మాయాశక్తి ప్రభావము
జనమేజయుడిట్లనియెను: ఓ మహాభాగా! వ్యాస! మహామేధావీ! నీవు చెప్పిన యాఖ్యానము విని నేను పరమవిస్మయమందితిని. జీవుడీ పాపరూపమైన సంసారబంధనముల నుండి యెట్లు విముక్తుడుగాగలడు? ఏలయన, కశ్యపాత్మజుడు త్రైలోక్యపతియునగు దేవేంద్రుడే యట్టి హేయముల కొడిగట్టిన నింక నరులమాట చెప్పనేటికి?
మాతృసేవ యను నెపముతో ప్రతినయొనర్చి యామె గర్భముజొచ్చి యందున్న బాలుని చంపుటెంత దారుణకృత్యమో కదా! ధర్మపరిపాలకుడును శాసకుడు నైన త్రిలోకాధిపతియే యంతటి క్షుద్రకార్య మొనర్ప నింక సామాన్యుడెట్లు చేయకుండును?
జగద్గురూ!అల కురుక్షేత్ర సంగ్రామము నందు నా పితామహులు చేసిన దుష్టకృత్యములకు నా కచ్చెరువు గలుగుచున్నది. అధర్మముగ ప్రవర్తించు వాసుదేవునిచే భీష్మద్రోణకృపకర్ణులు ధర్మాంశజుడగు ధర్మరాజును పురికొలుపబడిరి. వారును దేవాంశజులే! మేధావులే: ధర్మ తత్పరులే! ఈ సంసారము నిస్సారమని యెఱింగిన వారలే! ఐనను వారును ధర్మబాహ్యముగ నిందిత కృత్యము లేల యొనర్చిరి?
విప్రప్రవరా! అట్లు జరిగినచో నిక ధర్మమునకు చోటేది? ధర్మమునకు ప్రమాణమేది? నేనీ కథానక మాలకించినంతనే నా మనస్సు కలగుండు పడినది. ఒక యాప్తుని వాక్యమును ప్రమాణమను కొందుమేని అట్టి దివ్యదేహధారియు సర్వసముడు నైన యాప్తుడెవడు? లోకములందు పురుషు డెల్ల భంగుల విషయాసక్తుడై రాగవంతుడగుచుండును. అర్థనాశము కలిగిన వానికి తప్పక రాగద్వేషములు కల్గుచుండును. ప్రతివానికిని తన స్వార్థమునకై ద్వేషముతో నసత్యము పలుకవలసి వచ్చును.
అన్నియు తెలిసిన సత్త్వమూర్తియగు హరియే జరాసంధుని చంపుటకు కపటమున బ్రాహ్మణ వేషము తాల్చెను. అంతటి సత్త్వమూర్తియగు మహానుభావుడే యంతంత పనిచేయగ నిక నాప్తుడెవ్వడు? ఏది ప్రమాణము? అర్జునుడును యాగనిర్వహణమునకు కపట వృత్తి నవలంబించెను గదా? వారు చేసిన యజ్ఞ మెట్టిది? అది యేల శాంతి రహితమైనది? అది పరలోక ప్రాప్తికి గాని యశమునకు గాని చేయబడినదా?
ధర్మమునకు మొదటి పాదము సత్యము, రెండవది శౌచము, మూడవది భూతదయ, నాల్గవది నిష్కామదానము అని పురాణవిదులు పేర్కొందురు. ఆ నాలుగును లేనిచో ధర్మపు ప్రతిపాదమునకు నిలుకడయే లేదు. ధర్మనీతి బాహ్యమైన పని ధర్మమొసంగు ఫలము నెట్లొసగగలదు? వారిలో నే యొక్కరికి ధర్మము నెడల స్థిరమతి లేదని నాకు దోచుచున్నది. ఆ జగత్ర్పభువగు విష్ణువు కపటము కొఱకై వామన రూపముదాల్చి పాపమా బలిని వంచించెను గదా! ఆ బలి నూఱు యాగములకు కర్త - వేదాజ్ఞను తలదాల్చువాడు - ధర్మిష్ఠుడు - దానశీలి - సత్యవాది - జితేంద్రియుడు.

వ్యాసా! అంతటివాడును ప్రభవిష్ణువగు విష్ణునిచే నకస్మాత్తుగా స్థానభ్రష్టుడయ్యెను. ఇపుడు వారిలో జయ మెవ్వరిది? వామనునిదా? బలిదా? ద్విజోత్తమా! కపట నాటక సూత్రధారియగు వామనుడు బలిని గెల్చెనా? లేక వంచితుడైన బలి వామనుని జయించెనా? నిజము పలికి నా సందియ ముడుపుము. నీవు బహుపురాణకర్తవు - ధర్మజ్ఞుడవు - మహామతివి. కాన వాస్తవము దెలుపుమని నిన్నడుగుచున్నాను.
వ్యాసు డిట్లనెను: రాజా! ఈ సమస్త భూమండలమును దానము చేసిన బలి నిజముగ గెల్చినవాడు. ఆ హరి బలిని వంచించుటకు వామనత్వమొంది వామనడను పేరును ఖ్యాతి బడసెను. పిమ్మట హరి బలికి ద్వారపాలకుడయ్యెను. కాన దైవ ధర్మము సత్యమగును గాని యితరము గాదు. ఈయెల్ల దేహులకు సర్వభూతాత్మభావముతోడ సత్యపాలన మొనరించుట క్లేశ సాధ్యము. ఈ మహామాయ త్రిగుణాత్మిక - సర్వతోముఖము. ఇదెంతటి వానికిని దాటశక్యము గానిది, ఈ విశ్వము మాయచేతనే విరచింపబడినది. ఇది త్రిగుణముల సమ్మేళనము. కాన వంచకునకు సత్యపాలనమెట్లు సాధ్యమగును? ఈ విశ్వమిట్టి మిశ్రిత గుణములతో జనించినది. ఇది సనాతనము, తిరుగులేని దైవధర్మము. విధి విధానము. వైఖానసాదిమునులు మాత్రము విగత సంగులు - అపరిగ్రహులు - మాయా తీతులు. వారు మానమోహరహితులు - సత్యసంగతులు - తృష్ణారాగవర్జితులు వారు మాత్రమే సత్యధర్మమునకు దృష్టాంతముగ బేర్కొనదగినవారు.
ఓ రాజా! ఈ యంతయును త్రివిధ గుణమయము. కాన వేదపురాణములందు ధర్మశాస్త్రములందు నేక వాక్యత గన్పట్టదు. సగుణరాగవంతుడు సగుణకార్యము లొనరించును. కాని, నిర్గుణుడు సగుణచేష్ట లెన్నడును సలుపడు. ఈ త్రిగుణము లెల్లవేళల కలిసి మెలిసి యుండునే కాని విడివిడిగ నుండజాలవు. కనుక నిర్మలమును సుస్థిరమునైన పరమధర్మ మందెవని బుద్ధి నిలుచును? మహారాజా! ఈ బలవత్తరములైన యింద్రియములు నరుని మాయామోహితునిగ జేయును.

కనుక నింద్రియములు జన్మకు హేతువు లగుచున్నవి. మనస్సే యింద్రియములలోన దగులుకొని వెడలజాలకుండును. ఈ మనసు వలన వివిధ భావ పరంపరలు గలుగుచుండును. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచవఱకు నున్న స్థావరజంగమములైన యెల్ల ప్రాణులు నిరంతరము త్రిగుణములచే ప్రేరితము లగుచుండును. మాయా వశవర్తు లగుచుండును. ఆ మాయాశక్తి యెంతటి వారినైన మోహమున ముంచివైచి యాడించుచుండును. ఈ జగములను వికారవంతములుగ జేయుచుండును.
నరేంద్రా! ఈ నరుడేదేని పనిని మొదలు పెట్టుచో నతడు తొలుత నసత్యము లాడ నేర్చుకొనును. పిదప విషయభోగము లాకాంక్షించును. అవి తనకు దక్కనప్పుడు వానికొఱకు వంచనకైన పాల్పడును. దానిచే నతనికి దురితములు సంభవించును. కాన కామక్రోధలోభములు బలవత్తరములగు శత్రులు (నరకద్వారములు - ఆత్మ వినాశకములు). ఈ శత్రువులకు బానిసలైన నరులు మంచిచెడ్డల వివేక మెఱుంగరు. వారికి సంపదలం దహంకారము మిన్నుముట్టగ పుట్టుచుండును. అహంకారము వలన సమ్మోహము-సమ్మోహమున బుద్ధినాశము-తుదకు నాశము-గల్గును. ఈ జీవుల మనస్సులం దనేక సంకల్ప వికల్పములు పుట్టుచు నడగుచుండును. ఈ చిత్తమునందు నెల్లవేళల నసూయాద్వేషములు-ఆశ-తృష్ణ-దైన్యము-దంభము-దుర్మతి రగులుకొనుచుండును. ఈ చెడుభావము లెల్ల జీవులను మోహవశులుగ జేయుచుండును. నరుడు యజ్ఞ దానములు తీర్థ వ్రత నియమములు నాచరించును.
కాని వాని నెల్ల గర్వాతిరేకమున సలుపుచుండును. అహంకారముతో జేసిన యే చిన్నపనియైనను నిర్మలముగ నుండజాలదు. రాగలోభములతో జేసిన పను లెల్లను నపవిత్రములుగ నుండును. కనుక పండితులు మునుముందుగ ద్రవ్యశుద్ధి గమనింపవలయును. ఎట్టి ద్రోహబుద్ధియు లేక సంపాదించిన ధనము ధర్మకర్మములందు ప్రశస్తమైనది. ద్రోహముతో నార్జించిన ద్రవ్యముతో నరుడు శుభకార్యము లొనరింపగూడదు. అట్లొకవేళ చేసినచో నది ఫలించు కాలమున విపరీతముగ మారును. అతి నిర్మలహృదయుడు నిష్కాముడు మనస్వియైన వాడొనరించిన పని చక్కగ ఫలవంత మగును. మనస్సు వికారమయమైనచో నాశించిన ఫలితము చేకూరదు.

కావున యజమానులు ఋత్విగాదులు ఆచార్యవర్యులు - వీరు విశుద్ద మనస్కులుగ నుండవలయును. దేశకాలము లందును ద్రవ్యమందును కర్తృ క్రియలయందును మంత్రములందును శుద్ధి యుండవలయును. అపుడు యజమాను డాశించిన ఫలము పూర్తిగ ప్రాప్తించును. ఏలన, స్వార్థాభినివేశము గలవానికి మంచి చెడ్డల వివేకము గలుగదు. అట్టివాడు దైవాధీనుడై పాప మాచరించును గాని సుకృత మొనరింపడు. ఎల్ల దేవదానవులును ప్రజాపతి వలన నుద్భవిల్లిరి. ఐనను వీరు స్వార్థపరులును పరస్పర విరోధులునై వర్తింతురు. దేవతలు సత్త్వగుణ సంజాతులనియు మనుజులు రజోగుణ సంభూతులనియు తిర్యక్కులు తమోగుణ జనితము లనియు శ్రుతులందు గలదు. అమరులు సత్త్వసంజాతులైనను వారిలో వారికి పరస్పర వైర మనవరతము సంభవించుచుండును. ఇక తిర్యక్కులందు జాతి వైరమున్నదన్న నందు విచిత్ర మేమున్నది? దేవతలు సతతము ద్రోహపరులు-తపోవిఘ్నకరులు. వారు ద్వేషనిరతులు. పరస్పర వైరులు-అసంతుష్టులుగ నుందురు. కావున నీ సకల ప్రపంచ మహంకార సముత్పన్న మగుటచే నీ ప్రపంచ మెట్లు రాగద్వేష రహితముగా నుండగలదు?
అధ్యాయము 67 నరనారాయణుల తపఃప్రభావము
అధ్యాయము 67 నరనారాయణుల తపఃప్రభావము
No comments:
Post a Comment