Tuesday, December 31, 2024

NANU PALIMPA NADACHI VACHITHIVO-నను పాలింప నడచి వచ్చితివో

 నను పాలింప నడచి వచ్చితివో

తాళం: ఆది
రాగం: మోహనం (మేళకర్త 28, హరి కాంభోజి  జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స రి2 గ3 ప ద2 స      
అవరోహణ: స ద2 ప గ3 రి2 స

పల్లవి
నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రాణ నాథ

అనుపల్లవి
వనజ నయన మోమును జూచుట
జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను)

చరణం
సురపతి నీల మణి నిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...