Sunday, December 29, 2024

BRAHMA KADIGINA PADAMU బ్రహ్మ కడిగిన పాదము

 పల్లవి 

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ||

చరణములు 
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||

కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ||

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము |
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ||

No comments:

Post a Comment

Sri Kamalathmika Sahasra Nama Sthotram - శ్రీ కమలాత్మికా సహస్ర నామా స్తోత్రం

శ్రీ కమలాత్మికా సహస్ర నామా స్తోత్రం ఓం తామాహ్వయామి సుభగాం లక్ష్మీం త్రైలోక్య పూజితామ్‌ ఏహ్యేహి దేవి పద్మాక్షి పద్మకరకృతాలయే ॥ 01  ॥ అగచ్చాగచ...