Monday, December 30, 2024

ADIMURTI YITADU ఆదిమూర్తి యితడు

 


పల్లవి :
ఆదిమూర్తి యితడు ప్రహ్లాదవరదుడు |
ఏదేశ జూచినా తానే ఈతడిదే దేవుడు ||

చరణములు 
నవ్వుల మోముతోడ నరసింహరూపుతోడ |
జవ్వని తొడమీద సరసమాడ |
పువ్వుల దండలు ఇరుబుజాలపై వేసుకొని |
ఉవ్విళ్లూర కొలువై వున్నాడు దేవుడు||

శంకు చక్రములతోడ జమళి కోరల తోడ |
అంకెల కటి అభయహస్తాలెత్తి |
కంకణాల హారాలతో ఘనకిరీటము వెట్టి |
పొంకమైన ప్రతాపాన పొదలీని దేవుడు||

నానా దేవతలతోడ నారదాదుల తోడ |
గానములు వినుకొంటా గద్దెపై నుండి|
ఆనుక శ్రీవేంకటాద్రి నాహోబలము నందు|
తానకమై వరాలిచ్చి దాసులకు దేవుడు||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...