Sunday, December 29, 2024

PODAGANTIMAYAA పొడగంటిమయ్య మిమ్ము

 రాగం:అట్టతాళం


పల్లవి 
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా ||

చరణములు 
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా |
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా ||

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ |
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా ||

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా |
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...