Sunday, December 29, 2024

PHAALA NETRAANALA ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా

 పల్లవి 

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా ||

చరణములు 
ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార
లలిత నిశ్వాసడోలా రచనయా |
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన-
చలన విధినిపుణ నిశ్చల నారసింహా ||

వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత-
లవదివ్య పరుష లాలాఘటనయా |
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ
నవనవప్రియ గుణార్ణవ నారసింహా ||

దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి-
కార స్ఫులింగ సంగక్రీడయా |
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ-
కారణ ప్రకట వేంకట నారసింహా ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...