శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.
ప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనాథస్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరి స్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.
శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది మరియు సముద్రములో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.
ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, మరియు ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.
బలరాముని శాపం: ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు.
అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.
No comments:
Post a Comment