Sunday, December 29, 2024

NAVARASAMULADEE NALINAAKSHI నవరసములదీ నళినాక్షి

 పల్లవి 

నవరసములదీ నళినాక్షి |
జవకట్టి నీకు జవి సేసీని ||

చరణములు 
శృంగార రసము చెలియ మొకంబున |
సంగతి వీరరసము గోల్ల |
రంగగు కరుణరసము పెదవులను |
అంగపు గుచముల నద్భుత రసము ||

చెలి హాస్యరసము చెలవుల నిండీ |
పలుచని నడుమున భయరసము |
కలికి వాడుగన్నుల భీభత్సము |
అల బొమ జంకెనల నదె రౌద్రంబు ||

రతి మరపుల శాంతరసంబదె |
అతి మోహము పదియవరసము |
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి |
సతమై యీపెకు సంతోస రసము ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...