Friday, March 20, 2026

Matsya Jayanti - మత్స్య జయంతి

మత్స్య జయంతి

మత్స్య జయంతి అనేది ఒక ముఖ్యమైన ఆచార సాంప్రదాయ పండుగ. వేదాలను ప్రళయం కాలంలో కాపాడిన విష్ణుమూర్తి మొదటి అవతారమైన మత్స్య (చేప) అవతార ఆవిర్భావం సందర్భముగా ఆ శ్రీమహావిష్ణువుని స్మరిస్తూ జరుపుకునే పండుగ. దీనిని చైత్ర మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజు (తృతీయ) నాడు జరుపుకుంటారు, ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది.

పురాణాలలో విష్ణువు యొక్క 24 అవతారాలు వివరించబడ్డాయి. వీటిలో 23 అవతారాలు భూమిపైకి వచ్చాయి. తదుపరి 24వ అవతారం అయిన 'కల్కి అవతారం' రూపంలో ఇంకా జరగాల్సి ఉంది.

ప్రాముఖ్యత:మత్స్య అవతారం విష్ణువు యొక్క పది ప్రధాన దశావతారాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది . ఆయన సత్యయుగంలో, దమనక అనే రాక్షసుడి నుండి వేదాలను కాపాడుతూ, విశ్వ వినాశనం నుండి మనురాజును (లేదా సత్యవ్రతుడిని) మరియు సప్తఋషులను (ఏడుగురు ఋషులను) రక్షించడానికి అవతరించారు.

విష్ణువు యొక్క దయా కరుణ మరియు ధర్మ పరిరక్షణకు ప్రతీకగా, మానవ శరీరం కలిగిన ఒక భారీ మత్స్య రూపంలో అవతరించాడు.

భక్తులు తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేసి ఉపవాసం పాటిస్తారు.

విష్ణు దేవాలయాలలో షోడశోపచారాలతో స్వామిని పూజించాలి. తదుపరి మత్స్య పురాణం మరియు విష్ణు సహస్రనామం పఠించాలి.

మన స్థోమతను బట్టి దాన ధర్మాలు చేయవచ్చు. కొలనులో, చెరువులో, నదుల్లో కానీ ఉండే చేపలకు ఆహారం వేయవచ్చు 


No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...