Sunday, December 29, 2024

NITYA POOJALIVIGO నిత్య పూజలివిగో

 పల్లవి 

నిత్య పూజలివిగో నెరిచిన నోహో |
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ||

చరణములు 
తనువే గుడియట తలయె శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట |
కనుగొన చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికిని ||

పలుకే మంత్రమట పాదయిన నాలుకే
కలకల మను పిడి ఘంటయట |
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకు ||

గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట |
అమరిన ఊర్పులే ఆలబట్టములట
క్రమముతో శ్రీ వెంకటరాయునికి ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...