Tuesday, December 31, 2024

GANDHAMU PUYARUGA గంధము పుయ్యరుగా పన్నీరు

గంధము పుయ్యరుగా పన్నీరు

తాళం: ఆది  
రాగం: పున్నాగవరాళిమేళకర్త 8, హనుమ తోడి  జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: ని2 స రి1 గ2 మ1 ప ద1 ని2
అవరోహణ: ని2 ద1 ప మ1 గ2 రి1 స ని2

పల్లవి:
గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అను పల్లవి:
అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ ||గంధము||

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ||గంధము||

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ||గంధము||

హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ||గంధము||

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ||గంధము||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...