Sunday, December 29, 2024

ANDARIKI AADHAARAMAINA అందరికాధారమైన ఆది పురుషుడీతడు

 పల్లవి 

అందరికాధారమైన ఆది పురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతుడు ||

చరణములు 
సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవంబై నతడీతడు |
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ||

సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు
ధరనావుల మందలలో తగ జరించె నీతడు |
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ||

పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు
సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు |
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ||

No comments:

Post a Comment

Sri Tripura Bhairavee Sahasra Nama Sthotram - శ్రీ త్రిపురభైరవీ సహస్రనామ స్తోత్రం

శ్రీ త్రిపురభైరవీ సహస్రనామ స్తోత్రం మహాకాలభైరవ ఉవాచ : అథవక్ష్యే మహేశాని దేవ్యా నామ సహస్రకం యత్రసాదాన్మహా దేవి చతుర్వర్గ ఫలం లభేత్‌ ॥ 01॥ సర్...