Tuesday, December 31, 2024

VANDHANAMU RAGHUNANDHANA-వందనము రఘునందన

 వందనము రఘునందన

తాళం: ఆది

రాగం: శహన( మేళకర్త 28, హరి కాంభోజి  జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ


ఆరోహణ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స

అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 గ3 రి2 


పల్లవి
వందనము రఘునందన - సేతు
బంధన భక్త చందన రామ

చరణము(లు)
శ్రీదమా నాతో వాదమా - నే
భేదమా ఇది మోదమా రామ

శ్రీరమా హృచ్చార మము బ్రోవ
భారమా రాయబారమా రామ

వింటిని నమ్ము కొంటిని శర
ణంటిని రమ్మంటిని రామ

ఓడను భక్తి వీడను నొరుల
వేడను జూడను రామ

కమ్మని విడె మిమ్మని వరము
కొమ్మని పలుక రమ్మని రామ

న్యాయమా నీ కాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ

చూడుమీ గాపాడుమీ మమ్ము
పోడిమిగా (గూడుమీ రామ

క్షేమము దివ్య ధామము నిత్య
నీమము రామనామము రామ

వేగరా కరుణాసాగర శ్రీ
త్యాగరాజు హృదయాకర రామ

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...