Sunday, December 29, 2024

KOLANI DOPARIKI కొలని దోపరికి

 పల్లవి 

కొలని దోపరికి గొబ్బిల్లో యదు
కుల స్వామికిని గొబ్బిల్లో ||

చరణములు 
కొండ గొడుగుగా గోవుల గాచిన
కొండొక శిశువునకు గొబ్బిల్లో |
దండగంపు దైత్యుల కెల్లను తల
గుండు గండనికి గొబ్బిల్లో ||

పాప విధుల శిశుపాలుని తిట్టుల
కోపగానికిని గొబ్బిల్లో |
యేపున కంసుని యిడుమల బెట్టిన
గోప బాలునికి గొబ్బిల్లో ||

దండివైరులను తరిమిన దనుజుల
గుండె దిగులునకు గొబ్బిల్లో |
వెండిపైడి యగు వేంకట గిరిపై
కొండలయ్యకును గొబ్బిల్లో ||

No comments:

Post a Comment

Lalithambika Devi Temple, Thirumeeyachur, Tiruvarur District, Tamil Nadu - లలితాంబికాదేవి దేవాలయం, తిరుమీయచ్చూర్‌‌, తిరువారూర్‌ జిల్లా, తమిళనాడు

లలితాంబికాదేవి దేవాలయం, తిరుమీయచ్చూర్‌‌, తిరువారూర్‌ జిల్లా, తమిళనాడు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తిరుమీయచ్చూర్‌‌లోని లలితాంబికాదేవి దేవ...