసంద్రముచే చుట్టబడిన శాల్మలి దీవికి నాయకుడయ్యెను. రమ్యమగు కుశద్వీపము చుట్టు నేతి సంద్రము గలదు. ఈ దీవిని ప్రియవ్రతపుత్రుడుగు హిరణ్యరేతుడేలెను. ఐదవవాడగు ఘృతపృష్ఠుడు మహాబలశాలి. 

ఈ ప్రియవ్రత తనయుడు పాలసంద్రముచే చుట్టబడిన క్రౌంచ ద్వీపమునకు రాజుగ చేయబడెను. పెరుగు సంద్రముచేత చుట్టబడిన యందమైన శాకద్వీపమునకు ప్రియవ్రతసుతుడగు మేధాతిథి ధరానాధుడయ్యెను. వీతిహోత్రుడు మంచినీటి సంద్రముచే చుట్టబడిన పుష్కర ద్వీపమునకు తండ్రిసమ్మతితో రాజయ్యెను. ప్రియవ్రతుడు తనయూర్జస్వతి యను కన్యను శుక్రున కీయగ వారికి పేరు గాంచిన దేవయాని యను కన్య జనించెను. ఈ విధముగ ప్రియవ్రతుడు సప్త ద్వీపములను తన కొడుకులకు పంచిపెట్టి యాత్మ వివేకవంతుడై జ్ఞానము బడయుటకు యోగమార్గవలబించెను.

భువన వ్యవస్థ






No comments:

Post a Comment

Creation of the universe by Svayambhuvamanu - స్వాయంభువమను సృష్టి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - స్వాయంభువమను సృష్టి నారాయణ డిట్లనెను: నారదా! ఆ ప్రకారముగ విష్ణువు తన శతబాహూవులతో భూమిని యథాస్థానమున నెలకొల...