Sunday, December 29, 2024

NIGAMA NIGAMAANTA VARNITA నిగమనిగమాంతవర్ణిత

 పల్లవి 

నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారయణా ||

చరణములు 
దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య
నోపకరా నన్ను నొడబరపుచు |
పైపైనె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా ||

చికాకుపడిన నా చిత్తశాంతము సేయ
లేకకా నీవు బహులీల నన్ను |
కాకుసేసెదవు బహుకర్మల బడువారు
నాకొలదివారలా నారాయణా ||

వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల నడబడ జేతురా |
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీనారాయణా ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...