Wednesday, January 1, 2025

తిరుప్పావై - పద్దెనిమిదివ పాశురము

 తిరుప్పావై - పద్దెనిమిదివ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

నిన్నటి పాశురంలో నందగోపుడిని, యశోదని, కృష్ణ పరమాత్మని, బలరాముడిని కూడా స్తుతించి వారందరినీ కూడా మేల్కొలపడానికి ప్రయత్నించినటువంటి గోపికలు గురించి మనం తెలుసుకున్నాం. నిన్న కృష్ణపరమాత్మ లేవలేదు. ఎందుకు లేవలేదంటే అమ్మని పిలవకుండా, అమ్మని లేపకుండా స్వామి లేవడు అని తెలుసుకుని ముందుగా అమ్మని అంటే నీలాదేవిని లేపుతారు.

ఈ 18 వ. రోజు పాశురాన్ని చదువుదాం.

ఉన్దు మదగళిత్తనోడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమళుం కుళలీ కడై తిఱవాయ్
వందెగుం కోళి అళైత్తనగాణ్, మాదవి
ప్పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగళ్ కూవినగాణ్; 
పందార్ విరలి! ఉన్ మ్మైత్తునన్ పేర్ పాడ 
శెందామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వందు తిఱవాయ్; మగిళిందు ఏలోర్ ఎంబావాయ్ || 18 ||

ఇప్పుడు ఈ పాశురము యొక్క అర్థాన్ని చదువుదాం.

మదమును స్రవించే ఏనుగులు కలవాడు, ఏనుగులను తోయగల బలం కలవాడు, ఎదురులేని భుజబలం కలవాడూ అయిన నందగోపాలుని కోడలా! మంచి సువాసన కలిగిన కేశములు గల నప్పిన్నపిరాట్టీ! అంతటా కోళ్ళు కూస్తున్నాయి. జాజి పందిరి మీద కోకిల గుంపులు మేల్కొని కూస్తున్నాయి. బంతిని చేతిలో పట్టుకున్న ఓ అమ్మా! నీ భర్త అయిన శ్రీకృష్ణుని నామములను పాడుటకు వచ్చాము. సంపద కలిగిన ఎర్ర తామరలవంటి చేతులతో, నీ చేతి గాజులు ధ్వనించినట్లు వచ్చి తలుపు తియ్యమ్మా.

ఈ రోజు ధనుర్మాసం 18 వ రోజు. ఈరోజు 18 వ పాశురం లో గోపికలు శ్రీ కృష్ణుని అనుభవిద్దాం, పరమాత్మ కనబడగానే ఒక నిమిషం వృధా చేయకుండా ఆయన్ని పూర్తిగా అనుభవించాలి అన్న ఆశతో శ్రీకృష్ణుని మేల్కొలుపుతారు. కానీ ఆ పరమాత్మ లేవట్లేదు.

ఇక లాభం లేదని గోపికలు అట్నుంచి నరుక్కు వద్దాం అంటే నీలా దేవి నుంచి ప్రారంభిద్దాం అన్న ఆలోచనతో నీలా దేవిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి ఒక ఉదాహరణ….మనకి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడితో పని ఉందనుకోండి. ఆయన భార్య సహాయంతో ఆ పనిని మనం సాధించుకోవచ్చు. ఎందుచేతనంటే ఎవరూ భార్య మాటని కాదనలేరు. కాదంటే ఏం జరుగుతుందో మగవాళ్లకి బాగా తెలుసు. అందుచేత నీలాదేవి ద్వారా భగవంతున్ని దర్శించి ఆయనని అనుభవించాలి అనే ఆశతో ఉన్నారు. అందుకే మొదటి ప్రార్ధనా శ్లోకంలో నీలాదేవితో ఉన్నటువంటి స్వామిని మేల్కొలుపుతారు గోపికలు.

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం అని
నీలాదేవిని… నందగోపుని కోడలా! అని పిలుస్తున్నారు. మనం ప్రారంభంలోనే ఈ ప్రార్ధనా శ్లోకం గురించి తెలుసుకున్నాం. శ్రీ కృష్ణునికి మేనత్త కూతురు నీలాదేవి. చిన్నప్పటినుంచి కృష్ణుడు, నీలాదేవి కలిపి ఆడుకునేవారు. అందుకే నందగోపుని కోడలా! అని పిలుస్తున్నారు.

మదజలము శ్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు అయినా శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడలా! ఓ నప్పిన పిరాట్టి! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మ! కోళ్లు వచ్చి కూయుచున్నవి జాజిపందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి.  సుమా! నీవు నీ భర్తయను సరసల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునే యుందుము.

దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్టుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమమ్మ! అని గోపాంగనలు  లీలాదేవి నీ పాశురంలో మేలుకొలుపుచున్నారు. 

ఆండాల్ తిరువడిగళే శరణం


Tuesday, December 31, 2024

తిరుప్పావై - పదిహేడవ పాశురము

తిరుప్పావై - పదిహేడవ పాశురము 

శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నీ యీ పాశురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్కసారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ, ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది. మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుశా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏ క్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు.

ముందుగా పాశురాన్ని చదువుదాం. 

అమ్బరమే, తణ్ణీరే, శోఱే అరం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎళుందిరాయ్
కొంబనార్ క్కు ఎల్లాం కొళుందే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్!
అంబరం ఊడు అరుత్తు ఓంగి ఉలగళంద
ఉంబర్ కోమనే! ఉరంగాదు ఎళుందిరాయ్; 
శెంబోర్ కళ లడి చ్చెల్వ బలదేవా!
ఉంబియుమ్ నీయుమ్ ఉరంగేలోరెంబావాయ్ || 17 ||

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం..

అమ్బరమే, తణ్ణీరే, శోఱే అరం శెయ్యుంఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎళుందిరాయ్

వస్త్రములను, చల్లటి నీటిని, అన్నమును ఎంతో ఔదార్యంతో, ఏ ప్రయోజనం ఆశించకుండా దానం చేసేవాడా! నందగోపాలా! మాకు స్వామి అయినవాడా! నందగోపాలా! నిద్ర నుండి లెమ్ము! గోపికలు కృష్ణుని కలవడానికి నందుడికి, యశోదాదేవికి, బలరాముడికి కాకా పడుతున్నారు. 

కొంబనార్ క్కు ఎల్లాం కొళుందే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్!

స్త్రీలకందరికీ తలమానికం వంటిదానా! సుకుమారమైన శరీరం గల స్త్రీలందరిలో చిగురు వంటి దానా! మా కులమునకు మంగళ దీపం వంటి దానా! యశోదాదేవి మేలుకో! యశోదమ్మను మంత్రం గా ఊహించింది. అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా! జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది. ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.

అంబరం ఊడు అరుత్తు ఓంగి ఉలగళంద
ఉంబర్ కోమనే! ఉరంగాదు ఎళుందిరాయ్

ఆకాశం వరకు బాగా పెరిగి.. లోకములన్నీ కొలిచిన నిత్యసూరుల నాయకుడా! (ఇక్కడ వామనావతారాన్ని గుర్తు చేసుకుంటున్నారు).

ఓ కృష్ణా! మేలుకో! 

ఆయన లేవలేదు. అన్నగారు లేవలేదు కాబట్టి ఆయన కూడా లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు ఆ పరమాత్మ. బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు. ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు. ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేసారు.

శెంబోర్ కళ లడి చ్చెల్వ బలదేవా!
ఉంబియుమ్ నీయుమ్ ఉరంగేలోరెంబావాయ్

అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి. అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెలుసుకొని వచ్చాం. లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ తల్లి విన్నవించింది.ఎర్రని బంగారు కడియాలను పాదములకు ఆభరణముగా ధరించిన ఓ బలరామస్వామీ నీవూ, నీ తమ్ముడైన శ్రీ కృష్ణుడూ మేల్కొనండి.
అయితే బలరాముడు లేచి.. మీరు భ్రమపడ్డారు. కృష్ణుడు ఇక్కడ లేడు. నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.

పూర్తి భావం…..

ద్వారపాలకుని వేడుకొన్నందువలన అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా.. అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరాముడినీ, శ్రీకృష్ణుడినీ చూసి ఈవిధంగా అంటున్నారు..వస్త్రములను, చల్లటి నీటిని, అన్నమును ఎంతో ఔదార్యంతో, ఏ ప్రయోజనం ఆశించకుండా దానం చేసేవాడా! నందగోపాలా! మాకు స్వామి అయినవాడా! నందగోపాలా! నిద్ర నుండి లెమ్ము! గోపికలు కృష్ణుని కలవడానికి నందుడికి, యశోదాదేవికి, బలరాముడికి కాకా పడుతున్నారు.

స్త్రీలకందరికీ తలమానికం వంటిదానా! సుకుమారమైన శరీరం గల స్త్రీలందరిలో చిగురు వంటి దానా! మా కులమునకు మంగళ దీపం వంటి దానా! యశోదాదేవి మేలుకో! యశోదమ్మను మంత్రం గా ఊహించారు గోపికలు. అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా! జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది. ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.

వాళ్లకి కృష్ణుడు కనిపించలేదు. అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి. అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు  ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా! అని అండాళ్ తల్లి విన్నవించింది.

ఆకాశం వరకు బాగా పెరిగి.. లోకములన్నీ కొలిచిన నిత్యసూరుల నాయకుడా! (ఇక్కడ వామనావతారాన్ని గుర్తు చేసుకుంటున్నారు).

ఓ కృష్ణా! మేలుకో! ఆయన లేవలేదు. అన్నగారు లేవలేదు కాబట్టి ఆయన కూడా లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు. బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు. ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు. ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేసారు. ఎర్రని బంగారు కడియాలను పాదములకు ఆభరణముగా ధరించిన ఓ బలరామస్వామీ నీవూ, నీ తమ్ముడైన శ్రీ కృష్ణుడూ మేల్కొనండి.
అయితే బలరాముడు లేచి మీరు భ్రమపడ్డారు. కృష్ణుడు ఇక్కడ లేడు. నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.

ఆండాల్ తిరువడిగళే శరణం


TYAGARAJA KEERTHANALU - త్యాగరాజ కీర్తనలు

త్యాగరాజ కీర్తనలు 


అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా? 

అభిమానమెన్నడు కల్గురా

ఎవరని నిర్ణయించిరిరా

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

కన కన రుచిరా

కరుణా జలధే దాశరథే

గానమూర్తే శ్రీకృష్ణవేణు

గంధము పుయ్యరుగా పన్నీరు

జగదానంద కారకా

తెరతీయగ రాదా లోని

దొరకునా ఇటువంటి సేవ

దుడుకు గల నన్నే దొర

నగుమోము గనలేని

నను పాలింప నడచి వచ్చితివో

పరమాత్ముడు వెలిగే

బ్రోవ భారమా, రఘు రామ

బంటు రీతి కొలువీయ వయ్య రామ

మరుగేలరా ఓ రాఘవా!

వందనము రఘునందన

వందనము రఘునందన

వేంకటేశ నిను సేవింపను పది

శ్రీ గణనాథం భజామ్యహం

శ్రీ రామ పాదమా

సమయానికి తగు మాటలాడెనే

సామజ వర గమన

SAMAJA VARA GAMANA సామజ వర గమన

 సామజ వర గమన


తాళం: ఆది    

రాగం: హిందోళం  మేళకర్త 20, నట భైరవి   జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ


ఆరోహణ:
 స గ2 
మ1 ద1 ని2 స 

అవరోహణ: స ని2 ద1 మ1 గ2 స  


పల్లవి
సామజ వర గమన
సాధు హృత్-సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత


అను పల్లవి:
సామని గమజ - సుధా
మయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల
మామ్ పాలయ

వేదశిరో మాతృజ - సప్త
స్వర నాదా చల దీప
స్వీకృత యాదవకుల
మురళీవాదన వినోద
మోహన కర, త్యాగరాజ వందనీయ

SAMAYANIKI TAGU MATALADENE సమయానికి తగు మాటలాడెనే

 సమయానికి తగు మాటలాడెనే

తాళం: ఆది    

రాగం: ఆరభిమేళకర్త 29, శంకరాభరణము  జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ


ఆరోహణ: స రి2 మ1 ప ద2 స        

అవరోహణ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స  


పల్లవి
సాధించెనే ఓ మనసా

బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు
సాధించెనే ఓ మనసా

సమయానికి తగు మాటలాడెనే

దేవకీ వసుదేవుల నేగించినటు
సమయానికి తగు మాటలాడెనే

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు
సమయానికి తగు మాటలాడెనే

గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
సమయానికి తగు మాటలాడెనే

సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు
సమయానికి తగు మాటలాడెనే

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు
ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
సమయానికి తగు మాటలాడెనే

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి
కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ
సమయానికి తగు మాటలాడెనే

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన
పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన
సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను
సమయానికి తగు మాటలాడెనే

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన
కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు
సమయానికి తగు మాటలాడెనే

సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే
అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
సాధించెనే ఓ మనసా౥ సాధించెనే

SRI RAMA PADAMA - శ్రీ రామ పాదమా

శ్రీ రామ పాదమా

తాళం: ఆది
రాగం: అమృతవాహినీ(మేళకర్త 20, నట బైరవి  జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి2 మ1 ప  ద1 ని2 స
అవరోహణ: స ని2 ద1 మ1 గ2 మ1 రి2 

పల్లవి
శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే

అనుపల్లవి
వారిజ భవ సనక సనందన
వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ)

చరణము
దారిని శిలయై తాపము తాళక
వారము కన్నీరును రాల్చగ
శూర అహల్యను జూచి బ్రోచితివి
ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)

SRI GANANADHAM BHAJAMYAHAM - శ్రీ గణనాథం భజామ్యహం

శ్రీ గణనాథం భజామ్యహం

తాళం: ఆది
రాగం: కనకాంగి (1 కనకాంగి మేళ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి1 గ1 మ1 ప ద1 ని1 స
అవరోహణ: స ని1 ద1 ప మ1 గ1 రి1 స  

పల్లవి
శ్రీ గణ నాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం

అనుపల్లవి
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)

చరణము
రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణి-మయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...