నారాయణు డిట్లనెను: ఇంక హిరణ్మయవర్షమున యోగపతియగు కూర్మ భగవానుడు విరాజిల్లును. అతని నర్యముడీ విధముగ పూజించి సంస్తుతించును.
సర్వసత్త్వగుణ విశిష్టుడును గుర్తింపరాని జలనివాసము గలవాడును సుఖములు గురియువాడును సర్వగతుడును సర్వాధారుడునునగు భగవానునకు నమస్కారములు. ఈ దృశ్యమంతటిని తన మాయచేతసృజించినవాడు అనంతరూపుడు నిరూపించి లెక్కింపరాని యువతారములు గలవాడు నగు దేవునకు నమస్కారములు. ఈ యండ-పిండ-స్వేదజనులును ఉద్బిదములును దేవ-ఋషి-పితృ-భూతములును సకల చరాచరములును నింగి-దివి-భువి-గిరులు-వనులు-సత్తులు-సాగరములు-దీవులు-గ్రహతారకలును ఇంద్రియములు మున్నగునవన్నియును నీవే కదా!
సాంఖ్యు లెవనియందు విశేషనామరూపములుగల యిరవదినాల్గు తత్త్వములుగలవనిరో తత్త్వదృష్టితో చూడ నెవనియం దిట్టి సంఖ్యకు తావులేదో యట్టి సాంఖ్య నిదర్శనుడగు వానికి చేయెత్తి మ్రొక్కుదును ఈ విధముగ నర్యము డా వర్షమందున్న భగవానుని సర్వభూతకారకుడగు ప్రభుని గానము చేయుచు సంస్తుతించును. ఆ వర్షమునకు నుత్తరమున నుత్తర కురుప్రదేశమున యజ్ఞపురుషుడగు నాది వరాహ భగవానుడు భూదేవిచేత నిత్యపూజలందుకొనును.
ఆ దైత్యమర్దనుడగు యజ్ఞవరాహమూర్తిని యథావిధిగ భక్తిరసార్దృ హృదయయై భూదేవి యిట్లు ప్రస్తుతించును. మంత్రతత్త్వమున నెఱుంగదగిన మహాయజ్ఞస్వరూపుడు యజ్ఞానుష్ఠానము చేయించువాడు యజ్ఞక్రతువు యుగత్రయరూపుడు శుభకరుడగు వరాహభగవానునకు నమస్కారము. రెండు కట్టెలను మథించుటవలన నగ్నిని బడయవచ్చును.
అటులే రసహృదయులగు పండితులు గుణవివేకములను మథించి నిన్ను బబడయుదురు నీవు కర్మఫలములచే నెఱుగబడవు. నిన్ను గనగోరువారు జ్ఞానమున గందురు. అట్టి నీకు నమస్కారములు. ద్రవ్య-క్రియా-దేవతా-దేహ-కాలములు మున్నగు మాయావస్తు గుణములచేత తెలియబడు రూపము. గలవాడును యమనియమాదుల నాత్మవిచారణచేయు స్థిత ప్రజ్ఞులచే మాయారహితుడుగ తెలియబడువాడు నగు దేవునకు నమస్కారములు.
ఇను మయస్కాంత సన్నిధిచే నాకర్షింపబడును. అట్లే యాత్మసన్నిధిచేత మాయ పరిభ్రమించును. ఈ మాయ సృష్టిస్థితిప్రళయములు గల్గించును. వీనియందు నీ కెట్టి కామమును లేదు. గుణకర్మలకు సాక్షిభూతుడవైన నీకు నమస్కారములు. తన్నెదుర్కొన్న దైత్యుని పోరాటమున దునుమాడి సాగరమందుండి నన్నుద్ధరించి తన కోరలపై నన్నొక యాటవస్తువుగ ధరింపగల్గిన యాదివరాహ విభునకు నమస్కారములు. కింపురుషవర్షమందు సర్వేశ్వరుడు ఆదిపురుషుడు దాశరథియగు సీతారాముని శ్రీహనుమానుడు నిరంతర మిట్లు సంస్తుతించును.
ఆర్య లక్షణములు శీలవ్రతములు గలవాడు నుత్తమశ్లోకుడు నిగృహీతాత్ముడు-సాధువాదదక్షుడు-బ్రహ్మణ్యదేవుడు-మహాపురుషుడు-మహాభాగ్యుడు-విశుద్ధానుభవముగలవాడు- తన మహాతేజముచే నితర గుణవ్యవస్థను తిరస్కరించు వాడును-మహాప్రశాంతుడు-స్థితప్రజ్ఞులచే తెలియబడువాడు-నామరూపాహంకారములు లేనివాడును-నగు శ్రీరామ ప్రభువును శరణు పొందుచున్నాను.

నీ వీ మానవాకారము దాల్చుట మానవులకు మార్గము చూపుటకే కాని కేవలము రక్కసుల నుక్కడగించుటకు గాదు. అట్లు గాదేని యాత్మారాముడవైన నీకు సీతా కారణమున విరహబాధ గట్లుటేమి? స్త్రీసంగవిరహ బాధ సహింపరానిదని తెల్పుటకే నీ వట్లు చేసితివి గదా ! ఆ వాసుదేవ భగవానుడు జ్ఞానులపాలిటి సుహృత్తముడు. ముల్లోకము లందును దేనియందును నాసక్తిలేనివాడు. అతనికి స్త్రీ సంబంధమగు దోష మేమాత్రమంటలేదు. దుర్వాసుడు వచ్చినపుడు లక్ష్మణుడునిగూడ వదలిపెట్టడు. శ్రీరామచంద్రునకు కేవలము పరభక్తి-లోకారాధన ప్రియమైనది. అంతేకాని జనుల గొప్పలు సౌభాగ్యమువాక్చాతురి బుద్ధికుశలత అందము ప్రియములు గావు.
శ్రీరాముడీ సుగుణములులేని కోతిమూకతో నెయ్యము నెఱపెను గదా ! అమరుడు-రాక్షసుడు-నరుడు-నారి యెవరైనను సర్వాత్మభావమున మానవాకృతి దాల్చిన సుకృతజ్ఞుడు మర్యాదా పురుషోత్తముడు నగు శ్రీరామభద్రుని గొల్చిన ముక్తి చెందును. రాము డుత్తర కోసలవాసుల నెల్లరను దివికి గొంపోవుటే నిదర్శనము. ఇట్లు కింపురుషవర్షమందు రాజీవలోచనుడు సత్యపరాక్రముడు దృఢసంకల్పుడు నగు శ్రీరాముని వానరోత్తముడగు హనుమంతుడు సన్నుతించును. గానము చేయును. పరభక్తితో నెల్లవిధముల బూజించును. ఇట్టి శ్రీరామచంద్రుని దివ్యచిత్ర కథామృతమును చెవులారగ గ్రోలవలయును. అట్టి రామభక్తులు పాపముక్తులై శుద్ధచిత్తులై శ్రీరఘునాథుని సాలోక్య మందగలరు.
No comments:
Post a Comment